అమీన్ పూర్ లో విషాదం!
posted on Mar 28, 2025 10:19AM

ఏం కష్టమొచ్చిందో? ఎంతగా నలిగిపోయిందో.. ఆ తల్లి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ తీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చోటు చేసుకుంది. అమీన్ పూర్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించింది. ఈ తరువాత తానూ తిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ముగ్గురూ మరణించగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరణించిన పిల్లలు సాయికృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్ (8)ల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించి, తానూ తిన్న రజిత.. భర్త చెన్నయ్యకు మాత్రం విషం కలిపిన పెరుగన్నం పెట్టకుండా పప్పు అన్నం మాత్రమే పెట్టింది. కుటుంబ గొడవల కారణం గానే రజిత ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.