తెలంగాణలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో పెద్దపల్లి జిల్లాలో 17 ఏళ్ల యువకుడిని ఆ అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ అదే గ్రామానికి చెందిన సదయ్య కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన సదయ్య కోపంతో రగిలిపోయాడు.  చదువు సంధ్యలు లేకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న సాయికుమార్ తన కుమార్తెతో ప్రేమలో పడటం సదయ్యకు నచ్చలేదు. మందలించినా ఫలితం లేకపోవడంతో సాయికుమార్ ను గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. తన పుట్టిన రోజును స్నేహితులతో జరుపుకుంటున్న సాయికుమార్ ను సదయ్య గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (మార్చి 28) చెన్నైకు బయలు దరి వెళ్లారు. అక్కడ జరిగే అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిల్ లో ఆయన ప్రసంగిస్తారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై మీనంబాకం ఓల్డ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు చెన్నైలోని తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక మద్రాస్ లోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అసంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు చెన్నై పర్యటనకు వెళ్లడం  ఇదే తొలిసారి.
ఏం కష్టమొచ్చిందో? ఎంతగా నలిగిపోయిందో.. ఆ తల్లి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ తీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చోటు చేసుకుంది. అమీన్ పూర్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించింది. ఈ తరువాత తానూ తిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ముగ్గురూ మరణించగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరణించిన పిల్లలు  సాయికృష్ణ‌(12), మ‌ధుప్రియ‌(10), గౌత‌మ్‌ (8)ల‌ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.   పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించి, తానూ తిన్న రజిత.. భర్త చెన్నయ్యకు మాత్రం విషం కలిపిన పెరుగన్నం పెట్టకుండా పప్పు అన్నం మాత్రమే పెట్టింది. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణం గానే ర‌జిత ఈ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టిన‌ట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Cast: Chiyaan Vikram, Dushara Vijayan, SJ Suryah, Prithvi, Suraj Venjaramoodu Crew:  Cinematography by Theni Eswar Music by G.V. Prakash Kumar Editing by GK Prasanna  Written & Directed by SU Arun Kumar  Produced by Riya Shibu, Mumtaz  Chiyaan Vikram starrer Veera Dheera Soora released after a long hurdles and postponements. The movie had to face court issues and major amount financial troubles even on the release date but finally, it saw the light of day. The movie is directed by Chittah/Chinna fame SU Arun Kumar and let's discuss about the film in detail.  Plot:  Ravi aka Peddayana (Prithvi) is a huge name in the village and one lady creates a scene at their house. The case goes to SP (SJ Suryah) and he tries to encounter both Ravi and his son, Kanna (Suraj Venjaramoodu). Knowing this, Ravi goes to Kaali (Chiyaan Vikram) for help asking to kill SP, who left a life of goon behind. What will Kaali do now? Will he be a collateral in their fight or will he emerge victorious? Watch the film to know more.  Analysis::  Chiyaan Vikram looks fit and handsome for his age. He gave his full energy and everything he can to the role. His walking style, full beard and style all add to his performance. Dushara Vijayan is good and SJ Suryah is excellent in a role that needed him to be subtle. Prithvi and Suraj Venjaramoodu are also perfectly cast.  The film has a wafer thin plot and it engages us throughout but at times, feels a little draggy due to the runtime. The detailing and every chain reaction being captured in essence all make sense but slightly feels stretched at places.  The way he showcased how even non-violent people turn to violence to save their family and themselves towards the end in captured well. But the impact of betrayal that is hinted at in the flashback sequence is slightly low. It needed an even better scene during the meeting after years.  Few scenes and situations could have been worked out better in the second hour but it all feels like everything came to an anticipated conclusion. The movie needed a slightly better effort in writing at places but execution engages us. Still, Chiyaan Vikram is too big an actor for this to be accepted from him. Still, it is a better film from him in recent times.  In Conclusion:  Veera Dheera Soora is good in building up the tension but towards the end loses impact.  Rating: 2.5/5
  సినిమాలకు వేసవి కూడా మంచి సీజన్. ఈ టైంలో స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అయిపోతాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ తమ పిల్లలను తీసుకొని సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఎంటర్టైనర్స్ ఈ సీజన్ లో ఎక్కువగా ఆదరణకు నోచుకుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ వారం రెండు ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మార్చి 28న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు విడుదలవుతున్నాయి.   'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో శ్రీలీల హీరోయిన్. పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందిన 'రాబిన్ హుడ్'.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. (Robinhood)   నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. 2023 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందటంతో 'మ్యాడ్ స్క్వేర్'పై మంచి అంచనాలే ఉన్నాయి. (Mad Square)   ఓ వైపు హిట్ కాంబినేషన్ లో వస్తున్న 'రాబిన్ హుడ్', మరోవైపు హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'మ్యాడ్ స్క్వేర్'. రెండు సినిమాల్లోనూ కామెడీ ఉంది. 'రాబిన్ హుడ్' అనేది కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ వంటి ఎలిమెంట్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఫిల్మ్ కాగా, 'మ్యాడ్ స్క్వేర్' మాత్రం నవ్వించడమే టార్గెట్ రూపొందిన కామెడీ ఫిల్మ్. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.  
ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’ గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 300 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌చరణ్‌ సోలో హీరోగా చేసిన ‘గేమ్‌ఛేంజర్‌’ ఫ్లాప్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మాత్రం సోలో హీరోగా ‘దేవర’తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం జపాన్‌లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ‘దేవర’ చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్‌ చేస్తున్నారు. మార్చి 28న ఈ సినిమా జపాన్‌లో సందడి చేయబోతోంది. దీన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ఆ సినిమా ప్రమోషన్స్‌ కోసం జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి అభిమానుల్ని కలుసుకునే క్రమంలో ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ అయ్యే సంఘటన జరిగింది.  జపాన్‌లోని అభిమానులు ఎన్టీఆర్‌ను చూసి చుట్టుముట్టారు. అందరూ లేడీ ఫ్యాన్సే కావడం విశేషం. అందరూ ఆటోగ్రాఫ్స్‌ తీసుకుంటున్న సమయంలో ఒక అమ్మాయి ‘అన్నా.. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ చూసి తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం ఇది నేను రాసుకున్నాను. మీరు నాకు బిగ్గెస్ట్‌ ఇన్‌స్పిరేషన్‌’ అంటూ తను తెలుగు ప్రాక్టీస్‌ చేసిన బుక్‌ చూపించింది. అది చూసి ఎన్టీఆర్‌ షాక్‌ అయ్యారు. వెంటనే తేరుకొని ‘వావ్‌.. మీరే అందరికీ గొప్ప ఇన్‌స్పిరేషన్‌’ అంటూ ఆ బుక్‌లో తన ఆటోగ్రాఫ్‌ పెట్టి ఆమెను అభినందించారు.  ఆ వీడియోను తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ‘నేను జపాన్‌ సందర్శించినప్పుడల్లా నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తుంది. కానీ, ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఒక జపనీస్‌ అభిమాని ఆర్‌ఆర్‌ఆర్‌ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నన్ను కదిలించింది. సినిమా, భాషలను ప్రేమించే వ్యక్తిగా నేనెంతో సంతోషిస్తున్నాను. సినిమా అనేది సంస్కృతుల మధ్య వారధిగా ఉండడం, ఆ సినిమా శక్తి ఒక అభిమానిని ఒక భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ’ అని ట్వీట్‌ చేశారు ఎన్టీఆర్‌. 
టాలీవుడ్‌ డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. సత్యవతి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తన సంతాపాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సత్యవతి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తను చదువుకునే రోజుల్లో మాచర్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న సత్యవతి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లేవాళ్ళమని పవన్‌ పేర్కొన్నారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సత్యవతి ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రకటనలో తెలిపారు.  మెహర్‌ రమేష్‌ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన మెగా కుటుంబానికి చెందినవాడేనని అందరూ అనుకునేవారు. డైరెక్టర్‌గా ఎదిగిన తర్వాత ఎన్నో వేడుకల్లో మెహర్‌ రమేష్‌తో తమ కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి మెగాస్టార్‌ చిరంజీవి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తను డైరెక్టర్‌గా ఎదిగేందుకు మెగాస్టార్‌ పేరును మెహర్‌ ఎక్కడా ఉపయోగించలేదు. కేవలం తన టాలెంట్‌తోనే డైరెక్టర్‌గా ఎదిగారు. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే మెగా కుటుంబంతో ఆయనకు ఉన్న బంధుత్వం గురించి బయటికి వచ్చింది. డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కొన్ని ఫ్లాపుల వల్ల మెహర్‌ వెనకబడిపోయారు. ఆ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి అతనికి దర్శకుడిగా ఓ అవకాశం ఇచ్చారు. అలా మెహర్‌తో కలిసి చేసిన సినిమాయే ‘భోళాశంకర్‌’. అయితే అతనిపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సినిమా పరాజయం పాలైంది. 
  Kamakshi Bhaskarla is one of those actresses who is choosy about scripts. The actress has an impressive line up of three films. She is presently shooting for Allari Naresh’s upcoming horror thriller titled 12A Railway Colony. While Kamakshi recently wrapped up the shooting for Naveen Chandra’s breezy entertainer, she is set to commence shooting for the third instalment of blockbuster franchise Poliemera. While the actress has her kitty full of films, she relishes the act of juggling between multiple films and describes working on multiple projects is overwhelming.   “The best part is that in all the three films I play different roles, so versatility is the key to my filmography,” she explains. “Although it’s tough shooting for multiple films, the love for the work pushes me through. After all, who doesn’t love spending time on the film sets.”   Be it 12A Railway Colony or Polimera or Shaitan, her ability to bring to life on screen complex characters with nuances has been her forte.  “I think staying true to the character allowed me to explore new dimensions as an actor. I have played roles which have challenged me and pushed myself out of my comfort zone. I just follow the script and the director’s vision. I wanted to credit filmmakers who write characters for me, that’s a great validation that I have been evolving as an actor,” she says, adding that delivering captivating performances is possible through a clinical approach to filmmaking. Every role is a new journey. The prep for the character and its arc makes the process of filmmaking exciting.”  
భారతీయ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల నుంచి రచయితగా,దర్శకుడుగా,నిర్మాతగా,నటుడుగా తన సత్తా చాటుతు వస్తున్న బాలీవుడ్ లెజండ్రీ పర్సన్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap). పాంచ్,బ్లాక్ ఫ్రైడే,స్మోకింగ్,రిటర్న్ఆఫ్ హనుమాన్,ముంబై కటింగ్,ఘోస్ట్ స్టోరీస్,కెన్నెడీ,చోక్డ్,లస్ట్ స్టోరీస్ ఇలా ఇప్పటి వరకు సుమారు ఇరవై విభిన్నమైన చిత్రాలు అనురాగ్ దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.నిర్మాతగాను ఉత్తమమైన చిత్రాలని నిర్మించిన అనురాగ్ గత ఏడాది విజయసేతుపతి(VIjay Sethupati)హీరోగా తెరకెక్కిన 'మహారాజ'లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు విద్యార్థులని పుస్తకాలు చదవనివ్వడంతో పాటు సినిమాలు చూడనివ్వండి.వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది ఉదాహరణకి మనకి దర్శకుడు రాజమౌళి ఉన్నారు.ఆయన్ని చూసీ పది మంది డూప్లికేట్ రాజమౌళిలు పుట్టుకొచ్చారు.ఆయన్ని కాపీ కొట్టాలని ప్రయత్నిస్తుంటారు.కానీ ఆయన ఐడియాలు మాత్రమే ఒరిజినల్.కేజీఎఫ్ వచ్చి సక్సెస్ అయ్యింది.అందరు దానినే ట్రెండ్ గా తీసుకొని సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం.ప్రతిబంద్,శివ ఈ విధంగా చెప్పుకుంటు పోతే నా చిన్నతనం నుంచే పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా పేరు చెప్పి సరైన కథల్ని తెరకెక్కించడం లేదని చెప్పుకొచ్చాడు.     
  కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'వీర ధీర శూరన్'. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(మార్చి 27) థియేటర్లలో అడుగు పెట్టాల్సి ఉంది. విక్రమ్ అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందరో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ, విడుదల రోజు ఊహించని షాక్ తగిలింది. షో క్యాన్సిల్ అయిందని, టికెట్ మనీ రిఫండ్ చేస్తామని మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో టికెట్ బుక్ చేసుకున్నవారికి ఏం జరిగిందో అర్థంకావట్లేదు. అయితే దీనంతటికి కారణం లీగల్ సమస్యలే అని తెలుస్తోంది. (Veera Dheera Sooran)   'వీర ధీర శూరన్' మూవీ చిక్కుల్లో పడింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో ముంబైకి చెందిన ఒక కంపెనీ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ అమ్ముతామని అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాతలు.. రైట్స్ విషయం తేల్చకుండానే సినిమాని రిలీజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో 'వీర ధీర శూరన్' విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పటికే మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయ్యాయి. అసలు ఈరోజు మూవీ విడుదల ఉంటుందా లేదా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలో ఈ సినిమా వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. అయితే ఎలాగైనా ఈరోజు ఈవెనింగ్ షోల నుంచి 'వీర ధీర శూరన్'ను ప్రదర్శించేలా అడుగులు పడుతున్నాయి. కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్స్ అసోషియేషన్ రంగంలోకి దిగి వివాదానికి ఫుల్ స్టాప్ వేసే ప్రయత్నం చేస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. సాయంత్రం 6 గంటల నుంచి షోలు పడే అవకాశముంది.  
  సినిమాపేరు:L 2 ఎంపురాన్   నటీనటులు:మోహన్ లాల్,పృథ్వీ రాజ్ సుకుమారన్,మంజువారియర్,టోవినో థామస్, అభిమన్యు సింగ్,ఆండ్రియా తివాదర్, జెరోమ్ ప్లిన్, బోరిస్ ఆలివర్, కిషోర్,ఎరిక్ ఎబోని తదితరులు   రచన:మురళి గోపి  సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్  ఎడిటర్: అఖిలేష్ మోహన్  సంగీతం: దీపక్ దేవ్  బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్,ఆశీర్వాద్ సినిమాస్, గోకులం మూవీస్  నిర్మాతలు:సుభాస్కరాన్ ,ఆంథోనీ పెరంబవుర్, గోకులం గోపాలన్ దర్శకత్వం :పృథ్వీ రాజ్ సుకుమారన్ విడుదల తేదీ:27 -03 -2025  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ లూసిఫర్.2019 లో వచ్చిన ఈ మూవీ తెలుగు నాట కూడా డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది.దీంతో ఈ రోజు లూసిఫర్ కి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎల్ 2 ఎంపురాన్ ఎలా ఉందో చూద్దాం. కథ విదేశాల్లో ఉండే ఖురేషి అబ్రహం(మోహన్ లాల్) ప్రపంచ దేశాలకి చెందిన పోలీసులతో పాటు ప్రపంచ దేశాల్ని తన కనుసైగతో శాసించే స్మగ్లర్ కబుగా(ఎరిక్ ఎబోని) కి టార్గెట్ అవుతాడు.తన పెంపుడు తండ్రి పీకే రామదాస్ స్థాపించిన ఐయుఎఫ్ పార్టీ తరుపున రామదాస్ కుమారుడు జతిన్(టోవినో థామస్) కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటాడు.ఎలక్షన్స్ దగ్గర పడటంతో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మతోన్మాది,ఏఎస్ఎమ్ పార్టీ అధినేత భజరంగ్(అభిమన్యు సింగ్ )తో పొత్తు పెట్టుకుంటాడు.పైగా పార్టీ పేరుని ఐయుఎఫ్ రామదాస్ పార్టీగా మార్చుతున్నానని ప్రకటన కూడా చేస్తాడు.దీంతో రామ్ దాస్ కూతురు ప్రియదర్శిని(మంజువారియర్) తో పాటు పార్టీలోని ప్రధాన నాయకులు,కార్యకర్తలకి జతిన్ నిర్ణయం నచ్చదు.తన తండ్రి పార్టీని,ఆశయాన్నినిలబెట్టడానికి జతిన్ కి వ్యతిరేకంగా ప్రియదర్శని ఒక నిర్ణయం తీసుకుంటుంది.దీంతో ప్రియదర్శిని ని భజరంగ్ చంపాలనుకుంటాడు.కానీ తన అనుచరుడైన జాయేద్ మసూద్(పృథ్వీ రాజ్ సుకుమారన్) చేత భజరంగ్ చంపేలా ఖురేషి ప్లాన్ చేస్తాడు.భజరంగ్ కేరళ కే ఎందుకు వచ్చి ఐయుఎఫ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు? ఆ పొత్తు వెనుక ఉన్న రహస్యం ఏంటి? జతిన్ పార్టీ పేరు ఎందుకు మార్చాడు? ఖురేషి ఎందుకు ప్రపంచదేశాలకి టార్గెట్ అయ్యాడు.జాయేద్ మసూద్ చేత భజరంగ్ ని ఎందుకు చంపించాడు?జాయేద్ మసూద్ గతం ఏంటి? ప్రియదర్శిని తన తండ్రి ఆశయం నెరవేర్చడానికి స్టీఫెన్ గా వచ్చిన ఖురేషి ఏం చేసాడు? అసలు ఖురేషి కథ ఏంటి అనేదే ఈ చిత్ర కథ  ఎనాలసిస్  మొదటి పార్ట్ లో ఖురేషి అబ్రహం గురించి లేని పూర్తి కథని పార్ట్ 2 లో వివరంగా చెప్పారు.కాకపోతే కథనాల ద్వారా చెప్పకుండా ఎలివేషన్స్ ద్వారా చెప్పారు. ఖురేషి గా మోహన్ లాల్ క్యారక్టర్ కూడా దాదాపుగా 40 నిమిషాల దాకా ఎంటర్ అవ్వదు. అంత లాగ్ అవసరం లేదని మూవీ చూస్తే అర్ధమవుతుంది.మేకర్స్ తాము అనుకున్న కథ ప్రకారం అలా అనుకోని ఉండొచ్చేమో,కానీ సగటు ప్రేక్షకుడు మోహన్ లాల్ కోసం వస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు కదా!ఖురేషి ని ఫస్ట్ ఆఫ్ లో ప్రపంచాన్నే గడగడలాడించే డాన్ గా చూపించారు.కాబట్టి దీనికి పారలాల్ గా నడుస్తున్న కేరళ రాజకీయాల్లోని సమస్యని ఖురేషి చాలా ఈజీ గా సాల్వ్ చేస్తాడనే అభిప్రాయంలోకి ప్రేక్షకులు వచ్చేస్తారు.కాకపోతే ఏ సీన్ కా సీన్ కి సంబంధించిన ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది.ఈ విషయమే ప్రేక్షకులకి మూవీ బోర్ కొట్టకుండా చేసింది.సెకండ్ ఆఫ్ లో ఆయినా ఖురేషి ని కేరళ రాజకీయాలకి పరిమితం చేసి ఎండింగ్ ని విదేశాల్లో ప్లాన్ చేసుండాల్సిందేమో. కథనాల్ని వదిలేసి స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం మూవీ తెరకెక్కించినట్టుగా ఉండటం మైనస్ గా పరిగణించవచ్చేమో.కొన్ని కొన్ని సీన్స్ లో అయితే విదేశీ సినిమా చూసినా ఫీలింగ్ కూడా కలిగింది.ముస్లిమ్ కుటుంబాన్ని చంపే సీన్ అయితే ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీళ్లు  తెప్పించింది. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు ఖురేషి అబ్రహంగా మోహన్ లాల్(MohanLal)నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.కేవలం ఖురేషి క్యారక్టర్ మాత్రమే కనపడేలా చెయ్యడంలో మోహన్ లాల్  నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు.కాకపోతే స్టీఫెన్ నడుంపల్లి క్యారక్టర్ లో కొంత సేపు కనపడినా కూడా ప్రేక్షకులు ఖురేషి గురించే చెప్పుకుంటారు.పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారక్టర్ ఉన్నా కూడా నటన విషయంలో అంతగా చెప్పుకోవాల్సిన పనిలేదు.యాక్షన్ సీక్వెన్స్ కే పరిమితమయ్యింది.మిగతా క్యారెక్టర్స్ లో చేసిన మంజు వారియర్, టోవినో థామస్, విదేశీ నటులు జెరోమ్ ప్లిన్, బోరిస్ ఆలివర్,ఎరిక్ ఎబోని కూడా బాగా చేసారు.భజరంగ్ క్యారక్టర్ లో విలన్ గా చేసిన అభిమన్యు సింగ్ మరో సారి తన సత్తా చాటాడు. పృథ్వీరాజ్ సుకుమారన్(pruthi Rajsukumaran)డైరెక్షన్ కి  అయితే మంచి మార్కులే పడతాయి.ప్రతి ఫ్రేమ్ ని విభిన్నమైన టేకింగ్ తో ప్రేక్షకులకి నచ్చేలా చేసాడు.కొన్ని షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ మూవీని ఇంకో లెవల్ కి తీసుకెళ్లాయి.నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండి మూవీ బోర్ కొట్టకుండా చేసాయి. ఫైనల్ గా చెప్పాలంటే..... కథనానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం ఎల్ 2  ఎంపురాన్(L2 Empuraan)ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది.కాకపోతే రెగ్యులర్ సినిమాలు చూసి విసుగుచెందే వాళ్ళకి నచ్చుతుందేమో.   రేటింగ్ 2 .5 / 5                                                                                                          అరుణాచలం                                                                                     
Cast: Mohanlal, Prithviraj Sukumaran, Tovino Thomas, Manju Warrier, Suraj Venjaramoodu, Abhimanyu Singh, Kishore, Indrajith Sukumaran, Nyla Usha  Crew: Written by Murali Gopy  Music by Deepak Dev Cinematography by Sujith Vaassudev Editing by Samjith Mohammed  Directed by Prithviraj Sukumaran  Produced by Anthony Perumbavoor, Lyca Productions, Gokulam Gopalan Mohanlal has delivered huge number of blockbusters and cult films over the years. The sequel of his biggest blockbuster film, Lucifer, directed by another superstar Prithviraj Sukumaran, L2 Empuraan released with huge anticipation and excitement. The movie took a gigantic opening with pre-sales itself. Let's discuss in detail about the film.  Plot:  Stephen Nedumally(Mohanlal) is nowhere to be seen in Kerala Political Picture and in 5 years, Justin Ramadass(Tovino Thomas) has become a sort of dictator in the state. He decides to join hands with ASM, a right wing political party, lead by Bajrangi (Abhimanyu Singh) with great amount of hatred towards other religious. Such destructive thought process is anti PKR ideals.  Now, everyone in the party is expecting Stephen's comeback. On the other hand, there is a personal connect with Stephen aka Abraham Kureshi with Bajrangi. Where is Abraham Kureshi and why he is under alias Stephen and who is Zayed Masood (Prithviraj Sukumaran)? Watch L2 Empuraan Movie to know more.  Analysis:  Mohanlal delivered swaggy and charismatic performance in this role. But his screen time is very less when compared to Lucifer. Still, his screen presence is enough to bring huge cheers. Prithviraj Sukumaran, Tovino Thomas, Manju Warrier and Abhimanyu Singh deliver good performances but their screen time is again low.  Murali Gopy as a writer complicates the story with his screenplay and the establishment of characters takes too much of time in the first hour. But the second hour brings everything perfectly into place yet it just seems like one action part after another.  Prithviraj Sukumaran as a narrator takes too much time in establishing every line and character with lengthy scenes. His beginning twenty minutes portion could have been shortened and several sequences just feel like over stretched at places. Mohanlal appears like an item used for effect rather than watching his story.  In any case, there is a very interesting storyline underneath yet for the announced part 3, the film seems to have been stretched and new characters and angles have been introduced for the sake. Overall, the movie has great style than the content still it is engaging for the performances and stylish narrative and bit of concentration on story wouldn't have hurt it.  In Conclusion:  Too slow narrative hurts the well planned out sequences with over emphasis on style.  Rating: 2.5/5
  మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. కానీ, ఇద్దరూ జోడీగా నటించలేదు. మహానటిలో కీర్తి టైటిల్ రోల్ పోషించగా, విజయ్ ఆంథోనీ అనే పాత్రలో సమంతకి జోడీగా విజయ్ నటించాడు. అయితే ఇప్పుడు విజయ్-కీర్తి మొదటిసారి పెయిర్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత దర్శకులు రాహుల్‌ సాంకృత్యాన్‌, రవికిరణ్ కోలాతో సినిమాలు కమిటై ఉన్నాడు విజయ్. రవికిరణ్ ప్రాజెక్ట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'రౌడీ జనార్ధన' అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా కీర్తి నటిస్తున్నట్లు తెలుస్తోంది.    2023లో వచ్చిన దసరా, భోళాశంకర్ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కీర్తి. ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. మరి ఇప్పుడు విజయ్ సరసన 'రౌడీ జనార్ధన'లో నటించి, తెలుగులో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  రంగస్థలం.. పేరు వినగానే రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఆ సినిమా స్టోరీ మొత్తం కళ్ల ముందు కదులుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నది రంగస్థలం సినిమా గురించి కాదు.  అసలైన రంగస్థలం గురించి. ప్రజలకు కనువిందు చేసే థియేటర్ ప్రాముఖ్యత గురించి,ఈ థియేటర్ అనేది కేవలం సినిమానే కాదు.. నాటకరంగాన్ని,  ఎన్నో రకాల షో లను కూడా ప్రజలకు పరిచయం చేసింది. ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా రంగస్థలం గురించి,  దీని చరిత్ర గురించి,  రంగస్థలం అభివృద్ది చెందిన విధానం గురించి తెలుసుకుంటే.. రంగస్థలం అనేది  మానవ స్వభావాన్ని వ్యక్తీకరించే సాధనంగా పనిచేస్తుంది.  మానవ అనుభవాలు,  భావోద్వేగాలలో ఉండే వైవిధ్యాలు, భావోద్వేగాలలో దాగిన విషాదం, సంతోషం,  ఈర్ష్య,  అసూయ,  జాలి, దయ.. ఇలాంటివన్నీ  లోతుగా పరిశీలించి, ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు రంగస్థలం కల్పిస్తుంది.  ఇది కేవలం వినోదం మాత్రమే కాదు..  విద్య,  సామాజిక మార్పుకు కూడా శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రాముఖ్యత.. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) 1961లో ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‌లో 1962లో "థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్"  నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి  ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగస్థల ప్రదర్శన కూడా గొప్ప కళారూపం. ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం,  ప్రభుత్వాలు, వ్యక్తులు,  సంస్థలు నాటక సమాజానికి మద్దతు ఇవ్వడానికి,  ప్రోత్సహించడానికి కృషి చేయడం. ఈ రోజున ప్రజలు అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు,  నాటక సమాజాలు కార్యక్రమాలు, అవార్డు వేడుకలు,  ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రంగస్థల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు. రోజువారీ హడావిడి జీవితాలలో థియేటర్ అనేది ప్రజలకు కొద్దిసేపు అన్ని గోలలు మరచిపోయి కాస్త వినోదాన్ని,  మరికొంద ప్రశాంతతను పంచే వేదిక. సాధారణ పౌరుడి నుండి విలాసవంతమైన జీవితం గడిపే వారి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో,  సందర్భంలో ఈ థియేటర్ తో ముడి పడి ఉంటుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు జరిగే కొన్ని కార్యకలాపాలు.. ప్రత్యేక థియేటర్ ప్రదర్శనలు.. చాలా థియేటర్లు ప్రత్యేక నాటకాలు ,  రంగస్థల ప్రదర్శనలను నిర్వహిస్తాయి. కొన్ని ప్రొడక్షన్స్ ప్రేక్షకులను థియేటర్‌తో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించడానికి ఉచిత లేదా తగ్గింపు టిక్కెట్లను అందిస్తాయి.  అంతర్జాతీయ సందేశం.. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటక రంగం ప్రముఖుడు ప్రపంచ నాటక దినోత్సవ సందేశాన్ని వ్రాసి అందజేస్తాడు.  ఇది ప్రపంచవ్యాప్తంగా పంచుకోబడుతుంది. ఈ సందేశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటక రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. కళకు తమను తాము అంకితం చేసుకున్న వారు ఈ సందర్భంగా గుర్తించబడతారు.  తగిన గౌరవం పొందుతారు.  ఇది వ్యక్తి కళను ప్రపంచానికి మరింత విస్తృతం చేయడానికి సరైన మార్గం అవుతుంది. థియేటర్ వర్క్‌షాప్‌లు,  ప్యానెల్ చర్చలు.. థియేటర్ గ్రూపులు,  సాంస్కృతిక సంస్థలు నటన, నాటక రచన,  రంగస్థల కళపై వర్క్‌షాప్‌లు, చర్చలు,  మాస్టర్‌క్లాస్‌లను నిర్వహిస్తాయి. నిపుణులు థియేటర్  పరిణామం చెందిన విధానం,   ప్రాముఖ్యతపై తమ తమ అభిప్రాయాలు,  నాటి రాలపు సంఘటనలు  పంచుకుంటారు. వీధి నాటకాలు,  బహిరంగ ప్రదర్శనలు.. సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వీధి నాటక బృందాలు బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తాయి. విశ్వవిద్యాలయాలు,  నాటక పాఠశాలలు తరచుగా బహిరంగ ప్రదర్శనలను నిర్వహిస్తాయి. నాటక కళాకారుల గుర్తింపు.. అత్యుత్తమ నాటక కళాకారులు, నాటక రచయితలు,  ప్రదర్శకులకు కళారూపానికి చేసిన కృషికి అవార్డులు , గౌరవాలు ఇవ్వబడతాయి. సోషల్ మీడియా , ఆన్‌లైన్ ప్రచారాలు.. థియేటర్ ను ఇష్టపడేవారు,  సంస్థలు,  కథలు, కోట్స్,  మరచిపోలేని ప్రదర్శనలను పంచుకోవడానికి వరల్డ్ థియేటర్ డే వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. వర్చువల్ ప్రదర్శనలు,  ప్రత్యక్ష ప్రసారం చేయబడిన థియేటర్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పాల్గొనడానికి అనుమతిస్తాయి.                                       *రూపశ్రీ.
  భారతదేశంలో వివాహం అంటే ఒక పెద్ద పండుగ.   జీవితంలో ప్రతి ఒక్కరూ ఏ సంబరానికి ఖర్చు పెట్టనంత ఖర్చు పెడతారు.  అమ్మాయి వైపు ఆలోచిస్తే.. ఒక తండ్రి తన జీవిత కాలంలో సంపాదించే సంపాదనలో దాదాపు పావు భాగం నుండి సగ భాగం వరకు కూతుళ్ల పెళ్లి కోసం ఖర్చు చేస్తారు. చాలా వరకు ఆడపిల్ల వైపే పెళ్లి ఖర్చు ఉంటుంది.  మగ పెళ్ళివారిది కూడా ఖర్చు ఉంటుంది.  కానీ ఆడపిల్ల వైపు జరిగేంత ఖర్చు మాత్రం కాదు.  ఇకపోతే ఈ ఖర్చుల గురించి నేటి యువత చాలా సీరియస్ గానే ఆలోచించి పెళ్లిళ్లను ఆడంబరంగా చేసి డబ్బులు ఖర్చు చేయడం కంటే సింపుల్ గా చేసి డబ్బు ఆదా చేసే దిశగా అడుగులు వేస్తోంది.  ఇలా ఘనంగా చేసే వైపు నుండి సింపుల్ గా పెళ్లి చేయడాన్ని మైక్రో వెడ్డింగ్ అంటున్నారు. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. మైక్రో వెఢ్డింగ్.. మైక్రో వెడ్డింగ్ అంటే వివాహాన్ని సూక్ష్మ పద్ధతిలో నిర్వహించడం అని అర్థం. దీని అర్థం మొత్తం ఇలా చెప్పడంలోనే ఉంది.  మైక్రో వెడ్డింగ్ అంటే చాలా పెద్ద స్థాయిలో జరగని వివాహం. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు, జనాల హడావిడి కూడా ఎక్కువగా ఉండదు. ఈ  వివాహంలో, వధూవరులతో పాటు చాలా సన్నిహిత కుటుంబ సభ్యులు,  అతిథులు పాల్గొంటారు. వివాహాలు అతి తక్కువ మందితో జరుగుతాయి. వాటి సంఖ్య గరిష్టంగా 50-100,  కనిష్టంగా 20-25 వరకు ఉండవచ్చు. ఇంత మంది సమక్షంలో కూడా ఒక గొప్ప వివాహం నిర్వహించబడుతుంది. ఇది అధికారికంగా చేయవచ్చు లేదా సాధారణంగా చేసేయవచ్చు. అయితే మైక్రో వెడ్డింగ్ లో జరిగే పెళ్లి తంతు హంగామాలు అన్ని సింపుల్ గా చేసేస్తారు.   మైక్రో వెడ్డింగ్ లో  సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది.  మైక్రో వెడ్డింగ్‌లో అతిథులు తక్కువగా ఉంటారు కాబట్టి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. సాంప్రదాయ వివాహంతో పోలిస్తే మైక్రో వెడ్డింగ్‌ను చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. పెళ్లి కోసం జరిగే ఖర్చును ఆదా చేసి భవిష్యత్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే వారు మైక్రో వెడ్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. కరోనా కాలంలో జనసమూహం గుమిగూడడంపై నిషేధం ఉంది. తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన వారు చాలా తక్కువ మంది అతిథులతో, ఎటువంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి చూసిన వారందరికీ అది నచ్చింది. ఇదే మైక్రో వెడ్డింగ్ గా మారింది. మైక్రో వెడ్డింగ్ ప్రయోజనాలు.. అప్పుల బాధ ఉండదు.. చాలామంది  పరిమితులను మరచిపోయి పెళ్లికి చాలా ఖర్చు చేస్తారు. చివరికి వారు అప్పుల్లో కూరుకుపోతారు. మైక్రో వెడ్డింగ్ ఊహించని అప్పుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇవి పూర్తిగా బడ్జెట్ అనుకూలమైనవి. ఆత్మీయ పలకరింపులు.. సాంప్రదాయ వివాహంతో పోలిస్తే,  మైక్రో వివాహంలో  అతిథులను సంతోషంగా ఉంచవచ్చు. నిజానికి  వివాహ వేడుకలో ప్రతి అతిథితో సమయం గడపడం సాధ్యం కాదు. దీనికి విరుద్ధంగా మైక్రో వివాహాలలో, తక్కువ మంది అతిథుల కారణంగా వధూవరులతో పాటు ఇతర అతిథులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు.  అలంకరణ.. సాంప్రదాయ వివాహాల మాదిరిగా కాకుండా మైక్రో వివాహాలకు చాలా పెద్ద వేదిక అవసరం లేదు.  స్థలం చిన్నది కాబట్టి, అలంకరణకు పెద్దగా ఖర్చు ఉండదు.  అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదికను అలంకరించవచ్చు. ఆహార నాణ్యత.. మైక్రో వెడ్డింగ్‌లో తక్కువ మంది ఉంటారు.  తక్కువ ఆహారం వండుతారు.  తక్కువ ఆహారాన్ని వండినప్పుడు దాని నాణ్యత  మెరుగుపడుతుంది. ఇది కాకుండా తక్కువ ధర కారణంగా మీరు చాలా వెరైటీని కూడా ఉంచుకోవచ్చు. అలాగే  ఆహార వృధాను నివారించవచ్చు. సమయం ఆదా.. సాంప్రదాయ వివాహాలలో చాలా రోజులు పట్టే వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ మైక్రో వివాహంలో, మెహందీ-సంగీత్ నుండి వివాహం వరకు అన్ని ఆచారాలు కనీసం 2-3 రోజుల్లో పూర్తవుతాయి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.  అందుకే మైక్రో వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు. నష్టాలు.. ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, సూక్ష్మ వివాహాలకు కూడా వాటి ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సూక్ష్మ వివాహాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ రకమైన వివాహం వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలు.. మైక్రో వెడ్డింగ్ అనేది ఒక చిన్న వివాహ వేడుక. ఎవరిని పిలవాలో, ఎవరిని వదిలేయాలో చాలా మందికి  అర్థం  కాదు. చాలాసార్లు  ఎవరినైనా ఆహ్వానించాలని కోరుకుంటారు. కానీ మైక్రోో వివాహం యొక్క పరిమితుల కారణంగా,  ఆహ్వానం నుండి చాలామంది పేర్లను తొలగించాల్సి వస్తుంది. మైక్రో వివాహం వల్ల  సన్నిహితులు, మిత్రులు,  శ్రేయోభిలాషులు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.                                                 *రూపశ్రీ.
మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.
  ఆహారంలో ప్రోటీన్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది.  కండరాల నిర్మాణానికి,  శరీరం బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే శాకాహారులలో ప్రోటీన్ కు సంబంధించి భయాలు ఎక్కువ ఉంటాయి.  దీనికి కారణం.. ప్రోటీన్ అంటే మాంసాహారం లోనే ఉంటుందని నమ్మడం. చాలా వరకు ప్రోటీన్ కోసం అధిక శాతం మంది గుడ్లు ఎక్కువ తీసుకుంటారు.  కానీ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన కొన్ని శాఖాహార ఆహారాలు ఉన్నాయి.  మీరు శాఖాహారులు అయి, కండరాలను బలంగా పెంచుకోవాలనుకుంటే, ఈ సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఇవి మీ శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇవ్వడమే కాకుండా కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడతాయి.. సోయాబీన్.. సోయాబీన్‌ను శాఖాహార ప్రోటీన్లకు రాజు అంటారు. ఇందులో 100 గ్రాములకు దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు కంటే చాలా రెట్లు ఎక్కువ! సోయాబీన్స్‌లో కండరాల నిర్మాణానికి సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. దీనిని టోఫు, సోయా పాలు లేదా సోయా ముక్కలుగా తినవచ్చు. శనగపప్పు.. మన భారతీయ ఆహారంలో శనగపప్పు ఒక ముఖ్యమైన భాగం. 100 గ్రాముల శనగలల దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అది కాబూలి శనగలు  అయినా లేదా మినప్పప్పు అయినా రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పప్పుధాన్యాలు.. పప్పులు, పెసలు, శనగ,  మినపప్పు వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్కు  అద్భుతమైన వనరులు. 100 గ్రాముల పప్పు దినుసులలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్ మరియు ఫైబర్,  పుష్కలంగా ఉంటాయి. పనీర్.. పనీర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించబడుతుంది. 100 గ్రాముల పనీర్ ల  దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. వేరుశనగ.. వేరుశెనగలు చౌకగా ఉండటమే కాకుండా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల వేరుశెనగలో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని స్నాక్ గా లేదా వేరుశెనగ వెన్న రూపంలో తినవచ్చు.                                    *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
    పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు.  బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు,  మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి.  పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు.  వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు.    కానీ పెరుగు  కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో  తినడం వల్ల  చాలా నష్టం చేకూరుస్తుంది.  కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ఇంతకీ  పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఇది ఉబ్బరం,  గ్యాస్,  ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. డెజర్ట్‌లు స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?  కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా.  కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు,  స్వీట్ల  కలయిక  కడుపులో మంటను కలిగిస్తుంది. బంగాళాదుంపలు.. పెరుగుతో బంగాళాదుంపలు తినడం  చూసే ఉంటారు.  చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు,  బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది మాంసాహారం.. పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.  ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు.  ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం,  పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్నపిల్లలే చదువులో బాగా రాణిస్తారు.  పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు,  ప్రైజులు,  పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది.  ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా,  ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్దిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు.. ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ది స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టీవ్ చేసే ఆహారాలు ఇవ్వాలి.  పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వాల్నట్స్.. పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్‌నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు  మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని మీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది  చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి. ఆకుకూరలు పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు  మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్,  విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు  మెదడును బలపరుస్తాయి.  అయితే పిల్లలు పాస్ట్ ఫుడ్స్,  బయటి ఫుడ్స్ ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు.  అందుకే  ఆకుకూరలతో సూప్,  కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి. బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు  మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు  మెదడును పదునుపెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం.  వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు.  అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేరేడు,  రేగు పళ్లు.. వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు.  ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్డు.. గుడ్లు తినడం  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్  మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి.  రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పైన చెప్పుకున్న నాలుగు ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా బాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు.  వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు.  అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం,  వారిని ఇన్ప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...