LATEST NEWS
హైద్రాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయిల్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇజ్రాయిల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే  ఉన్న మహిళపై  ఎలక్ట్రిషన్ దస్తగిరి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వేధింపుల గూర్చి అడ్వకేట్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో   అడ్వకేట్ ఇజ్రాయిల్ పై  దస్తగిరి కక్ష్య పెంచుకున్నాడు. అడ్వకేట్  సోమవారం విధులకు వెళుతున్న సమయంలో  మాటు వేసి  దస్తగిరి హత్యకు పాల్పడ్డాడు హత్య తర్వాత దస్తగిరి ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇజ్రాయిల్ హత్యకు నాలుగు రోజుల ముందే దస్తగిరి రెక్కీ నిర్వహించాడు. కాపు కాసి ఉదయం అడ్వకేట్ ను దుండగుడు  హత్య చేశాడు. ఘటన  తర్వాత కంచన్ బాగ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఈ ఘటన తర్వాత ఒక న్యాయవాది ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్య వ్యక్తికి రక్షణ ఏ విధంగా ఉంటుంది  అనే ప్రశ్న ఉత్పన్నమైంది. 
  రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఎవరినైనా ఆపితే ఏం చేస్తాడు? హెల్మెట్, ఆర్సీ బుక్, లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి తనిఖీ చేసి ఏది తేడాగా కనిపించినా సరే వేల రూపాయల్లో చలానా కట్టవలసిందే అంటూ పుస్తకం పెన్ను తీస్తాడు. దానికి ఎవరైనా ఎలా స్పందిస్తారు?  సార్ సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు సార్.. వదిలేయండి సార్.. ప్లీజ్.. వందో అయిదొందలో ఇస్తాను  అంటూ బ్రతిమాలుతారు! కాసేపు బ్రతిమాలిన తర్వాత వారిచ్చే సొమ్ము పుచ్చుకొని చలానా పుస్తకాన్ని తిరిగి సంచిలో పెట్టుకొని.. మరొకరి కోసం నిరీక్షిస్తాడు ట్రాఫిక్ పోలీసు!  తన నియోజకవర్గం పరిధిలో అడ్డగోలుగా అరాచకాలను సాగించడంలో మాజీ మంత్రి విడదల రజని అనుసరించిన వ్యూహం ఇంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ లేదు! అచ్చంగా ట్రాఫిక్ పోలీసుల లాగానే ఆమె భారీ మొత్తాలు జరిమానాలుగా చూపించి బెదిరిస్తూ, చిన్న మొత్తాలను గుట్టు చప్పుడు కాకుండా దండుకున్నారనేది ఆరోపణ. చిన్న మొత్తాలు అనగా ఏమిటనుకుంటున్నారో అథమపక్షం రెండు కోట్ల రూపాయలన్న మాట. విడదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన ఏడాదిలో లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ క్రషర్ యజమానులే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తరువాత.. విడదల రజనికి రెండుకోట్లు, ఆమె మరిది గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా లకు చెరి పది లక్షల వంతున ముడుపులు సమర్పించినట్టుగా కేసు నమోదు అయింది. నమోదైన కేసు, ఆరోపణల ప్రకారం.. ఈ దందా సాగిన తీరు మాత్రం..  అచ్చంగా ట్రాఫిక్ పోలీసు వ్యవహారం లాగానే ఉన్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు. అదెలాగో తెలుసుకోండి.. స్టెప్ 1 : రజని తరఫున ఆమె పీఏ రామకృష్ణ క్రషర్ యజమానుల వద్దకు వెళ్లి.. మేడం వాళ్లను కలవాలనుకుంటున్నట్టుగా చెప్పారు.  స్టెప్ 2 : వారు వెళ్లి కలిసినప్పుడు.. తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే.. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని, మిగిలిన సంగతులు పీఏతో మాట్లాడుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.  స్టెప్ 3 : వారం రోజులు కూడా గడవక ముందే అధికారి పల్లె జాషువా.. పెద్దఎత్తున సిబ్బంది మందీ మార్బలంతో క్రషర్ కు తనిఖీలకు వచ్చారు. క్షుణ్నంగా తనిఖీలు జరిపి వెళ్లిపోయారు. నెల తర్వాత ఫోను చేసి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు 50 కోట్ల రూపాయల జరిమానా విధిస్తామని.. అలా కాకుండా ఉండాలంటే.. వెళ్లి రజని మేడం తో వ్యవహారం సెటిల్ చేసుకోవాలని బెదిరించారు.  స్టెప్ 4 : క్రషర్ యజమానులు మళ్లీ విడదల రజని వద్దకు వెళ్లి.. అయిదు కోట్ల రూపాయలు ఇచ్చుకోలేం అని.. బతిమాలి రెండుకోట్లకు బేరం కుదుర్చుకున్నారు.  స్టెప్ 5 : రజని సూచన మేరకు పురుషోత్తమపట్నంలోని ఆమె మరిది గోపికి వద్దకు రెండు కోట్లరూపాయలు అందజేశారు. అలాగే ఆ గోపికి పది లక్షలు, అధికారి పల్లెజాషువాకు కూడా పది లక్షలు ముట్టజెప్పారు.  ..చూశారుగా.. జరిమానా వేస్తే వేలల్లో పడిపోతుందని బెదిరించి వందల రూపాయల ముడుపులు స్వీకరించే ట్రాఫిక్ పోలీసు వ్యవహారంలాగానే.. యాభై కోట్ల జరిమానా పడుతుందని బెదిరించి.. రెండు కోట్లు ముడుపుల కింద స్వీకరించడం.. విడదల రజని స్టయిల్ ఆఫ్ రాజకీయం అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఆరోపణలతో కుంగిపోయింది.. అవమానాల్ని మౌనంగా భరించింది.. చేయని తప్పుకి జైలుకెళ్లింది.. దాదాపు ఐదేళ్ల పాటు సహనం కోల్పోకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడింది. బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. మొత్తానికి రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సుశాంత్ సూసైడ్‌కి, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. సుశాంత్  కేసుకు సంబంధించిన క్లోజర్ రిపోర్ట్‌‌లను సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందన్న వాదనల్ని సీబీఐ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సుశాంత్ మరణంతో ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలతో.. రియా చక్రవర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చేయని తప్పుకు ఆమె 27 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా  రియా, ఆమె కుటుంబ సభ్యులు మౌనంగా భరించారు. కానీ.. సుశాంత్ మరణం తర్వాత వారిపై జరిగిన ప్రచారం, నిరాధార ఆరోపణలతో ఇంతకాలం వారెంతో కుంగిపోయారు. ఇప్పుడు రియాకు క్లీన్ చిట్ రావడంపై బాలీవుడ్ యాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు. అప్పట్లో రియాను, ఆమె కుటుంబాన్ని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసినందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 2020 జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించారు. అతని మరణవార్త బయటకు తెలిశాక కొందరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు. ఇప్పుడు సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేదాకా  సుశాంత్ మరణానికి ఆవిడే కారణం అనుకున్న వాళ్లెందరో ఉన్నారు. ఇంత జరిగినా.. రియా కుటుంబం మౌనంగానే ఉంది. తమతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నా సహనంతోనే ఉన్నారు. అయితే, ఆ కుటుంబం ఇంతకాలం పడిన మానసిక వేదనకు.. ఇప్పుడు విముక్తి దొరికినట్లేనా? అనే ప్రశ్న తలెత్తితే.. ఎక్కడా సరైన సమాధానం దొరకట్లేదు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో మీడియా వేధింపులకు రియా, ఆమె ఫ్యామిలీ అనుభవించిన క్షోభని మాటల్లో చెప్పలేం. నిరాధార ఆరోపణలతో ప్రసారం చేసిన కథనాలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయ్. సుదీర్ఘ విచారణ తర్వాత సుశాంత్ మరణంతో ఆమెకు సంబంధం లేదని తేలాక వాళ్లకు కొంత ఊరట మాత్రం దక్కింది. కానీ.. దీనితోనే సమాజం వేసిన ముద్ర తొలగిపోతుందా? వారికి అంటుకున్న ఆరోపణల మరకలు తుడిచిపెట్టుకుపోతాయా? అనేదే.. అసలు ప్రశ్న. సుశాంత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత.. రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, డ్రగ్స్ సప్లై, మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలతో.. ఆమెతీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థల విచారణని కూడా ఆమె ఎదుర్కొంది. తన సోదరుడితో పాటు రియా కూడా జైలు శిక్ష అనుభవించింది. సుదీర్ఘ కాలంలో ఇలాంటి పరిణామాల తర్వాత సీబీఐ నుంచి క్లీన్ చిట్ దొరకడం, రియాకు  నిజంగా ఓ విడుదలలా అనిపించొచ్చు. ముంబై స్పెషల్ కోర్టులో సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో, రియాకు ఎలాంటి నేరం ఆపాదించలేదు. దీంతో, ఆమెపై ఉన్న చట్టపరమైన ఒత్తిడి దాదాపుగా తొలగిందనే చెప్పాలి. చట్టపరంగా కొంతవరకు ఆమెకు ఇది ఊరట కలిగించినా.. ఐదేళ్లుగా మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో విమర్శలు, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడుల వల్ల.. రియా ఎదుర్కొన్న మానసిక వేదనని పూర్తిస్థాయిలో తొలగించదనే చెప్పాలి. రియా విషయంలో.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీలు.. ఆమెని నేరస్తురాలిగా చిత్రీకరించడం, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయడం లాంటివి విస్తృతంగా జరిగాయ్. ఈ పరిస్థితుల్లో.. ఆమె కెరీర్ దెబ్బతినడమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్లీన్ చిట్ ద్వారా.. ఆమెకు న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. సమాజంలో ఆమెపట్ల ఏర్పడిన అభిప్రాయాలు, ఆమె కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు.. రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే.. రియా తప్పు చేయకపోయినా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ క్లీన్‌ చిట్‌తో చట్టపరంగా కొంత విముక్తి దొరికినా.. ఆమె మానసికంగా పూర్తిగా కోలుకునేందుకు, సమాజంలో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఆమె మళ్లీ ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ.. రియా అనుభవించిన వేదన, గతం తాలూకు గాయాలు అంత ఈజీగా మానిపోవు.
హైద్రాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి వచ్చే మే 1తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ విడుదల చేసింది.  ఈ నెల 28 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ  నోటిఫికేషన్తో మొదలవుతుంది. వచ్చే  నెల 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఏప్రిల్ నాలుగో తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  అదే నెల ఏడో తేదీన నామినేషన్ల స్కూట్ని ఉంటుంది. ఏప్రిల్ 9 వతేదీ వరకు   నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.  ఏఫ్రిల్ 23న పోలింగ్ , 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.   
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మంతా లెక్కల్లో చూపనిదిగా తేలింది.  లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో   అగ్నిప్రమాదం సంభవిం చడంతో ఈ నోట్ల కట్టల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది.   దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి న్యాయపరమైన ఎటువంటి బాధ్యతలూ అప్పగించరాదని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ వెంటనే   ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సైతం తొలగించారు. అలాగే నోట్ల కట్టల విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను నియమించింది.    
ALSO ON TELUGUONE N E W S
Pooja Hegde has not been doing similar amount of Telugu films like before but she is busy in Tamil and is working in Hindi with Varun Dhawan. The actress has been on social media trends with her energetic dance number from Suriya's Retro. Now, she posted a video jumping into Ganga with Varun Dhawan at Rishikesh.  The actress is working in Varun Dhawan's upcoming Hai Jawaani Toh Ishq Hona Hai and the actors wrapped their Rishikesh schedule today. As a mark of wrapping the schedule, they both jumped into Ganges and posted the video on social media.  Looking fit and atheletic, both have become trending topic on social media with this jump into the river video. Well, after wrapping this schedule, Pooja will join Vijay's Jana Nayagan to wrap most of her portions, say the reports. 
Thalapathy Vijay has been delivering back to back big grossers in recent times. He announced that Jana Nayagan will be his last film and he would concentrate on politics full time. His fans have been eagerly waiting for the release date of the film. The makers locked 9th January, 2026 release date.  Vijay and Ajith have made Pongal and Diwali festivals as their big release dates for their respective fans to celebrate their releases. After Varisu, Jana Nayagan will be his big film to release for the festival. So, he chose this big festival for his swan song.    Makers have stated that the first-look poster set the internet on fire, portraying Vijay standing tall, taking a selfie with an electrified crowd—a symbol of his deep-rooted bond with his fans.  Producers of the film, KVN Productions and Phars Film have crafted a worldwide release strategy that will ensure Thalapathy Vijay’s final cinematic outing reaches every corner of the globe. Whether in Chennai or Chicago, Mumbai or Melbourne, fans will unite to witness history in the making. The movie is directed by H. Vinoth and it is stated to be remake of NBK's Bhagavanth Kesari with Mamitha Baiju, Pooja Hegde in leading lady roles. 
Nayanthara has become one of the topmost stars of South Indian Cinema. She even debuted in Hindi with Jawan, in a 1000 crore grosser. The actress faced many box office failures in recent times with her solo starrers. Still, she found a huge budget film in Mookuthi Amman 2, in the direction of Sundar C.  The actress has been troubling makers with her clauses according to media reports. Even for this huge budget movie, she asked makers to change their plans from going to shoot in Pollachi to locations around Chennai, it seems. She doesn't want to miss out on spending time with her kids, so, she has put up this clause, it seems.  The reports also suggest that the actress has been acting erratic on sets of other films by not coming on time and leaving early. For Mookuthi Amman 2 also, she did not change her attitude, but Sundar C, being an experienced director, is completing the shoot at a rapid pace without wasting producer's money, say reports.  It is the biggest budget movie of her career and she needs it to click big time at the theatres as it would be a big comeback for her at the box office. Well, but such reports about her attitude won't be helping her further. Maybe she could be more accomodating for the makers to feel and breathe easy, if the reports are to be believed. 
  స్టార్ హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ లు, డిజాస్టర్ లు కామన్. అయితే డిజాస్టర్ సినిమాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు, వాటి గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ మూవీస్ లో ఒకటైన 'నా అల్లుడు' గురించి మాత్రం యంగ్ హీరోలు మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది. (Jr NTR)   జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వర ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందిన 'నా అల్లుడు' మూవీ 2005లో విడుదలై పరాజయం పాలైంది. ఇందులో మురుగన్ గా ఎన్టీఆర్ నవ్వులు పూయించాడు. పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ, సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేయాలని, రీ రిలీజ్ చేయాలని యంగ్ హీరోలు కామెంట్స్ చేస్తుండటం విశేషం.   ఎన్టీఆర్ ని యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎంతగానో అభిమానిస్తాడనే విషయం తెలిసిందే. 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీ ప్రమోషన్స్ లో విశ్వక్ కి.. "ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఏది రీమేక్ చేయాలనుకుంటున్నారు?" అనే ప్రశ్న ఎదురైంది. దానికి విశ్వక్ ఎవరూ ఊహించని విధంగా 'నా అల్లుడు' అని సమాధానమిచ్చాడు. ఆ సినిమా బాగుంటుందని, కొన్ని మార్పులతో బాగా తీయొచ్చని అభిప్రాయపడ్డాడు.   ఇక తాజాగా ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ సైతం 'నా అల్లుడు' సినిమా తనకి ఇష్టమని చెప్పాడు. 'మ్యాడ్ స్క్వేర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా "ఏ మూవీ రీ-రిలీజ్ కోరుకుంటున్నారు" అని ప్రశ్న ఎదురు కాగా.. 'నా అల్లుడు' అని చెప్పాడు నితిన్. "బావ పాత సినిమాల్లో నాకు నా అల్లుడు ఇష్టం. అది అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కానీ, అందులో ఫన్ చాలా బాగుంటుంది. నా అల్లుడు రీ రిలీజ్ అయితే చూడాలని ఉంది." అని నితిన్ చెప్పుకొచ్చాడు.   మొత్తానికి ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా ఇష్టమని ఇద్దరు హీరోలు చెప్పారు. భవిష్యత్ లో ఈ లిస్టు ఇంకా పెరుగుతుందేమో చూడాలి.  
బాలీవుడ్ అగ్రహీరో 'సల్మాన్ ఖాన్'(salman khan)రంజాన్(ramadan)కానుకగా ఈ నెల 30 న 'సికందర్'(Sikandar)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.గత కొంత కాలంగా సరైన హిట్ లేని సల్మాన్ సికందర్ తో తన సత్తా చాటతాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.సల్మాన్ కి జోడిగా వరుస విజయాలతో నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)చేస్తుండటంతో 'సికందర్' పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.  రీసెంట్ గా సికందర్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ ముంబై లో జరిగింది.భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర యూనిట్ తో పాటు కొద్దిమంది సల్మాన్ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సల్మాన్‌ తో ఒక మీడియా ప్రతినిధి రష్మిక,సల్మాన్ ఏజ్ కి మధ్య గ్యాప్ గురించి ప్రశ్న వేసాడు.దీంతో సల్మాన్ మాట్లాడుతు మా వయసు గురించి మీకెందుకు నాకు,రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు.ఈ విషయంలో రష్మిక ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు.ఒకవేళ భవిష్యత్తులో రష్మిక కి పెళ్లి జరిగి పాప పుడితే,ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది.అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తానని సల్మాన్ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. ఇక 'సికందర్‌' ట్రైలర్‌ చూస్తుంటే సల్మాన్ క్యారక్టర్ లో విభిన్న రకాల షేడ్స్ ఉన్నట్టుగా అర్ధమవుతుంది.యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ దర్శకుడు 'మురుగదాస్'(Ar Murugadoss)గత చిత్రాల మాదిరిగా బలమైన సోషల్ మెసేజ్ కూడా ఉందనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. సల్మాన్ నట విశ్వరూపం పక్కా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.సత్య రాజ్,కాజల్ అగర్వాల్,అంజిని థావన్,కిషోర్ షర్మాన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించగా సాజిద్ నడియావాలా(Sajid Nadiadwala)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడవక ముందే 43 మిలియన్ల వ్యూస్ ని సాధించడంతో పాటు ట్రెండింగ్ పరంగా మూడోస్థానంలో ఉంది.     
  ఈ సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. స్టార్స్ సైతం ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అయితే ట్రోల్స్ పై తాజాగా కన్నప్ప టీం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. (Kannappa)   మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు రఘబాబు.. ట్రోలర్స్ పై ఊహించని వ్యాఖ్యలు చేశారు.   ప్రెస్ మీట్ లో ట్రోల్స్ కి సంబంధించిన ప్రశ్న మంచు విష్ణుకి ఎదురైంది. దీనికి విష్ణు బదులిస్తూ.. కొందరు కావాలని కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తుంటారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదే సమయంలో పక్కనున్న రఘుబాబు మైక్ అందుకొని "కన్నప్ప సినిమాని ఎవరైనా ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి, శాపానికి గురవుతారు." అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
బాలయ్య లేటెస్ట్ హిట్ 'డాకుమహారాజ్' (Daku Maharaj)లో నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్న భామ ఊర్వశి రౌతేలా.ఈ మూవీ ముందు వరకు 'ఊర్వశి రౌతేలా' అంటే కేవలం ఐటెం సాంగ్స్ కే పరిమితమని భావించేవాళ్లు.తన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది.కానీ ఎప్పుడైతే'డాకు మహారాజ్' లో పోలీసు ఆఫీసర్ గా ప్రాధాన్యత గల పాత్రని పోషించిందో,తనలో మంచి నటి ఉందనే విషయం అందరకి అర్ధమయ్యింది. 'డాకు మహారాజ్ ని అగ్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ తమిళ అగ్ర హీరో సూర్య(Suriya)లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి(Venki Atluri)కాంబోలో ఒక మూవీని నిర్మించబోతోంది.ఇందులో 'ఊర్వశి రౌతేలా' నటించబోతుందనే వార్తలు తమిళ,తెలుగు సినీ సర్కిల్స్ లో  వినిపిస్తున్నాయి.హీరోయిన్ గా కాకపోయినా కూడా కథకి సంబంధించిన ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో ఊర్వశి కనిపించనుందని అంటున్నారు.ఇదే కనుక జరిగితే సితార బ్యానర్ లో ఊర్వశి వరుసగా రెండోసారి చేసినట్టవుతుంది.సినీ విశ్లేషకులు అయితే సూర్య మూవీలో ఊర్వశి చెయ్యడం ఖాయమైతే కనుక,తమిళ చిత్ర సీమలో ఊర్వశి తన హవాని చూపించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూన్ లో ఈ ప్రెస్టేజియస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి.ఇందుకు సంబంధించి  సూర్య డేట్స్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది.హీరోయిన్ గా మొదట్లో క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే  పేరు వినిపించింది.ఆమె బిజీగా ఉన్న దృష్ట్యా మరో హీరోయిన్ 'కయదు లోహర్’(kayadu LOhar)ని ఎంపిక చేశారనే టాక్ వినపడుతుంది.గత నెలలో ప్రేక్షకుల  ముందుకు వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో కయదు ఎక్స్ట్రాఆర్డినరీ గా నటించి యూత్ లో మంచి క్రేజ్ ని పొందిన విషయం తెలిసిందే.జీవీ ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని  అందించనున్నాడు.    
Shiv Sena workers or Shiv Sainiks are known for being violent against people who oppose their leaders. They vandalized Habitat Studio in Mumbai for hosting comedian Kunal Kamra show. A FIR has been registered against the controversial comedian in Maharashtra, after his comments against Deputy CM Eknath Shinde.  He made fun of Eknath Shine in his recent video of a show recorded at Habitat Studio. After registering case, Shiv Sainiks vandalized the studio. Now, they have announced that the Studio is extremely shocked, worried and broken by the recent acts.    They have announced that they are shutting down until they figure out a way to let the artists express their views freely without putting their property and themselves under any sort of jeopardy. They have further stated that freedom of expression should not come under threat and they want to encourage constructive discussion, only. Habitat Studio has stated that if people can come together to agree to disagree respectfully that would be ideal. Well, now eleven Shiv Sena workers who vandalized the property have been arrested and cases have been registered on more than 25 people say the police. 
Salman Khan is starring in Sikandar film and the actor is looking to make a big comeback at the box office after Tiger 3 debacle. The movie is directed by AR Murugadoss and it is releasing for Eid on 30th March. The actor made comments addressing age gap between him and leading lady at press event.  Rashmika Mandanna is playing leading lady role and Salman stated that people start bringing their 31-year-old age gap and questioned but when she doesn't have an issue and her father doesn't have an issue, why should people have. He remarked that he will take her permission and work with her daughter as well.  These comments have divided social media with some accepting that actors are just professionally trying to sell a story on screen and that should not be made into an issue. While few others trolled Salman Khan for not addressing the issue seriously and trying to throw it under the carpet just with some smug looking quotes.  Well, Indian Cinema never really cared about age difference between the leads and now, few people are pointing out but if the story demands then no one can question. It is just that Salman and Rashmika pairing looks awkward on screen with zero chemistry, is making them notice it so much.  If it looks pleasing and aesthetically arresting, then no one would have any issue. On the other hand, Sikandar doesn't really look like a spirited comeback for Salman Khan has the songs and trailer did not really ignite the buzz as much as the makers wanted it to. 
  తెలుగునాట తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమా వచ్చిందంటే.. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్.. కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీ కావడంతో సినిమాల్లో వేగం తగ్గింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో.. పవన్ పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఉండగా.. వాటిలో వీరమల్లు, ఓజీ మాత్రమే ఎలాగోలాగ పూర్తి చేస్తారని, ఉస్తాద్ పై ఆశలు వదులుకోవాల్సిందే అని కామెంట్స్ వినిపించాయి. అభిమానులు సైతం వీరమల్లు, ఓజీ నే పవన్ చివరి చిత్రాలనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సినీ కెరీర్ గురించి పవర్ స్టార్ ఊహించని కామెంట్స్ చేశారు.   తాజాగా తమిళ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ కెరీర్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. "నాకు డబ్బు అవసరమైనంత కాలం, సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండా.. రెండూ బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తాను." అన్నారు.   పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడమే గొప్ప విషయం అని.. ఆయన కొత్త సినిమాలు కమిట్ అయ్యే అవకాశం లేదని ఇప్పటిదాకా అందరూ భావించారు. కానీ, తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తుంటే.. ఆయన భవిష్యత్ లో సినిమాలు కంటిన్యూ చేస్తారని అర్థమవుతోంది.   పవన్ గతంలోనూ ఇదే రకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. తనకు వ్యాపారాలు లేవని.. అందుకే సినిమాలు చేసి డబ్బు సంపాదించి.. ఆ డబ్బుని పార్టీ కార్యకలాపాలకు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పారు. పవన్ సొంతంగా పార్టీని నడిపించడమే కాకుండా, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవన్నీ జరగాలంటే.. తనకు తెలిసిన సినిమా ద్వారానే డబ్బు సంపాదించాలి. అయితే పవన్ ఆలోచన బాగానే ఉంది కానీ, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి.   'హరి హర వీరమల్లు', 'ఓజీ' షూటింగ్ లు చివరి దశలో ఉన్నాయి. పవన్ డేట్స్ అందుబాటులో లేక ఈ రెండు సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా వీరమల్లు ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మే 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మే 9 కైనా వస్తుందో లేదో స్పష్టంగా చెప్పలేము. ఓజీకి కూడా పవన్ 30 రోజులు దాకా కేటాయించాల్సి ఉంది. ఆయన డేట్స్ కేటాయిస్తే.. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికే పవన్ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇక కొత్త సినిమాలు చేయడమంటే దాదాపు కష్టమే. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ కొంత షూటింగ్ జరిగాక, బ్రేక్ పడింది. ఇక సురేందర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ కాగా, ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. దీంతో పవన్ నిజంగానే సినిమాలు కంటిన్యూ చేస్తారా? అసలు ఆయనకి అంత సమయం దొరుకుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే సినిమాలు చేయాలనుకుంటే మాత్రం.. హరి హర వీరమల్లు, ఓజీ వంటి భారీ ప్రాజెక్ట్ ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలైతే తక్కువ రోజుల్లో పూర్తి చేసే అవకాశముంటుంది. మరి పవన్ ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  బంధాల విషయానికి వస్తే బాధ్యతలు చాలా ఉంటాయి.  చిన్నవైనా, పెద్దవైనా బాధ్యతలు నిర్వహించడం ప్రతి ఒకరి కర్తవ్యం.  అయితే అంతా తమదే బాధ్యత అనుకోవడం చాలా మంది చేసే తప్పు. ప్రతి ఒక్కరూ నిర్వహించాల్సిన బాధ్యతలకు ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితికి మించి బాధ్యతలు తీసుకునేవారు మంచివారు అనే ట్యాగ్ నేమ్ పొందగలరు ఏమో కానీ.. జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. చాలామంది తరచుగా బాధ్యతల పేరుతో  కష్టాలలోకి జారిపోయి  జీవితాంతం వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.  అసలు బాధ్యతల విషయంలో ఏవి పట్టించుకోకూడదు.  ఏ విషయాలు మనుషులను జీవితాంతం బాధపెడతాయి. తెలుసుకుంటే.. ఇతరుల ఆనందానికి బాధ్యత.. ఇతరులను సంతోషపెట్టే బాధ్యత మీకు లేదు. మీరు వారి ఆనందానికి సహాయం చేయవచ్చు. కానీ నిజమైన ఆనందం వారి లోపలి నుండే వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగ శ్రేయస్సును తమ చేతుల్లోకి తీసుకోవాలి,  వారి వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తిని పొందాలి. మీరు వేరొకరి ఆనందం భారాన్ని మోయలేరు. అలాగే వారి దుఃఖాన్ని తగ్గించాల్సిన బాధ్యత మీకు ఉండకూడదు. ముందుగా మీ స్వంత ఆనందంపై దృష్టి పెట్టాలి. ఇతరులు వారి స్వంత శాంతిని కనుగొననివ్వగలగాలి.  అంతేకానీ ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసమే బ్రతకడం పనిగా పెట్టుకుంటే మీకంటూ జీవితం, జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. ఎంపిక.. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకుంటే అది అందరికీ అర్థమయ్యేలా చెప్పడం,  అందరూ ఆమోదం తెలపాలని అనుకోవడం మీ పని కాదు. మీ విషయంలో ఇతరులు గందరగోళంలో ఉంటే, అలాగే ఉండండి. మనందరికీ జీవితంలో విభిన్నమైన ఆలోచనలు,  అనుభవాలు ఉంటాయి. అవి మన నిర్ణయాలను రూపొందిస్తాయి. ఆమోదం,  ధృవీకరణ కోరుకోవడం సహజం. కానీ అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరని అంగీకరించాలి. మీ ఎంపికలు మీ విలువలు, మీ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.  ఇతరులు వాటిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు మీ పట్ల నిజాయితీగా ఉండటమే ముఖ్యం. భావోద్వేగాలు.. మీరు ఎవరికైనా మానసికంగా సహాయం చేయవచ్చు, కానీ వారి భావాలను నిర్వహించడం మీ బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ వారి స్వంత భావాలు,  రియాక్షన్స్ కు బాధ్యత వహిస్తారు. ఇతరులను ఓదార్చాలని కోరుకోవడం సాధారణమే కావచ్చు. కానీ వారి భావాలను నియంత్రించడానికి లేదా సరిదిద్దడానికి ప్రయత్నించడం చికాకు లేదా ఆగ్రహానికి దారితీస్తుంది. సానుభూతిని తెలపడం,  మాట్లాడటం  ముఖ్య.  కానీ ఇతరులు ఇలా మాట్లాడటాన్ని కొన్నిసార్లు తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే భావోద్వేగాల పరంగా ఇబ్బంది పడుతున్నవారికి పదే పదే మాట్లాడించడం సరికాదు.  వారికంటూ కొంత సమయం ఇవ్వాలి. అంతేకాదు.. ఇతరుల భావోద్వేగాలు మీ మీద ఆధారపడటం కూడా తప్పే.. మీ తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చు. కానీ తప్పు లేకపోయినా ఇతరులు భావోద్వేగాలు తగ్గించడానికి మీరు మీ జీవితాన్ని,  సంతోషాన్ని త్యాగం చేసే పని పెట్టుకోకూడదు. విలువ.. ప్రతి మనిషి విలువైనవారే.. ఆ విలువను ఇతరుల ముందు  నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు.  విలువ అనేది దానికదే అర్థం కావాలి. ముఖ్యంగా మిమ్మల్ని చూడటానికి లేదా అభినందించడానికి ఇష్టపడని వారికి. మీ విలువకు ఇతరుల ప్రశంసలు లేదా గుర్తింపు అవసరం లేదు. మీ విలువను గుర్తించని వ్యక్తుల నుండి ఆమోదం పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపిస్తే  అది మీ శక్తిని హరిస్తుంది. బదులుగా మిమ్మల్ని అభినందిస్తున్న,  ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో కలిసిపోవడం మంచిది అంచనాలు..  అందరికీ అన్ని విధాలుగా అందరూ నచ్చరు. అందరి అంచనాలను అన్నివేళలా తీర్చడం సాధ్యం కాదు.  అలా చేయడానికి ప్రయత్నించడం వల్ల నిరాశ,  ఆగ్రహమే వస్తుంది.  పరిమితులను నిర్ణయించుకోవడం,  వేరొకరికి ఎంత ఇవ్వగలరో,  ఎంత ఇవ్వకూడదో స్పష్టంగా చెప్పడం ముఖ్యం.                               *రూపశ్రీ.  
  క్షయ ప్రజలను భయపెట్టే.. బాధపెట్టే ఒక వ్యాధి.  దీన్ని టి.బి అని కూడా అంటారు.  విచారించాల్సిన విషయం ఏమిటంటే క్షయ వ్యాధికి నివారణ చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది.   ఈ క్షయ వ్యాధి గురించి అవగాహన పెంపొందించడానికి,  క్షయ కేసులు తగ్గించడానికి,  ప్రజలు క్షయ జబ్బుకు దూరంగా ఉండటానికి ప్రతి ఏటా మార్చి 24వ తేదీన క్షయ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్షయవ్యాధికి కారణమయ్యే బాక్టీరియా (మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్)ను  డాక్టర్ కోచ్ కనుగొన్న శతాబ్ది వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, వ్యాధి నిర్ధారణ,  చికిత్సకు మార్గం సుగమం చేస్తూ, WHO 1982 నుండి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. “అవును! మనం టీబీని అంతం చేయగలం: కట్టుబడి, పెట్టుబడి పెట్టండి, అందించండి”. ఇది 2025 సంవత్సరానికి గాను క్షయ వ్యాధి గురించి ప్రకటించిన థీమ్.. టిబి ని అంతం చేయడానికి ప్రపంచం నడుం బిగించింది. గత రెండు సంవత్సరాలుగా  టిబి ని నివారించడం పట్ల ఆచరించబడుతున్న కార్యకలాపాలు చాలా ఆశాజనకంగా ఉండటం విశేషం. ఈ సంవత్సరం థీమ్ ఆశ, ఆవశ్యకత,  జవాబుదారీతనం.. ఇవన్నీ కలిసి  శక్తివంతమైన సమిష్టి విజయాన్ని ఇస్తాయని చెబుతుంది.  2023 ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశంలో (HLM) TBని అంతం చేస్తామని వివిధ దేశాల  దేశాధినేతలు,  ప్రభుత్వాధినేతలు ప్రతిజ్ఞ చేశారు.  ఈ కమిట్‌మెంట్ ను అందరికీ ఈ క్షయ దినోత్సవం గుర్తు చేస్తుంది. అయితే దీనికి తగిన చర్యలు తీసుకోకుండా కేవలం కమిట్‌మెంట్లు మాత్రమే కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.  ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రపంచంలో   మరణానికి కారణమయ్యే అంటు వ్యాధులలో క్షయవ్యాధి ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేస్తుంది. క్షయవ్యాధి నయం చేయగల,  నివారించగల వ్యాధి అయినప్పటికీ, దీని నియంత్రణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది.  క్షయ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయ వ్యాధి దగ్గు, తుమ్ము,  ఉమ్మివేయడం ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో నాలుగో వంతు మందికి క్షయ వ్యాధి సోకిందని చెబుతారు. ప్రపంచంలో మెడిసిన్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది సరిపోదని చెప్పడానికి క్షయ వ్యాధి ఒక ఉదాహరణ.  ఔషధ నిరోధకత వ్యాప్తి చెందే ప్రమాదం,  దాని తీవ్రత,  మరణాల పెరుగుదలకు ప్రధాన కారణాలు.  రోగ నిర్ధారణలో జాప్యం,  చికిత్సలో అసమర్థత ఇవన్నీ క్షయ జబ్బు విషయంలో జరుగుతున్న తప్పులు. తక్కువ,  మధ్యతరగతి ఆదాయ దేశాలను TB అధికంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధితో బాధపడుతున్న రోగుల జనాభా 170 కోట్లు. వీరిలో 58.7 కోట్లు ఆగ్నేయాసియాలో నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం 4000 కంటే ఎక్కువ మంది యూరోపియన్లు ఈ అనారోగ్యంతో మరణిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 25,90,000 మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారు. అంటే లక్ష మంది భారతీయ జనాభాలో ప్రతి 188 మందికి వ్యాధి సోకింది. 2000 సంవత్సరం నుండి, క్షయవ్యాధిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రయత్నాలు 7.4 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని అంచనా. అయితే, COVID-19 మహమ్మారి, యూరప్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు మరియు సామాజిక ఆర్థిక అసమానతలు క్షయవ్యాధిని నిర్మూలించడానికి పోరాటంలో సంవత్సరాల లాభాలను తిప్పికొట్టాయి మరియు ప్రభావితమైన వారిపై, ముఖ్యంగా అత్యంత దుర్బలమైన వారిపై మరింత ఎక్కువ భారాన్ని మోపాయి. 2000 సంవత్సరం నుండి క్షయవ్యాధిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రయత్నాలు 7.4 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని అంచనా. అయితే COVID-19 మహమ్మారి, యూరప్, ఆఫ్రికా,  మధ్యప్రాచ్యంలో యుద్ధాలు,  సామాజిక ఆర్థిక అసమానతలు క్షయవ్యాధిని నిర్మూలించడానికి గల ప్రయత్నాలను  తిప్పికొట్టాయని చెబుతున్నారు.  ఆర్థికంగా వెనుకబడిన వారిని క్షయ వ్యాధి మరింత దుర్భలత్వంలోకి  నెట్టివేసింది. క్షయ వ్యాధి లక్షణాలు.. క్షయవ్యాధి ఉన్న వ్యక్తి ముఖ్యంగా దగ్గు సమయంలో దానిని గాలి ద్వారా వ్యాపిస్తాడు. ఫలితంగా చురుకైన క్షయవ్యాధి ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని,  వారు ఇకపై అంటువ్యాధి నుండి బయటపడే వరకు వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  TB  సాధారణ లక్షణాలు: మూడు వారాల కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ కాలం దగ్గు ఉండటం రక్తం లేదా శ్లేష్మంతో సంబంధం ఉన్న దగ్గు ఛాతీ నొప్పి, లేదా శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు నొప్పి అనుకోకుండా బరువు తగ్గడం అలసట (సాధారణ బలహీనత) జ్వరం (సాధారణంగా 60-85% మంది రోగులలో) రాత్రిపూట చెమటలు పట్టడం (నిద్రలో అధికంగా చెమట పట్టడం) చలి (తీవ్రంగా వణుకు) క్షయ వ్యాధి  నివారించాలంటే.. క్షయవ్యాధి తీవ్రంగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. దీని వల్ల  వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తరచుగా చేతులు కడుక్కోవడం,  నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవడం చేయాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం,  సరైన నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం  వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది,  క్షయవ్యాధి సంక్రమణ అవకాశాన్ని తగ్గిస్తుంది. డాక్టర్ సలహా మేరకు TB చికిత్స మొత్తం కోర్సును పూర్తి చేయడం వలన ఔషధ-నిరోధక TB ప్రమాదాన్ని తగ్గిస్తుంది,  మళ్లీ రాకుండా   నిరోధిస్తుంది. పేదరికం, ఆకలి,  రద్దీగా ఉండే జీవన పరిస్థితులు వంటి సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం వలన  క్షయవ్యాధి భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  TB ఇన్ఫెక్షన్‌ను యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం వలన ఇన్ఫెక్షన్ క్రియాశీల క్షయవ్యాధిగా అభివృద్ధి చెందకుండా నిరోధించవచ్చు.                       *రూపశ్రీ.
  నీరు లేకుండా జీవితం లేదు. ఇది ఒక ప్రాథమిక అవసరం.  నీరు లేకుండా మనం జీవించలేము. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే జీవిత వేగంలో మనం ఈ సహజ వనరు పరిరక్షణను మరచిపోయాము. చాలా ప్రాంతాలలో నీటి కరువు ఉంది.  పంటలు సాగు చేయడానికి కాదు.. కనీసం తాగడానికి నీరు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.  ఇంత అభివృద్ది చెందిన టెక్నాలజీ యుగంలో కిలోమీటర్ల కొద్ది కాలినడకన వెళ్లి మరీ నీళ్లు తెచ్చుకుంటున్న గ్రామాలు నేటికి ఉన్నాయి.  ఇది ప్రపంచానికి తీవ్రమైన ప్రశ్న.  ఈరోజు ప్రపంచ జల దినోత్సవం.  ఈ సందర్భంగా నీటిని పొదుపు చేయడం  ఎలా.  సకల ప్రాణుల ప్రాణాలను కాపాడే నీటి సంరక్షణ కోసం చేయాల్సిన కొన్ని చిన్న చిన్న మార్పులను తెలుసుకుంటే.. ఈ ప్రపంచంలో జీవితానికి నీరు ప్రాథమిక అవసరం. నీరు లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. సరళంగా చెప్పాలంటే నీరు ఉంటేనే మనం ఉనికిలో ఉన్నాము. నీటి ప్రాముఖ్యతను వివరించడానికి, ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1993 సంవత్సరంలో ప్రారంభించింది. ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవడం  ప్రధాన లక్ష్యం నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, నీటి సంరక్షణను ప్రోత్సహించడం. నీటి వనరులు తరిగిపోతున్న తీరు ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. మనం ఇప్పుడే అప్రమత్తంగా ఉండకపోతే, భవిష్యత్తులో దాని పరిణామాలను మనం అనుభవించాల్సి రావచ్చు. 2025 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణ రంగంలో సహకరించడం ప్రతి వ్యక్తి కర్తవ్యం. ఒక వ్యక్తి సమాజం కోసం ఏమీ చేయలేకపోతే కనీసం  నీరు వృధా కాకుండా కాపాడటం అయినా చేయవచ్చు. నీటిని ఆదా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం దానిని సరైన దృక్కోణం నుండి చూడాలి. నీటి వృధాను నివారించడానికి కొన్ని సులభమైన మార్గాలను ఇక్కడ మేము మీకు చెబుతున్నాము. నీటిని ఇలా ఆదా చేయవచ్చు.. షవర్ తో స్నానం చేసే ట్రెండ్ ప్రజల్లో పెరిగింది. అందులో చాలా వృధా ఉంది. మనం బకెట్ తో స్నానం చేసే అలవాటు పెంచుకోవాలి. దీనితో మనం నీటి వృధాను నియంత్రించవచ్చు. ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్లు చాలా సాధారణం అయ్యాయి. RO నీటిని శుభ్రం చేస్తుంది కానీ చాలా నీరు వృధా అవుతుంది. అటువంటి పరిస్థితిలో, RO నుండి వచ్చే మురికి నీటిని పాత్రలు కడగడం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం  అలవాటు చేసుకోవాలి. మనం పళ్ళు తోముకోవడం, టాయిలెట్ కి వెళ్ళడం వంటి రోజువారీ పనులు చేస్తున్నప్పుడు నీటిని వృధా చేయకుండా ఉండాలి. టాయిలెట్‌ను పదే పదే ఫ్లష్ చేయడానికి బదులుగా మగ్గు లేదా బకెట్ నుండి నీటిని పోయడం ద్వారా కూడా మనం నీటిని ఆదా చేయవచ్చు. తరచుగా మనం ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకుంటాము.  మొత్తం నీళ్ళు తాగలేకపోతే, దాన్ని ఇతరులు పారేస్తారు. ఆ నీటిని సింక్‌లో పోయడానికి బదులుగా పక్షుల కోసం బాల్కనీ లేదా టెర్రస్‌పై ఉంచడానికి ప్రయత్నించాలి. కూరగాయలు కడగడానికి ఉపయోగించే నీటిని  మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించాలి. నీటిని ఆదా చేయడానికి ఇది చాలా ప్రభావవంతమైన మార్గం కూడా. మనం సైకిల్ లేదా కారు కడగడానికి రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించవచ్చు. కారు చాలా మురికిగా లేకపోతే, దానిని నీటితో కడగడానికి బదులుగా, మనం దానిని తడి గుడ్డతో తుడవవచ్చు.                                                      *రూపశ్రీ.  
  చక్కెర కాఫీలు, టీల తో పాటు స్వీట్లలో కూడా బాగా ఉపయోగించే పదార్థం.  ప్రతి ఇంట్లో ఒక డబ్బా నిండుగా చక్కెర ఉండాల్సిందే.. అయితే చక్కెర వ్యాధిగా పిలవబడే డయాబెటిస్ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఆహారం నుండి చక్కెరను మినహాయించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక నూనె లేకుండా ఏ ఆహారం వండలేం అన్నట్టు ఉంటుంది పరిస్థితి.  మరీ ముఖ్యంగా ఎంత ఆవిరిలో ఉడికించిన వంట అయినా సరే.. కాసింత నూనెతో పోపు వెయ్యకపోతే అసలు తినాలని అనిపించదు. ఇక నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలు ఎంత రుచిగా ఉంటాయో తినేవారి దూకుడును బట్టి చెప్పేయవచ్చు. అయితే నూనె కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అని అంటున్నారు ఆహార నిపుణులు.  ఆహారంలో తప్పనిసరిగా ఉపయోగించే చక్కెర, నూనె రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు కింది విధంగా విశ్లేషిస్తున్నారు.   వైద్యుల అభిప్రాయం ప్రకారం, చక్కెర,  కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం కాలేయానికి ఆల్కహాల్ తాగినంత హానికరం. ఇది కాలేయ పనితీరుకు ప్రమాదకరం. తినే ప్రతిదీ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఇది శరీర గిడ్డంగిగా పనిచేస్తుంది. కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఇది మధుమేహం,  ఇతర జీవక్రియ వ్యాధులకు దారితీస్తుంది.   చక్కెర,  కొవ్వు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని ఫలితంగా కాలేయ సమస్యలు, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటివి వస్తాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉంటారని నివేదికలు చెబుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల  ఫ్యాటీ లివర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? చక్కెర చేసే చేటు.. మధుమేహం, కాలేయ వ్యాధి, ఊబకాయానికి ప్రధాన కారణాలలో చక్కెర ఒకటి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం లావుగా మారుతుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కు దారితీస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారి కాలేయానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.   రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత అవకాశాన్ని పెంచుతుంది. చక్కెరలో ఖాళీ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది. బరువు పెరగడం ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది మచ్చలు,  వాపుకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నూనె చేసే చేటు.. ఆరోగ్యానికి హాని కలిగించే మరో ఆహార పదార్థం నూనె. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన, హైడ్రోజనేటెడ్ నూనెలు. కానీ చక్కెరలా కాకుండా చాలా నూనెలలో కణాల మరమ్మత్తు, మెదడు పనితీరుకు కీలకమైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఉపయోగించే నూనె రకం,  పరిమాణం చాలా ముఖ్యమైనవి.   నూనె చక్కెర కంటే ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది కాబట్టి  ఒక గ్రాము నూనెలో తొమ్మిది కేలరీలు ఉంటాయి.  అదనపు నూనె బరువు పెరగడానికి కారణమవుతుంది. నూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులకు కారణం కావచ్చు. నూనెను అధికంగా తీసుకుంటే అది కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.  ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది. మితంగా ఉపయోగించినప్పుడు, ఆవ నూనె లేదా ఆలివ్ నూనె వంటి కొన్ని నూనెలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఏది ఎక్కువ హాని.. నూనెను తక్కువ తీసుకోవడం ద్వారా రోజుకు 50 కేలరీలు తగ్గవచ్చు. అయితే, చక్కెర అంత హానికరం కాదు అని అనిపించినా పప్పులో కాలేసినట్టే..  అనుకున్న దానికంటే  చక్కెర చాలా  ఎక్కువ హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   చక్కెరను ఎక్కువగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదకరం ఎందుకంటే అది కాలేయంలో కొవ్వుగా మారుతుంది. చక్కెర మరియు నూనె రెండూ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, అవి వేర్వేరు పరిణామాలను కలిగి ఉంటాయి. కేలరీల దగ్గర పోలిక కనిపిస్తుంది. •  1 గ్రాము చక్కెర = 4 కేలరీలు •  1 గ్రాము నూనె = 9 కేలరీలు •  5 గ్రాముల నూనె వినియోగం = 45 కేలరీలు •  2 టీస్పూన్ల చక్కెర 1 టీస్పూన్ నూనెతో సమానం. కాబట్టి చక్కెర నూనె రెండూ హానికరమే.. ఉపయోగించే పరిమాణం,  ఉపయోగించే నాణ్యతను బట్టి కూడా ఈ హానికరంలో తేడాలు ఉండవచ్చు. కానీ తక్కువ వినియోగం ఎప్పటికీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవి బోలెడు రుచులను వెంటబెట్టుకు వస్తుంది.  మామిడి పళ్లు,  తాటి ముంజలు,  చెరకు రసం,  జ్యూసులు,  పుచ్చకాయలు,  కర్బూజా.. ఇలా ఒకటనేమిటి చాలా పండ్లు వేసవిలో నోరూరిస్తాయి. ఇక మరొక వైపు శీతల పానీయాలు, ఐస్ క్రీములు కూడా వేసవిలో ఊపందుకుంటాయి. అయితే చాలామందికి ఈజీగా లభించేది,  ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చేది కొబ్బరి బొండంకే  లేత కొబ్బరి బొండంలో నీరు శరీర తాపాన్ని తగ్గిస్తుంది.  శరీరాన్ని చల్లబరిడి ఎండ వడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది కొబ్బరి బొండం తాగి ఆ కొబ్బరి బొండం అక్కడే పడేస్తుంటారు. కానీ  అందులో ఉండే లేత కొబ్బరిని  మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారని  అంటున్నారు ఆహార నిపుణులు.  ఇంతకీ కొబ్బరి బొండంలో ఉండే  కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడం అయినా, వేడి నుండి రక్షించడం అయినా, శరీరానికి  ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో  అయినా లేదా గుండెను ఆరోగ్యంగా ఉంచడం అయినా, కొబ్బరి నీళ్లుకు మించిన గొప్ప పానీయం ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసం లేదు. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది. అయితే కొబ్బరి బొండం లో ఉండే లేత కొబ్బరి గురించి  చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి. కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లతో పాటు,  ఈ లేత కొబ్బరి కూడా తీసుకోవాలి. లేత  కొబ్బరి రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే రెగ్యులర్ చైన్ ట్రైగ్లిజరైడ్‌లను కలిగి ఉంటుంది. జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గాలనుకున్నా లేదా కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకున్నా, కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి చాలా మంచి ఆరోగ్యకరమైన ఎంపిక. లేత కొబ్బరి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  లేత కొబ్బరి తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో,  కడుపు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కొబ్బరి నీళ్లు లేదా దానిలో ఉండే లేత కొబ్బరి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివని పోషకాహార నిపుణులు  చెబుతారు. లేత కొబ్బరి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.  గుండె, ఎముకలు, చర్మం,  జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి ఈ వేసవికాలంలో కొబ్బరి బొండం తాగితే అందులో ఉండే లేత కొబ్బరిని  ఖచ్చితంగా  తినడం మిస్సవకండి. అయితే, మధుమేహం ఉన్నవారు లేత కొబ్బరి తినడం  తగ్గించాలి. కొబ్బరి నీళ్లు లేదా లేత  కొబ్బరి  అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. లేత కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ,  ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టు బలంగా,  మందంగా మారడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, భాస్వరం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి,  ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి.                        *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    
  ఎసిడిటీ  చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య.  బాగా వయసైన వారు ఆహారం సరిగా జీర్ణం అవ్వక ఎసిడిటీ బారిన పడేవారు. కానీ ఆహారం,  జీవనశైలి మార్పుల వల్ల ఇప్పట్లో చిన్న వయసు వారిలో కూడా ఎసిడిటీ సమస్యలు కామన్ అయిపోయాయి. తరచుగా ఎసిడిటీతో బాధపడుతూ దాని నుండి ఉపశమనం పొందకపోతే,  ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఎసిడిటీ సాధారణంగా తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి,   జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వస్తుంది.  ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా కడుపులో యాసిడ్లను కంట్రోల్ చేయవచ్చు.  ఈ సమస్యను తగ్గించడంలో  సహాయపడే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు తెలుసుకుంటే.. ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులు .. భోజనం షెడ్యూల్ చేసుకోవాలి.  ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. రోజులో చిన్న చిన్న మొత్తాలలో భోజనం తినాలి (ప్రతి 2-3 గంటలకు తేలికపాటి ఆహారం తినాలి). భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ కారంగా, వేయించిన,  నూనెతో కూడిన ఆహారం ఎసిడిటీని పెంచుతుంది. బదులుగా, తేలికైన, ఉడికించిన,  తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినాలి. కెఫిన్,  శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ, శీతల పానీయాలు,  సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా, హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీరు త్రాగాలి. తిన్న వెంటనే పడుకోకూడదు.  భోజనం తర్వాత కనీసం 30-40 నిమిషాలు నిటారుగా కూర్చోవాలి. పడుకోవడం వల్ల కడుపులో ఆమ్లం పెరుగుతుంది, ఇది ఆమ్లత్వాన్ని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని బాగా తీసుకోవాలి.  ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు,  సలాడ్లు తినాలి.  ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఆహారంలో ఆల్కలీన్ ఆహారాలను చేర్చుకోవాలి. అరటిపండు, దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, బొప్పాయి వంటి పండ్లు ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నీటి త్రాగడం పెంచాలి. రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా ఆమ్లతను తగ్గిస్తుంది. అల్లం,  తులసి తీసుకోవాలి.  అల్లం,  తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆమ్లత్వం నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...