రామ్ కిరణ్(ram kiran)మేఘ ఆకాష్(megha akash)జంటగా నటిస్తున్న చిత్రం స:కుటుంబానాం(sahakutumbanam).హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై,హెచ్.మహాదేవ గౌడ,హెచ్.నగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ శర్మ(udhay sarma)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నుంచి రీసెంట్ గా అది దా సారు'(adi da saaru)అనే పల్లవి తో సాగిన లిరికల్ వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది.ప్రముఖ అగ్ర నిర్మాత, ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఆ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సామాన్య అంశాలను జోడిస్తూ స్టార్ రైటర్ అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం జరిగింది.పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి నెక్స్ట్ లెవెల్ లో లిరిక్స్ ఉన్నాయనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పలువురి నుంచి వినిపిస్తున్నాయి.భాను మాస్టర్ కొరియోగ్రఫీ ని అందించగా ట్యూన్ కి బీట్ కి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసిన స్టెప్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.భాను మాస్టర్ కి ఈ సాంగ్ మంచి పేరు కూడా తెస్తుందనే మాటలు విన్పడుతున్నాయి.పలు సినిమాల్లో ఇప్పటికే హీరోయిన్ గా చేసిన మేఘా ఆకాష్ లుక్ చాలా సరికొత్తగా కనిపిస్తోంది.
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ లతో పాటు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కుటుంబం నేపథ్యంలో వస్తున్నఈ మూవీ విజయంపై చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.మధు దాసరి ఫోటో గ్రఫీ ని అందిస్థుడగా ఎడిటర్: శశాంక్ మాలి,కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పోలాకి,ఆర్ట్ డైరెక్టర్: పి.ఎస్. వర్మ,ఫైట్ మాస్టర్స్: అంజి, కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కుమార్ పద్మనాభ, కొరియోగ్రాఫర్ : భాను మాస్టర్,లైన్ ప్రొడ్యూసర్ : అంకిత్ కనయ్,పిఆర్ఓ: మధు VR