LATEST NEWS
సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తదననంతర పర్యవశానాలను గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలుగు సినీ పరిశ్రమను తన గుప్పిటిలోకి తెచ్చుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్, బీజేపీలను కంగు తినిపించారు. చాలా దృఢంగా నిలబడి.. తెలుగు సీనీ పరిశ్రమ మెడలు వంచడమే కాకుండా.. సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటనను ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ ను బదనాం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు వేరు వేరుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు తడబడేలా చేయగలిగారు. ఈ విషయం గురువారం (డిసెంబర్ 26) సినీ ప్రముఖులతో రేవంత్ జరిపిన భేటీ అనంతరం నిర్ద్వంద్వంగా స్పష్టమైపోయింది.    పుష్ప 2సినిమా ప్రీమియర్ షో సందర్భంగా  సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ గత 20 రోజులుగా కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాట  ఘటనకు పుష్ప2 సినిమా హీరో అల్లు అర్జున్ కారకుడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తరువాత హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో ఒక్క రాత్రి చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ విడుదలయ్యారు. అది వేరు సంగతి. కానీ ఎప్పుడైతే పోలీసులు అల్లుఅర్జున్ పై కేసునమోదు చేశారో అప్పటినుండి బీఆర్ఎస్, బీజేపీలు పోటీలు పడి మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్  చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలూ  అల్లు అర్జున్ కు ఏకపక్ష మద్దతు ప్రకటిస్తూ రేవంత్ సర్కార్ తెలుగు సినీమా పరిశ్రమను తెలంగాణ నుంచి తరిమేయాలనుకుంటోందా అన్న లెవల్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత అల్లుఅర్జున్ పై పోలీసులు కేసు పెడతారా ? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, అటు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ లాంటి సెలిబ్రిటీకే  తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదంటే ఇక సామాన్యులకు రేవంత్ రెడ్డి ఎవరో ఎలా తెలుస్తుందంటూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేసి సంబరపడిపోయారు.   అల్లు అర్జున్ పై కేసు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి చేయగ లిగినంతా చేశాయి బీఆర్ఎస్, బీజేపీలు. ఈ విషయంలో అల్లు అర్జున్ కు పోటీలు పడి మద్దతు తెలపడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఆ రెండు పార్టీలూ నేల విడిచి సాము చేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. దీంతో పరిస్థితి ప్రభుత్వం ఒక వైపు అల్లు అర్జున్, టాలీవుడ్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక వైపు అన్నట్లుగా మారిపోయింది.   అయితే గురువారం (డిసెంబర్ 27) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తరువాత బీఆర్ఎస్, బీజేపీలు అల్లు వెనుక ర్యాలీ అవ్వడం ఎంత హేతు రహితం అన్న విషయం ప్రస్ఫుటంగా తెలిపోయింది. సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ అత్యుత్సాహంతో నిర్వహించిన ర్యాలీయే కారణమని సినీ ప్రముఖులంతా ఆ భేటీలో అంగీకరించేసినట్లుగానే కనిపించింది. అంతే కాదు.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్ వారికి కరాఖండీగా చెప్పడమే కాకుండా, రాష్ట్రంలో టాలీవుడ్ కు అన్ని విధాలా సహకారం అందిస్తానని చెబుతూనే పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించి తీరాలని స్పష్టం చేశారు.  ఇక ఆ భేటీ తరువాత మరో విషయం ప్రస్ఫుటమైంది. సినీ ప్రముఖులంతా దాదాపుగా సీఎంకు సాగిలపడ్డారు.   తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండవన్న తన మాటకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ కుండబద్దలు కొట్టినా... ఆయనను పొగిడేందుకే సినీ ప్రము ఖులు పాటుపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేందుకు సహకరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారనీ, అందుకు తమకు భారీ టాస్క్ ఇచ్చారనీ, దాని ముందు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశాలు చాలా చిన్నవంటూ నిర్మాత దిల్ రాజు సినీ ప్రముఖుల తరఫున ప్రకటించేశారు. ఈ మెత్తం వ్యవహారంలో సినీ ప్రముఖులంతా సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ దే తప్పు అని అంగీకరించేసినట్లుగా కనిపిస్తోంది. ఈ సమావేశం వల్ల సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేకపోయినా రేవంత్ ను పొగడడానికీ, ఆయనకు శాలువాలు కప్పడానికీ సినీ ప్రముఖులు పోటీలు పడటం చూస్తుంటే  సంధ్యా థియోటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదాన్ని అంగీకరించి.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పరామర్శలకు క్యూకట్టినందుకు రేవంత్ కు సారీ చెప్పినట్లు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక సారి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుందని అర్ధమైన తరువాత పరిశ్రమ పెద్దలలో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. తొలుత కమేడియన్ రాహుల్ రామకృష్ణతో మొదలై... నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వరకూ ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి సంధ్యా థియోటర్ తొక్కిసలాట ఘటనకు బాధ్యుడు అల్లు అర్జున్ అని చెప్పడానికి వెనుకాడటం లేదు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఒకింత స్పష్టంగానే అల్లు అర్జున్ నాలుగు కార్లతో ర్యాలీగా సంధ్యాథియోటర్ కు వెళ్లి రోడ్ షో చేయడం తప్పేనని కుండ బద్దలు కొట్టేశారు. గతంలో బాలకృష్ణ వంటి హీరోలు తమ సినీమాలను తొలి రోజు ప్రేక్షకులతో కలిసి చూశారనీ, అయితే వారెవరూ ఇలా రోడ్ షో చేయలేదని గుర్తు చేశారు కూడా.    హీరోలు కూడా సాధారణ మనుషులేనని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అల్లు అర్జున్ కు చురకలంటించారు.  దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాజ కీయ లబ్ధి కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు వికటించాయి. దీంతో ఆ పార్టీ నేతలు కింకర్తవ్యం అన్న డైలమాలో పడ్డారు. 
దిగ్గజ పారిశ్రామిక  సంస్థ  సుజుకి మోటార్ కార్పోరేషన్ మాజీ సీఈవో  ఒసాము సుజుకి క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆయన వయస్సు 94 . లింఫోమా అనే క్యాన్సర్ తో చనిపోయినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జపాన్ లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన సుజుకి 1958లో ఆటో మేకర్ లో చేరారు. సుజుకి 91వ ఏట  అంటే 2021లో  తన రిటైర్మెంట్ ప్రకటించారు. తన వారసుడికి సుజుకి అధ్యక్ష పదవిని అప్పగించిన సుజుకి ఓసాము తన భార్య ఇంటి పేరును తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చిన్న కార్లు, మోటార్ సైకిళ్లను తయారుచేసి బ్రాండ్ గా మార్చేశారు. 
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో న‌టుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది. త‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇవ్వాల‌ని బ‌న్నీ నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ వేశారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు పోలీసులు స‌మ‌యం కోర‌డంతో  కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.   ఇక తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో బ‌న్నీని ఇటీవ‌ల పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.   హైకోర్టు నాలుగు వారాల మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డంతో విడుద‌ల‌య్యారు. మ‌రోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన‌ 14 రోజుల రిమాండ్ నేటితో ముగియడంతో బ‌న్నీ ఈరోజు వ‌ర్చువ‌ల్‌గా న్యాయ‌స్థానం ముందు విచార‌ణ‌కు  హాజ‌ర‌య్యారు.  కాగా, సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణ‌నూ నాంప‌ల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 10న చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అదే రోజు బ‌న్నీ రిమాండ్‌పైనా కూడా విచార‌ణ జరపనుంది.
మాజీ మంత్రి ,  వైసీపీ కీలక నేత పేర్ని నాని  ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం సంఘటనలో ఆ కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలసందే. ఇందుకు సంబంధించి వాస్తవాల వెల్లడి విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి, కుమారుడు పూర్తిగా విఫలమయ్యారు.  పోలీసుల నోటీసులు అందగానే గంపగుత్తగా కుటుంబం మొత్తంఅజ్ణాతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ కేసు విషయంలో పేర్ని నాని కుటుంబానిదే తప్పు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.   జగన్ హయాంలోనూ, ఆ తరువాతా కూడా ఏ విషయంపైనైనా స్పందించడంలో, మీడియా ముందుకు వచ్చి వాగ్ధాటి ప్రదర్శించడంలో చురుకుగా ఉండే పేర్ని నాని.. తన కుటుంబంపై నమోదైన కేసు విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయిచడమే కాకుండా పోలీసుల నోటీసులకు సైతం స్పందించకుండా అజ్ణాతాన్ని ఆశ్రయించడమే ఆయన వైపే తప్పు ఉందన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.   ఇదిలా ఉంటే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన రేషన్‌ బియ్యం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాయమైన రేషన బియ్యం బస్తాల సంఖ్య తొలుత వెలుగులోకి వచ్చిన దాని కంటే చాలా చాలా ఎక్కువ అన్న చర్చ జరుగుతోంది.  పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్‌ నుంచి  3,708 రేషన్‌ బియ్యం బస్తాలు మాయమయ్యాయని తొలుత అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆ సంఖ్య తప్పు అంటూ సవరించి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   4,840 అని చెప్పారు.  అయితే  తాజాగా ఇప్పుడు జయసుధ గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   ఏకంగా 7,577 అని లెక్క తేల్చారు. గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య ఎంతో తేల్చడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ నుంచి భారీగా బియ్యం అక్రమంగా తరలించారని చెప్పడం కోసమే అంత సమయం తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం ఇంత స్థాయిలో బియ్యం తరలించడం మామూలు విషయం కాదనీ,  పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చడానికి ఆ మాత్రం సమయం పడుతుందనీ చెబుతున్నారు. బియ్యం బస్తాల మాయం విషయంలో అవాస్తవముంటే..  మాయమైన బియ్యానికి  పేర్ని నాని తాలూకు న్యాయవాది డీడీలు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తారు.  ఇదంతా అలా ఉంచితే.. మరో వైపు పోలీసులు ఇచ్చిన నోటీసులపైన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పేర్ని నాని ఉపసంహరించుకున్నారు. కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసు విచారణలో ఉండగా కేసుకు సంబంధించిన పలు అంశాలు తెరపైకి వస్తుండటం ఆసక్తి కరంగా మారింది.  గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. అంతే కాకుండా పేర్ని నాని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి మాయమైన బియ్యం ఇప్పటికే   కాకినాడ పోర్టు నుంచి దేశం దాటేసిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు చేస్తున్నారు.   వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన పేర్నినాని తన భార్య పేర్ని జయసుధ పేరిట రేషన్ డీలర్ షిప్ తీసుకున్నారు.   ప్రభుత్వం నుంచి తమకు పంపిణీ కోసం అందిన బియ్యాన్ని తమ కుటుంబానికే చెందిన గోడౌన్ లో భద్రపరిచేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో  అధికారం మారిన తరువాత  అదే గోడౌన్ లో ఉండాల్సిన  బియ్యం నిల్వలు మాయం అయినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు అయ్యింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినా వారు రాలేదు. అయినా పోలీసులు ఇప్పటి వరకూ వారినెవరినీ అరెస్టు చేయలేదు. ఈ లోగా పేర్ని జయసుధ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువరించిన తరువాత పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.  ఇంత జరిగినా పేర్ని నాని కనీసం స్పందించక పోవడంతో బియ్యం బస్తాల మాయం విషయంలో ఆయన కుటుంబం ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది.  అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం, జనసేనలపై నోరెట్టుకు పడిపోయే పేర్ని నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తన కుటుంబంపై కేసు నమోదైనా కిమ్మనకపోవడంతో ఆయన కుటుంబం తప్పిదం ఉందన్న సంగతిని పరోక్షంగా అంగీకరించేసినట్లేనని అంటున్నారు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి మరీ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినందున జయసుధకు కోర్టులో ఊరట దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసిన ఆమె విచారణకు హాజరై ఉంటే కోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసి ఉండేదనీ, ఇప్పుడామె అజ్ణాతంలో ఉన్నందున కోర్టులో ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనీ వివరిస్తున్నారు. కోర్టు అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా కూడా విచారణకు హాజరై తీరాల్సిందేనని జయసుధకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. 
టాలివుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మరోసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాట గురించి వాదనలతో  పాటూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నట్లు సమాచారం.  రేవతి కుటుంబానికి రెండుకోట్ల రూపాయల ఆర్థికసాయం పుష్ప 2 టీమ్ ఇప్పటికే అందించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చింది. 
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వాయిస్ ఓవర్ తో తెలుగు నాట డిసెంబర్ 20 న రిలీజైన పాన్ వరల్డ్  మూవీ 'ముఫాసా'(mufasa).నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది లయన్ కింగ్' మూవీ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు  మంచి ప్రేక్షకాదరణతో ముందుకు దూసుపోతుంది. రీసెంట్ గా చిత్ర బృందం 'ముఫాసా'ఇండియాలో సాధించిన మొదటి వారం కలెక్షన్స్ ని ప్రకటించింది.దేశ వ్యాప్తంగా మొత్తం 74 కోట్లు వసూలు చెయ్యగా,ఇంగ్లీష్ లో 26 .75 కోట్లు, హిందీ,తెలుగు భాషల్లో 11 .2 కోట్లు,11 .3 కోట్లుతో మొత్తం 74 కోట్లు రాబట్టింది.మాములు హీరోల స్థాయిలో 'ముఫాసా' మొదటి వారానికే రికార్డు స్థాయి కలెక్షన్ ని రాబట్టడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరుస్తుంది. తాజాగా 'ముఫాసా' గురించి మహేష్ బాబు మాట్లాడుతు మనకు తెలిసిన ఇష్టపడే పాత్రకు కొత్త అంకం.'ముఫాసా' కి వాయిస్ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని.కాబట్టి ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు.ముఫాసా ని  ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్ని 200 మిలియన్ల డాలర్స్ తో నిర్మించగా బేరి జెన్కీన్స్ దర్శకత్వం వహించాడు.  
