LATEST NEWS
 భారత ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది.  ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం సోమవారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  2017 నుంచి భారత్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలవుతుంది. అంటే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు. పైసల్లోనే హెచ్చు, తగ్గులుండేవి.  2017 సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.16, డీజిల్‌పై రూ.2.02 పెంచింది. ఆ తర్వాత నుంచి డైనమిక్ ప్రైసింగ్ అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109 నుంచి రూ.110 మధ్య ఉండగా జిల్లాను బట్టి పైసల్లో తేడా ఉంటుంది. మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారుజాము నుంచి ఈ ధరలపై రూ.2 ఎక్సైజ్ సుంకం పెరగనుంది.  అంటే పెట్రోల్ ధర రూ.111 నుంచి రూ.112 కానుంది.  డీజిల్ ధర రూ.97.44 ఉండగా 99.44కు పెరగనుంది. రాష్ట్రాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చెరిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రూ.1 నుంచి రూ.2 వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయని ప్రజల నుంచి విమర్శలు రావడంతో కేంద్రప్రభుత్వం 2021 నవంబర్ 4వ తేదీన కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ఇంధన ధరలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు పెట్రోల్‌పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం రూ.11 కాగా, పెంచిన రూ.2తో ఎక్సైజ్ సుంకం రూ.13కు పెరగనుంది. డీజిల్‌పై రూ.8 ఉండగా తాజా పెంపుతో రూ.10కు చేరనుంది. మరోవైపు కేంద్రం పెట్రో, డీజిల్ ధరలు పెంచిందనే ప్రచారం జరిగిన కొద్దిసేపటికే కేంద్రం స్పందించింది. ఈ పెంపును ఆయిల్ కంపెనీలు భరిస్తాయని తెలిపింది. ప్రత్యక్షంగా వాహనదారుడిపై ఎలాంటి ప్రభావం చూపించదని స్పష్టంచేసింది. వాహనాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ధరలకే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ లభిస్తుందని తెలిపింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పట్టు మని పదిహేను నెలలు  కూడా కాలేదు.   ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో కొంచెం చాలా ఎక్కువగానే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో అసమ్మతి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. విపక్షాలు సరే సరి  ఆశించిన దాని కంటే ముందే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని  సంబర పడుతున్నాయి.  మరో వంక కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు  ముందిచ్చిన విలువ ఇవ్వడం లేదు. అందుకు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఒక ప్రహసనంగా మార్చడమే  నిదర్శనంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే  ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోందని అంటున్నారు.   నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదుల సంస్కృతి  కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రులపై ఫిర్యాదులు, ముఖ్యనాయకుల మధ్య వివాదాలు  కాంగ్రెస్ కల్చర్ లో ఎప్పటినుంచో ఉన్నదే అంటున్నారు.  ఒక విధంగా ముఖ్యమంత్రులు  తోక జాడించకుండా ఉండేందుకు  పక్కలో బల్లెంలా  అసమ్మతిని అధిష్టానమే ప్రోత్సహించే కల్చర్  ఇందిరమ్మ రోజుల నుంచీ ఉందని అంటారు.  నిజమే  కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి వ్యతిరేకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అంతగా పట్టించుకోని అధిష్టానం,ఇప్పడు కొంచెం సీరియస్ గానే ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా  అధిష్టానం అగ్ర నేతల దర్శనం లభించడం లేదని అంటున్నారు. మరోవంక అధిష్టానం నేతలు, అసమ్మతి నేతలకు పిలిచి మరీ అప్పాయింట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ అన్నిటినీ మించి  కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూముల వివాదం, జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ ని గట్టిగా దెబ్బ తీసిందని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా  ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు  ప్రభుత్వ వాదనలను పూర్తిగా పూర్వ పక్షం చేస్తూ చేసిన వ్యాఖ్యలు,  ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ అధిష్టానాన్ని మరింత అలర్ట్ చేసిందని అంటున్నారు. కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూముల వివాదం రాజకీయమ రంగు పులుముకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సమస్యను సీరియస్ గా  తీసుకోవడమే కాకుండా, పరిష్కా రాన్నితన చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.   అయితే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ,మీడియాలో జరుతున్న ప్రచారం మొత్తం ఫేక్ అనే భావనలోనే ఉన్నారు. ఏఐ ద్వారా కొందరు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలను సృష్టించి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని  ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇస్తున్న వివరణ ఆధారంగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మీడియా మీద కత్తులు దూస్తున్నారు. శనివారం (ఏప్రిల్ 5)  కంచ గచ్చిబౌలి వివాదంపై అధికారులతో నిర్వహించిన  సమీక్ష లోనూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్‌ కంటెంట్‌ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  మరో వంక  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కంచ గచ్చిబౌలి భూముల వివాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ ని దెబ్బ తీసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన టీపీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో శనివారం (ఏప్రిల్ 5) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా  అటవీ భూమి అవునా కాదా, గతంలో ఎమి జరిగింది వంటి సాంకేతిక అంశాల జోలికి వెళ్ళకుండా విద్యార్థుల ఆందోళనలు, భూములు చదును చేసే క్రమంలో నెమళ్లు. జింకలు ఇబ్బందికి గురైనట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మంత్రుల కమిటీని మీనాక్షి నటరాజన్‌  ప్రశ్నించినట్లు తెలుస్తోంది.   అలాగే  మంత్రులతో భేటీ అనంతరం ఎన్‌ఎఎస్ యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలతో గాంధీభవన్‌లో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె  కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని ఎవరికీ నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్‌ అధిష్టానం  ఆలోచనని స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ కోణంలో చూస్తుంటే, ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ధోరణి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్  మరి కొందరు నాయకులూ, సంస్థలతోనూ చర్చలు జరిపిన తర్వాత  అధిష్టానానికి నివేదిక ఇస్తారని  ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటయని అంటున్నారు. ఈ నేపధ్యంలో  కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎక్కడి వరకు వెళుతుంది? చివరకు ఏమి జరుగుతుంది? అధిష్టానం తీసుకునే నిర్ణయం  రాజకీయంగా ఎలాంటి విపరిణామాలకు దారి   చూపుతుంది?  ఎలాంటి ‘మార్పు’ తెస్తుంది? అన్నవన్నీ శేష ప్రశ్నలు. అయితే చివరకు ఏమి జరిగినా, ఏమీ జరగక పోయినా  అధిష్టానం దృష్టిలో  ముఖ్యమంత్రి స్కోర్ బోర్డులో ఇది మరో మైనస్ మార్క్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భాస్తున్నాయి. 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదివారం (ఏప్రిల్ 6) ఓ పేదోడి ఇట్లో నేలపై కుర్చుని సహపంక్తి భోజనం చేశారు.ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇంచక్కా కాళ్ళు మడిచి నేలపై కూర్చునే, భోజనం చేశారు. నిజానికి, ముఖ్యమంత్రి ఒక్కరే కాదు,మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, గత వారం  పది రోజులుగా, ఇలా పేదల ఇళ్లలోనే చేతులు కడుగుతున్నారు. అంటే, పేదల ఇళ్ళలో,  నేల భోజనమే చేస్తున్నారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పేదలతో కలిసి, సన్న బియ్యం విందుల్లో పాల్గొంటున్నారు. అవును, వారం పదిరోజుల క్రితం  ఉగాది పండగను పురస్కరించుకుని  కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్‌నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  స్పష్టం చేశారు. ఇక అక్కడి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం  అన్నం  వండించుకు తింటున్నారు. ఫోటోలు  దిగుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తున్నారు.  ప్రకటనల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. అయితే సన్న బియ్యం పంపిణీకి ఇంత ప్రచారం  అవసరమా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చారణా కోడికి బారణా మసాలా  అన్నట్లు కూసింత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. నిజమే విపక్షాల ఆరోపణను పూర్తిగా కొట్టివేయడం కుదరదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ  రాజకీయ ప్రచారం చేసుకోవడం అన్నది  అది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, గత కేసీఆర్ సర‘కార్’ అయినా సరి కాదు. అలా చేయడం ఆత్మ వంచన, కాదంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది.   అవును దానే దానే పే లిఖా హై ఖానేవాలే కా నామ్  అనేది లోకోక్తి. అంటే, భగవంతుని సృష్టిలోని ప్రతి గింజ పైనా  తినే వాడి పేరు రాసే ఉంటుందని  అర్ధం.  కానీ  ఇప్పడు రాజకీయ పార్టీలు ప్రతి గింజ పైనా తమ పేరు రాసుకునే వికారాలకు పోతున్నాయి.  అందుకే ఇప్పడు రాష్ట్రంలో సన్న బియ్యం వివాదంగా మారింది. పేదల కడుపులు ప్రచార వేదికలు అవుతున్నాయి. ఓ వంక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దానే దానే పే లిఖా హై రేవంత్  కా నామ్  అంటూ సన్న బియ్యం క్రెడిట్  మొత్తం తమ ఖాతాలో వేసుకుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు, దానే దానే పే లిఖా హై మోదీ కా నామ్ అంటూ క్రెడిట్ మొత్తం కేంద్రం ఖాతాలో అంటే కమలం ఖాతాలో వేసుకుంటున్నారు. నిజానికి  ఇప్పడు కొత్తగా ఉగాది నుంచి పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకంలో కానీ, ఇంతవరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం పథకంలో కానీ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ వాటా వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ  ఒక పైసా అటు ఒక పైసా ఇటుగా  ఖర్చును భరిస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళ్ళవలసిన అవసం లేదు.  అయితే  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వాలు ఖర్చు చేసేది చేస్తున్నది ప్రజల సొమ్మే కానీ, పార్టీల సొమ్ము కాదు. పజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తాయి.  నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే  సంక్షేమ పథకాల అమలుకు  తను తన జేబులోంచి రూపాయి కూడా తీయనని కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పే సందర్భంలో  రేవంత్ రెడ్డి ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారు. మేము (రాజకీయ పార్టీలు) మోసం చేస్తున్నాం  అంటూ ఎలాంటి దాపరికం లేకుండా కెమెరా సాక్షిగా  తమ అమూల్య అభిప్రాయాన్ని  స్పష్టంగా చెప్పారు. ముందు ముందు అవసరం అయితే చూసుకోవడానికి వీలుగా రికార్డు చేసి మరీ వినిపించారు. సో ..సన్న బియ్యం, దొడ్డుబియ్యం..  బియ్యం ఏదైనా, ఏ గింజ పైన అయినా, ప్రజల పేరే గానీ, పార్టీల పేరు ఉండదు. సో.. బియ్యం ఎవరివి ? పేరు ఎవరిదీ ? అనే చర్చ.. ఎవరు చేసినా  అది ఆత్మ వంచనే అవుతుంది. మోసమే అవుతుంది.
 అన్నమయ్య జిల్లాలో  సోమవారం (ఏప్రిల్ 7) జరనిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ మరణించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్‌-2 స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  రాయ‌చోటి క‌లెక్ట‌రేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  క్ష‌తగాత్రుల‌ను క‌లెక్ట‌ర్ శ్రీధ‌ర్ ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన ఎణిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు సోమవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికైన ఎనిమిది మందిలో ఏడుగురి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు.  ఇక ఎమ్మెల్యే   కోటాలో కాంగ్రెస్‌ ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు.  కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు, అలాగే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంగెలిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.  దాసోజు శ్రవణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నతి తెలియరాలేదు.  
ALSO ON TELUGUONE N E W S
Acclaimed producer Ravindra Banerjee Muppaneni of Loukya Entertainments, best-known for backing the National Award-winning film ‘Colour Photo’ and the blockbuster ‘Bedurulanka 2012’, is coming back with his next promising venture titled "Dhandoraa". The recently released "First Beat" received a tremendous response from the audience and raised anticipation around the project. After wrapping up the first schedule successfully, the team has now kick-started the second schedule in Dharipally village, located in Medak district, Telangana. This schedule will run continuously for 25 days. Actor Shivaji, who plays a key role in the film, has joined the sets and will be participating in this schedule.   Set against the rustic backdrop of rural Telangana, Dhandoraa explores the harsh realities and prevailing social evils within our society. The film features a talented ensemble cast including Navdeep, Nandu, Ravi Krishna, Manika Chikkala, Mounica Reddy, Bindu Madhavi, Raadhya, and others in pivotal roles. The film is being directed by Muralikanth, who is helming the project with a strong creative vision. The supremely talented crew members include Venkat R. Sakhamuri as the cinematographer and Mark K. Robin as the music composer. Srujana Adusumilli is the editor and Kranthi Priyam is handling the Art Direction.  Rekha Boggarrapu is working as the costume designer. Edward Stevenson Pereji is serving as the Executive Producer. Aneesg Marisetty is co-producing the project.  Disclaimer: This is a production house sponsored article. 
  నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించింది. 25రోజుల పాటు కంటిన్యూగా జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ పాల్గొంటున్నారు. 90s, కోర్ట్ వంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ వెర్సటైల్ యాక్ట‌ర్ ఇప్పుడు దండోరా చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.    రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ బీట్ వీడియోకు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.    ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వ‌ర్డ్ స్టీవ్‌స‌న్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.  
  అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. (Akhil Akkineni)   'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్.. ఎట్టకేలకు కొత్త సినిమా అప్డేట్ ఇస్తున్నాడు. అఖిల్ తన ఆరవ సినిమాని 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో చేస్తున్నాడు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రేపు(ఏప్రిల్ 8) విడుదల కానుంది. ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కుతోందట. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. (Lenin)   అఖిల్, శ్రీలీల ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు. అఖిల్ ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో హీరోగా నటించగా, అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగతా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఇక 'ధమాకా', 'భగవంత్ కేసరి' సినిమాలతో ఆకట్టుకున్న శ్రీలీల.. ఇటీవల వరుస పరాజయాలను చూసింది. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కోసం జత కట్టారు. మరి ఈ 'లెనిన్' వీరికి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.  
Ajith Kumar starrer Good Bad Ugly is releasing on 10th April 2025 and producer Mythri Movie Makers are releasing it on a wide scale in TN and around the world. The movie has huge anticipation among fans and movie-lovers. The bookings have been phenomenal and the makers are expecting highest opening for an Ajith starrer.    Recently, the fans of the actor have planned a huge 285-ft cutout to set a big record. But the cutout collapsed and it caused a huge uproar on social media. Many asked the government to ban such huge standees and cutouts near theatres as they can cause irrevocable damage and loss of lives.  Despite this huge setback, Ajith Kumar fans have decided to continue their planning to make Good Bad Ugly release a major event. They are planning DJ nights and all sorts of old film standees at theatres, the day before release. They are also planning to go on rallies on the night before release across TN.    The movie has been able to create phenomenal level craze among fans and even in Overseas markets the bookings are huge. The makers have planned widest release for a Ajith film all over and expecting for a Day-1 record breaking collection in Tamil Nadu.    Adhik Ravichandran being a fan of Ajith, has promised a complete meal packaged for fans while common audiences will also be thrilled with the film. Simran, Trisha, Prasanna, Arjun Das, Sunil are playing important roles in the film stuffed with mass commercial elements. 
