15రోజుల్లో పొట్ట తగ్గడానికి అద్బుతమైన మార్గం ఇది.. !

 

స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న  తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ  కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం  అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల  క్యాన్సర్, మధుమేహం,  గుండె జబ్బులకు  కూడా కారణం అవుతుంది.

డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్‌కి చేసినా, రన్నింగ్‌కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు,  ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి.  నిజానికి  వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో  ఫలితం ఉండటం లేదు.  బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే..

శరీర కొవ్వు  మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.  ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ  సరైన టిప్ ను ఫాలో అయితే  ఈ పని సులభం అవుతుంది.

కావలసిన పదార్థాలు..

10 గ్రాముల పచ్చి పసుపు,
4 నల్ల మిరియాలు,
ఒక చెంచా సొంపు

తయారీ విధానం..

పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా  మరిగించి తరువాత వడకట్టాలి.

మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో  కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.


                                    *రూపశ్రీ.