పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే..

మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కిలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu