అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయింది: రేవంత్ రెడ్డి
posted on Dec 21, 2024 2:57PM
సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావొద్దని పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఒకటే ఉండటంతో తొక్కిసలా జరిగి రేవతి చనిపోయిందన్నారు. కొడుకు ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చితే అల్లు అర్జున్ మాత్రం సినిమా చూడటానికి హాల్ లో కూర్చున్నాడని అన్నారు. రేవతి చావు వార్తను ఎసిపి వెళ్లి అల్లు అర్జున్ కు తెలియజేసి వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు డిసిపి అల్లు అర్జున్ కు అరెస్ట్ చేస్తామని చెబితే కూడా ఓపెన్ టాప్ జీప్ లో అల్లు అర్జున్ వెళ్లిపోయాడని రేవంత్ మండి పడ్డారు. హీరో కన్ను పోయిందా? కాలు పోయిందా? సినీ ప్రముఖులు వెళ్లి ఎందుకు పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.