LATEST NEWS
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  
బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిండు అసెంబ్లీలో   బాసటగా నిలిచారు.   బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధం విధించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్నవారు  రెచ్చిపోతున్నారన్నారు.  తమ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఉపేక్షించబోదన్నారు.  పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.  ప్రస్తుతం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారిని కట్టడి చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. 
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేద్ లో ఎండ తీవ్రత దడపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  
గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు. రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు. కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో  వంశీకి  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. 
బిఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.  నకిరేకల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో   సోషల్ మీడియా వేదికగా  తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ  నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేర్వేరుగా నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేపర్‌ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్‌  ఎక్స్‌  లో షేర్‌ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు   ఏ 1గా మన్నె క్రిశాంక్‌, ఏ 2 గా కేటీఆర్‌, ఏ 3గా కొణతం దిలీప్‌ కుమార్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్‌  ఫిర్యాదు మేరకు  ఏ1 గా కొణతం దిలీప్‌ కుమార్‌ , ఏ2గా మన్నే క్రిశాంక్‌, ఏ 3గా కేటీఆర్‌, మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.   పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతోపాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్‌ బాలునితో పాట ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.  
ALSO ON TELUGUONE N E W S
Pawan Kalyan, the deputy Chief Minister of Andhra Pradesh and biggest star of Telugu Cinema, has been concentrating more on his political works than films. He needs to complete his pending films and in the meantime, few of his fans are anticipating him to work with a talented filmmaker like Sukumar.  As the director has been continuously collaborating with Mythri Movie Makers and has publicly stated that he might not work for any other production house after Pushpa 2 success, press people asked producer Mythri Ravi about the possible collaboration of Pawan Kalyan and Sukumar. The producer denied any possibility of it happening. He reasoned that Pawan Kalyan is busy with his duties and he cannot allocate bulk dates as per the wish of director Sukumar. He remarked that when you know it is impossible to attain, then why to try. He stated that even they would love for such a combination to come together but it is out of possibility.  He interacted with press about Nithiin and Sreeleela's Robinhood which is releasing on 28th March. David Warner is making his debut with the film for the first time on Indian screen. The movie is expected to be a big hit for director Venky Kudumula and everyone involved.
Mohanlal is one of the biggest superstars of Indian Cinema based in Malayalam Cinema. He has delivered major blockbusters and one of his big hits is being released as 1000 crores in Telugu. The movie stars Kavya Madhavan and many others as well.  The movie "1000 Crores" is being produced under the banner of Sreekar Movie Makers by Kasula Ramakrishna (Sreedhar), Sreekar Gupta, and Kasula Ramakrishna. This film marks the latest project from Kasula Ramakrishna, who previously produced the hit film "100 Crores." The movie has completed all its production activities. Speaking on the occasion, producer Kasula Ramakrishna mentioned, "We are preparing to release the Malayalam superhit film under the title '1000 Crores' in Telugu. Mohanlal will be playing the lead role, with Kavya Madhavan as the heroine. A notable aspect of the film is that the senior artist Nag Mahesh will provide the voice-over for Mohanlal's character. Prominent PRO Veerababu will be serving as the Executive Producer for the film. After completing all the work, we are planning to release the film in April. We hope the movie will be a definite success and that Mohanlal will emerge as a hero who achieves worldwide recognition and reaches the milestone of 1000 crores." The music is composed by Ratheesh Veg, and cinematography is handled by Pradeep Nair, and the executive producer is Basimsetty Veerababu. The producers are Kasula Sreekar Gupta, Kasula Ramakrishna, and the film is directed by Joshi.
Ram Charan needs a big box office blockbuster post disasters like Acharya and Game Changer. The actor fans have been eagerly waiting for updates from his next RC16. The movie team has been withholding information from long and they have now decided to make it special for the fans of the actor on his birthday.  The makers have stated that #RC16 is being crafted on an unprecedented scale, with a colossal budget, breathtaking visuals, world-class production values, and cutting-edge technical excellence. They have decided to tease Ram Charan's look before big reveal in a pre-look poster.   The poster features Ram Charan in a captivating back pose, embodying a rugged and raw persona. His disheveled hair, beard, and serious expression add layers of intensity to his character, while the subtle yet powerful inclusion of a cigar held behind his back enhances the sense of intrigue. This astounding pre-look is designed to tease the audience and fans with the promise of a powerful first look poster. Buchi Babu Sana is directing the film and it is stated to be a larger-than-life story. Janhvi Kapoor is playing the leading lady role while AR Rahman is composing music for this Pan-India movie. Mythri Movie Makers, alongside the creative brilliance of Sukumar Writings, and Vriddhi Cinemas are producing it on a grand scale. 
Anil Ravipudi, one of the most successful directors of Telugu Cinema, is now directing Megastar Chiranjeevi for his next. After a blockbuster like Sankrantiki Vasthunnam, the expectations from his next are sky high. The anticipation for the movie is huge and many have been waiting for updates.  Now, the director has finally revealed that he gave final narration to the megastar and he is ready to start shooting of the film. He also revealed that name of the character of Megastar Chiranjeevi and it is "Shankar Varaprasad". He gave the actor his real name on screen and it will be fun to watch.  Taking to X, the director wrote,  "Final script narration done & locked. I told him about the character "Shankar Varaprasad" in my story and he loved & enjoyed it thoroughly. It is time to start the big festival movie shooting on an auspicious day."  He also confirmed that the movie will be a big festival release and Chiranjeevi would be wishing to lock Sankranti date. While NTR-Neel film is also gearing up for Sankranti release, we have to wait and see, how the two movies will perform. Sahu Garapati is producing the film. 
మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ముహూర్తాన్ని ఉగాది రోజున నిర్ణయించారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను బుధవారం దర్శకుడు అనిల్‌ రావిపూడి తన ట్విట్టర్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తయిందని, ఆల్రెడీ చిరంజీవికి నేరేషన్‌ కూడా ఇచ్చానని తెలిపారు. అంతేకాదు ఈ కథలోని శివశంకర వరప్రసాద్‌ పాత్రను చిరంజీవికి పరిచయం చేశానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు అనిల్‌. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో.. ‘చిరు’నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం.. అంటూ ఎంతో హ్యాపీ మూడ్‌లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.  షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30 ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జూన్‌ నుంచి జరిగే అవకాశం ఉంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అందుకే నాన్‌స్టాప్‌గా వరస షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలని అనిల్‌ రావిపూడి భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్లలో అనిల్‌ రావిపూడి ఎంతో స్పీడ్‌గా సినిమా పూర్తి చేస్తారనే పేరు ఉంది. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయడమే కష్టంగా మారింది. కానీ, అనిల్‌ రావిపూడి స్కూల్‌ వేరు. ప్రీ ప్రొడక్షన్‌ గానీ, షూటింగ్‌గానీ ఎంతో వేగంగా పూర్తి చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కేవలం 72 రోజుల్లో పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు అనిల్‌ రావిపూడి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉన్న సినిమాల్లో మెగాస్టార్‌ చిరంజీవి పెర్‌ఫార్మెన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. యాక్షన్‌ సీక్వెన్స్‌లు, డాన్సులు ఎంత అద్భుతంగా చేయగలరో, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉన్న సన్నివేశాలను కూడా అంతే అద్భుతంగా చేస్తారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది. ఇది ప్రేక్షకులకు ఒక ఫుల్‌ మీల్స్‌ లాంటిది. ఎందుకంటే ఈ కథలో కుటుంబ నేపథ్యం, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఒక పాత్ర కోసం అదితిరావు హైదరి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.  ఒక విభిన్నమైన కథను చిరంజీవి కోసం అనిల్‌ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో మెగాస్టార్‌ రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. అనిల్‌ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కథ ఏదైనా అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది పూర్తి స్థాయిలో ఉండేలా ప్లాన్‌ చేస్తారు. ఆ విధంగానే వరస విజయాలు అందుకుంటున్న అనిల్‌.. ఈ సినిమాలో మంచి మెసేజ్‌తోపాటు ప్రేక్షకులు, మెగాస్టార్‌ అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని తెలుస్తోంది. 
'అరుంధతి'మూవీతో తెలుగుప్రేక్షకుల అభిమాన నటుడుగా మారిన సోనుసూద్(Sonu sood)జులాయి, కందిరీగ,దూకుడు,అల్లుడు అదుర్స్,ఏక్ నిరంజన్ వంటి చిత్రాలతో మరింతగా దగ్గ్గరయ్యాడు.బాలీవుడ్ లో కూడా పలు హిట్ చిత్రాల్లో నటించిన సోనుసూద్ ఈ ఏడాది జనవరి 10 న 'ఫతే' అనే హిందీ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా తనే ఆ సినిమాని నిర్మించాడు. సోమవారం సాయంత్రం సోనుసూద్ భార్య సోనాలి సూద్(Sonali Sood)తో పాటు ఇద్దరు బంధువులు కారులో వస్తుంటే మహారాష్ట్ర లోని నాగపూర్ వద్ద కారు యాక్సిడెంట్ కి గురవ్వడం జరిగింది.దీంతో కారులో ఉన్న ముగ్గురు తీవ్రగాయాలపాలవ్వడంతో హాస్పిటల్ లో చేర్పించారు.ఇప్పుడు ఈ విషయంపై సోనుసూద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి.నా భార్యతో పాటు బంధువులు క్షేమంగా ఉన్నారు.మద్దతుగా నిలిచిన అందరకి కృతజ్ఞతలు అని ట్వీట్ చేసాడు.ప్రాంతాలతో సంబంధం లేకుండా సోనూసూద్ ఎన్నో ఏళ్ళ నుంచి సామాజికంగాను పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక సాయం కూడా చేసుకుంటు వస్తున్న విషయం తెలిసిందే.   
Mohanlal is one of tbe biggest superstars of Indian Cinema based in Malayalam Cinema. He delivered many memorable classics and blockbusters but in recent times, his films did not attract much box office interest. Changing that perception, his big blockbuster Lucifer sequel, L2E: Empuraan, has shocked everyone with its pre-bookings. The movie's release till last one week had been in big dilemma due to the financial cruch, Lyca Productions is facing. Sree Gokulam Movies came into picture and assisted the makers in smooth release. The makers did not promote it too much but the reports suggest that the movie has earned Rs.55 crores from just pre-bookings. Prithviraj Sukumaran, another big star of Malayalam Cinema, directing the movie has also increased its buzz and trailer consolidate the hype for the film. On BMS app, we can see Empuraan leading over every new scheduled release of this week with 434.9k likes while Salman Khan's big Eid film, Sikandar is at 326.8k likes.  Interestingly, rather shockingly, Nithiin and Sreeleela starrer Robinhood is lagging behind with 86.5k likes while Mad Square did little better with 87.1k likes. Both the films promotions have been going on at full pace with social media content being released twice or thrice everyday.  It is hard to not find Nithiin or Sreeleela promoting Robinhood but the film is not showing results at the same level. Even David Warner has started participating in reels and he came to pre-release event, a controversy has also happened, still the interest rate around the movie seems to be below MAD Square.  Lucifer released way back in 2019, and the sequel is releasing 6 years later. Yet the bookings are phenomenal. Mad released two years ago and it became one of the most talked about and shared films, still, it appears to have not ignited great buzz for its sequel. In fact makers started promotions, six months ago for the film.  Still, it did not cross 100k interests and bookings are not at the expected level, too. Even Robinhood is also suffering similarly, while it is not a sequel, the makers have been promoting it non-stop from past three months and in last one month, they have intensified it even more.  Looks like the highly promoted films are struggling big time to even stay in competition with OG superstars charisma. Unfortunately, Chiyaan Vikram's Veera Dheera Sooran has been unable to capture any amount of attention in this Ramzan box office battle with 33.9k likes till date. 
  ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా.. తనని తాను మార్చుకోవడం ఎన్టీఆర్ కి అలవాటు. ప్రతి సినిమాలోనూ లుక్స్ పరంగా ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తుంటాడు. కానీ, ఆఫ్ స్క్రీన్ లుక్స్ పరంగా మాత్రం.. తారక్ పెద్దగా కేర్ తీసుకోడనే పేరుంది. అయితే ఇప్పుడు దానికి కూడా చెక్ పెడుతున్నాడు. (Jr NTR)   ఎన్టీఆర్ బయట ఎక్కువగా క్యాజువల్ వేర్ లోనే కనిపిస్తుంటాడు. స్టైలింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా కనిపించడు. అలాంటి తారక్ ఉన్నట్టుండి పూర్తిగా స్టైల్ మార్చేశాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ మార్చి 28న జపాన్ లో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన తారక్.. తన ఆఫ్ స్క్రీన్ లుక్స్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఎప్పుడూ కనిపించని విధంగా సరికొత్త స్టైలింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో ఎన్టీఆర్ లో ఒకేసారి ఇంత మార్పు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.    'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ పొందాడు. అలాగే ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. భవిష్యత్ లోనూ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచనలో తారక్ ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఎన్టీఆర్ సంబంధించిన న్యూస్ నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో రావడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన లుక్స్ గురించి కూడా చర్చ జరిగే అవకాశముంది. అందుకే స్టైలింగ్ విషయాన్ని ఇంతకాలం పెద్దగా పట్టించుకోని ఎన్టీఆర్.. ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ఫలితంగానే జపాన్ టూర్ లో ఎన్టీఆర్ స్టైలింగ్ లో ఇంత మార్పు కనిపించిందని అంటున్నారు. తారక్ లేటెస్ట్ స్టిల్స్ చూసి, ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ విషయంలో.. ఎప్పుడూ ఇలాగే కేర్ తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.  
స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara)ప్రస్తుతం 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న'మూకుత్తి అమ్మన్‌'(Mookuthi Amman)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్‌ 2 (Mookuthi Amman 2)లో చేస్తున్న విషయం తెలిసిందే.మొదటి భాగం 'అమ్మోరు తల్లి'గా తెలుగులోకి కూడా డబ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందింది.ప్రముఖ నటుడు,దర్శకుడు ఆర్జే బాలాజీ పార్ట్ 1 కి దర్శకత్వం వహించగా, రెండవ భాగానికి సీనియర్ దర్శకుడు సుందర్ సీ(Sundar c)దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా అసిస్టెంట్ డైరెక్టర్,నయనతారకి మధ్య లొకేషన్ లో గొడవ జరిగిందని, దీంతో సుందర్ షూట్ ని ఆపేశారనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పుడు ఈ విషయంపై సుందర్ వైఫ్ ప్రముఖ నటి ఖుష్బూ 'ఎక్స్' వేదికగా స్పందిస్తు రూమర్స్ సృష్టించే వాళ్ళు రెస్ట్ తీసుకోండి.ఎందుకంటే ఇలాంటి రూమర్స్ ని సుందర్ అసలు పట్టించుకోరు.అనుకున్న ప్రకారమే మూకుత్తి అమ్మన్‌ 2 రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది.నయనతార చాలా మంచి నటి.గతంలో ఆమె చేసిన క్యారక్టర్ ని మళ్ళీ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.మా సినిమాకి ఎప్పడు మీ సపోర్ట్ కావాలి.సుందర్ నుంచి మరో బ్లాక్ బస్టర్ వస్తుంది రెడీ గా ఉండండని ట్వీట్ చేసింది.దీంతో మూకుత్తి అమ్మన్‌ 2 షూట్ ఆగిందనే న్యూస్ నిజంగానే రూమర్ గా మిగిలింది. తమిళనాట ఉన్న అగ్ర దర్శకుల్లో సుందర్ సి కూడా ఒకరు.రజనీకాంత్ హిట్ మూవీ 'అరుణాచలం' మూవీకి సుందర్ నే దర్శకుడు.అదే పేరుతో తెలుగులో కూడా విడుదలై   మంచి విజయాన్ని అందుకుంది.కమల్ హాసన్,శరత్ కుమార్ వంటి అగ్ర హీరోలతో కూడా సుందర్ సినిమాలని తెరకెక్కించాడు.సుమారు 30 సినిమాల దాకా ఆయన లిస్ట్ లో ఉన్నాయి.    
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం చేస్తున్న 'విశ్వంభర'(Vishwambhara)తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం'ఫేమ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.షూటింగ్ స్టార్టింగ్ కాకముందే 2026 సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు.దీంతో అనిల్ రావిపూడి ఈ మూవీకి సంబంధించిన అన్ని విభాగాలకి చెందిన పనుల్లో బిజీగా ఉన్నాడు.   ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 30 న పూజా కార్యక్రమాలతో ఉగాది రోజున ప్రారంభం కానుంది.ఆ తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చాలా కాలం తర్వాత చిరు కుటుంబ నేపథ్యంతో పాటు పూర్తి వినోదాత్మకంతో కూడిన కథలో చేస్తుండటం,అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.చిరు తరహా యాక్షన్ సన్నివేశాలకి కూడా లోటు లేని విధంగా అనిల్ స్క్రిప్ట్ ని రూపొందించినట్టుగా కూడా  తెలుస్తుంది.చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారని,ఒక హీరోయిన్ గా అదితిరావు హైదరి చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.అదితి పలు తెలుగు,హిందీ భాషల్లో ఎన్ని సినిమాలు చేసింది.ఇటీవల ప్రముఖ హీరో సిద్దార్ధ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా చిత్రాన్ని బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి ని నిర్మించి హిట్ ని అందుకున్న'సాహు గారపాటి',చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.'సంక్రాంతికి వస్తున్నాం'ని మ్యూజికల్ హిట్ గా కూడా నిలిపిన భీమ్స్ సిసోరియా(Bheems Ceciroleo)సంగీతాన్నిఅందిస్తున్నాడు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.
  మూర్ఛ.. చాలా మందికి పెద్దగా అవగాహన లేని వ్యాధి ఇది.  ఈ వ్యాధి బారిన పడేవారు ఆ కుంటుంబానికి తప్ప ఈ జబ్బు గురించి తెలిసిన వారు తక్కువే. నాడీ మండలాన్ని ప్రభావితం చేసే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.  ఈ మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి 26వ తేదీన మూర్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ మూర్ఛ దినోత్సవాన్ని  పర్పుల్ డే అని కూడా పిలుస్తారు. మూర్ఛ అవగాహనకు మద్దతుగా  ఊదా రంగును ధరించమని,  ఊదా రంగు రిబ్బన్ ఈ మూర్ఛ వ్యాధిని సూచిస్తుందని చెబుతారు.   నాడీ సంబంధిత పరిస్థితి మూర్ఛ, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల మూర్ఛ మాత్రమే కాకుండా  ఇతర లక్షణాలు కనిపిస్తాయి. మూర్ఛ  కారణం,  రకాన్ని బట్టి  దీని చికిత్స  మారుతుంది.  మూర్ఛ వ్యాధికి  అసలు కారణాలు ఏంటి?  దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే.. మూర్చకు కారణాలు.. ప్రమాదవశాత్తు మెదడు గాయం కావడం వల్ల మూర్ఛ  వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరంగా కొందరిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.  