రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా?  ఆమె చూపు కమలం పార్టీవైపు ఉందా అంటే ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తనకు రాజకీయాలంటే ఇష్టమన్న ఆమె, ప్రజాసేవ తన లక్ష్యమని చెప్పారు.  అంతే కాకుండా తానను తాను మోడీ భక్తురాలిగా చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయమేమిటంటే.. ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. అలాగే పవన్ కూడా తరచూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో రేణూ దేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలివ్వడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.

 పిల్లల కోసమే తాను ఇంత కాలం  రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రేణూదేశాయ్.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాననీ, అందుకే తాను రాజకీయాలకు పనికిరానని అంతా అంటుంటారనీ, కానీ తాను పొలిటీషియన్ ని అవతానన్నది తన జాతకంలోనే ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసేశారు రేణూ దేశాయి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu