LATEST NEWS
సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో  తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావొద్దని పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఒకటే ఉండటంతో తొక్కిసలా జరిగి రేవతి చనిపోయిందన్నారు. కొడుకు ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చితే అల్లు అర్జున్ మాత్రం సినిమా చూడటానికి  హాల్ లో కూర్చున్నాడని అన్నారు.   రేవతి చావు వార్తను ఎసిపి వెళ్లి అల్లు అర్జున్ కు తెలియజేసి  వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు  డిసిపి అల్లు అర్జున్ కు  అరెస్ట్ చేస్తామని చెబితే కూడా ఓపెన్ టాప్ జీప్ లో అల్లు అర్జున్ వెళ్లిపోయాడని రేవంత్ మండి పడ్డారు. హీరో  కన్ను పోయిందా? కాలు పోయిందా? సినీ ప్రముఖులు వెళ్లి ఎందుకు పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. 
భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి.   దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే..  భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్ర పక్ష పార్టీలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.   ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో అంబేద్కర్ ను ఆరాధించే వారు జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలు వేయడంతో పాటు అంబేద్కర్ కు జేజేలు పలుకుతూ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరఃసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో జమిలి ఎన్నికల  బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఈ అంశంపై చర్చ జరిగే సమయంలో హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్... అని ఇన్నిసార్లు ఆ పేరు జపించే బదులు... అన్ని సార్లు దేవుడి పేరు జపిస్తే ఏడు జన్మలకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్ లో మాటల మంటలు రేగాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా  ఉన్న కాంగ్రెస్ కు, ఇండియా కూటమి పార్టీలకూ అమిత్ షా తన వ్యాఖ్యల ద్వారా మంచి ఆయుధాన్ని అందించారు. దేవుడి పేరు చెప్పి అంబేద్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో గళమెత్తారు.  దీంతో సహనం కోల్పోయిన బిజెపి నేతలు ఒకరి తరువాత ఒకరు విరుచుకు పడ్డారు. ఒకసారి అంబేద్కర్ ను అవమానించిన తరువాత దానిని సరిదిద్దుకునే విధంగా అమిత్ షా ప్రసంగించినా ఫలితం లేకపోయింది. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒకటికి మూడు సార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. అయినా మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు కూడా ఆందోళనలు వెళ్లాయి. బిజెపి తనను తాను సమర్థించుకునేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఇండియా కూటమి ఎంపీలను పార్లమెంట్ లోకి రాకుండా అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ధాటికి బిజెపి కూటమి తట్టుకోలేక పోతోందనడానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు.   అంతెందుకు అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించడానికి స్వయంగా ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటేనే.. ఆ వ్యాఖ్యలు బీజేపీకి ఎంత నష్టం చేకూర్చాయో అవగతమౌతోంది. రాజకీయ పరిశీలకులు అమిత్ షా వ్యాఖ్యలను బీజేపీ సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   గౌతమ్ అదాని వ్యాపార లావాదేవీలలో లంచాలు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని అమరికా దర్యాప్తు సంస్థ తేలుస్తూ అక్కడి కోర్టుకు వివరాలు అందించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని, వెంటనే అదానీపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబట్టింది. ఒకవైపు అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తుండగా దాని నుంచి డైవర్ట్ చేయడానికే అమిత్ షా అంబేద్కర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అమిత్ షా వ్యాఖ్యల కారణంగా బీజేపీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూ లేని స్థాయికి మసకబారింది. అదానీ ముడుపుల వ్యవహారాన్ని మించి అమిత్ షా వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని చేకూర్చాయి.  భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేస్తోంది.   ఈ నేపథ్యంలో పార్లమెంట్ బయట నుంచి ఎంపీలు పార్లమెంట్ లోపలికి వచ్చే ద్వారం వద్ద మెట్లపై బిజెపి, దాని మిత్ర పక్ష ఎంపీలు కూర్చొని కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి కూటమి   నిరసనకు దిగింది. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల సభ్యులను సభలోకి వెళ్లనీయకుండా బీజేపీ ఎంపీలు అడ్డుపడటంతో నాలుగు రోజుల కిందట జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఓ బీజేపీ ఎంపీ గాయపడ్డారు.   దీంతో గొడవ ముదిరి పాకాన పడింది. తనను కూడా నెట్టి కింద పడేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తన బాధను వ్యక్తం చేశారు. ఇరు వర్గాల ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ ఖడ్ లకు కూడా  ఫిర్యాదులు చేశారు.  ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ డిఫెన్స్ లో పడిందనడంలో సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానిస్తూ అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో బీజేపీలో కంగారు మొదలైందనీ, అందుకు తార్కానమే.. రాహుల్ గాంధీ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను లోపలికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమని అంటున్నారు. ఖర్గే, రాహుల్ కాంబినేషన్ బాగా కుదరటంతో బిజెపి కూటమిని పార్లమెంట్ లో ఇండియా కూటమి గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. అంబేద్కర్ ను అవమానించడమంటే కోన్ని కోట్ల మంది బలహీన వర్గాల వారిని అవమానించడమేననీ, రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఇది కచ్చితంగా బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని చెప్పడానికి ఆస్కారమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ గండం నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాల్సిందేనంటున్నారు. 
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం(డిసెంబర్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (డిసెంబర్ 20) శ్రీవారిని మొత్తం 65 వేల 299 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 75లక్షల రూపాయలు వచ్చింది. 
మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేటీఆర్ కు తాత్కాలిక ఊరట కల్పించింది. అది పక్కన పెడితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఈ ఫార్ములా   రేసులో 55 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏసీబీ  కేసు నమోదు చేసింది.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(ఏ),  13(2), అలాగే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్  409  (విశ్వాస ద్రోహం), 120(బి) (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అదే సమయంలో ఈడీ కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేసింది.  . ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే అనివార్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేయాల్సి వచ్చిందని అంగీకరించారు. హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడటం, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం కోసం హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ జరగాలని తాను భావించాననీ, అయితే  స్పాన్సర్లు లేకపోవడం వల్ల హైదరాబాద్ నుండి వైదొలగాలని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులు భావించడంతో   తాను చొరవ తీసుకుని 55 కోట్లు నిర్వాహకులకు బదిలీ అయ్యేలా చేశాననీ కేటీఆర్ వివరణ ఇచ్చారు.  ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న కేటీఆర్, అదే ఈ రేసు రద్దు అయితే  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే నిర్వాహకులకు రూ.55 కోట్ల బదిలీ చేసినట్లు వివరించారు.   అయితే కేటీఆర్ వివరణ వల్ల చట్టపరమైన చిక్కుల తొలిగిపోయే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   రూ. 10 కోట్లకు పైగా ఖర్చులకు ఆర్థిక శాఖ,  రాష్ట్ర ప్రభుత్వంనుంచి పరిపాలనా అనుమతి అవసరం. కానీ అలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే విదేశీ సంస్థకు రూ.55 కోట్ల బదిలీ జరిగిపోయింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. అసలీ బదలాయింపుపై  ఆర్థిక శాఖకు కనీస సమాచారం కూడా లేదు.ఇవేమీ లేకుండానే  ఫార్ములా ఇ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఇఒ) కు బదిలీ చేశారు. ప్రభుత్వం విదేశీ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేసినప్పుడు ఆర్‌బిఐకి తెలియజేయాలి, కనీసం అది కూడా జరిగిన దాఖలాలు లేవు.  కాబట్టి, ఈ కేసులో కెటిఆర్‌ కు చట్టపరమైన, న్యాయపరమైన చిక్కులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కచ్చితంగా విధాన లోపం,  నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.  
ఫార్ముల-ఈ కార్ రేసు  విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే  ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి షాక్ ఇచ్చింది.   ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేయడంలో ఈ రేసు కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఏసీబీ కేసు నమోదు చేసిన క్రమంలో అరెస్ట్ నుంచి ఊరట పొందిన కేటీఆర్.. ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఊరట లభించగానే.. రేసు కేసు డొల్లఅని, అందుకే తొలి అడుగులోనే కాంగ్రెస్‌కు చుక్కెదురైందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.  అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపడంతో బీఆర్ఎస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా ఈడీ పేర్కొంది.  ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ   ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా... విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలో, కేటీఆర్ ఈడీ కేసుపైనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,ఆ కేసులో అల్లు అర్జున్(allu arjun)అరెస్ట్ అయ్యి, ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చిన విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)అసెంబ్లీ వేదికగా ఈ కేసు పై ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్ధం అవుతుంది. రీసెంట్ గా అల్లుఅర్జున్ విషయంపై ఏంఐఏం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఏంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసి(akbaruddin owaisi)మాట్లాడుతు అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నప్పుడు పక్కనున్నవాళ్ళు తొక్కిసలాట జరిగిందని చెప్పారు.అయితే మన సినిమా హిట్ అని అల్లుఅర్జున్ వాళ్ళతో అన్నాడు.తొక్కిసలాటలో మహిళ మృతి చెందినా కూడా అల్లు అర్జున్ సినిమాను చూసి వెళ్ళాడు.పైగా వెళ్ళేటప్పుడు బాధ్యత లేకుండా  అభిమానులకు చెయ్యి ఊపుతూ కూడా వెళ్ళాడు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.   
In Telangana Assembly, MLA Akbaruddin Owaisi slammed Allu Arjun's attitude during Pushpa 2 The Rule premiere and resultant stampede. He made shocking comments stating that Allu Arjun even after knowing that a stampede occurred and a person died, two are gravely injured, he turned to his people and stated, "Now, Film is a big hit". He questioned, "Where is humanity when such a disaster has happened?" He commented that a popular actor cannot be lack of humanity and be so full of himself that he feels he is enabled due to popularity. He further commented that he would make sure at his meetings that such disasters wouldn't happen with human courtesy.  MLA Akbaruddin further praised government for taking stringent action and immediately passing a strong statement that no one will be spared. CM Revanth Reddy also made similar comments about Allu Arjun lacking any empathy towards the crowd and his bouncers pushing fans so hard that it caused for such a stampede.  He interestingly stated that Police have warned against any such incidents happening to the theatre owners. He stated that the police have requested the theatre management to not allow actor to come to the theatre. Further, he stated that despite warnings the actor attended the premiere and caused the unrest. 
రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)దర్శకత్వంలో గత ఎన్నికలకి ముందు రిలీజైన మూవీ వ్యూహం.రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనుంజయ్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.  ఇక ఈ మూవీని ఫైబర్ నెట్ సంస్థ వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.2.15 కోట్లుకి  ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించింది.వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని తెలిపారు.ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని వివరించారు.దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగిందని చైర్మన్ జీవిరెడ్డి(gv reddy)ఒక ప్రకటనలో తెలిపాడు.  
Telangana CM Revanth Reddy slammed Icon Star Allu Arjun in the view of his Pushpa 2 The Rule premiere stampede. In the assembly, he made interesting comments on the actor. He stated that even though police warned against it, the actor went ahead to the premiere.  He stated that the DCP had to drag Allu Arjun out stating that two people died in stampede and warned him, if he won't go out of the theatre, he would arrest him. Revanth Reddy wondered "What kind of a person is Allu Arjun?" He stated that the stampede happened due to Allu Arjun's bouncers pushing away the crowd.  He interestingly stated that even after DCP forced him to go out of the screening, Allu Arjun waved at crowd knowing that a stampede occurred and two people died. He further wondered why did entire TFI celebrities go to show sympathy to Allu Arjun after just one day arrest.    He further expressed surprise about him being targeted by Telugu Film Industry people in unity to Allu Arjun. He commented that they should have visited the boy in the hospital rather than targetting him. CM Revanth Reddy comments surprise everyone as he directly bashed Allu Arjun as self-centred and full of himself.  CM Revanth Reddy further stated that Allu Arjun was rude towards the Police, who went to arrest him. On the other hand, Cinematography Minister Komatireddy Venkata Reddy stated that the government has issued Rs.25,00,000 to deceased Revathi's family and there won't be anymore benefit shows in Telangana State going forward.  On 4th night, during Pushpa 2 The Rule premieres, Allu Arjun attended the premiere at Sandhya 70 MM theatre in RTC "X" Roads in Hyderabad. During his visit, a stampede occurred and Revathi lost her life, while her son is fighting for life in the hospital. 
Aaron Taylor-Johnson has transformed himself to look at his muscular best as Kraven The Hunter. With a rigorous workout routine and strict diet, he has achieved a chiselled physique, boasting impressive strength, agility, and endurance. He took it as challenge to appear perfectly as this Marvel Superhero.  He talked about his discipline and rigorous hardwork to achieve the physique. He stated, “In the comics, Kraven is absolutely ginormous." He continued to say, "His abs and arms are literally part of his costume. His physical appearance is what the fans will expect to see when the character from the comic books comes to life on screen. One aspect of my job is to ask, how do we make this character believable? The transformation of my body was a crucial part of the costume.” Aron Taylor-Johnson spent months building up almost 35 pounds of muscle with personal trainer David Kingsbury and nutritionist Nate Schmidt. He and his team had only six months to achieve the muscle while it takes years to achieve it. Taylor-Johnson used a mobile gym working out even after shooting began.    Trainer Kingsbury warns against overtraining. “It’s very counterintuitive, the weight training side of things,” Kingsbury continues. “It’s fairly low volume, so we’re not doing that many sets of every exercise. We’re not necessarily doing very many exercises per session, either. It creates a bit of anxiety in you, because you think, ‘shouldn’t we be training today?’ But overtraining creates excessive muscle damage. It’s the stimulating reps that create muscle growth.” Directed by ​J.C. Chandor​​​, the film also stars ​Ariana DeBose, Fred Hechinger, Alessandro Nivola, Christopher Abbott and Russell Crowe. Sony Pictures Entertainment India releases ‘Kraven The Hunter’ on January 1st, in English, Hindi, Tamil and Telugu. Only in cinemas.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ 'బద్రి'.ఈ మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయమైన భామ 'అమీషా పటేల్'(ameesha patel).సరయు అనే క్యారక్టర్ లో సూపర్ గా నటించి తెలుగు నాట ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.ఆ తర్వాత మహేష్ బాబుతో నాని,ఎన్టీఆర్ తో 'నరసింహుడు' అనే సినిమాల్లో కూడా చేసింది.బాలీవుడ్ లో కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అమీషా గత సంవత్సరం గదర్ 2 అనే సినిమా చేసింది.సన్నీడియోల్ హీరోగా వచ్చిన ఈ మూవీని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించాడు. కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో అమీషాని ఉద్దేశించి అనిల్ శర్మ మాట్లాడుతు అత్త క్యారక్టర్ లో నటించడానికి అమీషా అంగీకరించలేదు.నర్గిస్ దత్ వంటి గొప్ప తారలు కూడా అత్తయ్య పాత్రలు చేసారని  అమీషాకి నచ్చచెప్పా.అయినా సరే ఆమె మాత్రం చేయనని చెప్పిందనే విషయాన్నీ సదరు ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై అమీషా స్పందిస్తు'డియర్ అనిల్ ఇది కేవలం సినిమా మాత్రమే.నిజజీవితంలో ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు.కాబట్టి ఆన్ స్క్రీన్ లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదనేది పూర్తిగా నా వ్యకిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.'గదర్'అనే కాదు ఏ మూవీలో అయినా కూడా అత్త క్యారెక్టర్స్ చెయ్యను.మీరంటే నాకు ఎంతో గౌరవం ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసింది.ఇప్పడు ఈ కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. గతంలో కూడా అనిల్ పై అమీషా కొన్ని ఆరోపణలు చేసింది.తన కొడుకు ఉత్కర్ష్ శర్మ కోసం గదర్ 2 లోని క్లైమాక్స్ సీన్ ని,తనతో ఒక మాట కూడా చెప్పకుండా మార్చేసాడని చెప్పుకొచ్చింది.ఇక 'గదర్ 2 'లో సన్నీడియోల్ భార్య సకీనా క్యారక్టర్ లో అమీషా ఎంతో అధ్బుతంగా చేసింది.60 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 600 కోట్ల దాకా వసూలు చేసింది.గదర్ 3 కూడా ఉందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో,మరి అమీషా అందులో ఉంటుందా లేదా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది.  
రష్మిక మందన్నా(rashmika mandanna)రీసెంట్ గా పుష్ప 2(pushpa 2)తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.శ్రీవల్లి క్యారక్టర్ లోని ఆమె నటనకి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.ప్రస్తుతం ఆమె ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో,చావా,కుబేర,సికిందర్ వంటి పలు క్రేజీ ప్రాజక్ట్స్ లో చేస్తుంది. రష్మిక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు నేను విజయ్(vijay)సార్ కి  వీరాభిమానిని.నేను స్క్రీన్ మీద చూసిన మొదటి హీరో విజయ్ గారే.ఆయన చేసిన 'గిల్లి' మూవీ అయితే లెక్కకు మించిన సార్లు చూసాను.అందులోని ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం.నా లైఫ్ మొత్తంలో ఎన్నో సార్లు ఆ పాటకి స్టేజీ పై డాన్స్ చేశాను.ఆ మూవీ మహేష్ బాబు హీరోగా తెలుగులో వచ్చిన 'పోకిరి' కి రీమేక్ గా తెరకెక్కిందని చెప్పుకొచ్చింది.కానీ గిల్లి సినిమా 'ఒక్కడు' మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రష్మిక వీడియోని షేర్ చేస్తు గిల్లి మూవీ పోకిరీకి రీమేకా అంటు పలు రకాల కామెంట్స్ తో ఎమోజి లని కూడా షేర్ చేస్తున్నారు. దీంతో విషయం అర్ధమైన రష్మిక  గిల్లి మూవీ ఒక్కడు కి రీమేక్ అని ఇంటర్వ్యూ తర్వాత అర్ధమయ్యింది.ఈ విషయంలో అందరకి సారీ అని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫన్నీ ఎమోజి లని జోడించింది.  
మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(vijay sethupathi)హీరోగా వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్(vetri maaran)దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ విడుదల పార్ట్ 2(vidudala part 2).డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీలో మంజువారియర్(manju warrier)సూరి, ఇలయవరసు,గౌతమ్ మీనన్,రాజీవ్ మీనన్,అనురాగ్ కశ్యప్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించగా భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణమైన ఇళయరాజా సంగీతాన్ని అందించాడు. ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళ లాంగ్వేజ్ లో 6 .6 కోట్లు,తెలుగులో నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ తో మొత్తం 7 కోట్లని వసూలు చేసింది.ఇక అన్ని ఏరియాల్లో ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే మార్నింగ్ షో ఒక మాదిరిగా ఫుల్ అయినా కూడా మాట్నీ నుంచి అన్ని చోట్ల కూడా  ఫుల్ అవ్వడం జరిగిందని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మేంట్,శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై కుమార్,రామారావు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ అణగారిన వర్గాల వారి హక్కులని  కొంత మంది జమీందారులు ఏ విధంగా అణగతొక్కుతున్నారో చూపించడం జరగగా అభ్యుదయ భావాలు కలిగిన పెరుమాళ్ క్యారక్టర్ లో విజయ్ సేతుపతి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే మాటనే అభిప్రాయాన్ని చాలా మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.  
  తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన నటి కస్తూరి కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "నన్ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చారు. అక్కడ బెడ్ లాంటివి ఏమీ ఉండవు కిందే పడుకోవాలి. నన్ను క్వారంటైన్ వార్డులో పెట్టారు. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక వారం అందులో ఉంచుతారు... తర్వాత ఆర్డర్స్ ని బట్టి రిమాండ్ ప్రిజన్ కి పంపిస్తారు. మొదటి రోజు జైలుకు వెళ్ళినప్పుడు నాకు పిచ్చిపట్టినట్టు అయ్యింది. కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్ ఉంటుంది. అల్లు అర్జున్ కి కూడా ఇలాగే అయ్యుంటుంది నాకు తెలిసి. అసలు బట్టలు లేకుండా నిలబడాలి. ఆడవాళ్ళ ప్రతీ పార్టీ పట్టుకుని మరీ చెక్ చేస్తారు. ప్రైవేట్ పార్ట్శ్ లో ఏమన్నా దాచామా అని చెక్ చేయడానికి మూడు సార్లు గుంజీళ్లు తీయిస్తారు. అల్లు అర్జున్ విషయంలో బెయిల్ వచ్చి ఉంటుంది అనుకున్నా కానీ జైలుకు వెళ్లారు. ప్రిజనర్ రికార్డు ఉంటుంది ..ఫోటో తీసి ఉంటారు. నంబర్ ఇచ్చి ఉంటారు అనుకున్నా. నాకు ఇవన్నీ చేశారు. 644788798 నంబర్ ని నాకు ఇచ్చారు. సాయంత్రం 6 అయ్యేసరికి భోజనాలు పెట్టేసి జైలు డోర్స్ లాక్ చేసేస్తారు. అప్పుడు నాకు మెంటల్ గా నేను ఖైదీని అన్న ఫీలింగ్ వచ్చింది. మెంటల్ గా చాలా అప్సెట్ అయ్యాను. ఆ ఒక్కరోజు నిద్రపోలేదు. రెండు రోజుకు ధైర్యం వచ్చేసింది. బాగా తిని నిద్రపోయాను. జైల్లో చాలా మందిని కలిసాను. వాళ్ళ గాధల్ని విన్నాను. జైల్లో ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి 4000 పేజీలు అక్కడ లైబ్రరీలో చదివాను. బాదం చెట్టు ఉంటే వాటిని దోనెలుగా చేసి అక్కడ ఉన్న వాళ్లందరికీ ఇచ్చాను. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. జైల్లో నాలుగు నెలల పసిబిడ్డ ఉన్నాడు వాళ్ళ అమ్మతో. జైల్లో నాకు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇచ్చారు. అలాగే స్కూల్ ఉంటుంది. పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆ స్కూల్ లో డిగ్రీ వరకు చదువుకోవచ్చు. జైలుకు వెళ్ళాక తెలిసింది ఏంటంటే నన్ను ఎలాంటి ప్లేస్ లో పెట్టినా నేను బ్రేవ్ గా ఉండగలను.. ఏది అవసరమో ఆ పని చేయగల సత్తా కూడా ఉందని అర్ధమయ్యింది. జైల్లో శిక్ష అనుభవించే వాళ్లంతా దోషులు కారు. దోషులందరికీ శిక్ష పడే ఛాన్స్ కూడా ఉండదు. ఇక్కడి ఈ మొత్తాన్ని కూడా ఒక బుక్ రాయాలి అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది కస్తూరి.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(upendra)చాలా సంవత్సరాల తర్వాత 'యూఐ'(ui)అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కన్నడంతోపాటుతెలుగు,తమిళ,హిందీ,మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.ఇక మూవీ చూసిన చాలా మంది అప్ డేటెడ్ మూవీగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ఏరియాల్లో డివైడ్ టాక్ కూడా వస్తుంది. ఈ మూవీ తొలిరోజు 6 .75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.అందులో కర్ణాటకలో 6 కోట్లు రాబట్టగా,తెలుగులో 70 లక్షలు,తమిళంలో 4 లక్షలు,హిందీలో లక్ష రూపాయిల చొప్పున రాబట్టింది.  మరి వీకెండ్స్ లో ఈ మేర రాబడుతుందో చూడాలి.      ఉపేంద్ర రచనా,దర్శకత్వంలోనే  తెరకెక్కిన ఈ మూవీలో రేష్మ నానయ్య హీరోయిన్ గా చెయ్యగా,మురళి శర్మ,రవిశంకర్,అచ్యుత్ కుమార్,సాదు కోకిల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాధ్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ మూవీని మనోహరన్,కె పి శ్రీకాంత్ లు సంయుక్తంగా నిర్మించారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   ‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది. అమ్మ చీర కొంగు చెమట పడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే  సగటు భారతీయ కుటుంబంలో ప్రతీ శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే జోలపాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి  చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో..  అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించటం వల్లనే  ఒక తరం నుంచి ఇంకో  తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి.  అలాగే  మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ,  వెస్టర్న్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచనా విధానం మార్చాలని, తర్వాత వచ్చే   తరాలు చీరని  మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే  ప్రపంచ చీర దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వాటిలో చీర కూడా ఒకటి.  ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన  వరల్డ్ శారీ డే జరుపుకుంటారు.   చీర ఎప్పటినుంచి ఉంది.. చీర చరిత్ర గురించి చూస్తే దీని ఆనవాళ్ళు ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత(2800-1800బి‌సి‌) కాలంలో దొరికాయి. అప్పుడిది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ గా మారుతూ వచ్చింది.. చీరలు  నేసే నేతన్నలకి, చీరల్లో ఉండే  ప్రత్యేక కళకీ  గౌరవం తెలపడానికిగానూ  2020, డిసెంబర్21వ తేదీన  ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం మొదలపెట్టారు.  స్థానికంగా మొదలై త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉద్యోమమే స్పూర్తి.. సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిస్టులా హెబ్బార్..  ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో సోషల్ యాక్టివిస్ట్  శ్రీమతి నళిని శేఖర్  దీన్ని ప్రారంభించారు.   శారీ డేని ఎందుకు జరుపుకోవాలి.. భారతీయుల మూలాలను గుర్తు చేస్తూ మన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం. చీర కేవలం ఏదో  ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వమని ప్రపంచానికి చాటి చెప్పడమే శారీ డే లో ఉన్న గొప్పతనం.  చీరలు తయారు చేసే కళను కాపాడి, చేతి వృత్తుల పరిశ్రమని ప్రోత్సహించడమనే మరక ఉద్దేశ్యం కూడా ఇందులో ఉంది. చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ది చెంది, స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టట్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయటం ద్వారా  మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియచేస్తుంది. చీరలో వైవిధ్యం.. ఫ్యాషన్ పరిశ్రమపై చూపిస్తున్న ప్రభావం.. భారతదేశంలోని ప్రతి ప్రాంతం దాని ప్రత్యేక శైలిని చీర ద్వారా పరిచయం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్  విలాసవంతమైన బనారసీ పట్టు చీర నుండి తమిళనాడులో చేతితో నేసిన కాంచీపురం చీర వరకు. రాజస్థాన్  రంగురంగుల బంధనీ చీర నుంచి తూర్పు భారతంలోని జామ్‌దాని, ఖాదీ చీరల వరకూ ఎంతో వైవిధ్యం కలిగి ఉన్నాయి. చీర కట్టే స్టైల్లో కూడా  ప్రతీ ప్రాంతానికి తమదైన ప్రత్యేకత ఉంది.  మహారాష్ట్రలో నౌవారి స్టైల్, గుజరాత్‌లో ముందుకు పల్లు కట్టడం, బెంగాల్ చీర కట్టు... ఇలా  చాలా వైవిధ్యం ఉంది. చరిత్రలో రాణి లక్ష్మీ బాయి లాంటి వీరనారిలు, ఇందిరా  గాంధీ వంటి మహిళలు చీరలను విభిన్న శైలుల్లో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు.   చీర ఇప్పుడు తన సాంప్రదాయ హద్దులని దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచీ, మనీష్ మల్హోత్రా, గౌరవ్ గుప్తా వంటి మోడర్న్ డిజైనర్స్ కూడా  చీరను డిఫరెంట్ స్టైల్సులో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నారు.   చీర ఆరు నుండి తొమ్మిది గజాల అన్‌స్టిచ్డ్ వస్త్రం కాదని, భారతదేశ  కళా నైపుణ్యం,  సంప్రదాయానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గుర్తించాలి.  ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి, వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలనుకున్నా, ముందు మనం మన మూలాలనుంచి  దూరం అవ్వకుండా ఉండాలి.  భారత సంప్రదాయాన్ని,  చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ వరల్డ్ శారీ డే ను జపురుకోవాలి.                                        *రూపశ్రీ.
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.  కోపం  అనేది ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన గుణమే అయినా కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు చాలా విషయాలలో నష్టాలు ఎదురుచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి వాళ్ల దగ్గర కోపం చూపించినా మహా అయితే మాట్లాడకుండా పోతారు. కొందరైతే చెడ్డవారనే ముద్ర వేస్తారు.. కానీ కుటుంబ సభ్యులు,  అన్నింటి కంటే ముఖ్యంగా జీవిత భాగస్వాములు కోపం వల్ల జీవితంలో కోలుకోలేని,  తిరిగి పూడ్చలేని నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది.  అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని అంటారు.  అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి అని అనుకున్నంత సులువగా దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడమే పెద్ద సమస్య.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.. లైఫ్ కోచ్ అయిన రవిశంకర్ గురూజీ కోపాన్ని జయించడానికి, కోపంతో ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలను స్పష్టంగా తెలిపారు. సైలెంట్ అయితే కోపం పెరుగుతుందా..? వివాహ బంధంలో సరైన భాగస్వామి దొరకకపోతే కోపం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోతే అవతలి వారి కోపం కంట్రోల్ కాదు.. ఫలితంగా . కోపం పెరుగుతుంది. కోపం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయి సమయాన్ని వృథా చేయకూడదు. అవతలి ఏదైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా అవాయిడ్ చేయకూడదు. ఇది చాలా తప్పు. కోపం ఇలా కంట్రోల్.. మీరు ఎంత చెప్పినా సరే.. ఎదుటి వ్యక్తి కోపం తగ్గకపోతే దీనికోసం చేయవలసిన పని కోపంగా ఉన్న వ్యక్తికి అర్థం అయ్యేలా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండే వ్యక్తిని సంప్రదించడం.మూడవ వ్యక్తి సహాయంతో కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ సక్రమంగా సాగకపోతే  కోపగించుకునే అవకాశం ఉంది.  కానీ అర్థమయ్యేలా ఎవరో ఒకరు వివరిస్తే అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి ప్రమేయం మంచిదేనా? సాధారణంగా భార్యాభర్తలు కానీ.. కుటుంబ సభ్యులు కానీ వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మూడవ  మనిషి ప్రమేయం ఉంటే ఇష్టపడరు. కానీ భాగస్వామి కానీ, కుటుంబంలో వ్యక్తి కానీ ఏదైనా చెప్పాలని చూసినప్పుడు అవతలి వ్యక్తి వినకుంటే.. మీరు చెప్పేది మంచి విషయమే అయినా అప్పటికే మీ మీద ఉన్న కోపం వల్ల  మీరు చెప్పే మంచి కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అలాంటి సందర్బంలో మూడవ వ్యకి సహాయం తీసుకోవడమే మంచిదట. అయితే భార్యాభర్తలు ఎప్పుడూ ఇలా మూడవ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుకోకూడదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా ఇద్దరూ కలసి ఓపెన్ గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడమే మంచిది. ఇది కూడా ట్రై చేయవచ్చు.. ఎవరైనా చాలా కోపంగా ఉంటే వారు నిశ్శబ్దంగా ఉంటే..  వారిని గౌరవించి మీరు కూడా  నిశ్శబ్దంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉంటే కోపంగా ఉన్న వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి సమయం లభిస్తుంది.   అతను తనంతట తానుగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కోపంగా ఉన్న సమయంలో  ఎటువంటి తప్పు అడుగు వేయకుండా జాగ్రత్త పడాలి.  ఇకపోతే.. ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకోవడం బంధాలకు..  ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల గొడవలు జరిగినప్పుడు.. కోపంగా ఉన్నప్పుడు  ప్రశాంతంగా ఉండటం,  ఎదుటివారి కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయడం మంచిది.                                              *రూపశ్రీ.  
  ప్రజలు చాలావరకు మానసిక సమస్యలతోనే  ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు.   చాలామందిని గమనిస్తే కాలంతో పాటు అలా సాగుతుంటారు.. కానీ వారిలో మానసిక సమస్యలు అలాగే ఉంటాయి.  అవన్నీ గతంలో జరిగిన గాయాల తాలూకు బాధాకర పరిస్థితులు.  కాలం అయితే గడుస్తోంది కానీ.. మానసికంగా ఒకచోటే చిక్కుబడిపోయి ఉంటారు. ఆ గాయపడిన పరిస్ఖితుల నుండి బయటకు రాలేకపోవడం వల్లనే చాలా వరకు డిప్రెషన్ వంటి సమస్యలకు లోనవుతుంటారు.  అయితే గతం చేసిన గాయాలు తగ్గంచలేనివే అయినా వాటి నుండి బయటపడం చాలా అవసరం. లేకపోతే జీవితంలో ఎదుగుదల అంతగా ఉండదు.  మానసికంగా బలహీనంగా ఉన్నవారు దాన్ని అధిగమించాలంటే ఈ గతం తాలూకు గాయాల నుండి బయటపడాలి. గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే.. వాటి నుండి బయటపడటం చాలా ముఖ్యం.  ఈ మానసిక గాయాలు మనిషిని లోపలి నుండి చాలా బలహీనంగా మారుస్తాయి.  దీని కారణంగా వ్యక్తులు ఎప్పుడూ నిరాశ,  ఆందోళన, మనుషుల మీద నమ్మకం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతం తాలూకు గాయాలతో ఇబ్బంది పడుతున్నవారిలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి వ్యకులలో తొందరగా కోపం, విచారం,  భయం వంటివి కలిగిస్తుంటాయి.  ఈ ఎమోషన్స్ ను బయట పెట్టలేక,  మనసులోనే అణుచుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎమోషన్స్ ను అణుచుకోవడానికి ప్రయత్నించకూడదు.  వీటిని బయటకు వ్యక్తం చేయడం వల్ల మనసులో భారం ఏర్పడదు. కౌన్సెలింగ్.. కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల మనసులో మానసిక బాధను, గాయాల తాలూకు పరిస్థితులను అధిగమించడం సులువు అవుతుంది.  గాయం తాలూకు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సహకారం.. కుటుంబ సభ్యులు, స్నేహితులు,  ఆప్తుల సహాయంతో  మానసిక గాయాల నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి.  చుట్టూ ఉన్నవారి సపోర్ట్ ఉంటే వీటి నుండి బయటపడటం తేలిక. వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా ఉంచడంలో అందరూ సహాయపడతారు. నిద్ర.. మానసిక సమస్యలకు మంచి ఔషదంగా నిద్రను చెప్పవచ్చు.  రోజూ కంటినిండా నిద్రపోవడం,  సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.  మానసిక సమస్యలు ఏర్పడినా అవన్నీ తర్కంగా,  ఆలోతనాత్మకంగా పరిష్కరించుకోగలుగుతారు.  శరీరంలో ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. సెల్ఫ్ నోట్.. మనసులో ఉన్న భావాలను,  మనసు పడే బాధను అక్షరరూపంలో రాస్తుంటే మనసు భారం చాలా వరకు తగ్గుతుంది.  వీటిని ఇలా రాస్తూ ఉంటే ఆ తరువాత ఎప్పుడైనా పునఃపరిశీలన చేసుకున్నప్పుడు ఆలోచనల పరంగా మారడానికి చాలా ఉపయోగపడతాయి.  అప్పట్లో నేను ఇలా ఉన్నాను, ఇప్పుడెందుకు ఇలా అయ్యాను.. అప్పట్లో ఇంత బాధలో ఉన్నాను.. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను.. ఇలాంటి మాటలు మనసుకు చాలా ఊరట ఇస్తాయి. హాబీ.. మానసిక సమస్యల నుండి, గతం గాయాల నుండి బయట పడాలంటే దానికి చక్కని మార్గం మనసుకు, మెదడుకు ఆలోచించే అంత సమయం ఇవ్వకపోవడం.  ఇందుకోసం  కొత్త పనులు, హాబీలు,  కొత్త విషయాలు నేర్చుకోవాలి.  దీని వల్ల రెండు లాభాలున్నాయి.  ఒకటి గతం గాయాలు మర్చిపోవడం, రెండవది కొత్త నైపుణ్యాలు సాధించడం ద్వారా జీవితంలో  ఆర్థిక భద్రతవైపు అడుగేయడం.                                       *రూపశ్రీ.
  నెయ్యి ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం.  ప్రతి రోజూ స్వచ్చమైన నెయ్యిని కనీసం ఒక స్పూన్ అయినా తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా మంచిదని చెబుతారు.  ముఖ్యంగా నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం,  అజీర్ణం,  ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి.  గర్భంతో ఉన్నవారు నీటిలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి తాగుతుంటారు. దీని వల్ల కడుపులో బిడ్డకు కూడా మంచిదని చెబుతారు. అయితే నెయ్యి స్వచ్చమైనది అయితేనే దాని వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.  కల్తీ నెయ్యి వాడితే మాత్రం దాని వల్ల కలిగే ప్రయోజనాలకంటే జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. తాజాగా కిలోల కొద్దీ నకిలీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరం బయటపడటంతో నెయ్యి విషయంలో చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో  కల్తీ నెయ్యని 2 నిమిషాలలో ఎలా గుర్తించవచ్చో ఆహార నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ కమీషన్ హర్యానాలోని జింద్ నగరంలో దాడి చేసి నకిలీ దేశీ నెయ్యిని తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కనుగొంది. ఈ ఆపరేషన్‌లో 1925 కిలోల నకిలీ నెయ్యి, 1405 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగిని ఢిల్లీ పోలీసులు సీల్ చేశారు. గోదాములో రంగులు, రసాయనాలు కూడా కనిపించాయని చెబుతున్నారు. సోడియం లారెత్ సల్ఫేట్ అనే రసాయనాన్ని జోడించి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారట. భారతదేశంలో చాలా చోట్ల నకిలీ నెయ్యి,  నూనె, పాలు మొదలైనవి తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు.   నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? నెయ్యి లో  కూరగాయల నూనె  కలుపుతారు. చౌకైన కూరగాయల నూనె లేదా కూరగాయల ఫ్యాట్ ను నిజమైన నెయ్యితో కలపడం ద్వారా దాని పరిమాణం పెరుగుతుంది. దీని వినియోగం వల్ల  కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  గుండె జబ్బులు,  ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి కల్తీ నెయ్యి  దీర్ఘకాలిక వినియోగం వల్ల ధమనులను అడ్డుకోవడానికి దారితీస్తుంది. స్టార్చ్.. నెయ్యి పరిమాణాన్ని పెంచడానికి పిండిని కలుపుతారు. ఇది కడుపు నొప్పి, అజీర్ణం,  గ్యాస్, బరువు పెరుగుట,  జీవక్రియ రుగ్మతలకు కారణమవుతుంది.   నకిలీ నెయ్యిలో ఉండే రసాయనాలు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. నకిలీ నెయ్యిలో ట్రాన్స్ ఫ్యాట్,  హానికరమైన నూనెలు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  అలాంటి నెయ్యి తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్  లేదా మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. నెయ్యి కల్తీని ఇలా గుర్తించవచ్చు.. ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఒక మి.లీ కరిగించిన నెయ్యిని తీసుకోవాలి.  అందులో ఒక మిల్లీ.. Conc.HCLని జోడించండి ఆ తర్వాత అందులో అర చెంచా చక్కెర వేయాలి. రెండు నిమిషాలు బాగా షేక్ చేయాలి. నెయ్యిలో కల్తీ లేకపోతే దాని రంగు మారదు. నెయ్యి నకిలీ అయితే దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారవచ్చు.                                               *రూపశ్రీ.                        
  చలికాలంలో  తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్‌లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు.  మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది.  రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది.   అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది.  ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ  చాలా తియ్యగా మారుతుంది.  ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.  ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి,  ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.  
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ.