LATEST NEWS
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (డిసెంబర్ 21) శ్రీవారిని మొత్తం 72 వేల 411 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 677 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది. 
వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాలు అన్నీఇన్నీకావు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  వైసీపీ నేత‌ల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్రజ‌లు ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి చెల్లించిన సొమ్మును జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అప్ప‌నంగా తన అనుచ‌ర గ‌ణానికి, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు. ఏపీ విజిలెన్స్ విభాగం ఫైబ‌ర్ నెట్‌, డిజిట‌ల్ కార్పొరేష‌న్, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ల‌లో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణలో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ డ‌బ్బు తీసుకొని వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌కు ఇచ్చిన డ‌బ్బు ఎవ‌రో నిర్మాత‌లు ఇచ్చింది కాదు,  ప్ర‌భుత్వం సొమ్మేన‌ని తేటతెల్లమైంది. అంతే కాదు.. డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా, ఫైబ‌ర్ నెట్ ద్వారా, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ ద్వారా వైసీపీ కుటుంబ స‌భ్యుల‌కు, వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు భారీ మొత్తంలో జీతాలు చెల్లించేశారు. వీరంతా సోష‌ల్ మీడియా ద్వారా అప్పటి ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని, జ‌గ‌న్‌తో రాజ‌కీయంగా విభేదించిన ఆయ‌న‌ చెల్లిని, త‌ల్లిని విమ‌ర్శించ‌డంతోపాటు, అస‌భ్య‌  ప‌ద‌జాలంతో దూసించేవారు.   వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాంగోపాల్ వ‌ర్మ వ్యూహం, శ‌పథం అనే రెండు సినిమాల‌ను తీశారు. రాంగోపాల్ వ‌ర్మ ఈ సినిమాలు తీసే స‌మ‌యంలోనే.. ఈ సినిమాలు తీసేది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించ‌డానికి.. వైఎస్ఆర్‌, వైఎస్‌ జ‌గ‌న్ రెడ్డిని పొగ‌డ‌టానికి అని బొమ్మ‌ల ద్వారా త‌న‌ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ మేలు చేసేలా తీసిన వ్యూహం సినిమాను ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో విడుద‌ల చేశారు. ఇందుకుగాను పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ ద్వారా రూ.2.10కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంగోపాల్ వ‌ర్మ‌కు సంబంధించిన ఒక సంస్థ‌కు సుమారు 1.10 కోట్లు చెల్లించిన‌ట్లు ఏపీ విజిలెన్స్ విభాగం విచార‌ణ‌లో వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో రూ.90ల‌క్ష‌లు పెండింగ్‌లో ఉండ‌గా..  పెండింగ్ సొమ్ము చెల్లించ‌వ‌ద్ద‌ని ఫైబ‌ర్ నెట్ కొత్త కార్య‌వ‌ర్గానికి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది. అదేవిధంగా మ‌మ్ముట్టి  క‌థానాయ‌కుడిగా తీసిన యాత్ర‌-2 సినిమాకు కూడా రూ.2.10 కోట్లు ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా కేటాయించారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు ఎండీగా వాసుదేవ రెడ్డి ఉన్నారు. వీరి ఆధ్వ‌ర్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు ప్ర‌భుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించార‌ని తెలుస్తోంది. వీరంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి క‌టుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో, మార్పింగ్ పొటోల‌తో పోస్టులు చేసేవారు. వీరిలో కొంద‌రు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.  తాజాగా  సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ది పొందారని పేర్కొంటూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపింది ఏపీ స‌ర్కార్‌. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు.  ఈ విష‌యంపై జీవీ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన 'వ్యూహం' సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్  ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని, దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అని చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాధనానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో ముందుగా డబ్బుల రికవరీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీకి ఈ మొత్తమే వచ్చాయా..ఇతర మార్గాల్లో ఏమైనా ప్రభుత్వం చెల్లించిందా అన్నది బయటకు రావాల్సి ఉంది.
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ వెంట ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన వైసీపీ కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోకి క్యూ క‌డుతున్నారు. మ‌రోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతంపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, త‌న చెల్లి ష‌ర్మిల‌ దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఆరంభించారు‌. ముఖ్యంగా ఆమెను ఏపీపీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ఢిల్లీలో  ఆయ‌నకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ లో ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు వైసీపీ కండువా క‌ప్పి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి వైస్ ష‌ర్మిల కీల‌క భూమిక పోషించారు. అయితే, సీఎంగా జ‌గ‌న్‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఆస్తుల విష‌యంలోనూ వారిమ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. కొద్దికాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ష‌ర్మిల‌..  ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ఆమె విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో వైఎస్ ష‌ర్మిల‌కూడా ఒక‌రు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఎన్నిక‌ల త‌రువాతా కూడా జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ష‌ర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు ష‌ర్మిల విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి‌. దీంతో ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేలా   పావుల‌ను క‌దిపేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు కనిపిస్తోంది.  ఏపీ కాంగ్రెస్ లో ష‌ర్మిల నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానించారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది‌. షర్మిల నాయకత్వంపై కొంత‌కాలంగా సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఆమె తీరు, వ్యవహారశైలిపై పార్టీ అధినాయకత్వానికి   ఫిర్యాదులు రూడా చేశారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నార‌ని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దల‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కేంద్ర పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న‌వారి ద్వారా ష‌ర్మిలను పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ముఖ్య‌ అనుచ‌రులుగా కొన‌సాగిన నేత‌లు కొంద‌రు ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు. వారంద‌రితో ఇటీవ‌ల‌ జ‌గ‌న్ ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు జ‌గ‌న్‌, వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ   చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాధ్, జ‌గ‌న్ ఒక‌రికొక‌రు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్ది సేపు విడిగా ముచ్చటించుకున్నారు. ఈ క్ర‌మంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై  వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌జరిగిందని తెలుస్తోంది. అయితే, అంత‌కుముందే వైసీపీలో చేరే విష‌యంపై జ‌గ‌న్‌, శైలజానాథ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం ఉంది. వ‌చ్చే రెండు నెల‌ల్లో శైల‌జానాధ్ తోపాటు మ‌రో ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  మ‌రోవైపు  ఇప్ప‌టికే ఏపీ కాంగ్రెస్ బ‌లోపేతంపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తాజా ప‌రిణామాల‌పై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్య‌నేత‌ల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి‌. ఏపీలోని ఓ సీనియ‌ర్‌ నేత‌, తెలంగాణ‌కు చెందిన ఓ కీల‌క నేత ఏపీ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు రాహుల్‌కు నివేదిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  అధికారం కోల్పోయిన త‌రువాత వైసీపీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ‌గ‌న్‌కు ముఖ్య అనుచ‌రులుగా పేరున్న నేత‌లు సైతం వైసీపీని వీడి కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీలోని ముఖ్య‌నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా రాహుల్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వారు ప‌లువురు వైసీపీ నేత‌లతో మంత‌నాలు జరిపినట్లు స‌మాచారం. ష‌ర్మిల నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు రాహుల్ టీంకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వారంతా వ‌చ్చే రెండు నెల‌ల్లో కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నార‌ని, వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు పేర్కొంటున్నారు. మొత్తానికి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ రంగంలోకి దిగ‌గా.. వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి గ‌ట్టి షాకిచ్చేందుకు రాహుల్ టీం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో ఎవ‌రిది పైచేయి అవుతుందో  చూడాలంటే మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే.
సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి  అగ్రహం చేసిన కొద్దిసేపట్లో మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ డామేజ్ జరిగి ఆక్సిజన్ అందలేదు. దీంతో శ్రీతేజ్ స్పృహ కోల్పోయి  ప్రాణాపాయ స్థితిలో  కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు కారణమైన అల్లు అర్జున్ ఇంతవరకు పరామర్శించలేదు. కానీ మంత్రి కోమటి రెడ్డి శనివారం కిమ్స్ చేరుకుని బాధిత కుటుంబానికి 25 లక్షల చెక్కును అందజేశారు. బెనిఫిట్స్  పోలు తెలంగాణ వ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు. 
సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో  తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావొద్దని పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఒకటే ఉండటంతో తొక్కిసలా జరిగి రేవతి చనిపోయిందన్నారు. కొడుకు ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చితే అల్లు అర్జున్ మాత్రం సినిమా చూడటానికి  హాల్ లో కూర్చున్నాడని అన్నారు.   రేవతి చావు వార్తను ఎసిపి వెళ్లి అల్లు అర్జున్ కు తెలియజేసి  వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు  డిసిపి అల్లు అర్జున్ కు  అరెస్ట్ చేస్తామని చెబితే కూడా ఓపెన్ టాప్ జీప్ లో అల్లు అర్జున్ వెళ్లిపోయాడని రేవంత్ మండి పడ్డారు. హీరో  కన్ను పోయిందా? కాలు పోయిందా? సినీ ప్రముఖులు వెళ్లి ఎందుకు పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
సంధ్య థియేటర్‌ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, సంఘాలు ఘటన పట్ల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో దీనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థులు అల్లు అర్జున్‌ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు, ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. కొందరు ఆకతాయిలు ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చెయ్యాలి అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. 
1993లో అర్జున్‌ హీరోగా రూపొందిన ‘జెంటిల్‌మేన్‌’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన శంకర్‌ ఒక్కసారిగా అందర్నీ ఆకర్షించాడు. సినిమాలు ఇలా కూడా తియ్యొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ తర్వాత చేసిన ‘ప్రేమికుడు’ చిత్రం యూత్‌ని ఉర్రూతలూగించింది. మూడో సినిమాగా కమల్‌హాసన్‌తో చేసిన ‘భారతీయుడు’ దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించి టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన సినిమాగా సంచలనం సృష్టించింది. అయితే ఆ సినిమాకి సీక్వెల్‌గా దాదాపు 29 సంవత్సరాల తర్వాత ‘భారతీయుడు2’ వచ్చింది. ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. కానీ, ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫలితంగా డిజాస్టర్‌ అయింది. ఈ సినిమా చివరలో ‘భారతీయుడు3’ వచ్చే ఏడాది రాబోతోందని ట్రైలర్‌ని రుచి చూపించారు.  ‘భారతీయుడు2’ ఫ్లాప్‌ అవ్వడం వల్ల రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పై ఆ ప్రభావం పడుతుందేమోనని చిత్ర యూనిట్‌ ఆందోళనకు గురైంది. సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న గేమ్‌ ఛేంజర్‌ ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్న ‘భారతీయుడు3’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్‌ చేసే ధైర్యం నిర్మాతలు చేయలేకపోతున్నారని, అందుకే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం జోరందుకుంది. దీంతో శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న భారతీయుడు3 ఓటీటీలో రిలీజ్‌ అవుతోందంటే.. రామ్‌చరణ్‌తో చేసిన గేమ్‌ ఛేంజర్‌ ఎలా ఉండి ఉంటుంది అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది.  భారతీయుడు3కి సంబంధించి మీడియాలో, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదింపేందుకు దర్శకుడు శంకర్‌ ముందుకొచ్చాడు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఇండియన్‌2’ చిత్రానికి అంత నెగెటివ్‌ టాక్‌ వస్తుందని ఊహించలేదు. అందుకే నా డైరెక్షన్‌లోనే వస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అలాగే ‘భారతీయుడు3’ చిత్రాన్ని అందరూ థ్రిల్‌ అయ్యే విధంగా తీర్చిదిద్దుతున్నాను. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చెయ్యకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్‌ చేస్తాం. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చారు శంకర్‌.
పుష్ప2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన తాలూకు సెగలు ఇంకా చల్లారలేదు. ఏదో ఒక రూపంలో ఈ ఘటన చర్చకు వస్తోంది. ఈ 19 రోజుల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. హీరోపైనా, చిత్ర యూనిట్‌పైనే ఎంతో మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అసెంబ్లీలో లేవనెత్తినపుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దానిపై వివరణ ఇస్తూ మాట్లాడిన మాటలు పెద్ద చర్చకు దారి తీశాయి. దీనిపై శనివారం సాయంత్రం అల్లు అర్జున్‌ అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ మీడియా సమావేశంపై భువనగిరి ఎం.పి., కాంగ్రెస్‌ నేత ఆదివారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.  ‘రేవంత్‌రెడ్డిగారు అసెంబ్లీలో సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన దానికి వెంటనే స్పందించిన అల్లు అర్జున్‌ హుటాహుటిన ప్రెస్‌మీట్‌ పెట్టారు. అయితే సమావేశంలో పాజిటివ్‌గా స్పందిస్తారని, తమ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగింది, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే సందేశాన్ని ఇస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ, ముఖ్యమంత్రి తనని కించ పరచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్క్రిప్ట్‌ని పక్కన పెట్టుకొని దాని ప్రకారమే మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రిగారు ప్రజల నుద్దేశించి ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పారు తప్ప అల్లు అర్జున్‌ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదు. అల్లు అర్జున్‌ గారూ.. మీరు థియేటర్‌లో ఉన్నప్పుడే బయట ఈ దుర్ఘటన జరిగింది. బయట అంబులెన్స్‌ సౌండ్స్‌ అన్నీ వినపడుతూనే ఉంటాయి. కానీ, మీరు సినిమా మీదే శ్రద్ధ పెట్టి పూర్తిగా సినిమా చూసి వెళ్లారు. పైగా మరుసటి రోజు విషయం నాకు తెలిసిందని అన్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్‌ చేసింది అనే దానిపైనే మీ ధ్యాస ఉంది కానీ.. థియేటర్‌ దగ్గర ఏం జరిగింది అనే విషయం గురించి మీరు పట్టించుకోలేదు. నిన్న ప్రెస్‌మీట్‌లో బాధ్యతగా మాట్లాడుతున్నట్టు లేదు. ఒక స్క్రిప్ట్‌ తీసుకొచ్చి దాన్నే చదివినట్టుగా అనిపించింది. మీరు చేసే సినిమాల్లో మూడు గంటలు హీరోగా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తారు. అదే విధంగా రియల్‌ లైఫ్‌లో కూడా హీరోగా ఉండాలని కోరుకుంటున్నాం’ అన్నారు. 
టాలీవుడ్‌లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టాప్‌ హీరోల సినిమాలు ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. అందులోనూ మొదటి వేటు రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’పైనే పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సినిమా టికెట్ల రేట్లపై, బెనిఫిట్‌ షోలపై తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. పుష్ప2 మేనియా తర్వాత సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌ కావడంతో ఈ సినిమా విషయంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్‌ రేట్లు పెంచకుండా, బెనిఫిట్‌ షోలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని కొందరు నేతలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడికి సూచించారు. మరి గేమ్‌ ఛేంజర్‌ సినిమా విషయంలో అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గేమ్‌ ఛేంజర్‌ చిత్రం మూడేళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాకి హైప్‌ రావడం సంగతి అటుంచితే.. కొంత నెగెటివ్‌ టాక్‌ కూడా స్ప్రెడ్‌ అయింది. నిర్మాణం ఆలస్యం కావడం, మధ్యలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు2 డిజాస్టర్‌ కావడం వంటి అంశాల వల్ల ఓపెనింగ్స్‌గానీ, టోటల్‌ కలెక్షన్స్‌గానీ ఏ స్థాయిలో ఉంటాయి అనేదానిపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వల్ల ఆ సినిమాకి ఇక్కడ ప్రయోజనం చేకూరే అవకాశం కనిపించడం లేదు. మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్‌ ఉండడం వల్ల చరణ్‌కి ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. మరి అబ్బాయ్‌ కోసం బాబాయ్‌ ఏం చెయ్యబోతున్నాడు, సంక్రాంతి పండగ సందర్భంగా చరణ్‌కి ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాడు అనే చర్చ మొదలైంది. రాష్ట్రంలోని కొన్ని సమస్యల పరిష్కారంలో పవన్‌కళ్యాణ్‌ చొరవ తీసుకొని ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. మరి అబ్బాయ్‌ సినిమా విషయంలో ప్రభుత్వానికి బాబాయ్‌ ఎలాంటి సూచనలు చేయబోతున్నాడు, గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని గట్టెక్కించడానికి పావులు ఎలా కదపబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన స్టామినా ఏమిటో చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలోనే నెంబర్‌ వన్‌ ఇండస్ట్రీగా టాలీవుడ్‌ అవతరించింది. గత ఐదేళ్ళలో సౌత్‌ సినిమాకి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించిన సినిమాలు తెలుగు నుంచే రావడంతో అందరి దృష్టీ ఇప్పుడు టాలీవుడ్‌పైనే ఉంది. మన హీరోలంతా ఒకరిని రికార్డును మరొకరు అధిగమించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను బ్లాక్‌బస్టర్‌ చెయ్యాలని కష్టపడుతున్నారు. తొలివారంలోనే అంతా రాబట్టవచ్చు అనే ఉద్దేశంతో నిర్మాతలు కూడా బడ్జెట్‌ ఎంతైనా వెనుకాడడం లేదు. దీనంతటికీ కారణం మొదటి వారం టికెట్‌ రేట్లను పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలు ఇవ్వడమే. అంతేకాకుండా, ప్రీమియర్‌ షోలకు అనుమతులు ఇవ్వడం, ఆ టికెట్‌ రేట్లను కూడా భారీగా పెంచుకునే అవకాశం కల్పించడంతో తమ సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ చేసి కలెక్షన్లు దండుకోవడానికి అలవాటు పడ్డారు.  ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక తెలుగు సినిమా మనుగడ కష్టమేనని అర్థమవుతోంది. ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో విస్తరింపజేసినవారు ఖచ్చితంగా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలు, టాప్‌ డైరెక్టర్లు. వాళ్ళు చేసే సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీసే. దీంతో బడ్జెట్‌ విషయంలో ఎలాంటి లిమిట్స్‌ పెట్టుకోకుండా చాలా రిచ్‌గా సినిమాలు తీస్తున్నారు. పుష్ప2 రిలీజ్‌ సందర్భంగా జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై శనివారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా, తెలుగు సినిమాకి అంత హైప్‌ రాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్‌ టికెట్‌ రేట్స్‌ పెంపు, బెనిఫిట్‌ షోలపై నిషేధం విధించింది.  సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌ చిత్రం ఇప్పుడు కష్టాల్లో పడుతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బడ్జెట్‌ పరంగా నిర్మాత దిల్‌రాజుకు ఎంతో భారంగా మారిన ఈ సినిమాకు పుష్ప2 తరహాలోనే ప్రమోషన్స్‌ చేస్తూ హైప్‌ తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం వల్ల గేమ్‌ ఛేంజర్‌కి పెద్ద షాక్‌ తగిలింది. నిర్మాత దిల్‌రాజును తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది తెలంగాణ సర్కార్‌. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిల్‌రాజు మాట్లాడుతూ టికెట్ల రేట్ల హైప్‌, బెనిఫిట్‌ షోలు తమ సినిమాకి యధావిధిగా ఉంటాయని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో  గేమ్‌ ఛేంజర్‌కి షాక్‌ తగిలింది. ఈ సినిమా ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో టాప్‌ హీరోల సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీసే కావడంతో అన్నింటిపైనా ఈ ప్రభావం పడుతుంది. దీన్నిబట్టి ఇకపై మన హీరోల రికార్డుల వేటకు బ్రేక్‌ పడినట్టే అని అర్థమవుతోంది. మరి ఈ సమస్య నుంచి తెలుగు సినిమాను ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. 
Allu Arjun came out in front of press to counter allegations leveled by CM Revanth Reddy. In Telangana Assembly, Revanth Reddy made allegations that even though police denied permission on 4th December night and even stated that Allu Arjun acted inhumane when police asked him to leave.  Countering to these allegations, Allu Arjun stated, "I never even in my wildest dream and nightmare I would want someone to be effected while watching my film. i work in films to entertain people and I can't imagine someone being hurt watching my film. My life ambition is to entertain people and not to hurt them, I want to win hearts."  He continued to say, "Theatres are like a temple to me and I wanted to see audience reactions to my film. Hence, I went to watch premiere." He stated that police were controlling the crowd assembled there at Sandhya theatre and if they would have told him, there was no permission, he would have gone back.    Allu Arjun continued to say that when police asked him to leave, he immediately left, leaving his kids behind. He further clearly stated that after knowing that someone died, he wanted to meet them personally and wanted to support them. As the family filed a case against him, he is unable to till date.  He classified it as an "unfortunate accident" and as it was a make or break moment for him, he wanted to watch the movie as he worked three years on the film. Finally, he stated that he is not blaming anyone but clearly called comments from CM as "false allegations". He also stated that 2 yards before the theatre, he waved at them but he did not conduct any roadshow. He tried to clear the crowd by waving but did not tried to showcase his strength with any procession.  He also stated that theatre management asked him to leave but not police as being told. He stated that the management stated that there was some issue with crowd and hence, he walked out. 
సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన గురించి శనివారం అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ లేవనెత్తిన ఈ అంశం గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఘటన జరిగిన తీరు గురించి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళడాన్ని కూడా రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు, అలాగే ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్‌ను చూసేందుకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇకపై ఏ హీరో సినిమాకైనా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్‌ షోలకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంతవరకు అది జరగదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే.. శనివారం మరోసారి అల్లు అర్జున్‌ మీడియా ముందుకు వచ్చారు. తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకు మీడియాతో సమావేశమయ్యారు.  ఈ అత్యవసర సమావేశంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘ఇది ఒక యాక్సిడెంట్‌. ఇందులో ఎవరి తప్పు లేదు. దురదృష్టకరమైన ఘటన. మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని అందరూ మంచి ఇంటెన్షన్‌తో చేసినప్పటికీ ఇది జరగడం చాలా బాధగా ఉంది. ఆ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాను. ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఒక మిస్‌ అండర్‌స్టాండిరగ్‌. ఎవరినీ బ్లేమ్‌ చెయ్యడానికి కాదు. నేను రాంగ్‌గా బిహేవ్‌ చేశానని నా గురించి కొన్ని విమర్శలు వచ్చాయి. నన్ను కలిసేందుకు సినిమా వాళ్ళు వచ్చినందుకు కూడా కామెంట్స్‌ చేశారు. నా కాళ్ళు, చేతులు విరిగిపోయాయా అంటూ చాలా తప్పుగా మాట్లాడారు. అది నాకెంతో బాధ కలిగించింది. నన్ను ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు. నేను అలా మాట్లాడగలనా? నా సినిమా పెద్ద సక్సెస్‌ అయినా ఎలాంటి ఫంక్షన్స్‌ పెట్టకుండా ఇంట్లోనే కూర్చుని ఉన్నాను. మూడేళ్ళు కష్టపడి చేసిన సినిమాను నేను థియేటర్‌లో చూడలేదు. అంత పెద్ద సక్సెస్‌ అయినా నేను ఇంట్లోనే కూర్చుని ఉన్నాను. నా గురించి తప్పుగా చెప్పడం బాధ కలిగించింది. మూడేళ్ళు ఎఫర్ట్‌ పెట్టి చేసిన సినిమా థియేటర్‌లోనే చూడాలని అనుకుంటాను. 