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman khan)ఈద్ కానుకగా మార్చి 30 న 'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవి చూసి సల్మాన్ అభిమానులని ఎంతగానో నిరాశపరిచింది.దీంతో సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ఎలాంటి కథాంశంతో తెరకెక్కిస్తాడనే ఆసక్తి  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఈ క్రమంలో తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'భజరంగీబాయ్ జాన్'(Bajrangi Bhaijaan)కి సీక్వెల్ తెరకెక్కించే యోచనలో సల్మాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ వార్తలకి బలం చేకూర్చేలా మొదటి పార్ట్ కి కథని అందచేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో సల్మాన్ చర్చలు జరుపుతున్నాడు.ఫస్ట్ పార్ట్ దర్శకుడు కబీర్ ఖాన్ నే సీక్వెల్ కి దర్సకత్వం వహిస్తున్నాడని,ఆల్రెడీ మూవీ కి సంబంధించిన పనుల్లో ఉన్నాడని కూడా తెలుస్తుంది.సీక్వెల్ పై త్వరలోనే ప్రకటన కూడా రానుందని బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 'భజరంగీ బాయ్ జాన్' 2015లో ప్రేక్షకుల ముందుకు రాగా పాకిస్థాన్ కి చెందిన షాహిదా అనే ఆరేళ్ళ పాప తప్పిపోయి ఇండియాకి వస్తుంది. ఆ పాపని అక్కున చేర్చుకొని తన కన్నవాళ్ళ దగ్గరకి పంపించే భజరంగీ క్యారక్టర్ లో సల్మాన్ ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.కరీనా కపూర్,నవాజుద్దిన్ సిద్ధికి,హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించారు.సల్మాన్,రాక్ లైన్ వెంకటేష్ 75 కోట్లతో నిర్మించగా 918 కోట్లపైనే వసూలు చేసింది.దీన్ని బట్టి చిత్ర విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.    
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు సానా(Buchibabu Sana)దర్శకత్వంలో'పెద్ది'(Peddi)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్  నిన్న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 36 .05 మిలియన్ల  వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ జాబితాలో ఉన్న దేవర 26 .17 మిలియన్లు, పుష్ప 2 20 .45 మిలియన్ల వ్యూస్ రికార్డుని 'పెద్ది' దాటేసాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్  చేస్తున్నారు.పెద్ది గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ కి తనతో పాటు చిత్ర బృందం మొత్తం ఎంతో ఆనందపడుతుందని  చరణ్  తెలిపాడు. చరణ్ సరసన జాన్వీ కపూర్ జత కడుతున్న 'పెద్ది'లో  కన్నడ స్టార్ హీరో  శివరాజ్ కుమార్(SivarajKUmar)తో పాటు జగపతిబాబు,దివ్యేంద్రు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)మ్యూజిక్ అని అందిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది.2026 మార్చి 27 చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.      
  "మేము మేము బాగానే ఉంటాం" అని హీరోలు అంటూనే ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అభిమానులు గొడవలు పడుతూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ పై అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.   అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఆర్య-2' మూవీ ఈ వారం రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రదర్శించబడుతున్న ఒక థియేటర్ వద్దకు పవన్ కళ్యాణ్ అభిమాని వచ్చి "బాబులకే బాబు కళ్యాణ్ బాబు" అని నినాదాలు చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అతనిపై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు. అంతేకాదు, అతని చేత "జై బన్నీ" అని నినాదాలు చేయించడమే కాకుండా, డ్యాన్స్ చేయాలని ఒత్తిడి కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా, అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.   చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడు. మెగా, అల్లు వేరువేరు కాదు.. ఒకటే అన్నట్టుగా మొన్నటివరకు అభిమానులు ఉండేవారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి వీరి మధ్య దూరం పెరిగింది. నిజానికి మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు. అభిమానులు మాత్రం అవసరంగా గొడవలకు దిగుతున్నారు.   ఒక హీరో సినిమాకి వచ్చి, ఆ హీరో అభిమానులను రెచ్చగొట్టేలా.. వేరే హీరో పేరుతో నినాదాలు చేయడం తప్పు. అలాగే ఆ నినాదాలు చేసిన వ్యక్తిని ఒంటరిని చేసి దాడి చేయడం కూడా అంతే తప్పు. అసలు అభిమానులకు ఒకరిపై ఒకరికి ద్వేషం ఎందుకు? ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ఏం సాధిస్తారు?. హీరోలు ఒకరినొకరు మాటలు అనుకోవట్లేదు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవట్లేదు. మరి అభిమానులు ఎందుకు ఇలా రోడ్డెక్కుతున్నారు?.   మెగా, అల్లు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒక్కటే. ఆ రెండు ఫ్యామిలీలు.. ఫంక్షన్స్, పార్టీలలో బాగానే కలుస్తుంటాయి. ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా మాట్లాడుతుంటారు. కానీ, అభిమానులకు ఏమైంది? ఎందుకు గొడవలు పడుతున్నారు?. పోనీ ఆ రెండు కుటుంబాల మధ్య ఏదో వార్ ఉందని కాసేపు అనుకుందాం. ఉంటే మాత్రం.. అభిమానులకి గానీ, వారి కుటుంబాలకు గానీ వచ్చే నష్టమేంటి?. గొడవలతో తమ జీవితాలను నాశనం చేసుకోవడం తప్ప.. అటు హీరోలకి కానీ, ఇటు అభిమానులకి కానీ ఒరిగేది ఏముంది?.   ఈ విషయంపై మెగా, అల్లు కుంటుంబ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. చిరంజీవి, అల్లు అరవింద్ వంటి వారు మీడియా ముందుకి వచ్చి.. అభిమానుల మధ్య గొడవలకు బ్రేక్ పడేలా చేయాలి. లేదంటే భవిష్యత్ లో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది.  
Allu Arjun has become Icon Star of Indian Cinema with Pushpa 2 The Rule. He delivered a huge blockbuster that broke many records. Now, the actor is working with a sensational director like Atlee for his next. The movie is said to be catering to global audiences with science fiction theme.  According to sources from Tamil Media, the movie will be a space travel drama with parallel universe concept being explored. While the director previously planned it as a two big star leads film, Allu Arjun did not much interest in multi-starrer it seems. Now, it will have Allu Arjun in a double role for the first time.  Also, the movie plot with space travel and parallel universe concept will be a first for Indian Cinema. There will be many iconic scenes that will be etched in Indian Cinematic history, it seems. Sun Pictures, the production house, have stated, "A Magnum Opus where mass meets Magic".  So, some are predicting that the film could contain magical elements than space travel and parallel universe. But major sources state that Atlee wants to try something unique that caters to global audiences and not just Indian audiences with commerical template intact.  The director tried sports drama in commerical mass formula with Bigil and a social message film with magician as one of the leads with Mersal. So, it would be interesting to see if he would really attempt such high end sci-fi elements in this big budget film. The official confirmation about the film and concept will be revealed on Allu Arjun's birthday, tomorrow, 8th April. 
తమిళ సూపర్ స్టార్ అజిత్ అప్ కమింగ్ మూవీ 'గుడ్ బాడ్ అగ్లీ'(Good Bad Ugly).ఏప్రిల్ 10 న తమిళ,తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ కి 'అధిక్ రవిచంద్రన్'(adhik Ravichandran)దర్శకుడు కాగా త్రిష(Trisha)ప్రభు,అర్జున్ దాస్,ప్రసన్న,సునీల్,యోగిబాబు,రెడీన్ కింగ్ స్లే,జాకీ ష్రఫ్,ప్రియాప్రకాష్ వారియర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రీసెంట్ గా 'గుడ్ బాడ్ అగ్లీ'తెలుగు ట్రైలర్ రిలీజ్ అవ్వగా 'ఏకే' అనే క్యారక్టర్ లో అజిత్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది.దమ్ము నా కోసం వదిలిపెట్టా,మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా.వయలెన్స్ నా కొడుకు కోసం వదిలిపెట్టా.కానీ నా కొడుక్కి ఆపద వస్తే వదిలింది పట్టుకోవాలిగా అని అజిత్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో ప్రధాన హైలెట్ గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్ తో మూవీ ఏ లక్ష్యం కోసం తెరకెక్కిందో కూడా అర్థమైపోతుంది.మూవీలోని మిగతా క్యారక్టర్ లు కూడా ఏకే గురించి రకరకాలుగా చెప్పడం,'ఐ యామ్ బాడ్ బాయ్' అని అజిత్ చెప్పడం క్యూరియాసిటీని కలిగిస్తుంది. ట్రైలర్ ఆసాంతం డైలాగులు కూడా చాలా ఆసక్తికరంగా ఉండి,అభిమానులకి,ప్రేక్షకులకి కావాల్సినంత సినీ వినోదాన్ని అందించడం పక్కా.తెలుగు అగ్ర నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలైన రవిశంకర్,నవీన్ సుమారు 250 కోట్ల బడ్జెట్ తో అజిత్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.జి వి ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని అందించగా అభినందన్ రామానుజం ఫొటోగ్రఫీ అందించాడు.  
  'పుష్ప-2'తో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ప్లేస్ లోకి అనూహ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ షూట్ ను బన్నీ త్వరలో ప్రారంభించనున్నాడు. దీంతో త్రివిక్రమ్ సినిమా సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. (AA22)   అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు వచ్చాయి. 2023 జులైలో వీరి కాంబోలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. 'పుష్ప-2' తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదేనని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, అనుకోకుండా అట్లీ మూవీ తెరపైకి వచ్చింది. దీంతో ఏడాదికి పైగా అల్లు అర్జున్ సినిమా కోసం ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ ఏం చేస్తాడు? మరికొంత కాలం ఎదురుచూస్తాడా? లేక వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడా? అనే చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేసే అవకాశముందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.   బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మైథలాజికల్ ఫిల్మ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా సమయం పడుతుంది. పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్లాలనే ఆలోచనలో టీం ఉందట. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ మీద వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట. కొద్ది నెలలు ఆలస్యంగా షూట్ స్టార్ట్ అయినా.. షూట్ తక్కువ టైంలోనే పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారట. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకోనున్నారని సమాచారం.    ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం.. త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కానున్నారనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి ఫోకస్ ని అల్లు అర్జున్ సినిమాపైనే పెడుతున్నారు. త్రివిక్రమ్ కి పురాణాలపై పట్టు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీతో చేయనున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్ తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవికాలం అంటే అందరికి మామిడి పండ్లు గుర్తు వస్తాయి.  మామిడి పండ్ల వాసన నుండి రుచి వరకు ప్రతిదీ ఆకర్షిస్తుంది.  పసుపు రంగులో బాగా పండిన మామిడి పండ్లను తినకపోతే వేసవికాలానికి న్యాయం చేసినట్టే అనిపించదు.  అయితే మామిడి పండ్లు ఎంత రుచిగా ఉంటాయో.. కొందరికి అంతే చేటు చేస్తాయి.  మామిడి పండ్లు మిగతా పండ్ల లాగా ఆరోగ్యానికి చాలా మంచివే అయినా.. కొందరు మామిడిపండ్లు తినడం ఎంత మాత్రం మంచిది కాదు.  పండ్లలో రాజైన మామిడి పండులో ఉండే పోషకాలు ఏంటి? మామిడి పండును ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే విషయం తెలుసుకుంటే.. పోషకాలు.. మామిడి పండ్లలో విటమిన్-సి,  విటమిన్-ఎ,  విటమిన్-బి9,  విటమిన్-ఇ, ఫైబర్, పొటాషియం,  ఐరన్,  కాపర్,  మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు  ఉన్నాయి.  ఈ పోషకాలు శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి.  అయితే మామిడి పండ్లను అందరూ తినడం మంచిది కాదు.   మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి.  ఈ సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.  మధుమేహం ఉన్నవారు,  కుటుంబంలో మధుమేహం సమస్య ఇప్పటికే ఉన్నవారు మామిడి పండ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మధుమేహం ఉన్నవారు అయితే అసలు తినకూడదు. ఇటీవల కాలంలో పొట్ట సంబంధ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి.  వాటిలో గ్యాస్,  అసిడిటీ,  మలబద్దకం మొదలైనవి ముఖ్యమైనవి.  ఇవి  పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తున్నాయి.  ఈ సమస్యలు ఉన్నవారు మామిడి  పండ్లు తినకపోవడమే మంచిది.  మామిడిపండ్లను తింటే పై సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇప్పట్లో చాలా పెరుగుతున్నాయి.  ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు,  చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు,  జీవక్రియ చాలా బలహీనంగా ఉన్నవారు.  అంటే తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లను తినకపోవడం మంచిది.  ఎందుకంటే మామిడి పండ్లు పై సమస్యలను ఎక్కువ చేస్తాయి. లేటెక్స్ కు అలెర్జీ ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదు.  ఎందుకంటే మామిడి పండ్లలో ఉండే పోషకాలు,  ప్రోటీన్లు.. లేటెక్స్ లో ఉండే ప్రోటీన్ల మాదిరిగానే ఉంటాయి.  అందుకే మామిడి పండ్లను తింటే ఈ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లు తినే విషయంలో చాలా జాగ్రత్త పడాలి.  ఎందుకంటే మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కరెలు ఉంటాయి.  కేలరీలు ఎక్కువ ఉంటాయి.  మామిడి పండ్లను ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవి కాలం వచ్చేసరికి శరీరంలో నీటి లోపం, డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. మండే ఎండలు,  తేమతో కూడిన వేడి కారణంగా అలసట, నీరసం,  చిరాకుగా అనిపించడం సర్వసాధారణం. చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ఎనర్జీగా వెళతారు.  తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాడిపోయిన తోటకూర కాడలా కనిపిస్తారు.  అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం  కేవలం నీళ్లు తాగితే సరిపోదు. ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తీసుకోవాలి.  ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వేసవిలో తీసుకునే  జ్యూస్‌లు  శరీరాన్ని చల్లబరచడమే కాకుండా  శక్తిని కూడా ఇస్తాయి. ఈ మండే ఎండలో శరీరాన్ని తాజాగా ఉంచే మూడు జ్యూస్‌ల గురించి తెలుసుకుంటే.. పుచ్చకాయ నీటి కొరతను తొలగిస్తుంది.. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో ఉత్తమమైన హైడ్రేటింగ్ పండుగా మారుతుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్లు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుద్ది  చేయడమే కాకుండా హైడ్రేషన్ స్థాయిని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇది శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం ఇస్తుంది. చర్మాన్ని తాజాగా,  ప్రకాశవంతంగా ఉంచుతుంది. పుచ్చకాయ ముక్కలను మిక్సర్‌లో వేసి, కొంత నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి.  కావాలంటే దానికి నల్ల ఉప్పు,  కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు. కొబ్బరి నీరు సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి.. వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  నిమ్మరసంతో కలిపి తాగినప్పుడు ఇది అద్భుతమైన శక్తిని పెంచే పానీయంగా మారుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వేడి,  వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ, నల్ల ఉప్పు కలిపి తాగవచ్చు. దోసకాయ తాజాదనాన్ని కాపాడుతుంది.. దోసకాయలో 96 శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి చల్లదనాన్ని అందిస్తుంది. అదే సమయంలో పుదీనా సహజ శీతలీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. దోసకాయ శరీరంలో తాజాదనాన్ని కాపాడుతుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా   నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది,  జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దోసకాయ తొక్క తీసి ముక్కలుగా కోసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేయాలి. దాన్ని ఫిల్టర్ చేసి చల్లబరిచి త్రాగాలి.                                  *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...