అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై   విచారణ 

టాలివుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మరోసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాట గురించి వాదనలతో  పాటూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నట్లు సమాచారం. 
రేవతి కుటుంబానికి రెండుకోట్ల రూపాయల ఆర్థికసాయం పుష్ప 2 టీమ్ ఇప్పటికే అందించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చింది.