30 సంవత్సరాలుగా నా సినిమా కాకపోయినా, చాలా సార్లు ఆ థియేటర్‌కి వెళ్లాను. ఎప్పుడూ ఏమీ జరగలేదు. నేను రోడ్‌ షో చేశానని చెప్పారు. అది తప్పు. థియేటర్‌కి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పుడు బయటికి వచ్చి అందరికీ థాంక్స్‌ చెబుతూ ముందుకెళ్లాను. నేను వాళ్ళని పలకరిస్తేనే వాళ్లు పక్కకు తప్పుకుంటారు. నేను అదే చేశాను. నేను రోడ్‌ షో చెయ్యలేదు అని మరోసారి చెబుతున్నాను.  నా దగ్గరకి పోలీసులు వచ్చారని చెప్పారు. కానీ, ఏ ఒక్క పోలీస్‌ నా దగ్గరకి రాలేదు. అది మాత్రం పూర్తిగా అబద్ధం. నాకు ఇలా ఓ యాక్సిడెంట్‌ జరిగిందని నెక్స్‌ట్‌ డే తెలిసింది. నేను వెంటనే హాస్పిటల్‌కి వెళ్దామని వాసుతో అన్నాను. కానీ, ఇప్పుడు అక్కడ పొజిషన్‌ ఎలా వుందో తెలీదు. ఎంత ఎమోషనల్‌గా ఉన్నారో తెలీదు. అలాగే మళ్ళీ అక్కడికి క్రౌడ్‌ వస్తుంది. లేనిపోని సమస్యలు వస్తాయని వాసు చెప్పాడు. ముందు తను అక్కడికి వెళ్లి పరిస్థితి చూసిన తర్వాత వెళ్దాం అన్నాడు. సరే అని నేను వెయిట్‌ చేస్తున్న టైమ్‌లో నా మీద కేస్‌ ఫైల్‌ అయిందని చెప్పారు. ఇక ఎక్కడికి కదల్లేని పరిస్థితి. మా లీగల్‌ టీమ్‌ కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. దాంతో నేను ఏమీ చెయ్యలేకపోయాను. ఆ తర్వాత మా నాన్ననిగానీ, మా మావయ్యనిగానీ వెళ్ళి కలవమని చెప్పాను. అది కూడా కుదరదని చెప్పారు. అయితే నేను మాత్రం ఆ యాక్సిడెంట్‌ జరిగిన రోజు నుంచి నార్మల్‌గా లేను. ఇప్పుడు కూడా నార్మల్‌గా లేను. ఈ విషయంలో ఆ కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలని సుకుమార్‌ అన్నారు. సుకుమార్‌ కొంత, నేను కొంత, ప్రొడ్యూసర్‌ కొంత ఎమౌంట్‌ కలెక్ట్‌ చేసి మొత్తం ఆ బాబు పేరుమీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చెయ్యాలని అనుకున్నాం. నేను ఎందుకు బాధ్యతగా ఉండను చెప్పండి. చిరంజీవిగారి ఫ్యాన్స్‌గానీ, కళ్యాణ్‌గారి ఫ్యాన్స్‌గానీ చనిపోయినపుడు ఎంతో దూరం వెళ్ళి చూసొచ్చాను. అలాంటిది నా ఓన్‌ ఫ్యాన్స్‌కి ఏదైనా జరిగితే నేను చూడకుండా ఉంటాను. ఈ విషయంలో నామీద చాలా లో యాంగిల్‌లో విమర్శలు చేస్తున్నారు. అది కరెక్ట్‌ కాదు. మా సైడ్‌ నుంచి ఆ కుటుంబానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తాం’ అన్నారు. అయితే శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల గురించి డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా ఇన్‌డైరెక్ట్‌గా అసెంబ్లీలో జరిగిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. 
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె కుమారుడు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారు.రీసెంట్ గా ఈ విషయానికి సంబంధించిన పలు విషయాలపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు అల్లు అర్జున్ పై కొన్ని విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇక ఈ రోజు సాయంత్రం అల్లుఅర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించబోతున్నాడు.దీంతో అల్లు అర్జున్(allu arjun)ఏం మాట్లాడబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.ఇక అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఏంఐఏం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఏంఎల్ఏ అక్బరుద్దీన్ ఓ వైసి మాట్లాడుతు అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నప్పుడు పక్కనున్నవాళ్ళు తొక్కిసలాట జరిగిందని చెప్పారు.అయితే మన సినిమా హిట్ అని అల్లుఅర్జున్ వాళ్ళతో అన్నాడని చెప్పిన నేపథ్యంలో కూడా అల్లుఅర్జున్ తన మీటింగ్ లో ఈ విషయాలపై మాట్లాతాడేమో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడినట్టుగా తెలుస్తుంది.  
Ram Charan's Game Changer directed by Shankar is gearing up for release on 10th January 2025. The movie has been made on a huge budget and the makers have grave expectations on Sankranti Box Office pull to recover their money. But no ticket rate hikes and no benefit shows rule is going to effect them for the first weekend.  Producers looking at Allu Arjun's Pushpa 2 The Rule hikes, Game Changer team also would have anticipated similar kind with an anticipation for Sankranti season to help the collections. From 10th to 18th, the makers would have been calculating about the hikes they need to ask looking at Daaku Maharaaj and Sankrantiki Vasthunnam competition. They would have wanted ticket hikes to compensate for screens loss with a hope to increase the audiences count.  Now, the stampede during Pushpa 2 The Rule has resulted in Telangana Government taking a huge decision to not allow hikes and benefit shows. This could be a result of TFI showing solidarity towards Allu Arjun after his arrest. CM Revanth Reddy looked upset with TFI people for this show of solidarity.  While Daaku Maharaaj and Sankrantiki Vasthunnam makers would have been okay with normal ticket rates, Game Changer makers would be hoping for hikes. With director Shankar at the helm, the movie has become a Pan-India film like Ram Charan's previous film RRR and even Acharya, starring him in a cameo, also got hikes.  So, the makers would have been hoping for better hikes to get returns on their investment, even in worst case scenario. Looking at Shankar's current form, fans are not that positive but now, they are even more worried with no hikes and extra benefit shows. 