కుటుంబంలో ఎవరికైనా వంశ పారంపర్యంగా మూర్ఛ వస్తూ ఉంటే ముందు జాగ్రత్తగా చిన్నతనంలోనే వైద్యులను సంప్రదించాలి. జీవక్రియ లోపాలు ఉన్నవారిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో,  రోగ నిరోధక శక్తికి సంబంధించి ఏవైనా అనారోగ్యాలు ఉండే వారిలో మూర్ఛ వ్యాధి తొందరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న దాదాపు 70 శాతం మంది మందులతో తమ మూర్ఛలను నియంత్రించుకుంటారు. మూర్ఛ ఉన్న వ్యక్తులు  ప్రమాదాలకు ఎక్కువగా గురవుతారు. ముఖ్యంగా మూర్ఛలు హెచ్చరిక లేకుండా వస్తుంటాయి.  దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఉబ్బసం లేదా మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యల మాదిరిగానే మూర్ఛ కూడా కొన్ని ప్రమాదాలతో వస్తుంది. వీటిని అదుపు చేయకుండా వదిలేస్తే చాలా తీవ్రంగా మారవచ్చు. మూర్ఛ సంబంధిత ప్రమాదాలను తగ్గించడంలో  మూర్ఛ నియంత్రణ మొదటి అడుగు. మూర్ఛలు కొన్నిసార్లు గాయాలు లేదా పడిపోవడానికి దారితీయవచ్చు. అవి అప్పుడప్పుడు మరింత తీవ్రంగా  మరణానికి కూడా కారణమవుతాయి. వివిధ రకాల మూర్ఛలు వేర్వేరు ప్రమాదాలను కలిగి ఉంటాయి.  వచ్చే మూర్ఛల రకం,  జీవనశైలిపై  ప్రమాద స్థాయి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సరిగా నియంత్రించబడని టానిక్-క్లోనిక్ మూర్ఛలు అత్యధిక ప్రమాదాన్ని కలిగిస్తాయి. మూర్చ సమస్య ఉంటే ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని లేదు. కానీ వైద్యులను సంప్రదించి మూర్చ వ్యాధికి తగిన చికిత్స,  జాగ్రత్తలు, నియంత్రణ తీసుకుంటే సాధారణ వ్యక్తులలా జీవితాన్ని గడపవచ్చు. మూర్ఛ వ్యాధికి ప్రథమ చికిత్స.. ప్రశాంతంగా ఉండాలి. మూర్ఛ వచ్చిన  వ్యక్తితోనే ఉండాలి. మూర్ఛ వచ్చిన వ్యక్తిని  సురక్షితంగా ఉంచాలి. గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. మూర్ఛ వచ్చిన వారి తల కింద మెత్తని వస్తువును ఉంచాలి.  బిగుతుగా ఉన్న దుస్తులను వదులుగా చేయాలి. . మూర్ఛ ముగిసిన తర్వాత శరీరంలో  వంకర పోయిన అవయవాలను మెల్లిగా వాటి యథా స్థానాలలో ఉంచాలి.  వాటి నోటిలో ఆహారం లేదా ద్రవం ఉంటే, వెంటనే వాటిని  బయటకు పోయేలా చేయాలి. మూర్చ్ వచ్చిన వ్యక్తి కోలుకునే వరకు వారికి  ధైర్యం చెప్పాలి.వారు ప్రమాదంలో ఉంటే తప్ప వారి నోటిలో ఏమీ పెట్టకూడదు. మూర్ఛ ఎందుకు వస్తుంది..  మెదడులో విద్యుత్ అవాంతరాలు ఏర్పడటం వల్ల మూర్ఛ వస్తుంది.  మూర్చలో వివిధ రకాలు ఉన్నాయి. ఏమి జరుగుతుందో అర్థం కాని వ్యక్తులకు ఇది భయానక పరిస్థితి కావచ్చు. మైగ్రేన్లు, స్ట్రోక్‌లు,  అల్జీమర్స్ తర్వాత ఇది నాల్గవ అత్యంత సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. మూర్ఛ వచ్చిన తర్వాత వ్యక్తిని వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.                                         *రూపశ్రీ.
  బంధాల విషయానికి వస్తే బాధ్యతలు చాలా ఉంటాయి.  చిన్నవైనా, పెద్దవైనా బాధ్యతలు నిర్వహించడం ప్రతి ఒకరి కర్తవ్యం.  అయితే అంతా తమదే బాధ్యత అనుకోవడం చాలా మంది చేసే తప్పు. ప్రతి ఒక్కరూ నిర్వహించాల్సిన బాధ్యతలకు ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితికి మించి బాధ్యతలు తీసుకునేవారు మంచివారు అనే ట్యాగ్ నేమ్ పొందగలరు ఏమో కానీ.. జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. చాలామంది తరచుగా బాధ్యతల పేరుతో  కష్టాలలోకి జారిపోయి  జీవితాంతం వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.  అసలు బాధ్యతల విషయంలో ఏవి పట్టించుకోకూడదు.  ఏ విషయాలు మనుషులను జీవితాంతం బాధపెడతాయి. తెలుసుకుంటే.. ఇతరుల ఆనందానికి బాధ్యత.. ఇతరులను సంతోషపెట్టే బాధ్యత మీకు లేదు. మీరు వారి ఆనందానికి సహాయం చేయవచ్చు. కానీ నిజమైన ఆనందం వారి లోపలి నుండే వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగ శ్రేయస్సును తమ చేతుల్లోకి తీసుకోవాలి,  వారి వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తిని పొందాలి. మీరు వేరొకరి ఆనందం భారాన్ని మోయలేరు. అలాగే వారి దుఃఖాన్ని తగ్గించాల్సిన బాధ్యత మీకు ఉండకూడదు. ముందుగా మీ స్వంత ఆనందంపై దృష్టి పెట్టాలి. ఇతరులు వారి స్వంత శాంతిని కనుగొననివ్వగలగాలి.  అంతేకానీ ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసమే బ్రతకడం పనిగా పెట్టుకుంటే మీకంటూ జీవితం, జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. ఎంపిక.. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకుంటే అది అందరికీ అర్థమయ్యేలా చెప్పడం,  అందరూ ఆమోదం తెలపాలని అనుకోవడం మీ పని కాదు. మీ విషయంలో ఇతరులు గందరగోళంలో ఉంటే, అలాగే ఉండండి. మనందరికీ జీవితంలో విభిన్నమైన ఆలోచనలు,  అనుభవాలు ఉంటాయి. అవి మన నిర్ణయాలను రూపొందిస్తాయి. ఆమోదం,  ధృవీకరణ కోరుకోవడం సహజం. కానీ అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరని అంగీకరించాలి. మీ ఎంపికలు మీ విలువలు, మీ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.  ఇతరులు వాటిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు మీ పట్ల నిజాయితీగా ఉండటమే ముఖ్యం. భావోద్వేగాలు.. మీరు ఎవరికైనా మానసికంగా సహాయం చేయవచ్చు, కానీ వారి భావాలను నిర్వహించడం మీ బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ వారి స్వంత భావాలు,  రియాక్షన్స్ కు బాధ్యత వహిస్తారు. ఇతరులను ఓదార్చాలని కోరుకోవడం సాధారణమే కావచ్చు. కానీ వారి భావాలను నియంత్రించడానికి లేదా సరిదిద్దడానికి ప్రయత్నించడం చికాకు లేదా ఆగ్రహానికి దారితీస్తుంది. సానుభూతిని తెలపడం,  మాట్లాడటం  ముఖ్య.  కానీ ఇతరులు ఇలా మాట్లాడటాన్ని కొన్నిసార్లు తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే భావోద్వేగాల పరంగా ఇబ్బంది పడుతున్నవారికి పదే పదే మాట్లాడించడం సరికాదు.  వారికంటూ కొంత సమయం ఇవ్వాలి. అంతేకాదు.. ఇతరుల భావోద్వేగాలు మీ మీద ఆధారపడటం కూడా తప్పే.. మీ తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చు. కానీ తప్పు లేకపోయినా ఇతరులు భావోద్వేగాలు తగ్గించడానికి మీరు మీ జీవితాన్ని,  సంతోషాన్ని త్యాగం చేసే పని పెట్టుకోకూడదు. విలువ.. ప్రతి మనిషి విలువైనవారే.. ఆ విలువను ఇతరుల ముందు  నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు.  విలువ అనేది దానికదే అర్థం కావాలి. ముఖ్యంగా మిమ్మల్ని చూడటానికి లేదా అభినందించడానికి ఇష్టపడని వారికి. మీ విలువకు ఇతరుల ప్రశంసలు లేదా గుర్తింపు అవసరం లేదు. మీ విలువను గుర్తించని వ్యక్తుల నుండి ఆమోదం పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపిస్తే  అది మీ శక్తిని హరిస్తుంది. బదులుగా మిమ్మల్ని అభినందిస్తున్న,  ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో కలిసిపోవడం మంచిది అంచనాలు..  అందరికీ అన్ని విధాలుగా అందరూ నచ్చరు. అందరి అంచనాలను అన్నివేళలా తీర్చడం సాధ్యం కాదు.  అలా చేయడానికి ప్రయత్నించడం వల్ల నిరాశ,  ఆగ్రహమే వస్తుంది.  పరిమితులను నిర్ణయించుకోవడం,  వేరొకరికి ఎంత ఇవ్వగలరో,  ఎంత ఇవ్వకూడదో స్పష్టంగా చెప్పడం ముఖ్యం.                               *రూపశ్రీ.  
    పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు.  బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు,  మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి.  పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు.  వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు.    కానీ పెరుగు  కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో  తినడం వల్ల  చాలా నష్టం చేకూరుస్తుంది.  కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ఇంతకీ  పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఇది ఉబ్బరం,  గ్యాస్,  ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. డెజర్ట్‌లు స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?  కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా.  కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు,  స్వీట్ల  కలయిక  కడుపులో మంటను కలిగిస్తుంది. బంగాళాదుంపలు.. పెరుగుతో బంగాళాదుంపలు తినడం  చూసే ఉంటారు.  చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు,  బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది మాంసాహారం.. పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.  ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు.  ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం,  పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్నపిల్లలే చదువులో బాగా రాణిస్తారు.  పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు,  ప్రైజులు,  పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది.  ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా,  ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్దిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు.. ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ది స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టీవ్ చేసే ఆహారాలు ఇవ్వాలి.  పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వాల్నట్స్.. పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్‌నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు  మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని మీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది  చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి. ఆకుకూరలు పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు  మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్,  విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు  మెదడును బలపరుస్తాయి.  అయితే పిల్లలు పాస్ట్ ఫుడ్స్,  బయటి ఫుడ్స్ ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు.  అందుకే  ఆకుకూరలతో సూప్,  కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి. బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు  మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు  మెదడును పదునుపెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం.  వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు.  అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేరేడు,  రేగు పళ్లు.. వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు.  ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్డు.. గుడ్లు తినడం  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్  మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి.  రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పైన చెప్పుకున్న నాలుగు ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా బాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు.  వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు.  అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం,  వారిని ఇన్ప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                                   
   నెయ్యిని భారతీయ ఋషులు అమృతంతో సమానమైన ఔషదంగా పేర్కొన్నారు.  ఆహారంలో నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తినడం,  ఉదయాన్నే నెయ్యిని వేడి నీటితో తాగడం లాంటి చిట్కాలు వినే ఉంటారు.  కానీ నెయ్యిలో నల్ల మిరియాలు కలిపి తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. దేశీ ఆవు నెయ్యి చాలా  ఆరోగ్యకరమైనది అని ఆయుర్వేదం చెబుతుంది.  ఎందుకంటే దేశీ ఆవు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి.  ఇక  మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది.  ఈ పైపెరిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్,  ఎసిడిటీ వంటి సమస్యతో బాధపడేవారు ఒక మిరియాలు వాడితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది.  అయితే ఒక స్పూన్ దేశీ ఆవు నెయ్యిలో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకున్నా లేదా ఒక స్పూన్ నెయ్యితో ఒక మిరియం గింజ తీసుకుని నమిలి తిన్నా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. దేశవాళీ ఆవునెయ్యి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు దేశ వాళీ ఆవు నెయ్యిలో కాస్త మిరియం పొడి కలిపి తీసుకుంటే మంచిది.  పేగుల దారిని ఇది సుగమం చేస్తుంది.  ఆహారం ప్రేగులలో సులువుగా కదిలేందుకు సహాయపడుతుంది. తద్వారా పేగులలో వ్యర్థపదార్థాలు మలం రూపంలో సులువుగా విసర్ఝించబడతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఈ లక్షణాలు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి.  నెయ్యిలో కాసింత మిరియాల పొడి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.                                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...