తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు.
అవును,గతంతో పోల్చుకుంటే, భట్టి విక్రమార్క’ ఎక్కువలకు పోలేదు. గాలిలో దీపం పెట్టి, దేవుడా రక్షించు అన్నట్లు కాకుండా బడ్జెట్ అంచనాలను అంతగా పెంచలేదు. గత సంవత్సరం రూ.2.91కోట్ల బడ్జెట్’ ప్రవేశ పెట్టి, ఆశించిన అంచనాల మేరకు ఆదాయం లేక భంగ పడిన అనుభవంతో కావచ్చును, ఈసారి కొంత జాగ్రత్త పడ్డారు. అంకెల గారడీ జోలికి పెద్దగా పోకుండా బడ్జెట్ రూపొందించారు. అలాగని, పూర్తి వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ రూపొందించారా,అంటే లేదు. అనవసర గొప్పలకు పోకుండా, గత సంవత్సరపు రూ. 2.91 కోట్లకు నాలుగు శాతం అదనంగా కలిపి రూ’.3.04,965 కోట్ల అంచనాలతో బడ్జెట్’ను సమర్పించారు.
నిజానికి, అప్పులు కూడా పుట్టని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో, ఈ బరువు కూడా ప్రభుత్వానికి మోయలేని భారమే అవుతుంది.జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది, అది లేనమ్మకు కొప్పు కుదరదు. సవరమో, విగ్గో తప్పవు. రాష్ట్ర ప్రభుత్వానిది అదే పరిస్థితి, కేంద్ర ప్రభుతం కరుణించి, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి అప్పుల విషయంలో కల్పించిన వెసులు బాటు కల్పిస్తే ఏమో కానీ, లేదనే కష్టమే అంటున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుగ్వం ప్రభుత్వ భూముల మ్మకం మీద చాలా ఆశలు పెట్టుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్, అంచనాలను భారీగా,(సగటున 14 శాతం వంతున పెంచుకుంటూ పోయింది. అయితే, అలా అవాస్తవిక అంచనాలతో పెరిగిన బడ్జెట్ బరువు, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదు, అనుబహంలో తెలిసింది,. అయిన చివరి వరకు అదే పంథాలో వెళ్ళింది. అయినా, వాస్తవ వ్యయం అంచనాల దరిదాపుకు కూడా వెళ్ళలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు అప్పులు.. ఈ ఒక్క విషయంలో మాత్రం, అంచనాలను మించి అప్పులు చేశారు. అందుకే, ఇప్పడు అప్పులు కూడా పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరిందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ జనం ముందు ఘోల్లు మంటున్నారు.
అవును. నిజమే, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నట్లుగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేసింది. అందులో అనుమానం లేదు. అందుకే రాష్ట్ర అప్పుల్లో కూరుకు పోయిది. అయితే అదేదో, ఇప్పడే వెలుగులోకి వచ్చిన విషయం కాదు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో చేసిన, పెంచిన అప్పుల భారం కూడా రహస్యం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పడు ముఖ్యమంత్రి ‘విప్పి’ చెపుతున్న, అప్పుల లెక్కలే, ప్రతిపక్షంలో ఉన్నప్పడు, చెప్పారు. అంటే, రాష్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది, తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికల గెలుపే లక్ష్యంగా.కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్’కు మించి ఆరు గ్యారెంటీలను, ఇంకా ఎన్నో హామీలను ఇచ్చింది. ఇక్కడే, రాజకీయ ప్రత్యర్దులే కాదు, ఆర్థిక వేత్తలు, చివరకు సామాన్యులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. సంక్షేమా పథకాలకు పెద్ద పీత వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డే, అప్పట్లో, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని అనేవారు,. నిన్నటి బీఆర్ఎస్, ప్రభుత్వం గానీ, ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థిక క్రమశిక్షణకు ఇవ్వలేదు. సంక్షేమం ప్రభుత్వ బాధ్యత, అదే గీత దాటితే ఆర్థిక సంక్షోభం అనివార్యమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగంది అదే జరుగుతోంది. ప్రభుత్వాలు మారినా,పంథా మారటం లేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని, అప్పుల కుప్ప మారిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే చట్రంలో ముందుకుసాగుతోంది. ఒక లక్ష్యం,గమ్యం లేకుండా ఎటు పోతున్నామో తెలియకుండా, గత ప్రభుత్వం పరిచిన అప్పుల బతాలో పడిపోతోంది, అందుకే ముఖ్యమంత్రి అప్పులు పుట్టడం లేదని గగ్గోలు పెడుతున్నారు.
ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేసన అప్పుల పద్దులో, రూ. 1.53 లక్షల కోట్లు చెల్లించిందని ఆర్థిక మంత్రి స్వయంగా చెప్పారు. మరో వంక గడచిన 15 నెలల కాలంలో రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేశామని ఆయనే చెప్పారు. నిజానికి, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన దారిలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందనేందుకు ఇంతకూ మించిన ఉదాహరణ అవసరం లేదు. ఆప్రభుత్వం ఈ ప్రభుత్వానికి