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె కుమారుడు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారు.రీసెంట్ గా ఈ విషయానికి సంబంధించిన పలు విషయాలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతు ఇకపై సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని,బెనిఫిట్ షోలను అనుమతించబోమని తేల్చిచెప్పడం జరిగింది.ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి లాగానే సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని,బెనిఫిట్ షోలను అనుమతించబోమనే ప్రకటన చేయాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  గణితం…. పుస్తక భాషలో చెప్పుకుంటే లెక్కల శాస్త్రం అనొచ్చు. అసలు ఈ లెక్కలు లేకుండా మన జీవితాన్ని ఊహించగలమా? మనం పుట్టినప్పటి నుంచి, చనిపోయేదాక లెక్కలు మన జీవితంలో భాగంగా ఉన్నాయి.  చిన్న పిల్లల చాక్లెట్ల లెక్క నుంచి సైంటిస్టుల రాకెట్  లాంచింగ్ దాకా ఈ లెక్కలు అన్ని చోట్లా ఉపయోగపడుతున్నాయి. డబ్బు మీద నడిచే ఈ కాలంలో లెక్కలు, గణాంకాలు లేకుండా ఏదీ జరగదు. మరి అలాంటి గణితమంటే మనలో చాలామందికి  అదేదో పెద్ద అర్ధం కానీ మిస్టరీలా అనిపించి, వింటేనే వణుకు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇష్టపడితే దీనంత ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు అంటారు గణిత ప్రియులు. ప్రపంచ నడకకి అడుగడుగునా అవసరమయ్యే ఈ గణిత శాస్త్రం మీద ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. గణిత శాస్త్ర చరిత్రలో భారత గణిత శాస్త్రజ్ఞులు చేసిన కృషి ఎంతో ప్రత్యేకమైనది. అందులో శ్రీనివాస రామానుజన్ గారిది ప్రత్యేక స్థానం. అందుకే  గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ గారి జ్ఞాపకార్ధం ఆయన పుట్టినరోజయిన  డిసెంబర్ 22వ తేదీని ప్రత్యేక దినంగా  గుర్తించారు. రామానుజన్ గారి  125వ జయంతి సందర్భంగా 2012, డిసెంబర్22వ తేదీన,  భారత ప్రభుత్వం  అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రకటించింది. గణిత శాస్త్రానికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా నంబర్ థియరీ, పార్టిషన్ ఫంక్షన్ లు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.  ప్రత్యేకమైన ఈ రోజున శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవ, ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటే.. గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ .. శ్రీనివాస రామానుజన్  1887 లో,  తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నాణ్యమైన విద్య అందకపోయినా  తన  12 వ ఏటనే త్రికోణమితిలో తన ప్రావీణ్యాన్ని చూపారు. రామానుజన్  14 వ ఏట మద్రాసులోని పచాయప్ప కాలేజీలో చేరి ఇతర సబ్జెక్టులలో ఫెయిలైనా కూడా, గణితంపై మాత్రం  స్వతంత్ర పరిశోధన చేశారు. 1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్టులో ఉద్యోగం పొందేందుకు రామస్వామి అయ్యర్ సాయం చేశారు. అలా అక్కడ పని చేసుకుంటూనే ఆయన రకరకాల గణిత సిద్ధాంతాలు నోట్సుల్లో  రాసుకునేవారు. 1913 లో ఆయన సిద్ధాంతాలని చూసి ఆశ్చర్యపోయిన కేంబ్రిడ్జ్ గణిత శాస్త్రవేత్త  GH హార్డీ, రామానుజన్‌ను లండన్‌కు ఆహ్వానించారు. అలా అక్కడ  రామానుజన్ గణితం మీద మరింత కృషి చేశారు.  1918 లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన అతితక్కువ వయస్కుల్లో రామానుజన్ ఒకరు. ఆయన రాసిన చాలా గణిత సిద్ధాంతాల  మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రంలో  చేసిన కృషి దేశీయంగా, అంతర్జాతీయంగా గొప్ప  ప్రభావం చూపింది.  నేటి తరానికి గణిత దినోత్సవం.. జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ కృషిని స్మరించుకోవటానికి మాత్రమే కాకుండా, గణితంపై నేటి తరం వారికి ఆసక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామానుజన్ రూపొందించిన త్రికోణమితి సిద్ధాంతాలు, మన డైలీ లైఫ్ లో వాటి ఉపయోగాలు గురించి తెలుసుకున్నప్పుడు త్రికోణమితి మీద ఆసక్తి పెరగడం ఖాయం. రామానుజన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రాలు  "ది మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ"  లాంటివి చూడడం వల్ల పిల్లలకి   గణితం పట్ల ప్రేమ పెరుగుతుంది.  ప్రతి విద్యార్థిలో కొన్ని బలాలు,  బలహీనతలు ఉంటాయి. వారిలో బలహీనతలని ఎత్తి చూపించకుండా వారికి నచ్చిన దానిలో ప్రోత్సహిస్తే ఎంత మంచి జరుగుతుందో  రామానుజన్ జీవితం సమాజానికి ఒక ఉదాహరణగా, పిల్లలకి ప్రేరణగా నిలుస్తుంది. 2024 థీమ్.. జాతీయ గణిత దినోత్సవం 2024 కు  "గణితం: ఆవిష్కరణ, పురోగతికి వంతెన" అనే థీమ్ ఎంచుకోబడింది. నానాటికీ పెరుగుతున్న సాంకేతికత,  సైన్స్ ద్వారా చేస్తున్న ఆవిష్కరణల డెవలప్మెంటుకి   గణిత సూత్రాలు ఎలా ఆధారం అవుతున్నాయనే విషయాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.  గణితంపై ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ  రామానుజన్ జీవితాన్ని కృషిని స్మరించుకుంటూ.. రామానుజన్ లాంటి గణిత శాస్త్రవేత్తలుగా మారేవైపు నేటి తరం అడుగులు వెయ్యాలి.                         *రూపశ్రీ. 
   ‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది. అమ్మ చీర కొంగు చెమట పడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే  సగటు భారతీయ కుటుంబంలో ప్రతీ శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే జోలపాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి  చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో..  అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించటం వల్లనే  ఒక తరం నుంచి ఇంకో  తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి.  అలాగే  మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ,  వెస్టర్న్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచనా విధానం మార్చాలని, తర్వాత వచ్చే   తరాలు చీరని  మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే  ప్రపంచ చీర దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వాటిలో చీర కూడా ఒకటి.  ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన  వరల్డ్ శారీ డే జరుపుకుంటారు.   చీర ఎప్పటినుంచి ఉంది.. చీర చరిత్ర గురించి చూస్తే దీని ఆనవాళ్ళు ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత(2800-1800బి‌సి‌) కాలంలో దొరికాయి. అప్పుడిది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ గా మారుతూ వచ్చింది.. చీరలు  నేసే నేతన్నలకి, చీరల్లో ఉండే  ప్రత్యేక కళకీ  గౌరవం తెలపడానికిగానూ  2020, డిసెంబర్21వ తేదీన  ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం మొదలపెట్టారు.  స్థానికంగా మొదలై త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉద్యోమమే స్పూర్తి.. సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిస్టులా హెబ్బార్..  ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో సోషల్ యాక్టివిస్ట్  శ్రీమతి నళిని శేఖర్  దీన్ని ప్రారంభించారు.   శారీ డేని ఎందుకు జరుపుకోవాలి.. భారతీయుల మూలాలను గుర్తు చేస్తూ మన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం. చీర కేవలం ఏదో  ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వమని ప్రపంచానికి చాటి చెప్పడమే శారీ డే లో ఉన్న గొప్పతనం.  చీరలు తయారు చేసే కళను కాపాడి, చేతి వృత్తుల పరిశ్రమని ప్రోత్సహించడమనే మరక ఉద్దేశ్యం కూడా ఇందులో ఉంది. చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ది చెంది, స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టట్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయటం ద్వారా  మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియచేస్తుంది. చీరలో వైవిధ్యం.. ఫ్యాషన్ పరిశ్రమపై చూపిస్తున్న ప్రభావం.. భారతదేశంలోని ప్రతి ప్రాంతం దాని ప్రత్యేక శైలిని చీర ద్వారా పరిచయం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్  విలాసవంతమైన బనారసీ పట్టు చీర నుండి తమిళనాడులో చేతితో నేసిన కాంచీపురం చీర వరకు. రాజస్థాన్  రంగురంగుల బంధనీ చీర నుంచి తూర్పు భారతంలోని జామ్‌దాని, ఖాదీ చీరల వరకూ ఎంతో వైవిధ్యం కలిగి ఉన్నాయి. చీర కట్టే స్టైల్లో కూడా  ప్రతీ ప్రాంతానికి తమదైన ప్రత్యేకత ఉంది.  మహారాష్ట్రలో నౌవారి స్టైల్, గుజరాత్‌లో ముందుకు పల్లు కట్టడం, బెంగాల్ చీర కట్టు... ఇలా  చాలా వైవిధ్యం ఉంది. చరిత్రలో రాణి లక్ష్మీ బాయి లాంటి వీరనారిలు, ఇందిరా  గాంధీ వంటి మహిళలు చీరలను విభిన్న శైలుల్లో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు.   చీర ఇప్పుడు తన సాంప్రదాయ హద్దులని దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచీ, మనీష్ మల్హోత్రా, గౌరవ్ గుప్తా వంటి మోడర్న్ డిజైనర్స్ కూడా  చీరను డిఫరెంట్ స్టైల్సులో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నారు.   చీర ఆరు నుండి తొమ్మిది గజాల అన్‌స్టిచ్డ్ వస్త్రం కాదని, భారతదేశ  కళా నైపుణ్యం,  సంప్రదాయానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గుర్తించాలి.  ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి, వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలనుకున్నా, ముందు మనం మన మూలాలనుంచి  దూరం అవ్వకుండా ఉండాలి.  భారత సంప్రదాయాన్ని,  చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ వరల్డ్ శారీ డే ను జపురుకోవాలి.                                        *రూపశ్రీ.
