LATEST NEWS
వివాదాస్పద లేడీ అఘోరీ  చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల  ఇంట్లో బస చేసిన  అఘోరీ మాయమాటలు చెప్పి  శ్రీ వర్షిణిని లోబరుచు కుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ  శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు. 
ఎమ్మెల్సీగా  నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని గోల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా నియోజకవర్గంలో తెలుగుదశం, జనసేన ల మధ్య ఉన్న విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. నాగబాబు సమక్షంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. జనసేన శ్రేణులు జై జనసేన అంటూ నినాదాలు చేయగా తెలుగుదేశం వర్గీయుల నుంచి పెద్ద పెట్టున జై వర్మ అంటూ పిఠాపురం వర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భాత సభలో నాగబాబు వర్మకు సంబంధించి ఒకింత వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాగబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పిఠాపురం వర్మ ఫొటో లేకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు పిఠాపురం వర్మకు అనుకూలంగా  నాగబాబు సమక్షంలో నినాదాలు చేశారు. పైగా నాగబాబు నియోజకవర్గ పరిధిలో చేసిన ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద పిఠాపురంలో నాగబాబు తొలి సారిగా జరిపిన పర్యటన నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలను బయటపెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్  కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు పోటీగా  బిజెపికి చెందిన గౌతంరావు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రాజాసింగ్ పార్టీ  రాష్ట్ర అధిష్టానంపై విమర్శలు చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ కు గురయ్యారు.  గౌతంరావుకు  స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా  టికెట్  ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో రాజాసింగ్ పార్టీ  రాష్ట్ర అధిష్టానంపై ఎక్కుపెట్టారు.  మేకప్ మెన్ లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నట్లు  ఆరోపించారు. గత పార్ల మెంటు ఎన్నికల్లో హైద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవిలత ప్రకటించగానే  రాజాసింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి మగాళ్లే దొరకలేదా అని కామెంట్ చేశారు.   తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల బిజెపి అభ్యర్థిగా గౌతంరావు పేరు ప్రకటించారు. అంబర్ పేట నియోజకవర్గంలో గౌతంరావు, కిషన్ రెడ్డి ప్లెక్సీలు ఉండటంతో రాజాసింగ్ కు మింగుడు పడలేదు. శ్రీరామనవమి శోభాయాత్రకు పోటీగా గౌతంరావు మరో శోభాయాత్ర నిర్వహించడం వివాదానికి దారి తీసింది.  నేను నిర్వహిస్తున్న శోభాయాత్రను అడ్డుకోవడం మీ అయ్యతరం కూడా కాదని వ్యాఖ్యానించారు. 
అనుకున్నదే జరిగింది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో  పార్లమెంట్ ఉభయ   సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్‌ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌- యూఎంఈఈడీ-ఉమీద్‌) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలుంది. ఆ ఒక్క గడప దాటేస్తే.. బిల్లు చట్టమవుతుంది. ఆ తర్వాత  ఏమవుతుంది? ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేశ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పడు దేశం ముందున్న పెద్ద ప్రశ్నగా రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇక విషయంలోకి వస్తే.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక బిల్లు పై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రప్రథమం కావచ్చు. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఎ కూటమి, వ్యతిరేకంగా విపక్ష, ఇండియా కూటమి గట్టిగా నిలబడ్డాయి. పటిష్ట వాదనలు వినిపించాయి. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనాయకులు అందరూ, చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చలో లోక్ సభలో సభా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విప్పలేదు. ప్రధానమంత్రి  మోదీ అయితే అసలు సభలోనే అడుగు పెట్ట లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  చర్చ ప్రారంభంలో కొంత సేపు సభలో ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోయి  మళ్ళీ ఓటింగ్ సమయానికి వచ్చారు. అంతే కాదు  సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ గాంధీ ముభావంగానే ఉన్నారు. ఎదుకనో ఏమో కానీ  ప్రధాన చర్చలో పాల్గొనలేదు. లోక్ సభలో   గొగొయ్ ప్రధాన ప్రసంగం చేశారు. చివరకు, అర్థరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ అయన నైట్ డ్రెస్  లో మొక్కుబడిగా సభకు వచ్చారనీ. ఇది ఆయన నిరాసక్తతకు మరో నిదర్శనంగా కొందరు పేర్కొన్నారు. అలాగే  ఇటు చర్చ జరుగుతుంటే.. ఆయన అటు తిరిగి ఫోన్  చూసుకోవడం గురించి కూడా కొందరు ప్రస్తావించారు. చివరకు మీడియా బ్రీఫ్ లోనూ రాహుల్ గాంధీ కనిపించక పోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నాయి.  అయితే  ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాసక్తంగా ఉన్నా.. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా వుంది. ఏక తాటిపై నడిచింది. ఉభయ  సభల్లోనూ ఒక్క ఓటు బీర పోకుండా కాపాడుకుంది. ఆవిధంగా, బిల్లు పాస్  అయినా.. ఒక విధంగా విపక్ష ఇండియా కూటమి,  విజయం  సాధించింది. కూటమి మనుగడ పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, కూటమి ఎంపీలు, ముక్త కంఠంతో హమ్ ఏక్’ హై అని  నినదించారు.  నిరూపించారు.  నిజం, నిజంగా, ఇదొక అనూహ్య పరిణామం. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయట పడిన విభేదాల నేపధ్యంలో ఇండియా కూటమి ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఇండియా కూటమి ఏక తాటిపైకి రావడం సామాన్య విషయం కాదు. నిజానికి ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో విభేదాలు తార స్థాయికి చేరిన విషయం కాదన లేనిది. చివరకు కొందరు కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా  లోక్ సభ ఎన్నికలతోనే ఇండియా కూటమి  కథ ముగిసిందనే అభిప్రాయం వ్యక్త పరిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ- కశ్మీర్ ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా ,సిపిఎం నేత ప్రకాష్ కరత్, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఇండియా కూటమి  మనుగడ పై అనుమనాలు వ్యక్త పరిచారు.  తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, కొందరు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ లాంటి సూచన చేశారు. అంతే కాదు  కొందరు  కూటమి నాయకులు,మీడియా విశ్లేషకులు, ఇండియా కూటమికి  శ్రద్ధాంజలి  ఘటించారు. అలా మనుగడ కోల్పోయిందని కొందరు,  అసలు  పోనే పోయిందని,ఇంకొందరు అనుకున్న ఇండియా కూటమికి వక్ఫ్ సవరణ బిల్లు సంజీవనిలా ప్రాణం పోసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే  ఈ ఐక్యత ఇలాగే, నిలుస్తుందా? నిలబడుతుందా? పార్లమెంట్  లోపలి సఖ్యత  వెలుపలా కొనసాగుతుందా? ముఖ్యంగా ఎన్నికల రణ క్షేత్రంలో ఎన్డీఎని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడుతుందా? అంటే, మాత్రం అనుమానమే అంటున్నారు. అయినా, ప్రస్తుతానికి  అది అనవసర చర్చగానూ పరిశీలకులు భావిస్తున్నారు. అదొకటి అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయలు, వినవచ్చిన వాస్తవాలు ఆశ్చర్యం గొలిపే విధంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  నమ్మసక్యం కాకుండా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ భవనంతో సహా, ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (సీజీవో)  సైతం ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసిందని, స్వయంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రికార్డుల అదారంగా చెప్పిన విషయం,ఆశ్చర్య పరిచే విధంగా ఉందని అంటున్నారు. అంతే కాదు.. వక్ఫ్ పేరిట జరుగతున్న దురాక్రమణలు, దుర్వినియోగం గురించి సభ్యులు చేసిన ఆరోపణ లలోని నిజానిజాలు బయట పడాలంటే,అందుకుమరి కొంత సమయం పడుతుందిని అంటు న్నారు.అందుకే, చట్ట రూపం దాలుస్తున్న  వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాలలో  ఒక మలు పుకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.
తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా?  జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే  మంగళవారం (ఏప్రిల్ 1)  దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అవును రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్, హెచ్‌సీయూ భూమల విక్రయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, మంత్రివర్గ విస్తరణకి సంబందించిన అనేక కీలక అంశాలు బుధవారం ( ఏప్రిల్ 2)  ఢిల్లీలో సందడి చేశాయి.  ఓ వంక లోక్ సభలో అత్యంత కీలకమైన, అంతకు మించి అత్యంత వివాదస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లు పై వాడివేడి చర్చ జరుగతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జంతర్ మంతర్ నుంచి ‘మోదీ దిగిరావాలని’ డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం, దేశాన్ని జాగృతం చేస్తాం, బీజేపీని బూడిద చేస్తాం అంటూ గర్జించారు. హెచ్చరించారు. అయితే  రేవంత్ రెడ్డి గర్జించింది వక్ఫ్ సవరణ బిల్లు విషయంగా కాదు.  విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన  బీసీ పోరుగర్జన సభలో రేవంత్‌ రెడ్డి ఈ గర్జన చేశారు. రేవంత్ రెడ్డి గర్జనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్  అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  మీ మంత్రి వర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా?  అంటూ  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతే  కాదు  బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు చేసి మరీ అసెంబ్లీకి ఇచ్చిన హామీ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారని కిషన్ రెడ్డి  కౌంటర్ ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి గర్జన, కిషన్ రెడ్డి కౌంటర్ స్పందన.. ఇతర పరస్పర ఆరోపణల పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్  వద్ద గర్జన చేస్తున్న సమయంలోనే లేదంటే కొంచెం అటూ ఇటుగా రాజ్యసభలో  హెచ్‌సీయూ భూమల అమ్మకం వ్యవహారం రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి  రాష్ట్రంలో  రోజు రోజుకు రాజకీయ వేడిని పెంచుతున్న హెచ్‌సీయూ భూమల విక్రయం  అంశాన్ని సభలో ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన సురేష్ రెడ్డి, అరుదైన పశుపక్షాదులకు ఆవాసంగా ఉన్న కంచ గచ్చిబౌలి  లోని 400 ఎకరాల భూమి విక్రయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం  అమానుషంగా, అత్యంత క్రూరంగా అణచి వేస్తోందని ఆరోపించారు. అలాగే  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూముల విక్రయ నిర్ణయం వలన విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినడమే కాకుండా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది.  మరో వంక  ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటుగా గోడం నగేష్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా,బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూమల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి, యూనివర్సిటీ భూములు విక్రయిస్తే పర్యావరణ పరంగా ఎదురయ్యే అనర్ధాలను వివరించారు. అటవీ, వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బీజేపే ఎంపీల విజ్ఞప్తి మేరకు  కేంద్ర అటవీ సంరక్షణ శాఖ, వివాదాస్పద కంచ గచ్చిబౌలి భులకు సమబందించిన సమగ్ర నివేదికని తక్షణం పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా రాష్ట్ర రాజకీయాలు బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో వేడిని పుట్టించాయి.  నిజానికి ఇవన్నీ ఒకెత్తు అయితే.. తెలంగాణ రాజకీయం ఢిల్లీలో వీరంగం వేస్తున్న సమయంలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు, మళ్ళీ మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నాలుగేళ్లు చర్యలు తీసుకోకున్నా సుప్రీం కోర్టు చేతులు కట్టుకుని కుర్చోవాలా  అని ఘాటుగా వ్యాఖ్యానించింది.  గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏమి జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతుంది, అనర్హత వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటూ  ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి, రాష్ట శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో, చేసిన వ్యాఖ్యలను సుప్రీం  కోర్టు తప్పు పట్టింది. నిండు సభలో ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేసింది నిజమే అయితే..  రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్‌ఎస్‌ నుంచి అధికార అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యామ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిరాయింపుల  వ్యవహారం కూడా ఢిల్లీ ఖాతాలో  చేరింది.  ఇలా ఒక దానివెంట ఒకటి,  రాష్ట్ర రాజకీయాలు,  యాధృచ్ఛికమే అయినా ప్రస్తుతానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే  ఢిల్లీ సీన్ ఢిల్లీలో సాగుతుంటే రాష్ట్రంలోనూ రాజకీయ ఉష్ణోగ్రతలు ఎండలతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. 
ALSO ON TELUGUONE N E W S
Cast: R. Madhavan, Siddharth, Nayanthara. Meera Jasmine, Kaali Venkat, Vinay Varma, Aadukalam Murugadoss Crew:  Written by S. Sashikanth, Suman Kumar Music by Shakthisree Gopalan Cinematography by Viraj Singh Gohil Editing by T. S. Suresh Directed by S. Sashikanth Produced by Chakravarthy Ramachandra, S. Sashikanth Genre: Sports Drama Thriller Available on Netflix Released on 4th April 2025 Test marks the reunion of Madhavan and Siddharth after their Yuva with director Mani Ratnam. Nayanthara and Meera Jasmine have been added to the mix. With such a huge ensemble star cast of incredible talents, Test movie has immediately grabbed attention of everyone. The movie has released directly on Netflix on 4th April and let's discuss about the film in detail.  Plot:  Arjun (Siddharth), a legendary cricketer, who is on the verge of retirement is adamant about continuing to play further. He pulls off sorts media and meeting room drama to secure his place in the Playing XI. His son, Adi wants to become a cricketer and see great love and care from his father. But he is distant and busy with his own life. On the other hand, his teacher Kumudha (Nayanthara) is overtly emotional and attached to kids in her class.  She has a great personal connect with Arjun, as her father is his first coach. But her husband Sarvanan (Madhavan) is a scientist who is fixated on his hydro fuel project, even though he is brilliant and an MIT returned professional. He doesn't find funding for his project and also any sort of governmental help to launch it. He doesn't regard cricket as a big thing but his wife loves it to the core. She wants to have babies but Sara feels it is a regular life and he is not interested in trivial things. How their lives are entangled with a Test Match? Watch the movie to know more.  Analysis:  The movie tries to be understated yet slightly exaggerates everything. To give an example, Siddharth is seen as a career-oriented person with no regard for any other emotion in life. We see him as a tough critic even of his son, who is just learning the game. But nothing builds on it to showcase how he is worthy to be so highly regarded when it comes to the game. It seems like he gets a free pass to stay with his family while a test match is going on.  And Saravanan, Madhavan, being such a brilliant scientist doesn't know about the funding sources. At least there should have been scenes about his research and mechanism that he is employing to convince anybody who wants to invest in such projects. While what should like his last resort doesn't get such treatment as it is mentioned in the passing but not shown explicitly like Arjun's manipulative nature.  While the writing and direction wants to explore the line, "When tested to the extreme, you'll know how the people will react, like a hero or a villain". This needed a lot more scenes and conviction to convince why there are flips in characters rather than just a mention. Many scenes where the softness and tough attire needs to be established properly, we get things pushed around rather than shown clearly.  Madhavan and Nayanthara are good and their scenes keep things engaging but Siddharth comes off guard and does so little. His character needed to grow on us but writing doesn't allow such a thing. Even Meera Jasmine is underutilised and Nayanthara's bond with her husband and Adi is underexplored. Overall, the movie could have easily been the best emotional drama along with being a sports film. But it ends being watchable only because of Madhavan.  In Conclusion:  Madhavan does well but story doesn't hold up to the promising premise.  Rating: 1.5/5 
Cast: Naveen Chandra, Shalini Vadnikati, Priyadarshi, Viva Harsha, Jayaprakash, Raja Ravindra Crew:  Music by Shravan Bharadwaj Cinematography by Vamsi Patchipulusu Editing by Garry BH Story , Screenplay and Direction by Dr. Anil Vishwanath Produced by Sai Abhishek Dr. Anil Vishwanath has delivered a very popular movie like Polimera on OTT platform. He followed it up with a blockbuster sequel, Polimera 2. Now, he has come up with 28 Degree Celsius starring a good actor like Naveen Chandra in the leading role. Shalini Vadnikati has playing the leading lady role in this thriller. The concept and title itself give a very unique look to the film. The movie released on 4th April, all over. Let's discuss about the film, in detail.  Plot:  Karthik (Naveen Chandra), a House Surgeon in Georgia from Indian Origin, is found hurt with severe wounds while another NRI Geetha, is found dead in a suburban house. Police Officer (Raja Ravindra) shift them to the hospital and he starts to read the diary of Karthik. He get to know that Karthik is an orphan and with merit scholarships, he got into one of the best colleges in India for MBBS. He meets Anjali (Shalini Vadnikati), similarly qualified and brilliant medicine student and falls in love with her. Her parents don't agree for the couple's marriage, and due to trauma, she develops an acquired brain injury, ABI.  Due to the injury, her physical and mental condition worsen and she cannot survive if her body temperature decreases 28 degree celsius. If the surrounding temperatue rapidly cools or if she has to stay in a cold place or hot places, like even drinking a hot coffee can lead to catastrophic reaction and to her death in 30-40 minutes. Karthik gets to know about this condition and marries her, still. The couple move to Georgia for her treatment and Karthik finds a job as attending surgeon. Suddenly, one day, Anjali dies due to extreme cold weather. What is the reason? Who killed her? Who is Geetha? Is Karthik the reason? Watch the movie to know more.  Analysis:  Dr. Anil Vishwanath made an engaging and thrilling Polimera films. His story-telling and intriguing premises gave us some good characters along with twists and turns. But here, he took a very old story and tried to tell it with medical conditions which seem new and different. The medical condition gets sub-plot level treatment in the screenplay and it looks like a plot device just brought in to give some sort of new tool rather than having any big importance in entire story.  In a film like Bhale Bhale Mogadivoy, Nani has a problem with memory and it drives the plot throughout without any deviation. When 28 Degrees Celsius is the most interesting part of the subject and if the story doesn't move with it rather uses as a tool to tell a routine story. Neither characters nor situations look interesting enough to engage us. The 28 Degree Celsius adjustment is shown simple and easy to attain while adjusting temperature around you is difficult.  Georgia kind of a country is not close to equator while the director established that the person should be always taken to a place where temperature doesn't fluctuate too much. The kind of care needs to be taken and how the people around adjust doesn't really come across well. Naveen Chandra did well but rest of all did not get any good character arc to even talk. Hence, the movie just feels like a very lazy and amatuerish attempt without proper detailing and story-telling prowess.  In Conclusion:  The movie just feels like a medical journal than an engaging screenplay.  Rating: 1.5/5 
మోహన్‌లాల్‌ హీరోగా పృథ్విరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో 2019లో రూపొందించిన ‘లూసిఫర్‌’ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ చిత్రాన్ని రూపొందించారు. మార్చి 27న ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సీన్స్‌ ఉన్నాయనే వివాదం చెలరేగడంతో వాటిని తొలగించాలని సెన్సార్‌ బోర్డ్‌ చెప్పడంతో ఆ సీన్స్‌ తొలగించి ట్రిమ్డ్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సినిమాపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా విషయం పార్లమెంట్‌ వరకు వెళ్లింది. రాజ్యసభలోని కొందరు సభ్యులు ఎంపురాన్‌ సినిమాకి సంబంధించిన వివాదాన్ని మరోసారి లేవనెత్తారు. దీనిపై స్పందిస్తూ మలయాళ నటుడు, కేంద్రమంత్రి, బీజేపీ ఎం.పి. సురేష్‌గోపి తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షానికి చెందిన ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే విపక్ష సభ్యులు మాత్రం సురేష్‌గోపి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  దాదాపు 5 నిమిషాల పాటు సురేష్‌గోపీ ఆగ్రహంతో మాట్లాడారు. ప్రముఖ రాజకీయ నేత టీపీ చంద్రశేఖరన్‌ జీవితం, హత్య నేపథ్యంలో రూపొందిన ‘టీపీ51’ చిత్రాన్ని కట్స్‌తో రీరిలీజ్‌ చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఆ సినిమాతోపాటు ‘లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌’ సినిమాని కూడా ధైర్యం ఉంటే రిలీజ్‌ చెయ్యాలని కేరళ సీఎంకి సవాల్‌ విసిరారు. ఆ రెండు సినిమాలను రిలీజ్‌ చేయాలంటే గట్స్‌ కావాలన్నారు. సభలో సురేష్‌ గోపి మాట్లాడిన తీరుపై కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తను మాట్లాడుతున్న భాషలో ఎలాంటి తప్పు లేదని స్పీకర్‌కు తెలియజేశారు సురేష్‌ గోపి. ఎంపురాన్‌ చిత్ర నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం తన దృష్టికి వచ్చిన వెంటనే నిర్మాతలకు ఫోన్‌ చేశానని అన్నారు. అలాగే సినిమా ప్రారంభంలో తన పేరుతో వేసిన కార్డును తొలగించాలని కూడా వారికి సూచించానన్నారు. సభలో తప్పుగా మాట్లాడానని భావిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. ఈ సినిమాను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, తన పార్టీపై చెడు ప్రచారం చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో సురేష్‌గోపీ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 అవతార్ పార్ట్ 1(Avathar part 1)తో ప్రపంచ సినీ ప్రేమికులకి సరికొత్త లోకాన్నిపరిచయం చేసిన ప్రపంచ సినీ పితామహుడు జేమ్స్ కామెరూన్(James Cameron)పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు.ఆ తర్వాత 'అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్' లో సముద్రంలో జరిగే పోరాటం చూపించాడు.ఇప్పుడు అవతార పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్(Avatar3 fire and ash)అగ్నికి సంబంధించిన నేపథ్యంలో తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఒక సినిమా కార్న్ లో పాల్గొన్న దర్శకుడు కామెరూన్ అవతార్ 3 కి సంబంధించిన   పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.ఆయన మాట్లాడుతు ఇప్పటి వరకు తెరకెక్కిన రెండు చిత్రాలకంటే పార్ట్ 3 భిన్నంగా ఉంటుంది.తొలి రెండు భాగాల్లో'జేక్' కుటుంబం మానవ ప్రపంచంతో పోరాటం చేసింది.కానీ ఇప్పుడు మూడో పార్ట్ లో సరికొత్త విలన్స్ పుట్టుకొస్తున్నాయి.యాష్ ప్రపంచంలోని తెగలతో జేక్ కుటుంబం పోరాటం చేయబోతుంది.మొదటి పార్ట్ లో భూమి,రెండో పార్ట్ లో సముద్రం,మూడో పార్ట్ లో చంద్రుడి పై జరిగే యుద్దాన్ని చూడబోతున్నారు.తప్పకుండా అవతార్ పార్ట్ 3 ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పుకొచ్చాడు. జేమ్స్ కామెరూన్ మాట్లాడిన ఈ మాటలతో అవతార్ 3 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి అడుగుపెడుతుందా అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.2025 డిసెంబర్ 19 న మూడో పార్ట్ విడుదల కానుంది.అవతార్ 4 ,5 పార్టులు కూడా ఉండగా 2029 ,2031 లో విడుదల కానున్నాయి.ఈ మేరకు మేకర్స్ అధికారకంగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు.     
  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎవరి ఊహలకి అందదు. గతంలో తాము నిర్మించిన బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలను ఒకేసారి విడుదల చేసి సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు కూడా తమ బ్యానర్ లో రూపొందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకేరోజు విడుదల చేస్తోంది. కానీ, ప్రమోషన్స్ లో మాత్రం వెనుకబడిపోయింది.   ఏప్రిల్ 10న 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'జాట్' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు కూడా మైత్రి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందినవే. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించగా, అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఇక 'జాట్'లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించగా, మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. ఈ రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ లే. పైగా విడుదలకు ఇంకా ఐదు రోజులే సమయముంది. అయినప్పటికీ ప్రమోషన్స్ లో మాత్రం జోరు లేదు. (Good Bad Ugly)   అజిత్ మొదటి నుంచి ప్రమోషన్స్ కి దూరం. దాదాపు ఆయన మూవీల ప్రమోషన్స్ బాధ్యతను మిగతా టీం తీసుకుంటూ ఉంటుంది. కానీ, ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలో పూర్తిగా వదిలేసినట్టుగా అనిపిస్తోంది. తమిళనాట అజిత్ సినిమా స్థాయి హడావుడి కనిపించట్లేదు. ఇక తెలుగునాట సరేసరి. నిర్మాతలు మైత్రి అయినప్పటికీ, ఎందుకనో తెలుగులో ప్రమోట్ చెయ్యట్లేదు. (Jaat)   ఇక 'జాట్' పరిస్థితి కూడా అలాగే ఉంది. 'గదర్-2' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సన్నీ డియోల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. జాట్ పై హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. అలాగే ఓ వైపు మైత్రి నిర్మాణం, మరోవైపు గోపీచంద్ దర్శకత్వం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల దృష్టి కూడా ఈ సినిమాపై ఉంటుంది. కానీ అందుకు తగ్గ ప్రమోషన్స్ లేకపోవడంతో.. అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ రావాల్సినంత హైప్ రాలేదు.   ఒకే రోజు తమ బ్యానర్ నుంచి ఇద్దరు స్టార్స్ సినిమాలు వస్తున్నా మైత్రి ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంది? ఇదొక కొత్త స్ట్రాటజీనా? సైలెంట్ వచ్చి రిజల్ట్ తో సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.  
AHA OTT, the leading regional streaming platform, is excited to bring you Hometown—a beautiful ode to childhood, love, and the memories that shape us. The brand-new web series is now available for streaming exclusively on aha Video, offering a heartwarming journey into our hometowns. Set against the backdrop of a nostalgic, picturesque town in Karimnagar, Hometown follows the journey of Srikanth, a young man stepping into the world of filmmaking, as he looks back at the place that made him who he is. Through laughter, mischief, and moments of pure innocence, Hometown weaves together stories of first loves, unbreakable friendships, and the bittersweet transition from childhood to adulthood. With its charming characters and relatable themes, the series brings to life the beauty of growing up in a town where everyone knows each other, and every street holds a memory. It's the kind of story that takes you back to those simpler days, making you smile at the innocence of youth while embracing the inevitable changes that life brings.   Hometown features a stellar ensemble cast, with the ever-talented Rajeev Kanakala playing Srikanth's father, bringing depth and warmth to the family dynamic. The incredible Jhansi stars as Srikanth's mother, perfectly capturing the love and strength of a caring, supportive mom. Supporting the story are Prajwal Yadma, Sairam, Anirudh, Annie and Sravya who bring Srikanth's childhood friends to life with their impeccable performances, each adding their own shade of humor and nostalgia to the series. Directed by Srikanth Reddy Palle and produced by Naveen Medaram Productions (MNOP), Hometown balances light-hearted moments with emotional depth, creating a perfect blend of storytelling that resonates with everyone—whether you're from a small town or a big city.   In a world where technology and busy lives often take us away from our roots, Hometown invites you to pause and reconnect with the simplicity of those carefree days when friendships were everything, and the future was just a dream waiting to unfold. From the vibrant streets of the town to the intimate, often humorous conversations between childhood friends, every scene is crafted to make you feel like you're part of the story. With its nostalgic tone and fresh, authentic voice, Hometown is more than just a series—it's a celebration of the ties that bind us to our past, and the people who make us who we are.  
వరల్డ్ వైడ్ గా విశేష ఆదరణ సొంతం చేసుకున్న పలు థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో 'స్క్విడ్ గేమ్'(Squid Game)కూడా ఒకటి.దక్షిణ కొరియా డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ హర్రర్ టెలివిజన్ సిరీస్ గా ఈ సిరీస్ తెరకెక్కగా కొరియన్ రచయితతో టెలివిజన్ నిర్మాత హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించాడు. 2021 లో మొదటి సిరీస్,2024 సెకండ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచ మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.2025 జూన్ 27 మూడో సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండగా భారీ మొత్తంలో వచ్చే నగదు బహుమతి గెలుచుకోవడానికి 456 మంది వివిధ రకాల ఆటగాళ్లు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఎలాంటి గేమ్స్ ఆడారనే పాయింట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో 456 మంది ఆటగాళ్ళల్లో ఒకడిగా నటించిన నటుడు ఓ యోంగ్ సు(O Yeong Su).80 సంవత్సరాల వయసు కలిగిన 'సు' సుమారు 50 సంవత్సరాల నుంచి నటుడిగా కొనసాగిస్తు వస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం ఒక లేడీ జూనియర్ ఆర్టిస్ట్ పై లైంగిక వేధింపులకి పాల్పడగా . సదరు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.దీంతో ఆమె తరుపు లాయర్ కోర్టులో వాదిస్తు జూనియర్ ఆర్టిస్ట్ జీవనోపాధికి సినిమాలే ఆధారం.కానీ 'సు' వల్ల ఆమె షూటింగ్ లకి వెళ్ళడానికి భయపడుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలని పరిశీలించిన కోర్టు 'సు' కి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.విచారణ సమయంలో తను చేసిన పనికి 'సు'పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడంతో పాటుగా తనని తాను సమర్ధించుకున్నట్టుగా తెలుస్తుంది.    
సాధారణంగా ఒక సినిమా హిట్‌ అయితే.. ఆ సినిమాకి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని సీక్వెల్స్‌ చేస్తుంటారు. ఈ విషయంలో హాలీవుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడ్‌ చరిత్రలో ఎన్నో సినిమాలు లెక్కకు మించిన భాగాలుగా వచ్చాయి. సాధారణంగా సీక్వెల్‌ ఏదైనా మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగం ఉంటుంది. అలా కాకుండా వచ్చిన సినిమాలోని కథకు అంతకుముందు ఏం జరిగింది అనేది చూపించడం ఒక కొత్త ప్రక్రియ అని చెప్పొచ్చు. ఇటీవలే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అయితే 2012లోనే తమిళ్‌లో ఓ సినిమాకి ఇలాంటి ప్రయోగం చేశారు. 2007లో అజిత్‌ హీరోగా విష్ణువర్థన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘బిల్లా’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2012లో చక్రి తోలేటి దర్శకత్వంలో తమిళ్‌లో ‘బిల్లా2’ ప్రీక్వెల్‌ చేశారు. తెలుగులో ఈ సినిమాను ‘డేవిడ్‌ బిల్లా’ పేరుతో విడుదల చేశారు. డేవిడ్‌ బిల్లా అనే వ్యక్తి బిల్లాగా ఎలా మారాడు అనే కథాంశంతో ఆ సినిమాను రూపొందించారు. అయితే అది అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అలాగే 1994లో యానిమేషన్‌ మూవీగా వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. అదే కథతో 2019లో 3డి యానిమేషన్‌లో ఎంతో నేచురల్‌గా రూపొందించిన ‘ది లయన్‌ కింగ్‌’ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి కూడా సీక్వెల్‌ తియ్యకుండా ప్రీక్వెల్‌ చేశారు. లయన్‌ కింగ్‌లో ముఫాసా అనే క్యారెక్టర్‌ మరణిస్తుంది. ‘ముఫాసా ది లయన్‌ కింగ్‌’ పేరుతో ఆ సినిమాకి ప్రీక్వెల్‌ రూపొందించారు. ఇందులో ముఫాసా చిన్న తనం నుంచి అడవికి రాజుగా ఎదిగే క్రమాన్ని తెరకెక్కించారు.  ఇటీవల విక్రమ్‌ హీరోగా ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వీరధీరశూరన్‌’ చిత్రాన్ని రెండో భాగంగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన మొదటి భాగం త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే కార్తీ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఖైదీ’ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఓపెనింగ్‌లోనే హీరో జైలు నుంచి రిలీజ్‌ అవుతాడు. ఆ హీరో పదేళ్ళపాటు జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే కథాంశంతో ‘ఖైదీ’ ప్రీక్వెల్‌ రూపొందనుంది.  2022లో రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ సంచలన విజయం సాధించింది. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్‌ 1’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై వున్న భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 200 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మేకర్స్‌. కాంతార వెనుక చాలా చరిత్ర ఉందని, ఛాప్టర్‌ 1లో దాన్ని విస్తృత స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు రూపొందిన ప్రీక్వెల్స్‌ని పరిశీలిస్తే.. మొదట రిలీజ్‌ అయిన సినిమాలే ఘనవిజయాలు అందుకున్నాయి తప్ప ఆ తర్వాత ప్రీక్వెల్‌ పేరుతో విడుదలైన సినిమాలు కొన్ని ఫ్లాప్‌ అవ్వగా, మరికొన్ని ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. ‘బిల్లా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘డేవిడ్‌ బిల్లా’ బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. హాలీవుడ్‌లో ఈ తరహా ప్రయోగాలు అనేకం జరిగి ఉంటాయి. కానీ, ఇండియాలో రిలీజ్‌ అయిన ‘ది లయన్‌ కింగ్‌’ పరిస్థితి కూడా అదే. 1994లో యానిమేషన్‌లో వచ్చిన ఈ సినిమా 45 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసింది. 1998లో ది లయన్‌ కింగ్‌ 2గా ప్రీక్వెల్‌ను నిర్మించారు. కానీ, ఈ సినిమా విజయం సాధించలేదు. 2019లో 3డి యానిమేషన్‌లో వచ్చిన ది లయన్‌కింగ్‌ చిత్రాన్ని 260 మిలియన్‌ డాలర్లతో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై 1650 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 2024లో దీనికి ప్రీక్వెల్‌గా వచ్చిన ముఫాసా ది లయన్‌ కింగ్‌ 300 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తే కేవలం 700 మిలియన్‌ డాలర్లు మాత్రమే కలెక్ట్‌ చేసింది. ఇప్పటివరకు రిలీజ్‌ అయిన ప్రీక్వెల్స్‌ని పరిశీలిస్తే.. ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కాంతార ఛాప్టర్‌ 1పై డిస్కషన్‌ జరుగుతోంది. ఈ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ప్రీక్వెల్స్‌ హిట్‌ అవ్వలేదు అనే సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసేందుకు హోంబలె ఫిలింస్‌ అధినేతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా కాంతార ఛాప్టర్‌1ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఖైదీ, వీరధీరశూరన్‌ చిత్రాలు కూడా ప్రీక్వెల్స్‌గా రాబోతున్నాయి. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. 
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal)మరో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కాంబోలో   మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan).మోహన్ లాల్ గత చిత్రం లూసిఫర్(Lucifer)కి పార్ట్ 2 గాలైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్,శ్రీ గోకులం మూవీస్ కలిసి సంయుక్తంగా మోహన్ లాల్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి.మూవీ అయితే ప్రేక్షాదరణతో దూసుకుపోతుంది.కాకపోతే సినిమాలోని కొన్ని సీన్స్ తో పాటు కొన్నిపేర్లు భారతీయ జనతా పార్టీ కి దగ్గరగా ఉన్నాయని కొంత మంది అభ్యంతరం వ్యక్తం చెయ్యగా,కొన్ని సీన్స్ ని డిలీట్ చెయ్యడంతో పాటు మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. రీసెంట్ గా ఎల్ 2 ఎంపురాన్ నిర్మాతల్లో ఒకరైన 'గోకులం గోపాలన్'(Gokulam Gopalan)ఇంట్లోతో పాటు చిట్ ఫండ్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.దీంతో ఎంపురాన్ కి గోపాలన్ నిర్మాత కావటం వల్లనే  ఈడీ సోదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.  వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు  200 కోట్లు సాధించిన ఎల్ 2 ఎంపురాన్ లో మోహన్ లాల్ నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.మంజు వారియర్, అభిమన్యు సింగ్,టోవినో థామస్,జెరోమ్ ప్లాన్,ఇంద్రజిత్ సుకుమారన్,కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు.దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక  కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది.  
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతుండగా,ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.రీసెంట్ గా 'పెద్ది'మూవీకి సంబంధించి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుపోతుంది.రేపు ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ కూడా రిలీజ్ కానుండటంతో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. చరణ్ ఇటీవల్ మార్చి 27 న తన 40 వ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.తన పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకి చరణ్ దంపతులు రీసెంట్ గా శ్రీరామచంద్రుడి పాదుకల్ని,హనుమాన్ ప్రతిమని,హనుమాన్ చాలీసా పుస్తకాన్ని గిఫ్ట్ గా పంపించారు.బుచ్చిబాబుని ఉద్దేశించి 'నా మనసులో నీకెప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడు నీపై ఉండాలని కోరుకుంటున్నానని ఒక నోట్ ని కూడా చరణ్ పంపించడం జరిగింది.ఆ ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న బుచ్చిబాబు ఈ బహుమతి మీ ప్రేమని,అభిమానాన్ని తెలియచేస్తుందంటు చరణ్,ఉపాసన ని టాగ్ చేస్తు పోస్ట్ పెట్టాడు. 'పెద్ది'లో చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా జగపతి బాబు,కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా  ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సంవత్సరమే పెద్ది థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పచ్చదనం అంటే ఆ  తాతకు ప్రాణం.. ఇంతకీ ఎవరు ఈ తాత అంటే.. ఆయన పేరు సూర్యనారాయణ్..  తన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఆయనకు చాలా ఇష్టం.  ఆ ఇష్టమే ఆయనను ఒక సంకల్పానికి సిద్దం చేసింది. బెంగళూరు నివాసి అయిన ఈ పచ్చదనపు ప్రేమికుడు తనకు ఉన్న పరిశుభ్రతను చాలా సీరియస్ గా తీసుకున్నారు.  ఎంతగా అంటే తను నివసించే పరిసర ప్రాంతాలను చీపురు పట్టుకుని మరీ శుభ్రం చేసే అంత.  పచ్చదనానికి ప్రాణం పోస్తున్న ఆ తాత గురించి తెలుసుకుంటే.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు నుండి 62 ఏళ్లకు రిటైర్ అయిపోతారు.  65 ఏళ్లు దాటాయంటే ఇంటి పట్టున ఉంటూ భార్యా లేదా కోడలు వండిపెడుతుంటే తింటూ కృష్ణా, రామ అంటూ కాలక్షేపం చేస్తుంటారు.  మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ  సంతోషాన్ని,  జ్ఞాపకాలను పోగేసుకుంటూ ఉంటారు.  కానీ  బెంగళూరుకు చెందిన 83ఏళ్ల సూర్యనారాయణ్ మాత్రం అందుకు భిన్నం.  ఈయన మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. 60ఏళ్ల వయసులో రిటైర్ అయిన ఈయన 24ఏళ్ల నుండి తనకు ఎంతో ఇష్టమైన పరిశుభ్రతను తను నివసించే ప్రాంతాలకు  అంతా వ్యాప్తం చేస్తున్నాడు. ఈయన దగ్గరుండి ఎవరితోనూ పనులు చేయించట్లేదు.  స్వయంగా తానే చీపురు పట్టి వీధులు ఊడుస్తున్నాడు.  ప్రతి ఉదయం వీధులు ఊడ్చి శుభ్రం చేస్తాడు.  శుభ్రమైన మురుగు కాలువలు,  పచ్చదనం,  చెత్త ప్రదేశాలను మచ్చలేని ప్రదేశాలుగా శుభ్రంగా మార్చేస్తుంటాడు. సూర్యనారాయణ్ గారు  రైతు కుటుంబంలో జన్మించారు.  ఆయనకు చెట్లు నాటడం అంటే చెప్పలేనంత ఇష్టం.  వాటిని సంరక్షించడం ఆయన బాధ్యతగా భావించేవాడు. చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి,  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వయస్సులో, సూర్యనారాయణ్ ప్రతిరోజూ చేతిలో చీపురు పట్టుకుని తన పనిని కొనసాగిస్తూ కనిపిస్తాడు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ తాత కృషి మరింత పెరుగుతుంది. 2001 నుండి వర్షాకాలంలో కూడా అవిశ్రాంతంగా వీధులు ఊడ్చడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం,  ఎండిన ఆకులను కంపోస్ట్ చేయడం చేస్తున్నాడు. వర్షాకాలంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, డ్రైనేజీ పొంగిపోకుండా నిరోధించడానికి  అదనపు కృషి చేస్తున్నాడు. తను చేసే పనిని చాలా అంకిత భావంతో చేస్తాడు.  సంవత్సరాల నుండి  తను చేస్తున్న పని మధ్యలో గాయాలు అయినా సరే వెనకడుగు వేయడం లేదు.  తన భార్య మద్దతు ఉండటంతో తాను చేసే పని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా మనసు పెట్టి చేయగలుగుతున్నానని, తనకు ఆ పని చేయడం ఇష్టం కాబట్టే చేస్తున్నానని ఎంతో సంతోషంగా అంటున్నాడు.   ఈ స్వచ్చంద సేవకుడికి లాల్ సలాం చెప్పాల్సిందే..!                          *రూపశ్రీ.
  శత్రువుల మనస్సుల్లో భయాన్ని రేకెత్తించిన నిష్ణాతుడైన వ్యూహకర్త, ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని,  మరాఠా నావికాదళాన్ని స్థాపించిన దార్శనిక నాయకుడు. యూరోపియన్ శక్తులు సముద్రాలను నియంత్రించే సమయంలో, శివాజీ స్వావలంబన నావికా దళానికి ఒక మార్గాన్ని రూపొందించాడు, 'భారత నావికాదళ పితామహుడు' అనే బిరుదును పొందాడు. డిసెంబర్ 4న నేవీ దినోత్సవం సందర్భంగా, శివాజీని భారత నావికాదళ మార్గదర్శకుడిగా కూడా గౌరవిస్తారు. భారతదేశంలో నేవీ ఇంత దృఢంగా రూపుదిద్దుకొన్నది అన్నా.. భారత నావికాదళ విభాగంలో ఓ గుర్తింపును తెచ్చుకోగలిగి దేశానికి రక్షణ కల్పిస్తోందన్నా అదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ చలువే.. భారత నావికాదళ పితామహుడు అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఎందుకు గౌరవిస్తారో తెలుసుకుంటే.. దూరదృష్టి గల నాయకత్వం,  నావికా వ్యూహం రాబోయే కాలంలో యుద్దాల  ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన గొప్ప దార్శనికత విప్లవాత్మకమైనది. భవిష్యత్తులో యుద్ధం తీరప్రాంతాలు,  అరేబియా సముద్రాల వెంబడి ఉంటుందని శివాజీ అర్థం చేసుకున్నాడు. ఈ కారణంగా పోర్చుగీస్ కు  తన రాజ్యానికి ఉమ్మడిగా ఉన్న సిద్ధిల నుండి వచ్చే సాధారణ ముప్పుల నుండి భారతదేశ పశ్చిమ సముద్ర తీరాన్ని కాపాడటం కోసం కసరత్తులు చేశాడు. శివాజీ నావికా దళాల వ్యవస్థీకరణ సర్వతోముఖంగా,  పూర్తిగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నావికాదళం వేగవంతమైన,  బలమైన నౌకాదళాన్ని సృష్టించడం, నావికాదళానికి సురక్షితమైన లంగరులను అందించడం, వాటిని సరఫరా చేయడం, రక్షించడం, మొదలైనవి  దాడి జరిగినప్పుడు ఎదుర్కోవడంలో  శిక్షణ పొందిన నావికాదళాన్ని రూపొందించగలిగింది. ఇక్కడి నుండే శివాజీ వ్యూహాత్మక దృష్టి భారత నావికాదళం   ను అభివృద్ధి చేయడమే అంతిమం లక్ష్యం అయ్యింది.   బలమైన నావికా దళాన్ని నిర్మించడం శివాజీ మహారాజ్ సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించడం. చాలా  రకాల యుద్ధనౌకలను నిర్మించడానికి, వాటిని సమర్థవంతంగా  నిలబెట్టుకోవడానికి చాలా ఖర్చులు చేశాడు. ఈ నౌకాదళంలో వివిధ రకాల నౌకలు ఉన్నాయి.  వాటిలో ముఖ్యమైనవి.. గల్లివాట్స్: వేగవంతమైన దాడులు చేయడానికి,  నిఘా సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించే ఓడలు.  ఇవి సాధారణంగా చాలా భారీగా నిర్మించబడతాయి గురాబ్స్: సముద్రంలో పెద్ద యుద్ధాలలో ఉపయోగించే తుపాకీతో కూడిన రెండవ పెద్ద ఓడలు. శివాజీ తన నౌకాదళానికి బలమైన ఓడల ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకున్నాడు.  అందువల్ల అతను తన దగ్గర ఉన్న నైపుణ్యం గల శిల్పులతో అధిక నాణ్యత గల కలపతో ఓడలను నిర్మించమని ఆదేశించాడు.  పదిహేడవ శతాబ్దంలో ఓడల తయారీకి అత్యంత సమకాలీన పద్ధతులను అనుసరించాడు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ షిప్‌బిల్డర్లను,  సిద్దీలు,  పోర్చుగీసులను ఉపయోగించి  ఉత్తమ నౌకాదళాన్ని అందించాడు. శివాజీ ఆధ్వర్యంలో స్థాపించబడిన కేంద్రీకృత నావికా దళం ప్రపంచంలోని ఆధిపత్య యూరోపియన్ శక్తులతో సమర్థవంతంగా పోటీపడేది. కీలకమైన నావికా స్థావరాలను ఏర్పాటు చేయడం సురక్షితమైన,  బాగా ప్రణాళికాబద్ధమైన నావికా నౌకాశ్రయాల అవసరాన్ని గ్రహించిన శివాజీ కొంకణ్ తీరంలో అనేక కోటలు,  ఓడరేవులను అభివృద్ధి చేశాడు . వీటిలో సింధుదుర్గ్, విజయదుర్గ్ & కొలాబా నావికా కోటలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ కోటలు బాగా నిర్మించబడ్డాయి,  సరఫరా, మరమ్మతు దుకాణాలు,  సిద్ధంగా ఉన్న రక్షణ యంత్రాలు కలిగి ఉండేలా ఏర్పాటు అయ్యాయి. మాల్వన్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపంలో నిర్మించిన సింధుదుర్గ్ కోట, శివాజీ నావికా దళం బలానికి నిదర్శనం. కోట ఉన్న ప్రదేశం ద్వారా, మరాఠా నావికాదళం పశ్చిమ తీరం వెంబడి సముద్రంలో ఇతర కార్యకలాపాలను తనిఖీ చేయడానికి,  నియంత్రించడానికి మంచి స్థితిలో ఉండేది. ఈ నావికా స్థావరాలు మరాఠా నావికాదళం  నిరంతర పనితీరుకు మద్దతు ఇచ్చినందున అవి ముఖ్యమైన సరఫరా డిపోలు,  స్టేజింగ్ పాయింట్లుగా ఉండేవి. శిక్షణ,  ఆవిష్కరణలు.. శివాజీ మహారాజ్ తన నావికా దళాల కసరత్తులు,  విన్యాసాల గురించి చాలా శ్రద్ధ వహించాడు. తన నావికులు,  నావికా అధికారులు సముద్ర పోరాటం, నావికా ధోరణి,  ఓడ సంరక్షణను అర్థం చేసుకునేలా ఆయన కఠినమైన వృత్తి శిక్షణను ఏర్పాటు చేశాడు. శిక్షణ,  నైపుణ్య అభివృద్ధిపై ఈ దృష్టి వృత్తిపరమైన,  సమర్థవంతమైన నావికాదళాన్ని నిర్మించడంలో పాత్ర పోషించింది. శివాజీ నావికా కార్యకలాపాలలో అతనికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన మరో అంశం ఆవిష్కరణ. సముద్రంలో మారుతున్న యుద్ధ స్వభావానికి అనుగుణంగా అధునాతన సాధనాలను అభివృద్ధి చేయాలని,  వ్యూహాత్మక ఆలోచనలను ఉపయోగించాలని ఆయన కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. పూణేలోని జాగీర్‌ను మొదటిసారిగా చేపట్టి స్వతంత్ర మరాఠా పాలనను స్థాపించే ప్రయత్నం ప్రారంభించినప్పుడు శివాజీ వయసు కేవలం పదహారు సంవత్సరాలు . శివాజీకి వేగం, ఆశ్చర్యం వంటి గెరిల్లా యుద్ధ వ్యూహాలు ఉన్నాయి , అందుకే శివాజీని " పర్వత ఎలుక" అని పిలుస్తారు. అతని వ్యూహాలు అతను తన స్థానాన్ని నిలబెట్టుకుని, మొఘల్ సామ్రాజ్యం మరియు ఇతర ప్రత్యర్థులతో సహా వారి సంఖ్య,  సైన్యంతో సంబంధం లేకుండా శత్రువులను ఓడించగలిగాడు. శివాజీ నావికా దళంలో ఆ కాలానికే ఇంత కృషి చేసినందుకే.. ఈయనను భారతీయ నావికాదళ పితామహుడు అని అంటారు.                                               *రూపశ్రీ.  
వేసవికాలం మొదలవగానే చాలా ఇళ్లలో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు.  ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుండి రాగానే చల్లని నీరు తనివితీరా తాగితే తప్ప శరీరానికి ఉపశమనం, మనసుకు హాయి అనిపించవు. అయితే చాలామంది ఫ్రిజ్ నీరు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. అందుకే మేం ఫ్రిజ్ వాటర్ తాగము అని చెబుతూ ఉంటారు. నిజంగా ఫ్రిజ్ వాటర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందా? వేసవి కాలంలో సాధారణ నీరు ఎంత తాగినా దాహం తీరినట్టు అనిపించదు.  అలాంటప్పుడు ఫ్రిజ్ నీరు తాగడమే బెటర్ అనుకుంటారు చాలా మంది.  మరి ఫ్రిజ్ లో చల్లని నీరు చేసే చేటు ఏంటి? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. ఫ్రిజ్ నుండి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్టు అనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది.  ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు,ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతుంది.  అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడం చాలా ఆలస్యం. ఫ్రిజ్ నీళ్ళు తాగే వారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది.  బరువు తగ్గాలని అనుకునే వారు ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల శరీరంలో మలబద్దకం రావచ్చు.   ఫ్రిజ్ లో చల్లని నీరు తాగడం వల్ల మైగ్రైన్ వచ్చేప్రమాదం పెరుగుతుంది.  ఇది తలనొప్పి సమస్యను పెంచుతుంది.  ఇప్పటికే మైగ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారు చల్లని నీరుకు దూరంగా ఉండాలి. ఒక వేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలి అనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగవచ్చు.                                  *రూపశ్రీ.
నీరు మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక వనరులలో ముఖ్యమైనది.  దాహం వేసినప్పుడు నీరు తాగుతాం.   ఏదైనా ఆహార పదార్థం తిన్నప్పుడు నీరు తీసుకుంటూ ఉంటాం.  ఇది తప్ప నీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.  బయటకు వెళ్ళినప్పుడు అలసట వస్తే తాగడానికి కావాలి అని ఒక నీళ్ల బాటిల్ వెంట తీసుకువెళతాము.  అంతే తప్ప నీటి గురించి మరింత సీరియస్ గా ఆలోచించాల్సిన పని ఏముంది అనుకుంటారు చాలా మంది. వేసవిలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం. ఎందుకంటే మన శరీరంలో 60 శాతం నీటితో తయారవుతుంది.  శరీరంలో నీటి కొరత ఉంటే, డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది.  శరీరంలోని అనేక భాగాల పనితీరు ప్రభావితమవుతుంది. శరీరంలోని అన్ని కణాలు,  అవయవాలు సరిగ్గా పనిచేయడానికి నీరు అవసరం. దీనితో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరైన సరఫరాకు, శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి,  చర్మాన్ని మృదువుగా ఉంచడానికి నీరు కూడా చాలా ముఖ్యమైనది. నీరు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని అనిపిస్తుందేమో.. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. మెదడు పనితీరు..  రోజువారీ కొన్ని గ్లాసుల నీటిని జోడించడం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని,  భావోద్వేగాలను స్థిరీకరించవచ్చని,  ఆందోళన వంటి ఎమోషన్స్ ను  తగ్గించడంలో కూడా సహాయపడుతుందని  పరిశోధనలు చెబుతున్నాయి. బరువు.. నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడానికి,  మీ బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. నిజానికి నీరు  కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇది అదనపు కేలరీలు  తీసుకోవడాన్ని  నిరోధిస్తుంది. ఇది  జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది, బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. కీళ్ల నొప్పులు..  కీళ్ల మృదులాస్థి దాదాపు 80 శాతం నీటితో కూడి ఉంటుంది. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల  కీళ్ళు బాగా లూబ్రికేట్ గా ఉంటాయి. ఇది ఎముకల మధ్య మరింత పరిపుష్టిని సృష్టించడం ద్వారా ఘర్షణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉష్ణోగ్రత.. శరీరం డీహైడ్రేట్ కు  గురైనప్పుడు  శరీరం ఎక్కువ వేడిని నిల్వ చేస్తుంది. ఇది వేడి ఉష్ణోగ్రతలను తట్టుకునే  సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో పుష్కలంగా నీరు త్రాగినప్పుడు ఏదైనా రకమైన కార్యాచరణ సమయంలో శరీరం వేడెక్కినప్పుడు చెమట పట్టడానికి సహాయపడుతుంది.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. గుండె ఆరోగ్యం..  గుండె ఆరోగ్యానికి హైడ్రేటెడ్ గా ఉండటం కూడా చాలా ముఖ్యం. నిజానికి,  రక్తం ప్రధానంగా ఆక్సిజన్ తో కూడి ఉంటుంది.  తగినంత నీరు త్రాగనప్పుడు అది గాఢంగా మారుతుంది. ఇది ఖనిజాల (ఎలక్ట్రోలైట్స్) అసమతుల్యతకు దారితీస్తుంది. పొటాషియం,  సోడియం వంటి ఈ ఖనిజాలు  గుండె సరిగ్గా పనిచేయడానికి ముఖ్యమైనవి.                                        *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఎనర్జీ డ్రింక్స్ చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇవి తాగగానే బాగా యాక్టీవ్ గా అనిపిస్తుంది కూడా. ఈ రోజుల్లో యువత టీవీ యాడ్స్,   ఫిట్‌నెస్ ఐకాన్‌ లు   శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగడం చూసి ఎనర్జీ డ్రింక్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. యువత మాత్రమే కాదు, అన్ని వయసుల వారు తమను తాము శక్తివంతంగా ఉంచుకోవడానికి,  తక్షణ శక్తి కోసం   ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ పానీయాలు తాగడం వల్ల  శరీరానికి కొత్త శక్తి వస్తుంది, కానీ నిజం ఏమిటంటే అవి  గుండె ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తున్నాయి. వ్యాయామం చేసిన తర్వాత ఎనర్జీ డ్రింక్స్ తాగడం చాలా మంది అలవాటు. దీని వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుందని అనుకుంటారు.  అయితే దీని వల్ల  వ్యాయామం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదని, దీనికి విరుద్ధంగా అది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ లో  ఏముంది? ఎనర్జీ డ్రింక్స్ లో ప్రధానంగా కెఫిన్, చక్కెర, టౌరిన్, గ్వారానాతో పాటు  కొన్ని ఇతర ఉత్తేజకాలు ఉంటాయి. ఈ మూలకాలన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి పనిచేస్తాయి, కానీ వాటి అధిక పరిమాణం  హానికరం కావచ్చు. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల గుండెపోటు వస్తుందా?  అధిక కెఫిన్ ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది, ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును పెంచుతుంది. ఇది హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది,  గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల ఎనర్జీ డ్రింక్స్ తాగిన తర్వాత రక్తపోటు పెరుగుతుందని పరిశోధనలలో తేలింది.  ఇప్పటికే అధిక రక్తపోటు ఉంటే, ఎనర్జీ డ్రింక్స్ తాగడం ప్రమాదకరం. దీని కారణంగ గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అధిక చక్కెర స్థాయి చాలా ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది,. ఇది మధుమేహం,  ఊబకాయాన్ని పెంచుతుంది. ఈ రెండూ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి ప్రధాన కారణాలు.  గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.  క్రమరహిత హృదయ స్పందన ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే కెఫిన్,  ఇతర ఉత్తేజకాలు క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా) కు కారణమవుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. దీని వల్ల గుండెపోటు వస్తుందనే భయం ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల రక్తపోటు,  హృదయ స్పందన రేటుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో చాలా ప్రభావం ఉంటుంది.                          *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  విటమిన్లు శరీరానికి చాలా ముఖ్యమైనవి. శరీరంలోని వివిధ అవయవాలు సమర్థవంతంగా  పనిచేయడంలో విటమిన్లు కీలకపాత్ర  పోషిస్తాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి,  కంటి చూపుకు విటమిన్-ఎ చాలా ముఖ్యం.  అయితే చాలామంది ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో విటమిన్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.  ఆహారం నుండి అయినా సప్లిమెంట్ల ద్వారా అయినా విటమిన్లను ఎక్కువగా తీసుకుంటే దానికి తగ్గ పరిణామాలు వేరేగా ఉంటాయి.  ముఖ్యంగా విటమిన్-ఎ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం జబ్బుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే.. శరీరంలో విటమిన్ ఎ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలేయంలో పేరుకుపోతుంది.  కాలక్రమేణా అది అక్కడే ఉండిపోతుంది. దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది.  ఇతర రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ ఎ టాక్సిక్ గురించి చాలామందికి తెలియదు.  విటమిన్ ఎ టాక్సిసిటీ..  దీనిని హైపర్విటమినోసిస్ ఎ అని కూడా పిలుస్తారు. ఇది  శరీరంలో విటమిన్ ఎ అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఎదురయ్యే  పరిస్థితి. ఈ పరిస్థితి తీవ్రమైనది,  దీర్ఘకాలికమైనది రెండూ కావచ్చు. తక్కువ సమయంలో చాలా ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ ను తీసుకుంటే తీవ్రమైన విటమిన్ ఎ విషప్రభావం ఏర్పడుతుంది.  దీర్ఘకాలిక విటమిన్ ఎ విషప్రభావం శరీరంలో ఎక్కువ కాలం పాటు విటమిన్ ఎ అధికంగా పేరుకుపోయినప్పుడు వస్తుంది. విటమిన్ ఎ టాక్సిస్ కు కారణాలు చాలా మంది విటమిన్ ఎ ని ఎక్కువగా తీసుకుంటారు, ఇది విటమిన్ ఎ విషప్రక్రియకు దారితీస్తుంది. మెగావిటమిన్ థెరపీ అంటే వ్యాధులను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి కొన్ని విటమిన్లను చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవడం. విటమిన్ ఎ విషప్రభావం కాలేయం దెబ్బతినడం, ఆస్టియోపోరోసిస్, శరీరంలో కాల్షియం అధికంగా చేరడం,  అధిక కాల్షియం కారణంగా మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. విటమిన్ ఎ విషప్రయోగం యొక్క లక్షణాలు హైపర్విటమినోసిస్ ఎ చిరాకు నిద్రమత్తు కడుపు నొప్పి మెదడుపై ఒత్తిడి,  వాంతులు దీర్ఘకాలిక హైపర్విటమినోసిస్ ఎ నోటి పూతలు ఎముకల వాపు గోర్లు పగుళ్లు ఎముక నొప్పి ఆకలి లేకపోవడం నోటి మూలల్లో పగుళ్లు అస్పష్టమైన దృష్టి లేదా కళ్ళలో వివిధ మార్పులు మైకము వికారం,  వాంతులు సూర్యరశ్మికి సున్నితత్వం కఠినంగా, పొడిగా, పొట్టు తీయడం లేదా దురద చర్మం,  కామెర్లు,  జుట్టు రాలడం గందరగోళం,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  శిశువులు పేలవమైన బరువు పెరుగుట,  మృదువైన తల చర్మం.  కోమా,  ఉబ్బిన కళ్ళు,  డబుల్ దృష్టి,  శిశువు తలపై మృదువైన మచ్చ ఉబ్బడం.                                        *రూపశ్రీ.