LATEST NEWS
మాజీ మంత్రి ,  వైసీపీ కీలక నేత పేర్ని నాని  ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం సంఘటనలో ఆ కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలసందే. ఇందుకు సంబంధించి వాస్తవాల వెల్లడి విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి, కుమారుడు పూర్తిగా విఫలమయ్యారు.  పోలీసుల నోటీసులు అందగానే గంపగుత్తగా కుటుంబం మొత్తంఅజ్ణాతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ కేసు విషయంలో పేర్ని నాని కుటుంబానిదే తప్పు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.   జగన్ హయాంలోనూ, ఆ తరువాతా కూడా ఏ విషయంపైనైనా స్పందించడంలో, మీడియా ముందుకు వచ్చి వాగ్ధాటి ప్రదర్శించడంలో చురుకుగా ఉండే పేర్ని నాని.. తన కుటుంబంపై నమోదైన కేసు విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయిచడమే కాకుండా పోలీసుల నోటీసులకు సైతం స్పందించకుండా అజ్ణాతాన్ని ఆశ్రయించడమే ఆయన వైపే తప్పు ఉందన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.   ఇదిలా ఉంటే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన రేషన్‌ బియ్యం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాయమైన రేషన బియ్యం బస్తాల సంఖ్య తొలుత వెలుగులోకి వచ్చిన దాని కంటే చాలా చాలా ఎక్కువ అన్న చర్చ జరుగుతోంది.  పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్‌ నుంచి  3,708 రేషన్‌ బియ్యం బస్తాలు మాయమయ్యాయని తొలుత అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆ సంఖ్య తప్పు అంటూ సవరించి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   4,840 అని చెప్పారు.  అయితే  తాజాగా ఇప్పుడు జయసుధ గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   ఏకంగా 7,577 అని లెక్క తేల్చారు. గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య ఎంతో తేల్చడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ నుంచి భారీగా బియ్యం అక్రమంగా తరలించారని చెప్పడం కోసమే అంత సమయం తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం ఇంత స్థాయిలో బియ్యం తరలించడం మామూలు విషయం కాదనీ,  పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చడానికి ఆ మాత్రం సమయం పడుతుందనీ చెబుతున్నారు. బియ్యం బస్తాల మాయం విషయంలో అవాస్తవముంటే..  మాయమైన బియ్యానికి  పేర్ని నాని తాలూకు న్యాయవాది డీడీలు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తారు.  ఇదంతా అలా ఉంచితే.. మరో వైపు పోలీసులు ఇచ్చిన నోటీసులపైన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పేర్ని నాని ఉపసంహరించుకున్నారు. కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసు విచారణలో ఉండగా కేసుకు సంబంధించిన పలు అంశాలు తెరపైకి వస్తుండటం ఆసక్తి కరంగా మారింది.  గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. అంతే కాకుండా పేర్ని నాని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి మాయమైన బియ్యం ఇప్పటికే   కాకినాడ పోర్టు నుంచి దేశం దాటేసిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు చేస్తున్నారు.   వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన పేర్నినాని తన భార్య పేర్ని జయసుధ పేరిట రేషన్ డీలర్ షిప్ తీసుకున్నారు.   ప్రభుత్వం నుంచి తమకు పంపిణీ కోసం అందిన బియ్యాన్ని తమ కుటుంబానికే చెందిన గోడౌన్ లో భద్రపరిచేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో  అధికారం మారిన తరువాత  అదే గోడౌన్ లో ఉండాల్సిన  బియ్యం నిల్వలు మాయం అయినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు అయ్యింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినా వారు రాలేదు. అయినా పోలీసులు ఇప్పటి వరకూ వారినెవరినీ అరెస్టు చేయలేదు. ఈ లోగా పేర్ని జయసుధ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువరించిన తరువాత పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.  ఇంత జరిగినా పేర్ని నాని కనీసం స్పందించక పోవడంతో బియ్యం బస్తాల మాయం విషయంలో ఆయన కుటుంబం ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది.  అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం, జనసేనలపై నోరెట్టుకు పడిపోయే పేర్ని నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తన కుటుంబంపై కేసు నమోదైనా కిమ్మనకపోవడంతో ఆయన కుటుంబం తప్పిదం ఉందన్న సంగతిని పరోక్షంగా అంగీకరించేసినట్లేనని అంటున్నారు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి మరీ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినందున జయసుధకు కోర్టులో ఊరట దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసిన ఆమె విచారణకు హాజరై ఉంటే కోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసి ఉండేదనీ, ఇప్పుడామె అజ్ణాతంలో ఉన్నందున కోర్టులో ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనీ వివరిస్తున్నారు. కోర్టు అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా కూడా విచారణకు హాజరై తీరాల్సిందేనని జయసుధకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. 
టాలివుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మరోసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాట గురించి వాదనలతో  పాటూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నట్లు సమాచారం.  రేవతి కుటుంబానికి రెండుకోట్ల రూపాయల ఆర్థికసాయం పుష్ప 2 టీమ్ ఇప్పటికే అందించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చింది. 
ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.ఆయన కు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అసలు ఆర్ధిక సంస్కరణల కోసమే ఆర్ధిక వేత్త మన్మోహన్ ను రాజకీయాలలోకి పీవీ తీసుకువచ్చారు. ఆయన తన ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు .బంగారం తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఆర్ధిక వ్యవస్థ ను సుస్థిరం చేసారు.అలా రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవి వరించింది.రాజ్యసభ సభ్యుడిగానే 10 ఏళ్లు ప్రధానిగా ఆ పదవిలో ఉన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు పొందారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబ్ లో జన్మించిన మన్మోహన్, 1958లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రం చదివి, 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో డాక్టరేటు పొందారు. 1978-80మధ్య రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా,1982-85లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ గా కూడా పని చేశారు. కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసినది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఆయన ఐదు పర్యాయాలు అసోం నుంచి, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఒక్కసారి కూడా లోక్ సభ కు ఎన్నిక కాకపోవడం గమనార్హం. ఆయన ఈ 33ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక గౌరవ పదవులు నిర్వహించారు.ఈ నాటికీ భారత ఆర్థిక వ్యవస్థ చెదరకపోవడానికి ఆనాటి ఆయన ఉక్కు సంకల్పమే కారణమనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి రాజకీయ ఆర్థిక వేత్త భారత్ కు లభించడం,ఆయనను వెలికి తీసిన పీవీ లాంటి మేధావి ఉండడం భారతీయుల అదృష్టం గా భావించాలి. ఆయన నాటిన విత్తే  నేటికీ భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా  కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఆయన ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఆర్ధిక మంత్రి పదవి,ప్రధానమంత్రి పదవి అనుకోకుండా లభించినా ఆ పదవులకు గౌరవం తెచ్చారు. ప్రధాని పదవికి తన విదేశీయత కారణంగా సోనియా గాంధీ అనర్హురాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలతో ఆమె ఆ పదవికి మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసారు. యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీని కలసి ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలను నిర్ణయాలు తీసుకునేవారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే  ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు.  
అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా   తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి  పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.  పెద్దిరెడ్డి పాపాల  పుట్టలు అన్నీ పగులుతున్నాయి.   వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద‌ మొత్తంలో దోపిడీకి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పెద్దిరెడ్డి దోపిడీలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అటు పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జగన్ హయాంలో  జగన్ రెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని.. ఢిల్లీలో జగన్ వాయిస్ ను తనకు చేతనైన రీతిలో నిర్వహించిన ఆయన కుమారుడు మథున్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే తయారైంది.  జగన్ కూడా వారిరువురినీ పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వారికి ఇచ్చిన పార్టీ పదవులను జగన్ పీకేశారు.   వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి పార్టీలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు.   చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలను జగన్ ఆయనకే కట్టబెట్టారు. అయితే  ఎన్నికలలో  ఆ రెండు జిల్లాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, ఆయన కుమారుడు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు. ఇక ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మిగిలిన వారంతా ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.  అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీకావు. అంగళ్లులో చంద్రబాబును చంపడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అనుమానాలున్నాయి. ఆ రోజు చంద్రబాబు పర్యటనలో పోలీసులు వ్యవహరించిన విధానం, పుంగనూరు వద్ద జరిగిన అల్లర్లలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి పాల్పడిన ఆర్థిక అరాచకాలకు అంతే లేదు. దీంతో రాజకీయంగా యాక్టివ్ గా ఉంటే అవన్నీ బయటకు వస్తాయన్న భయంతో ఆయన పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ కూడా పెద్దిరెడ్డిని పక్కన పెట్టేయడంతో ఆయన జిల్లాకు ముఖం చాటేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద అధికారం అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి ఇప్పుడు దాదాపుగా అజ్ణాత వాసం చేస్తున్నారు. పార్టీ నుంచి కూడా అండ కరవవ్వడంతో చేసిన తప్పులకు ఎప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తుందో అన్న భయంతో కాలంగడుపుతున్నారని చెప్పవచ్చు.  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచీ, గతంలో తాను చేసిన తప్పుల నుంచీ గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమాన కరరీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ క్యాడర్ కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. నిరసన వ్యక్తం చేస్తున్నది. పులివెందులలో గురువారం (డిసెంబర్ 26) ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన సొంత క్యాడర్ నుంచే  నిరసన ఎదుర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు.  జగన్  పార్టీ కార్యకర్తలను విస్మరించడమే ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని వైసీపీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాన్ని ఓటమి తరువాత ఆయన దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే జగన్ మాత్రం పార్టీ ఓటమికి తెలుగుదేశం కూటమి అసత్య ప్రచారం, ఈవీఎంల టాంపరింగే కారణమంటూ అస్మదీయుల హితవచనాలను పక్కన పెట్టేశారు. పార్టీ అధికారంలో ఉండగా ప్రజల దృష్టిలో భ్రష్టులుగా ముద్రపడిన గోరంట్ల మాధవ్ వంటి వారికి ఇప్పుడు పార్టీ పదవులు కట్టబెడుతూ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు.  ఆయన తీరు పార్టీకి క్యాడర్ ను దూరం చేస్తున్నది. ఇందుకు రుజువుగా గురువారం (డిసెంబర్ 26) పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పార్టీ క్యాడర్ ను కూడా జగన్ కలవడానికి సుముఖంగా లేరంటూ వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.   జగన్ కు కలిసేందుకు పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఉదయం ఏడు గంటలకే పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే  వారికి ఆయన దర్శన భాగ్యం దక్కలేదు. వర్షాన్ని లెక్క చేయకుండా జగన్ ను కలసేందుకు తిండితిప్పలను కూడా విస్మరించి క్యూలైన్ లో వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ క్యాడర్ లో  అసహనం పెల్లుబికింది. జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ తీరుపై విమర్శలు గుప్పించడం పార్టీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఎంత అసహనంతో ఉన్నారో తేటతెల్లం చేసంది. 
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వాయిస్ ఓవర్ తో తెలుగు నాట డిసెంబర్ 20 న రిలీజైన పాన్ వరల్డ్  మూవీ 'ముఫాసా'(mufasa).నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది లయన్ కింగ్' మూవీ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు  మంచి ప్రేక్షకాదరణతో ముందుకు దూసుపోతుంది. రీసెంట్ గా చిత్ర బృందం 'ముఫాసా'ఇండియాలో సాధించిన మొదటి వారం కలెక్షన్స్ ని ప్రకటించింది.దేశ వ్యాప్తంగా మొత్తం 74 కోట్లు వసూలు చెయ్యగా,ఇంగ్లీష్ లో 26 .75 కోట్లు, హిందీ,తెలుగు భాషల్లో 11 .2 కోట్లు,11 .3 కోట్లుతో మొత్తం 74 కోట్లు రాబట్టింది.మాములు హీరోల స్థాయిలో 'ముఫాసా' మొదటి వారానికే రికార్డు స్థాయి కలెక్షన్ ని రాబట్టడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరుస్తుంది. తాజాగా 'ముఫాసా' గురించి మహేష్ బాబు మాట్లాడుతు మనకు తెలిసిన ఇష్టపడే పాత్రకు కొత్త అంకం.'ముఫాసా' కి వాయిస్ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని.కాబట్టి ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు.ముఫాసా ని  ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్ని 200 మిలియన్ల డాలర్స్ తో నిర్మించగా బేరి జెన్కీన్స్ దర్శకత్వం వహించాడు.  
ఏఆర్ రెహమాన్(ar rehman)సంగీతాన్ని ఇష్టపడని భారతీయ సినీ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన స్వర రచనలో వచ్చిన ప్రతి పాట కూడా సరికొత్త నవ్యత తో కూడుకొని ఉంటుంది.    సంగీత దర్శకులకి కూడా వీరాభిమానులు ఉంటారని కూడా నిరూపించిన రెహమాన్ ఆస్కార్ ని సైతం అందుకొని భారతీయ సినీ రంగానికి ఎనలేని కీర్తిని గడించేలా చేసాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రెహ్ మాన్  తన కెరీర్ లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతు 1985 ,86 మధ్య జరిగిన ఒక సంఘటన సంగీతం విషయంలో నన్నెంతో మార్చేసింది.గతంలో మా బ్యాండ్ లో చాలా మంది మెంబర్స్ ఉండేవాళ్ళు.అందులో గిటారిస్ట్ గా పని చేసే ఒక వ్యక్తి బాగా తాగొచ్చి నువ్వు ఏం ప్లే చేస్తున్నావో అర్ధమవుతుందా,సినిమా మ్యూజిక్ ప్లే చేస్తున్నావు అని చులకనగా మాట్లాడాడు. అప్పుడు నాకు  కొంచం బాధగా అనిపించినా కూడా,అతను చెప్పిన మాట అప్పుడు నాకు అర్ధం కాలేదు. కాని ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి వారం రోజుల సమయం పట్టింది.అతను చెప్పిన మాటల ప్రకారం నా సంగీతంలో నేను వర్క్ చేసిన కంపోజర్ల ప్రభావం నాపై ఉందని అర్ధమయ్యింది.దాంతో నాకంటూ సొంతంగా ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకోవాలనున్నాను. అలా చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చాడు. రెహ్ మాన్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(buchibabu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి వర్క్ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు సాంగ్స్ రికార్డింగ్ కూడా  అయ్యాయని రెహ్మాన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు.ఇటీవల తన భార్య సైరా భాను నుంచి రెహ్ మాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  
రామ్ కిరణ్(ram kiran)మేఘ ఆకాష్(megha akash)జంటగా నటిస్తున్న చిత్రం స:కుటుంబానాం(sahakutumbanam).హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై,హెచ్.మహాదేవ గౌడ,హెచ్.నగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ శర్మ(udhay sarma)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నుంచి రీసెంట్ గా అది దా సారు'(adi da saaru)అనే పల్లవి తో సాగిన లిరికల్ వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది.ప్రముఖ అగ్ర నిర్మాత, ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఆ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.  సామాన్య అంశాలను జోడిస్తూ స్టార్ రైటర్ అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం జరిగింది.పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి నెక్స్ట్ లెవెల్ లో లిరిక్స్ ఉన్నాయనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పలువురి నుంచి వినిపిస్తున్నాయి.భాను మాస్టర్ కొరియోగ్రఫీ ని అందించగా ట్యూన్ కి బీట్ కి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసిన స్టెప్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.భాను మాస్టర్ కి ఈ సాంగ్ మంచి పేరు కూడా తెస్తుందనే మాటలు విన్పడుతున్నాయి.పలు సినిమాల్లో ఇప్పటికే హీరోయిన్ గా చేసిన మేఘా ఆకాష్ లుక్ చాలా సరికొత్తగా కనిపిస్తోంది. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ లతో పాటు  రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కుటుంబం నేపథ్యంలో వస్తున్నఈ మూవీ విజయంపై చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.మధు దాసరి ఫోటో గ్రఫీ ని అందిస్థుడగా ఎడిటర్: శశాంక్ మాలి,కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పోలాకి,ఆర్ట్ డైరెక్టర్: పి.ఎస్. వర్మ,ఫైట్ మాస్టర్స్: అంజి, కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కుమార్ పద్మనాభ, కొరియోగ్రాఫర్ : భాను మాస్టర్,లైన్ ప్రొడ్యూసర్ : అంకిత్ కనయ్,పిఆర్ఓ: మధు VR  
సంగీతదర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్‌. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.   కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాత. రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల  సహ నిర్మాతలు. రామచంద్రమ్‌ పుణ్యమంతుల,టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్‌ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్, మెహబూబ్‌ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న ఈ సినిమాకి సంగీతం– రఘుకుంచే, డిఓపి– సాయికుమార్‌ దారా ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల కోడైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల పిఆర్‌వో–మూర్తి మల్లాల   కథ,కథనం, మాటలు, దర్శకత్వం– చైతన్య మోటూరి
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.జరిగిన ఈ ఘోరానికి హీరో అల్లు అర్జున్(allu arjun)తో పాటు పుష్ప టీం రెండు కోట్ల రూపాయలని ఇచ్చింది.ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు(dil raju)అయితే  రేవతి భర్తకి సినిమా ఇండస్ట్రీలోనే పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇక రేవతి కేసుకి సంబంధించి డిసెంబర్‌ 13న నాంపల్లి కోర్టు అల్లుఅర్జున్ కి రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత  హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.దీంతో రిమాండ్‌ పూర్తి తర్వాత ప్రాసెస్‌లో భాగంగా అల్లుఅర్జున్ ఈ రోజు కోర్టులో హాజరు కానున్నాడు.ఈ సందర్భంగా పోలీసులు కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని హై కోర్టు పర్మిషన్ తో పోలీసులు విచారణ చేసారు. ఆ సమయంలో తొక్కిసలాటకి సంబంధించిన వీడియోస్ ని అల్లు అర్జున్ కి చూపించగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురి కావడం జరిగింది.  
భారతదేశపు పదమూడవ ప్రధానమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలని ప్రవేశపెట్టి, ప్రజల యొక్క స్థితి గతులని మార్చేసిన రాజకీయ ఉద్దండుడు మన్మోహన్ సింగ్(manmohan singh) రెండు పర్యాయాల పదవి కాలంలో మాటలతో కాలక్షేపం చెయ్యకుండా చేతలతో తన సత్తా చాటి అంతర్జాతీయంగా భారతదేశపు యొక్క కీర్తి పతాకాన్ని మరింతగా విశ్వవ్యాప్తం చేసాడు. అంతటి మహోన్నత వ్యక్తి  అయిన మన్మోహన్ సింగ్ నిన్న ఢిల్లీ లోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సోషల్ మీడియా వేదికగా మన్మోహన్ సింగ్ మరణంపై స్పందిస్తూ దేశంలో ఉన్న గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు.వరుసగా రెండు సార్లు ప్రధానిగా పని చేసిచరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు.అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడుగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మన దేశానికి కూడా అయన మృతి తీరని లోటు.ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసాడు. ఇక మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26 న ప్రస్తుత పాకిస్థాన్ ప్రొవిజన్స్ లోని 'గా' అనే గ్రామంలో జన్మించాడు. ఆయనకి ముగ్గురు సంతానం కాగా  భార్య పేరు గురుశరన్ కౌర్ కొహ్లీ.  
  మూవీ : రహస్యం ఇదమ్ జగత్ నటీనటులు: రాకేశ్, స్రవంతి, మానస వీణ, భార్గవ్, కార్తీక్ తదితరులు ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్ మ్యూజిక్: గ్యాని సినిమాటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్ నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్ ఓటీటీ: ఈటీవి విన్ కథ: అభి (రాకేశ్) విదేశాలలో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి అకీరా (స్రవంతి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన తండ్రి చనిపోవడంతో, అకీరా ఇండియా వెళ్లడానికి సిద్ధమవుతుంది. అకీరాను విడిచి తను ఉండలేనని భావించిన అభి, ఆమెతో పాటు తను కూడా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అంతకుముందు ఇద్దరు కలిసి సరదాగా కార్లో ఒక ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ లో అరుణి, కళ్యాణ్, విశ్వతో  పరిచయమవుతుంది. తప్పనిసరి పరిస్థితులలో వాళ్లంతా ఒకరాత్రి ఒక ఇంట్లో ఉండవలసి వస్తుంది. 'అరుణి' కి టైమ్ ట్రావెల్ .. వామ్ హోల్ .. మల్టీ యూనివర్స్ అనే అంశాలపై అవగాహన ఉంటుంది. అందుకు సంబంధించిన విషయాలపై ఆమె పరిశోధన కూడా చేస్తుంటుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. అభి, విశ్వ మధ్య గొడవకి కారణమేంటి? అరుణి చేసిన ప్రయోగం ఏంటి? అకీరాకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ ని లింక్ చేస్తూ ఓ చిన్న ప్రేమకథని చూపించాలనుకున్నాడు దర్శకుడు. అయితే ఇది సామాన్య ప్రేక్షకుడి ఊహాశక్తికి మించి ఉంటుంది. అంటే మొదటగా విశ్వ ఎందుకు హీరో మీద కోపంగా ఉంటాడో అర్థం కాదు.  ఆ తర్వాత అరుణి మాటలని అలా ఎలా నమ్ముతుంటారో అర్థం కాదు. సినిమాని స్కిప్ చేసి చూస్తే అసలేం అర్థం కాదు.. స్కిప్ చేయకుండా చూసే అంత ఓపికా ఎవరికీ ఉండదు.  సినిమా మొదలవ్వగానే ఇదేదో డాక్యుమెంటరీలా‌ ఉందే అనిపిస్తుంది. ఓ నలభై నిమిషాల తర్వాత అమెరికాలో ఉండే కొంతమంది తెలుగువాళ్ళు కలిసి షార్ట్ ఫిల్మ్ తీసి దానిని యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేశారా అనిపిస్తుంది. అంత స్లో‌గా ఉంది. మధ్యలో మైథలాజికల్ ని ఎందుకు తీసారో? సైన్స్ ఫిక్షన్ ను ఎందుకు వాడారో మేకర్స్ కే తెలియాలి. ఒకానొక‌ సందర్భంలో ఏదీ నిజం.. ఏది ప్రస్తుతం అర్థం కాదు.. గజిబిజి సుడోకు పజిల్ లా స్క్రీన్ ప్లే సాగుతుంది. కథలోని పాత్రల పర్ఫామెన్స్ పెద్దగా ప్రభావం చూపకపోవడం.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం పెద్ద మైనస్.‌ మైథలాజికల్ అంశం బాగున్నప్పటికి దానికి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో‌ మేకర్స్ ఇంకా జాగ్రత్త వహించాల్సింది. కొన్ని హాలివుడ్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి ఇన్ స్పైర్ తీసి‌నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ మధ్య కారణాలు లేకుండా గొడవలు పడటం.. కొన్ని సీన్లు ఎందుకున్నాయో అర్థం కాదు. అడల్డ్ సీన్లు లేవు. గ్యానీ మ్యూజిక్ ఓకే. టేలర్ బ్లూమెల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: రాకేశ్ పాత్రలో అభి, స్రవంతి పాత్రలో అకీరా ఆకట్టుకున్నారు. అరుణిగా మానస వీణ తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా :  ఓపికకి పరీక్ష పెట్టే రహస్యం ఇదమ్ జగత్ రేటింగ్: 1.75 / 5 ✍️. దాసరి   మల్లేశ్
Cast: Kichcha Sudeep, Varalaxmi Sarathkumar, Samyukta Hornad, Sukrutha Wagle, Anirudh Bhat, Sunil, Ilavarasu, Redin Kingsley Crew:  Cinematography by Shekhar Chandra Edited by S. R. Ganesh Baabu Music by B. Ajaneesh Loknath Produced by Kalaippuli S. Thanu, Sudeepa Directed by Vijay Karthikeyaa Kichcha Sudeep has a good following in Telugu states as he made a great impression with Eega movie directed by SS Rajamouli. He has been acting in different languages even though he hails majorly from Kannada Cinema. The highly popular actor has come up with an high voltage action entertainer Max for Christmas holidays. The movie released in original language on 25th December and in Telugu on 27th December. Let's discuss about the film in detail.  Plot:  Inspector Arjun Mahakshay(Sudeep) known as Max, gets suspended for two months and transferred to another police station. On the day, he is taking charge, he arrests two local MLA sons and they die in the lock-up. As the MLAs are influential and have capability to topple CM, local police are completely shaken. In fear, they try to save themselves. Gangster Ganesh aka Gani(Sunil) and Inspector Roopa(Varalaxmi Sarathkumar) gets involved. How Max will solve this issue in 12 hours forms the rest of the story.  Analysis:  Kichcha Sudeep is good and in form as an action hero. His screen presence and look are believable as a mass action hero. His style of dialogue delivery and daredevil attitude does engage us. But the movie needed to carve out his character even better as it looks like bang an action episode after a point. Varalaxmi Sarathkumar, Sunil did their best but Sunil's voice has been dubbed by someone else and we miss the connect. All others also did well.  The movie seems to be inspired heavily from Lokesh Kanagaraj's films in setting up an action sequence and even executing it. Mainly, Kaithi influence is visible even in the action set pieces and set design. But the makers seems to have deliberately deviated from some of the emotional beats that Karthi's film touched to make it even more bloody actioner. So, the characters don't really stay with us after the movie finishes.  Technical values are outstanding. Production design, cinematography and editing streamline the movie as a one huge action set piece divided into episodes. While few episodes are engaging, few feel like the makers have gone overboard. Gallons and gallons of bloodshed is seen on the screen but innovativeness in action set pieces vanishes as the film goes on. At the attempt level, we can say, it is nice from Kannada Cinema.  Ajaneesh Loknath has gone loud for this one and it seems like hero worship vehicle after a point. Movie is aimed at action lovers and it will find takers but a strong core and emotional depth would have made this movie much more better. With it ending up being a film that happens in 12-hours and in one night, the inventiveness could have made it even better. Still, watchable for Sudeep.  In Conclusion:  Max goes a little bit overboard in action tiring us after a point.  Rating: 2.5/5 
Pushpa 2 The Rule film starring Allu Arjun, Rashmika Mandanna has become the key factor in Telangana State and TFI discussions, recently. The stampede occured during movie premiere night on 4th December at Sandhya Theatre, has stirred up a huge storm that entire TFI met CM Revanth Reddy.  While on one hand, such issues are going on, movie is continuing to create huge records. Movie has collected Rs.1705 crores gross worldwide in just 21 days. Movie has opened Rs.700 crores Nett gross collections club in Hindi markets and became first film to collect such huge amount.    It might even cross Rs.750 crores Nett gross collections, if it maintains pace till New Years' Eve. Movie team is unable to enjoy this success due to the accident but Pushpa 2 will remain a film to have created such a storm at the box office post Baahubali 2.  Now, Hindi films and stars would be looking to spreading their wings into South India for such wide reach and big grosses as Pushpa 2, showcased how universally loved character can bring audiences to theatres in large numbers. Movie is third highest grosser in Telugu states while it created Industry record in Hindi. 
  ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)రిలీజైన రోజు నుంచి అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తొలిరోజు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన విషయంలోను,కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లు సాధించిన విషయంలోను తొలి భారతీయ సినిమాగా నిలిచింది.హిందీలో ఇప్పటికే 700 కోట్ల నెట్ కలెక్షన్ ని సాధించిందంటే పుష్పరాజ్ హవాని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా పుష్ప 2 మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే 1705 కోట్ల గ్రాస్ ని అందుకున్న తొలి బారతీయ మూవీగా నిలిచింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన కేజీఎఫ్ పార్ట్ 2 (1250 కోట్లు), ఆర్ఆర్ఆర్ (1300 కోట్లు) రికార్డుని  దాటేసి  బాహుబలి 2 (1800 కోట్లు) ని బీట్ చేసే దిశగా వెళ్తుంది.బాహుబలి 2 కి టోటల్ రాంగ్ రన్ లో 1800 కోట్లు వచ్చిన దృష్ట్యా పుష్ప 2 ఆ రికార్డుని లాంగ్ రన్ లో  ఈజీగా దాటే అవకాశం ఉంది. ఇక  పుష్ప 2 ఓటిటి వేదికగా జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వార్తలపై పుష్ప 2 మేకర్స్ స్పందిస్తు పుష్ప 2 థియేటర్ రిలీజైన రోజు నుంచి యాభై ఆరు రోజుల తర్వాతే ఓటిటి లోకి స్ట్రీమింగ్ కి వస్తుందని చెప్పారు    
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.
  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన భారతదేశంలో అయితే వీటికి అస్సలు లోటు ఉండదు.  ఒక వైపు హిందూ దేవుళ్ల పూజలు,  ముస్లిం సోదరుల నమాజ్ లు,  క్రిస్టియన్ సోదరుల ప్రార్థనలతో దేశం బోలెడు సంస్కృతులు,  సంప్రదాయాలతో అలరారుతుంది. అయితే హిందువులకు ఉన్నన్ని పండుగలు ముస్లిం లకు,  క్రిస్టియన్స్ కు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.. క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించినట్టే క్రిస్మస్ కూడా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు జననంమే క్రిస్మస్ పండుగకు ఆధారం. క్రీస్తు జన్మించిన తేదీని ఖచ్చితంగా గుర్తించలేకపోయినప్పటికీ డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడం 4వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యంలో పాగన్ పండుగ అయిన "సోలిస్ ఇన్విక్టి" (అజేయ సూర్యుడు జన్మదినం)ని క్రైస్తవ పండుగగా మార్చినట్టు చరిత్రకారులు భావిస్తారు.  యేసు క్రీస్తు పుట్టుకను శాంతి, ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా  మానవత్వం, సద్గుణాలు, సమానత్వం బోధించారు. క్రిస్మస్ సంప్రదాయాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ప్రత్యేకమైన  ఆచారాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతులతో ముడిపడినప్పటికీ, కొన్ని సాధారణ సంప్రదాయాలు అన్ని చోట్లా కనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఫిర్ చెట్లు క్రిస్మస్ ట్రీగా పాపులర్ అయ్యాయి.  మొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్మనీలో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. చెట్లను నక్షత్రాలు, బొమ్మలు, మిఠాయిలతో అలంకరిస్తారు.  క్రిస్మస్ పాటలు లేదా క్యారల్స్ పాడడం సంప్రదాయమైంది. “సైలెంట్ నైట్,” “ఓ హోలీ నైట్,” “జింగిల్ బెల్స్” వంటి పాటలు ప్రసిద్ధి చెందాయి. యేసు జన్మదినం సందర్భంగా మేఘదూతలు ఆయనకు ఇచ్చిన కానులని ఆధారంగా చేసుకుని ఈ రోజున గిఫ్ట్‌లు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.   పిల్లలు  బాగా ఇష్టపడే శాంటాక్లాజ్  గిఫ్ట్‌లను అందజేస్తూ, పిల్లల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాడు. క్రిస్మస్ వేడుకలో చేసే   ప్లమ్ కేక్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి కుటుంబం తమకు తగిన వంటకాలు తయారు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటుంది. కాగితం నక్షత్రాలు, క్రిస్మస్ లైట్స్, క్రిబ్ సెట్స్ తో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇండియాలోని   క్రైస్తవులు క్రిస్మస్ ట్రీకి బదులుగా మామిడి లేదా వెదురు చెట్లను ఉపయోగిస్తారు. రంగురంగుల లైట్లు, కాగితం నక్షత్రాలతో  ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.                                     *రూపశ్రీ.
సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే.. కాదని చెప్పడం నేర్చుకోవాలి.. ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు. సరిహద్దు గీతలుండాలి.. ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి. మార్పు సాధ్యమే.. ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. "నో" అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి.. ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.                                                      *నిశ్శబ్ద
  స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న  తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ  కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం  అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల  క్యాన్సర్, మధుమేహం,  గుండె జబ్బులకు  కూడా కారణం అవుతుంది. డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్‌కి చేసినా, రన్నింగ్‌కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు,  ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి.  నిజానికి  వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో  ఫలితం ఉండటం లేదు.  బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే.. శరీర కొవ్వు  మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.  ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ  సరైన టిప్ ను ఫాలో అయితే  ఈ పని సులభం అవుతుంది. కావలసిన పదార్థాలు.. 10 గ్రాముల పచ్చి పసుపు, 4 నల్ల మిరియాలు, ఒక చెంచా సొంపు తయారీ విధానం.. పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా  మరిగించి తరువాత వడకట్టాలి. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో  కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.                                     *రూపశ్రీ.  
  జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి.  ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు.  కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పోషకాలు.. జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి.  జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి.  దీని వల్ల నిద్ర బాగా వస్తుంది. జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ  నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు.  శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది.  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు. జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం,  కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది.                                                  *రూపశ్రీ.
  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే చాలా సాధారణ సమస్య.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు అందరూ దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత,  నెలసరి సరిగా రాకపోవడం, అండాశయంలో  తిత్తులు వంటి సమస్యలను కలిగి ఉంటుంది.  దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది మహిళలు పిసిఒఎస్ గురించి, దాని వల్ల వచ్చే సమస్యలను బహిరంగంగా చెప్పలేకపోతుంటారు.  సకాలంలో వ్యాధి నిర్ధారణ,  చికిత్స లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం భారతదేశంలోనే ప్రతి ఐదుగురు కౌమారదశలో ఉన్న మహిళల్లో ఒకరు PCOSతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని అంచనా 6% నుండి 21% మధ్య ఉంటుంది. ఒక అధ్యయనంలో నిపుణులు PCOS వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి దీనికి చికిత్స  తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తి  లేదా మెదడు సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. పిసిఓయస్.. PCOS వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకునే ముందు పిసిఓయస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం..! పిసిఒఎస్ అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధి. హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఈ సమస్యలో  ఋతు చక్రం ప్రభావితమవుతుంది. ఇందులో పీరియడ్స్ అస్సలు జరగవు లేదా చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది కాకుండా ఈ వ్యాధిలో  అండాశయాల వెలుపలి అంచున ద్రవాలతో నిండిన చిన్న తిత్తులు ఉండవచ్చు. వీటిని సిస్ట్ లు అని అంటారు. PCOS యొక్క దీర్ఘకాలిక సమస్య.  ఇది  గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ముప్పులు తప్పవా? 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ సమస్య మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది.  PCOS ఉన్న స్త్రీలకు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం,  మధ్య వయసులో ఆలోచనా సామర్థ్యంలో మార్పులు ఎక్కువగా ఉంటాయట.  ఇది జీవిత నాణ్యత, కెరీర్,  ఆర్థిక భద్రతతో సహా అనేక విధాలుగా  స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిసిఓయస్ ఉన్న మహిళలలో ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం, అది కాస్తా అధిక బరువుకు కారణం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా  ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.                                   *రూపశ్రీ.