ఏఆర్ రెహమాన్(ar rehman)సంగీతాన్ని ఇష్టపడని భారతీయ సినీ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన స్వర రచనలో వచ్చిన ప్రతి పాట కూడా సరికొత్త నవ్యత తో కూడుకొని ఉంటుంది.    సంగీత దర్శకులకి కూడా వీరాభిమానులు ఉంటారని కూడా నిరూపించిన రెహమాన్ ఆస్కార్ ని సైతం అందుకొని భారతీయ సినీ రంగానికి ఎనలేని కీర్తిని గడించేలా చేసాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రెహ్ మాన్  తన కెరీర్ లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతు 1985 ,86 మధ్య జరిగిన ఒక సంఘటన సంగీతం విషయంలో నన్నెంతో మార్చేసింది.గతంలో మా బ్యాండ్ లో చాలా మంది మెంబర్స్ ఉండేవాళ్ళు.అందులో గిటారిస్ట్ గా పని చేసే ఒక వ్యక్తి బాగా తాగొచ్చి నువ్వు ఏం ప్లే చేస్తున్నావో అర్ధమవుతుందా,సినిమా మ్యూజిక్ ప్లే చేస్తున్నావు అని చులకనగా మాట్లాడాడు. అప్పుడు నాకు  కొంచం బాధగా అనిపించినా కూడా,అతను చెప్పిన మాట అప్పుడు నాకు అర్ధం కాలేదు. కాని ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి వారం రోజుల సమయం పట్టింది.అతను చెప్పిన మాటల ప్రకారం నా సంగీతంలో నేను వర్క్ చేసిన కంపోజర్ల ప్రభావం నాపై ఉందని అర్ధమయ్యింది.దాంతో నాకంటూ సొంతంగా ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకోవాలనున్నాను. అలా చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చాడు. రెహ్ మాన్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(buchibabu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి వర్క్ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు సాంగ్స్ రికార్డింగ్ కూడా  అయ్యాయని రెహ్మాన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు.ఇటీవల తన భార్య సైరా భాను నుంచి రెహ్ మాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  
రామ్ కిరణ్(ram kiran)మేఘ ఆకాష్(megha akash)జంటగా నటిస్తున్న చిత్రం స:కుటుంబానాం(sahakutumbanam).హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై,హెచ్.మహాదేవ గౌడ,హెచ్.నగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ శర్మ(udhay sarma)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నుంచి రీసెంట్ గా అది దా సారు'(adi da saaru)అనే పల్లవి తో సాగిన లిరికల్ వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది.ప్రముఖ అగ్ర నిర్మాత, ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఆ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.  సామాన్య అంశాలను జోడిస్తూ స్టార్ రైటర్ అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం జరిగింది.పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి నెక్స్ట్ లెవెల్ లో లిరిక్స్ ఉన్నాయనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పలువురి నుంచి వినిపిస్తున్నాయి.భాను మాస్టర్ కొరియోగ్రఫీ ని అందించగా ట్యూన్ కి బీట్ కి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసిన స్టెప్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.భాను మాస్టర్ కి ఈ సాంగ్ మంచి పేరు కూడా తెస్తుందనే మాటలు విన్పడుతున్నాయి.పలు సినిమాల్లో ఇప్పటికే హీరోయిన్ గా చేసిన మేఘా ఆకాష్ లుక్ చాలా సరికొత్తగా కనిపిస్తోంది. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ లతో పాటు  రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కుటుంబం నేపథ్యంలో వస్తున్నఈ మూవీ విజయంపై చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.మధు దాసరి ఫోటో గ్రఫీ ని అందిస్థుడగా ఎడిటర్: శశాంక్ మాలి,కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పోలాకి,ఆర్ట్ డైరెక్టర్: పి.ఎస్. వర్మ,ఫైట్ మాస్టర్స్: అంజి, కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కుమార్ పద్మనాభ, కొరియోగ్రాఫర్ : భాను మాస్టర్,లైన్ ప్రొడ్యూసర్ : అంకిత్ కనయ్,పిఆర్ఓ: మధు VR  
సంగీతదర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్‌. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.   కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాత. రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల  సహ నిర్మాతలు. రామచంద్రమ్‌ పుణ్యమంతుల,టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్‌ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్, మెహబూబ్‌ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న ఈ సినిమాకి సంగీతం– రఘుకుంచే, డిఓపి– సాయికుమార్‌ దారా ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల కోడైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల పిఆర్‌వో–మూర్తి మల్లాల   కథ,కథనం, మాటలు, దర్శకత్వం– చైతన్య మోటూరి
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.జరిగిన ఈ ఘోరానికి హీరో అల్లు అర్జున్(allu arjun)తో పాటు పుష్ప టీం రెండు కోట్ల రూపాయలని ఇచ్చింది.ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు(dil raju)అయితే  రేవతి భర్తకి సినిమా ఇండస్ట్రీలోనే పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇక రేవతి కేసుకి సంబంధించి డిసెంబర్‌ 13న నాంపల్లి కోర్టు అల్లుఅర్జున్ కి రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత  హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.దీంతో రిమాండ్‌ పూర్తి తర్వాత ప్రాసెస్‌లో భాగంగా అల్లుఅర్జున్ ఈ రోజు కోర్టులో హాజరు కానున్నాడు.ఈ సందర్భంగా పోలీసులు కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని హై కోర్టు పర్మిషన్ తో పోలీసులు విచారణ చేసారు. ఆ సమయంలో తొక్కిసలాటకి సంబంధించిన వీడియోస్ ని అల్లు అర్జున్ కి చూపించగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురి కావడం జరిగింది.  
భారతదేశపు పదమూడవ ప్రధానమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలని ప్రవేశపెట్టి, ప్రజల యొక్క స్థితి గతులని మార్చేసిన రాజకీయ ఉద్దండుడు మన్మోహన్ సింగ్(manmohan singh) రెండు పర్యాయాల పదవి కాలంలో మాటలతో కాలక్షేపం చెయ్యకుండా చేతలతో తన సత్తా చాటి అంతర్జాతీయంగా భారతదేశపు యొక్క కీర్తి పతాకాన్ని మరింతగా విశ్వవ్యాప్తం చేసాడు. అంతటి మహోన్నత వ్యక్తి  అయిన మన్మోహన్ సింగ్ నిన్న ఢిల్లీ లోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సోషల్ మీడియా వేదికగా మన్మోహన్ సింగ్ మరణంపై స్పందిస్తూ దేశంలో ఉన్న గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు.వరుసగా రెండు సార్లు ప్రధానిగా పని చేసిచరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు.అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడుగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మన దేశానికి కూడా అయన మృతి తీరని లోటు.ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసాడు. ఇక మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26 న ప్రస్తుత పాకిస్థాన్ ప్రొవిజన్స్ లోని 'గా' అనే గ్రామంలో జన్మించాడు. ఆయనకి ముగ్గురు సంతానం కాగా  భార్య పేరు గురుశరన్ కౌర్ కొహ్లీ.  
  మూవీ : రహస్యం ఇదమ్ జగత్ నటీనటులు: రాకేశ్, స్రవంతి, మానస వీణ, భార్గవ్, కార్తీక్ తదితరులు ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్ మ్యూజిక్: గ్యాని సినిమాటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్ నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్ ఓటీటీ: ఈటీవి విన్ కథ: అభి (రాకేశ్) విదేశాలలో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి అకీరా (స్రవంతి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన తండ్రి చనిపోవడంతో, అకీరా ఇండియా వెళ్లడానికి సిద్ధమవుతుంది. అకీరాను విడిచి తను ఉండలేనని భావించిన అభి, ఆమెతో పాటు తను కూడా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అంతకుముందు ఇద్దరు కలిసి సరదాగా కార్లో ఒక ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ లో అరుణి, కళ్యాణ్, విశ్వతో  పరిచయమవుతుంది. తప్పనిసరి పరిస్థితులలో వాళ్లంతా ఒకరాత్రి ఒక ఇంట్లో ఉండవలసి వస్తుంది. 'అరుణి' కి టైమ్ ట్రావెల్ .. వామ్ హోల్ .. మల్టీ యూనివర్స్ అనే అంశాలపై అవగాహన ఉంటుంది. అందుకు సంబంధించిన విషయాలపై ఆమె పరిశోధన కూడా చేస్తుంటుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. అభి, విశ్వ మధ్య గొడవకి కారణమేంటి? అరుణి చేసిన ప్రయోగం ఏంటి? అకీరాకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ ని లింక్ చేస్తూ ఓ చిన్న ప్రేమకథని చూపించాలనుకున్నాడు దర్శకుడు. అయితే ఇది సామాన్య ప్రేక్షకుడి ఊహాశక్తికి మించి ఉంటుంది. అంటే మొదటగా విశ్వ ఎందుకు హీరో మీద కోపంగా ఉంటాడో అర్థం కాదు.  ఆ తర్వాత అరుణి మాటలని అలా ఎలా నమ్ముతుంటారో అర్థం కాదు. సినిమాని స్కిప్ చేసి చూస్తే అసలేం అర్థం కాదు.. స్కిప్ చేయకుండా చూసే అంత ఓపికా ఎవరికీ ఉండదు.  సినిమా మొదలవ్వగానే ఇదేదో డాక్యుమెంటరీలా‌ ఉందే అనిపిస్తుంది. ఓ నలభై నిమిషాల తర్వాత అమెరికాలో ఉండే కొంతమంది తెలుగువాళ్ళు కలిసి షార్ట్ ఫిల్మ్ తీసి దానిని యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేశారా అనిపిస్తుంది. అంత స్లో‌గా ఉంది. మధ్యలో మైథలాజికల్ ని ఎందుకు తీసారో? సైన్స్ ఫిక్షన్ ను ఎందుకు వాడారో మేకర్స్ కే తెలియాలి. ఒకానొక‌ సందర్భంలో ఏదీ నిజం.. ఏది ప్రస్తుతం అర్థం కాదు.. గజిబిజి సుడోకు పజిల్ లా స్క్రీన్ ప్లే సాగుతుంది. కథలోని పాత్రల పర్ఫామెన్స్ పెద్దగా ప్రభావం చూపకపోవడం.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం పెద్ద మైనస్.‌ మైథలాజికల్ అంశం బాగున్నప్పటికి దానికి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో‌ మేకర్స్ ఇంకా జాగ్రత్త వహించాల్సింది. కొన్ని హాలివుడ్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి ఇన్ స్పైర్ తీసి‌నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ మధ్య కారణాలు లేకుండా గొడవలు పడటం.. కొన్ని సీన్లు ఎందుకున్నాయో అర్థం కాదు. అడల్డ్ సీన్లు లేవు. గ్యానీ మ్యూజిక్ ఓకే. టేలర్ బ్లూమెల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: రాకేశ్ పాత్రలో అభి, స్రవంతి పాత్రలో అకీరా ఆకట్టుకున్నారు. అరుణిగా మానస వీణ తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా :  ఓపికకి పరీక్ష పెట్టే రహస్యం ఇదమ్ జగత్ రేటింగ్: 1.75 / 5 ✍️. దాసరి   మల్లేశ్
Cast: Kichcha Sudeep, Varalaxmi Sarathkumar, Samyukta Hornad, Sukrutha Wagle, Anirudh Bhat, Sunil, Ilavarasu, Redin Kingsley Crew:  Cinematography by Shekhar Chandra Edited by S. R. Ganesh Baabu Music by B. Ajaneesh Loknath Produced by Kalaippuli S. Thanu, Sudeepa Directed by Vijay Karthikeyaa Kichcha Sudeep has a good following in Telugu states as he made a great impression with Eega movie directed by SS Rajamouli. He has been acting in different languages even though he hails majorly from Kannada Cinema. The highly popular actor has come up with an high voltage action entertainer Max for Christmas holidays. The movie released in original language on 25th December and in Telugu on 27th December. Let's discuss about the film in detail.  Plot:  Inspector Arjun Mahakshay(Sudeep) known as Max, gets suspended for two months and transferred to another police station. On the day, he is taking charge, he arrests two local MLA sons and they die in the lock-up. As the MLAs are influential and have capability to topple CM, local police are completely shaken. In fear, they try to save themselves. Gangster Ganesh aka Gani(Sunil) and Inspector Roopa(Varalaxmi Sarathkumar) gets involved. How Max will solve this issue in 12 hours forms the rest of the story.  Analysis:  Kichcha Sudeep is good and in form as an action hero. His screen presence and look are believable as a mass action hero. His style of dialogue delivery and daredevil attitude does engage us. But the movie needed to carve out his character even better as it looks like bang an action episode after a point. Varalaxmi Sarathkumar, Sunil did their best but Sunil's voice has been dubbed by someone else and we miss the connect. All others also did well.  The movie seems to be inspired heavily from Lokesh Kanagaraj's films in setting up an action sequence and even executing it. Mainly, Kaithi influence is visible even in the action set pieces and set design. But the makers seems to have deliberately deviated from some of the emotional beats that Karthi's film touched to make it even more bloody actioner. So, the characters don't really stay with us after the movie finishes.  Technical values are outstanding. Production design, cinematography and editing streamline the movie as a one huge action set piece divided into episodes. While few episodes are engaging, few feel like the makers have gone overboard. Gallons and gallons of bloodshed is seen on the screen but innovativeness in action set pieces vanishes as the film goes on. At the attempt level, we can say, it is nice from Kannada Cinema.  Ajaneesh Loknath has gone loud for this one and it seems like hero worship vehicle after a point. Movie is aimed at action lovers and it will find takers but a strong core and emotional depth would have made this movie much more better. With it ending up being a film that happens in 12-hours and in one night, the inventiveness could have made it even better. Still, watchable for Sudeep.  In Conclusion:  Max goes a little bit overboard in action tiring us after a point.  Rating: 2.5/5 
Pushpa 2 The Rule film starring Allu Arjun, Rashmika Mandanna has become the key factor in Telangana State and TFI discussions, recently. The stampede occured during movie premiere night on 4th December at Sandhya Theatre, has stirred up a huge storm that entire TFI met CM Revanth Reddy.  While on one hand, such issues are going on, movie is continuing to create huge records. Movie has collected Rs.1705 crores gross worldwide in just 21 days. Movie has opened Rs.700 crores Nett gross collections club in Hindi markets and became first film to collect such huge amount.    It might even cross Rs.750 crores Nett gross collections, if it maintains pace till New Years' Eve. Movie team is unable to enjoy this success due to the accident but Pushpa 2 will remain a film to have created such a storm at the box office post Baahubali 2.  Now, Hindi films and stars would be looking to spreading their wings into South India for such wide reach and big grosses as Pushpa 2, showcased how universally loved character can bring audiences to theatres in large numbers. Movie is third highest grosser in Telugu states while it created Industry record in Hindi. 
  ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)రిలీజైన రోజు నుంచి అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తొలిరోజు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన విషయంలోను,కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లు సాధించిన విషయంలోను తొలి భారతీయ సినిమాగా నిలిచింది.హిందీలో ఇప్పటికే 700 కోట్ల నెట్ కలెక్షన్ ని సాధించిందంటే పుష్పరాజ్ హవాని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా పుష్ప 2 మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే 1705 కోట్ల గ్రాస్ ని అందుకున్న తొలి బారతీయ మూవీగా నిలిచింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన కేజీఎఫ్ పార్ట్ 2 (1250 కోట్లు), ఆర్ఆర్ఆర్ (1300 కోట్లు) రికార్డుని  దాటేసి  బాహుబలి 2 (1800 కోట్లు) ని బీట్ చేసే దిశగా వెళ్తుంది.బాహుబలి 2 కి టోటల్ రాంగ్ రన్ లో 1800 కోట్లు వచ్చిన దృష్ట్యా పుష్ప 2 ఆ రికార్డుని లాంగ్ రన్ లో  ఈజీగా దాటే అవకాశం ఉంది. ఇక  పుష్ప 2 ఓటిటి వేదికగా జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వార్తలపై పుష్ప 2 మేకర్స్ స్పందిస్తు పుష్ప 2 థియేటర్ రిలీజైన రోజు నుంచి యాభై ఆరు రోజుల తర్వాతే ఓటిటి లోకి స్ట్రీమింగ్ కి వస్తుందని చెప్పారు    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.
  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన భారతదేశంలో అయితే వీటికి అస్సలు లోటు ఉండదు.  ఒక వైపు హిందూ దేవుళ్ల పూజలు,  ముస్లిం సోదరుల నమాజ్ లు,  క్రిస్టియన్ సోదరుల ప్రార్థనలతో దేశం బోలెడు సంస్కృతులు,  సంప్రదాయాలతో అలరారుతుంది. అయితే హిందువులకు ఉన్నన్ని పండుగలు ముస్లిం లకు,  క్రిస్టియన్స్ కు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.. క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించినట్టే క్రిస్మస్ కూడా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు జననంమే క్రిస్మస్ పండుగకు ఆధారం. క్రీస్తు జన్మించిన తేదీని ఖచ్చితంగా గుర్తించలేకపోయినప్పటికీ డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడం 4వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యంలో పాగన్ పండుగ అయిన "సోలిస్ ఇన్విక్టి" (అజేయ సూర్యుడు జన్మదినం)ని క్రైస్తవ పండుగగా మార్చినట్టు చరిత్రకారులు భావిస్తారు.  యేసు క్రీస్తు పుట్టుకను శాంతి, ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా  మానవత్వం, సద్గుణాలు, సమానత్వం బోధించారు. క్రిస్మస్ సంప్రదాయాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ప్రత్యేకమైన  ఆచారాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతులతో ముడిపడినప్పటికీ, కొన్ని సాధారణ సంప్రదాయాలు అన్ని చోట్లా కనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఫిర్ చెట్లు క్రిస్మస్ ట్రీగా పాపులర్ అయ్యాయి.  మొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్మనీలో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. చెట్లను నక్షత్రాలు, బొమ్మలు, మిఠాయిలతో అలంకరిస్తారు.  క్రిస్మస్ పాటలు లేదా క్యారల్స్ పాడడం సంప్రదాయమైంది. “సైలెంట్ నైట్,” “ఓ హోలీ నైట్,” “జింగిల్ బెల్స్” వంటి పాటలు ప్రసిద్ధి చెందాయి. యేసు జన్మదినం సందర్భంగా మేఘదూతలు ఆయనకు ఇచ్చిన కానులని ఆధారంగా చేసుకుని ఈ రోజున గిఫ్ట్‌లు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.   పిల్లలు  బాగా ఇష్టపడే శాంటాక్లాజ్  గిఫ్ట్‌లను అందజేస్తూ, పిల్లల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాడు. క్రిస్మస్ వేడుకలో చేసే   ప్లమ్ కేక్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి కుటుంబం తమకు తగిన వంటకాలు తయారు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటుంది. కాగితం నక్షత్రాలు, క్రిస్మస్ లైట్స్, క్రిబ్ సెట్స్ తో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇండియాలోని   క్రైస్తవులు క్రిస్మస్ ట్రీకి బదులుగా మామిడి లేదా వెదురు చెట్లను ఉపయోగిస్తారు. రంగురంగుల లైట్లు, కాగితం నక్షత్రాలతో  ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.                                     *రూపశ్రీ.
సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే.. కాదని చెప్పడం నేర్చుకోవాలి.. ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు. సరిహద్దు గీతలుండాలి.. ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి. మార్పు సాధ్యమే.. ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. "నో" అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి.. ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.                                                      *నిశ్శబ్ద
  స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న  తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ  కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం  అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల  క్యాన్సర్, మధుమేహం,  గుండె జబ్బులకు  కూడా కారణం అవుతుంది. డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్‌కి చేసినా, రన్నింగ్‌కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు,  ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి.  నిజానికి  వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో  ఫలితం ఉండటం లేదు.  బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే.. శరీర కొవ్వు  మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.  ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ  సరైన టిప్ ను ఫాలో అయితే  ఈ పని సులభం అవుతుంది. కావలసిన పదార్థాలు.. 10 గ్రాముల పచ్చి పసుపు, 4 నల్ల మిరియాలు, ఒక చెంచా సొంపు తయారీ విధానం.. పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా  మరిగించి తరువాత వడకట్టాలి. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో  కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.                                     *రూపశ్రీ.  
  జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి.  ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు.  కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పోషకాలు.. జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి.  జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి.  దీని వల్ల నిద్ర బాగా వస్తుంది. జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ  నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు.  శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది.  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు. జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం,  కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది.                                                  *రూపశ్రీ.
  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే చాలా సాధారణ సమస్య.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు అందరూ దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత,  నెలసరి సరిగా రాకపోవడం, అండాశయంలో  తిత్తులు వంటి సమస్యలను కలిగి ఉంటుంది.  దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది మహిళలు పిసిఒఎస్ గురించి, దాని వల్ల వచ్చే సమస్యలను బహిరంగంగా చెప్పలేకపోతుంటారు.  సకాలంలో వ్యాధి నిర్ధారణ,  చికిత్స లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం భారతదేశంలోనే ప్రతి ఐదుగురు కౌమారదశలో ఉన్న మహిళల్లో ఒకరు PCOSతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని అంచనా 6% నుండి 21% మధ్య ఉంటుంది. ఒక అధ్యయనంలో నిపుణులు PCOS వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి దీనికి చికిత్స  తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తి  లేదా మెదడు సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. పిసిఓయస్.. PCOS వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకునే ముందు పిసిఓయస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం..! పిసిఒఎస్ అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధి. హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఈ సమస్యలో  ఋతు చక్రం ప్రభావితమవుతుంది. ఇందులో పీరియడ్స్ అస్సలు జరగవు లేదా చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది కాకుండా ఈ వ్యాధిలో  అండాశయాల వెలుపలి అంచున ద్రవాలతో నిండిన చిన్న తిత్తులు ఉండవచ్చు. వీటిని సిస్ట్ లు అని అంటారు. PCOS యొక్క దీర్ఘకాలిక సమస్య.  ఇది  గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ముప్పులు తప్పవా? 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ సమస్య మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది.  PCOS ఉన్న స్త్రీలకు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం,  మధ్య వయసులో ఆలోచనా సామర్థ్యంలో మార్పులు ఎక్కువగా ఉంటాయట.  ఇది జీవిత నాణ్యత, కెరీర్,  ఆర్థిక భద్రతతో సహా అనేక విధాలుగా  స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిసిఓయస్ ఉన్న మహిళలలో ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం, అది కాస్తా అధిక బరువుకు కారణం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా  ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.                                   *రూపశ్రీ.