కొబ్బరి బొండంలో కొబ్బరి గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? వేసవిలో దీన్ని మిస్ కావద్దు..!
posted on Mar 24, 2025 9:30AM
.webp)
వేసవి బోలెడు రుచులను వెంటబెట్టుకు వస్తుంది. మామిడి పళ్లు, తాటి ముంజలు, చెరకు రసం, జ్యూసులు, పుచ్చకాయలు, కర్బూజా.. ఇలా ఒకటనేమిటి చాలా పండ్లు వేసవిలో నోరూరిస్తాయి. ఇక మరొక వైపు శీతల పానీయాలు, ఐస్ క్రీములు కూడా వేసవిలో ఊపందుకుంటాయి. అయితే చాలామందికి ఈజీగా లభించేది, ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చేది కొబ్బరి బొండంకే లేత కొబ్బరి బొండంలో నీరు శరీర తాపాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరిడి ఎండ వడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది కొబ్బరి బొండం తాగి ఆ కొబ్బరి బొండం అక్కడే పడేస్తుంటారు. కానీ అందులో ఉండే లేత కొబ్బరిని మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడం అయినా, వేడి నుండి రక్షించడం అయినా, శరీరానికి ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో అయినా లేదా గుండెను ఆరోగ్యంగా ఉంచడం అయినా, కొబ్బరి నీళ్లుకు మించిన గొప్ప పానీయం ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసం లేదు. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది. అయితే కొబ్బరి బొండం లో ఉండే లేత కొబ్బరి గురించి చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి.
కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లతో పాటు, ఈ లేత కొబ్బరి కూడా తీసుకోవాలి. లేత కొబ్బరి రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే రెగ్యులర్ చైన్ ట్రైగ్లిజరైడ్‌లను కలిగి ఉంటుంది.
జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గాలనుకున్నా లేదా కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకున్నా, కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి చాలా మంచి ఆరోగ్యకరమైన ఎంపిక. లేత కొబ్బరి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. లేత కొబ్బరి తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో, కడుపు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.
కొబ్బరి నీళ్లు లేదా దానిలో ఉండే లేత కొబ్బరి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతారు. లేత కొబ్బరి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుండె, ఎముకలు, చర్మం, జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి ఈ వేసవికాలంలో కొబ్బరి బొండం తాగితే అందులో ఉండే లేత కొబ్బరిని ఖచ్చితంగా తినడం మిస్సవకండి.
అయితే, మధుమేహం ఉన్నవారు లేత కొబ్బరి తినడం తగ్గించాలి. కొబ్బరి నీళ్లు లేదా లేత కొబ్బరి అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. లేత కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టు బలంగా, మందంగా మారడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, భాస్వరం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి, ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...