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.  కోపం  అనేది ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన గుణమే అయినా కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు చాలా విషయాలలో నష్టాలు ఎదురుచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి వాళ్ల దగ్గర కోపం చూపించినా మహా అయితే మాట్లాడకుండా పోతారు. కొందరైతే చెడ్డవారనే ముద్ర వేస్తారు.. కానీ కుటుంబ సభ్యులు,  అన్నింటి కంటే ముఖ్యంగా జీవిత భాగస్వాములు కోపం వల్ల జీవితంలో కోలుకోలేని,  తిరిగి పూడ్చలేని నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది.  అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని అంటారు.  అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి అని అనుకున్నంత సులువగా దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడమే పెద్ద సమస్య.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.. లైఫ్ కోచ్ అయిన రవిశంకర్ గురూజీ కోపాన్ని జయించడానికి, కోపంతో ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలను స్పష్టంగా తెలిపారు. సైలెంట్ అయితే కోపం పెరుగుతుందా..? వివాహ బంధంలో సరైన భాగస్వామి దొరకకపోతే కోపం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోతే అవతలి వారి కోపం కంట్రోల్ కాదు.. ఫలితంగా . కోపం పెరుగుతుంది. కోపం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయి సమయాన్ని వృథా చేయకూడదు. అవతలి ఏదైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా అవాయిడ్ చేయకూడదు. ఇది చాలా తప్పు. కోపం ఇలా కంట్రోల్.. మీరు ఎంత చెప్పినా సరే.. ఎదుటి వ్యక్తి కోపం తగ్గకపోతే దీనికోసం చేయవలసిన పని కోపంగా ఉన్న వ్యక్తికి అర్థం అయ్యేలా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండే వ్యక్తిని సంప్రదించడం.మూడవ వ్యక్తి సహాయంతో కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ సక్రమంగా సాగకపోతే  కోపగించుకునే అవకాశం ఉంది.  కానీ అర్థమయ్యేలా ఎవరో ఒకరు వివరిస్తే అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి ప్రమేయం మంచిదేనా? సాధారణంగా భార్యాభర్తలు కానీ.. కుటుంబ సభ్యులు కానీ వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మూడవ  మనిషి ప్రమేయం ఉంటే ఇష్టపడరు. కానీ భాగస్వామి కానీ, కుటుంబంలో వ్యక్తి కానీ ఏదైనా చెప్పాలని చూసినప్పుడు అవతలి వ్యక్తి వినకుంటే.. మీరు చెప్పేది మంచి విషయమే అయినా అప్పటికే మీ మీద ఉన్న కోపం వల్ల  మీరు చెప్పే మంచి కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అలాంటి సందర్బంలో మూడవ వ్యకి సహాయం తీసుకోవడమే మంచిదట. అయితే భార్యాభర్తలు ఎప్పుడూ ఇలా మూడవ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుకోకూడదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా ఇద్దరూ కలసి ఓపెన్ గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడమే మంచిది. ఇది కూడా ట్రై చేయవచ్చు.. ఎవరైనా చాలా కోపంగా ఉంటే వారు నిశ్శబ్దంగా ఉంటే..  వారిని గౌరవించి మీరు కూడా  నిశ్శబ్దంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉంటే కోపంగా ఉన్న వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి సమయం లభిస్తుంది.   అతను తనంతట తానుగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కోపంగా ఉన్న సమయంలో  ఎటువంటి తప్పు అడుగు వేయకుండా జాగ్రత్త పడాలి.  ఇకపోతే.. ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకోవడం బంధాలకు..  ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల గొడవలు జరిగినప్పుడు.. కోపంగా ఉన్నప్పుడు  ప్రశాంతంగా ఉండటం,  ఎదుటివారి కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయడం మంచిది.                                              *రూపశ్రీ.  
  నెయ్యి ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం.  ప్రతి రోజూ స్వచ్చమైన నెయ్యిని కనీసం ఒక స్పూన్ అయినా తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా మంచిదని చెబుతారు.  ముఖ్యంగా నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం,  అజీర్ణం,  ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి.  గర్భంతో ఉన్నవారు నీటిలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి తాగుతుంటారు. దీని వల్ల కడుపులో బిడ్డకు కూడా మంచిదని చెబుతారు. అయితే నెయ్యి స్వచ్చమైనది అయితేనే దాని వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.  కల్తీ నెయ్యి వాడితే మాత్రం దాని వల్ల కలిగే ప్రయోజనాలకంటే జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. తాజాగా కిలోల కొద్దీ నకిలీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరం బయటపడటంతో నెయ్యి విషయంలో చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో  కల్తీ నెయ్యని 2 నిమిషాలలో ఎలా గుర్తించవచ్చో ఆహార నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ కమీషన్ హర్యానాలోని జింద్ నగరంలో దాడి చేసి నకిలీ దేశీ నెయ్యిని తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కనుగొంది. ఈ ఆపరేషన్‌లో 1925 కిలోల నకిలీ నెయ్యి, 1405 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగిని ఢిల్లీ పోలీసులు సీల్ చేశారు. గోదాములో రంగులు, రసాయనాలు కూడా కనిపించాయని చెబుతున్నారు. సోడియం లారెత్ సల్ఫేట్ అనే రసాయనాన్ని జోడించి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారట. భారతదేశంలో చాలా చోట్ల నకిలీ నెయ్యి,  నూనె, పాలు మొదలైనవి తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు.   నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? నెయ్యి లో  కూరగాయల నూనె  కలుపుతారు. చౌకైన కూరగాయల నూనె లేదా కూరగాయల ఫ్యాట్ ను నిజమైన నెయ్యితో కలపడం ద్వారా దాని పరిమాణం పెరుగుతుంది. దీని వినియోగం వల్ల  కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  గుండె జబ్బులు,  ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి కల్తీ నెయ్యి  దీర్ఘకాలిక వినియోగం వల్ల ధమనులను అడ్డుకోవడానికి దారితీస్తుంది. స్టార్చ్.. నెయ్యి పరిమాణాన్ని పెంచడానికి పిండిని కలుపుతారు. ఇది కడుపు నొప్పి, అజీర్ణం,  గ్యాస్, బరువు పెరుగుట,  జీవక్రియ రుగ్మతలకు కారణమవుతుంది.   నకిలీ నెయ్యిలో ఉండే రసాయనాలు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. నకిలీ నెయ్యిలో ట్రాన్స్ ఫ్యాట్,  హానికరమైన నూనెలు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  అలాంటి నెయ్యి తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్  లేదా మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. నెయ్యి కల్తీని ఇలా గుర్తించవచ్చు.. ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఒక మి.లీ కరిగించిన నెయ్యిని తీసుకోవాలి.  అందులో ఒక మిల్లీ.. Conc.HCLని జోడించండి ఆ తర్వాత అందులో అర చెంచా చక్కెర వేయాలి. రెండు నిమిషాలు బాగా షేక్ చేయాలి. నెయ్యిలో కల్తీ లేకపోతే దాని రంగు మారదు. నెయ్యి నకిలీ అయితే దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారవచ్చు.                                               *రూపశ్రీ.                        
  చలికాలంలో  తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్‌లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు.  మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది.  రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది.   అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది.  ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ  చాలా తియ్యగా మారుతుంది.  ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.  ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి,  ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.  
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ.