తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార స్థాయిలో కొన‌సాగుతోంది. అధికార కాంగ్రెస్ తో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాగా త్వ‌ర‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అరెస్ట్ ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఈ మేర‌కు  మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇదే స‌మ‌యంలో రేవంత్ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ స‌రికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌ద‌కొండు నెల‌ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిందంటూ బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వ  అవినీతిపై పాల్ప‌డిందంటూ ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమ‌లులో విఫ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేలా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిజంగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తుందా..?  బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ స‌ర్కార్ ను ఇరుకు పెడుతుందా..? అనే అంశాల‌పై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది. మాజీ మంత్రి కేటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 2023 ఫిబ్రవరిలో హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ జ‌రిగింది. ఈ రేసింగ్ లో భారీగా  ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రేవంత్ స‌ర్కార్ ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టి ఆధారాలు సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన  వాంగ్మూలం ప్రకారం రూ.55 కోట్ల నిధులను కేటీఆర్   ఆదేశాల మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ క్రింద కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో ముందుస్తుగా నెల రోజులు హైదరాబాద్ లో పోలీస్‌శాఖ 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఫైల్ ఇప్ప‌టికే సిద్దం చేసింద‌ని, మ‌రికొద్ది రోజుల్లోనే కేటీఆర్ అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెబుతూనే.. అరెస్టుకైనా   సిద్ధ‌మేన‌ని చెప్పారు. కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న నేప‌థ్యంలో.. రేవంత్ స‌ర్కార్ కు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని విమ‌ర్శించిన కేటీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వం అవినీతిపై త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, అర్హ‌త లేక‌పోయినా శోదా కంపెనీకి టెండ‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని, త‌న బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి టెండ‌ర్ల‌ను అప్ప‌గించార‌ని అన్నారు. మొత్తం రూ. 8,888 వేల కోట్ల టెండ‌ర్ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి టెండ‌ర్లు ర‌ద్దు చేయాల‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ను కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీకి వెళ్లి  ఫిర్యాదు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని, త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వులు కూడా పోవ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణలో జ‌రుగుతున్న అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేటీఆర్,   డిమాండ్ చేస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంపై స్పందించ‌కుంటే  తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌టేన‌ని బ‌లంగా ప్ర‌చారం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది.  కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌లు సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ స్ప‌దిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇస్తుండ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో జ‌రిగిన అవినీతిపై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌కుంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ క‌లిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాల‌ని చూస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేలా బీఆర్ఎస్ నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం అయ్యేలా దృష్టిసారించింది. డిసెంబ‌ర్ 1 నుంచి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బీజేపీ పాద‌యాత్ర‌లు చేప‌ట్ట‌నుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ అమలు చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు పాద‌యాత్ర‌ల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఈ రాజ‌కీయ చంద‌రంగంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌గ‌ల‌దా అనే అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రతీక్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోనికి తీసుకున్నారు. లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై స్థానికులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి   ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్ కార్యకర్త సురేశ్ రాజ్   పరారీలో ఉన్నాడు.  సురేష్ రాజ్ వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నారనే ప్రాథమిక సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. కలెక్టర్‌పై దాడికి ముందు, తర్వాత నరేందర్ రెడ్డితో సురేశ్ రాజ్ దాదాపు 40 సార్లు ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు.  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో  చీఫ్ విప్ లు, విప్ లను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పేర్లను ఖరారు చేశారు. శాసనసభలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులును, శాసనమండలి చీఫ్ విప్ గా పంచుమర్తి ఆంజనేయులను ఖరారు చేశారు. ఇక  అసెంబ్లీలో 15 మందిని, మండలిలో ముగ్గురిని విప్ లు గా ప్రకటించారు. విప్ లలో జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. అసెంబ్లీ మండలిలోచీఫ్ విప్, విప్ ల జాబితా ఇలా ఉంది. .  అసెంబ్లీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శాసనమండలిలో చీఫ్ విప్: పంచుమర్తి అనురాధ అసెంబ్లీలో విప్ లు... 1. బొండా ఉమ (టీడీపీ) 2. కాలవ శ్రీనివాసులు (టీడీపీ) 3. యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ) 4. ఆదినారాయణరెడ్డి (బీజేపీ) 5. బొమ్మిడి నాయకర్ (జనసేన) 6. బెందాళం అశోక్ (టీడీపీ) 7. రెడ్డప్పగారి మాధవి (టీడీపీ) 8. అరవ శ్రీధర్ (జనసేన) 9. తంగిరాల సౌమ్య (టీడీపీ) 10. దాట్ల సుబ్బరాజు (టీడీపీ) 11. దివ్య యనమల (టీడీపీ) 12. పీజీవీఆర్ నాయుడు (టీడీపీ) 13. తోయక జగదీశ్వరి (టీడీపీ) 14. బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన) 15. వీఎం థామస్ (టీడీపీ) మండలిలో విప్ లు.. 1. వేపాడ చిరంజీవి (టీడీపీ) 2. పి.హరిప్రసాద్ (జనసేన) 3. కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ) 
ALSO ON TELUGUONE N E W S
ఓటిటి సినీ ప్రియులకి ఈ వారం సరికొత్త సినిమా పండుగ రానుంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవైకి పైగా చిత్రాలు ఓటిటి సినీ ప్రియులకి కనువిందు చేయనున్నాయి.పైగా అవన్నీ కూడా దేనికవే డిఫరెంట్ సబ్జెట్స్ తో తెరకెక్కడంతో మూవీ లవర్స్ కి కూడా సరికొత్త అనుభూతి కూడా కలగనుంది.  నెట్‌ఫ్లిక్స్(netflix)లో చూసుకుంటే  నవంబర్ 12 న రిథమ్ ప్లస్ ఫ్లో, ది డార్క్ క్వీన్ 13 న  రిటర్న్ ఆఫ్ ది కింగ్ హాట్ ఫ్రాస్టీ  ది మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్  ఎమిలియా పెరెజ్  14 న  ది ఫెయిరీ ఆడ్ పేరెంట్స్ ఏ న్యూ విష్ 15  కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2 మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ లు సందడి చేయనున్నాయి. ఇక జియో వేదికగా చూసుకుంటే  నవంబర్ 13 సెయింట్ డెనిస్ మెడికల్   14 న   ది మ్యూజిక్ ఆఫ్ శ్రీ   15 న  ది డే ఆఫ్ ది జకల్  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)లో చూసుకుంటే  నవంబర్ 12 డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ అనే హాలీవుడ్ చిత్రం తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ కానుండగా   15 న  యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ  అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో  నవంబర్ 12  ఇన్‌ కోల్డ్ వాటర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)-  14 న  క్రాస్  ఆపిల్ టీవీ ప్లస్ లో  నవంబర్ 13  బాడ్ సిస్టర్స్ సీజన్ 2  15 న  సీలో సీజన్ 2  జీ 5 లో  నవంబర్ 15  పైతని లయన్స్ గేట్ ప్లే వేదికగా  నవంబర్ 15  ఆపరేషన్ బ్లడ్ హంట్  ఇలా మొత్తం ఇరవై కి పైగా చిత్రాలు సందడి చేయనుండగా వాటిల్లో హాలీవుడ్, పోర్చుగీస్ కి చెందిన చిత్రాలతో పాటు వెబ్ సిరిస్ లు కూడా ఉన్నాయి. ఒక్క డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ అనే హాలీవుడ్ చిత్రం మాత్రమే తెలుగు డబ్బింగ్ లో సందడి చేయనుంది.  
Zebra starring Satyadev, Daali Dhanunjaya, Sunil, Priya Bhavani Shankar, Satyaraj is one of the most talked about films in recent times. Megastar Chiranjeevi attended the pre-release event of the film to wish the team mainly, for his Godfather co-star Satyadev.  The filmmakers have unveiled eagerly anticipated trailer of the film and it showcases Satyadev and comedian Satya as scamsters who scam a bank. They need money and try to attain by hook or crook. But they are pushed into trouble due to an event and Daali Dhanunjaya enters into their story.  The highly interesting trailer showcases the loveable screen presence of Satyadev along with terrifying presence of Dhanunjaya. Both of them have given their best performances in the film and we can say so from the trailer. Also, the high production values from the producers stand out.  Ravi Basrur music is a huge highlight for the trailer. Director Eashvar Karthic crafted an engaging thriller and we can say so from the trailer. The curiosity about the film increased with the trailer and the movie is scheduled for a release on 22nd November worldwide. 
Matka starring Mega Prince Varun Tej is one of the most talked about films, in recent times.  Director Karuna Kumar of Palasa fame made this film on a huge budget and he expressed confidence in his film for being memorable for decades. He made these comments talking to press and here are some of the excerpts.  He stated that Varun Tej has given his finest performance in the film and it will be talked about even after 20 years. He remarked that he saw the film and hence, he is able to give such a bold statement. He also praised the actor as a cool and dedicated person on the sets.  Karuna Kumar also stated that he did research about Matka game and the film will be an interesting watch for everyone with all commercial elements. He also stated that he wanted to write a short story but developed it for screen after understanding its intensity and gravity.  He clearly stated that the movie doesn't have any connection with Ratan Khatri story. Further he revealed that he processed over 3600 images to create sets and recreate Vizag of 1970's extensively. He thanked SRT Entertainments for joining as producers by trusting him and also Vyra Entertainments for high production values. Movie is releasing on 14th November. 
Ilaiyaraaja, the master composer and legend of Indian Cinema, has announced that his biopic will be made on a lavish canvas. Dhanush has been chosen by the master himself to play him on the big screen. Kamal Haasan wished the team all the success at the announcement press event.  Arun Matheswaran is directing the film and he is busy writing the script. Ilaiyaraaja has reportedly asked the director to travel with him for at least an year to be able to convert it into a script. In the meantime, reports suggested that the production company is not that trustworthy for Dhanush and hence, the project could be dropped.  But now, the latest reports suggest that the actor has been busy in finalising new producers and there is a chance, he could also join as one among them. For now, the project is still on and it is just delayed but not shelved. Soon, the official announcement about commencement of shoot will be released by Dhanush himself, it seems.
Simbu has been waiting patiently for past two years to start his next film in the direction of Desingh Periyasamy. The actor announced the movie with an exciting look an year ago and it has been in pre-production for an year before. The actor did not commit in any other film until RKFI dropped out as producers and he did Thug Life for them, instead.  Mani Ratnam had already worked with Simbu and hence, he finalised him for this movie after Jayam Ravi, Dulquer Salmaan quit it. Simbu asked the director to work further on reducing the budget and announced that he would produce it on his own production company ATMAN films.  Now, the reports suggest that the movie will take few more months to start has the budget has been increased from 100 crores to 150 crores. As the actor is waiting to gain funds for the film, it is said that it is getting delayed further. In the meantime, Simbu fans are eagerly waiting to watch him in action with Kamal Haasan in Thug Life. 
Nandamuri Balakrishna is a roaring lion of Telugu Cinema and he has become God of Masses too. The actor has delivered mutiple cult action blockbusters and now, he is working on NBK109 with Bobby Kolli. The director has promised to present NBK in a never seen before avatar.  Fans have been asking makers to unveil the title from a long time. Now, the makers have decided to unveil the title teaser on the auspicious day of Karthika Pournima, on 15th November. Makers released a promising poster to make this announcement.  In the poster, NBK can be seen in a bearded look holding bloody axe in a rugged look. Fans are going crazy looking at his avatar and their anticipation for title teaser has grown even higher. Bollywood actor Bobby Deol is also part of the cast in a prominent role. Movie is rekeasing for Sankranti 2025.
King Nagarjuna, Dhanush and Rashmika Mandanna starrer Kubera has risen curiosity among everyone with the first look glimpses. The anticipation for the movie just because of Nagarjuna and Dhanush combination is far superior. Adding to the excitement, Sekhar Kammula is directing the film.  Now, the makers have announced that first glimpse will be releasing on 15th November. They have released a uber cool still of Nagarjuna from the movie and it is increasing curiosity further.  Nagarjuna is seen seated on a plush sofa, lost in thought, in the poster that creates curiosity. The soft glow of the city lights in the background contrasts sharply with his somber expression. Despite his polished appearance and the evident wealth surrounding him, the sorrow in his eyes suggests a life far more complicated than it appears.  With the shooting nearing completion, only the songs remain to be filmed. The post-production phase is already underway, and the team is gearing up for the promotional campaign to begin in full swing with the first glimpse.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. (NBK 109 Title Teaser) నవంబర్ 15న 'NBK 109' టైటిల్ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో పవర్ ఫుల్ శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. 'NBK 109' సినిమా టైటిల్ గా 'డాకూ మహారాజా', 'సర్కార్‌ సీతారామ్‌' వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి వీటిలో దేన్నయినా లాక్ చేశారో లేక ఏదైనా కొత్త టైటిల్ ఎంపిక చేశారో అనేది నవంబర్ 15న తేలిపోనుంది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
దక్షిణ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్(mohanlalనట ప్రస్థానానికి ప్రత్యేక స్థానం  ఉంది.దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ అశేష అభిమానులని సంపాదించుకున్నాడు.ప్రస్తుతం మంచు విష్ణు కధానాయకుడుగా వస్తున్న 'కన్నప్ప'(kannappa)లో ఒక కీలక పాత్రని పోషించడంతో పాటుగా 'ఎంపురేన్' అనే మూవీ కూడా  చేస్తున్నాడు. త్వరలోనే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రీసెంట్ గా మోహన్ లాల్ సతీమణి సుచిత్ర(suchitra)ఒక ఇంటర్వ్యూ  ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు నేను చేతన్( మోహన్ లాల్ ముద్దు పేరు) ని మొదటి సారి తిరువనంతపురంలో జరిగిన  ఒక పెళ్లి వేడుకలో చూసాను. మెరున్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చిన చేతన్ ని అంతకుముందు తెరపై చూడటమే కానీ రియల్ గా చూడటం మొదటి సారి.పైగా మా రెండు కుటుంబాలకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా  ఆ పెళ్ళిలో అర్ధమయ్యింది.మొదటి సినిమా మజిల్ విరుంజ పుక్కళ్ చూసినప్పుడు ఆయన మీద ప్రేమ పుట్టలేదు.కానీ ఆ తర్వాత  ఆయన సినిమాలన్నీ చూడటం మొదలు పెట్టాకా  ఆయనెంత ప్రతిభావంతుడో అర్ధమయ్యింది. అప్పటినుంచి ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. దాంతో చేతన్ కి నా పేరు లేకుండా ఉత్తరాలు రాయడం ప్రారంభించాను.రోజుకి ఐదు కార్డులు రాసేదాన్ని.ఆయన ఎక్కడకి వెళ్తున్నాడో తెలుసుకొని ఆ అడ్రస్ కి కూడా లెటర్స్ రాసేదాన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రేమతో చేతన్ ని వేధించాను.ఆయన్ని సుందర కుట్టప్పన్(అందమైన అబ్బాయి ) అనే కోడ్ భాషలో పిలిచే దాన్ని.బహుశా నేను అలా పిలుస్తానని  ఇప్పటికీ  ఆయనకీ తెలియదు.మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు చేతన్ గురించి చెప్పాను. దాంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడి మా పెళ్లి చేసారని చెప్పుకొచ్చింది. 1988 లో మోహన్ లాల్, సుచిత్ర ల  వివాహం జరగగా వారివురికి ఇద్దరు పిల్లలు.  
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప-2'. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సంచలనంగా మారింది. ఇందులో కేవలం ఒక ఎపిసోడ్ కే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఓ రీజినల్ ఫిల్మ్ కి పెట్టినంత బడ్జెట్ పెట్టారట. (Pushpa 2 The Rule) 'పుష్ప 2'లో జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మేకర్స్ సైతం జాతర ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సినిమాలో ఈ జాతర ఎపిసోడ్ 15 నుంచి 20 నిమిషాల నిడివి ఉంటుందట. అయితే ఈ 15 నిమిషాల ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారట మేకర్స్. ఇదే ఇప్పుడు షాకింగ్ గా మారింది. రూ.75 కోట్ల అంటే టైర్-2 హీరోల భారీ సినిమాల బడ్జెట్. అలాంటిది కేవలం 15 నిమిషాల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టే సినిమాపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  “నమ్మకం”  మూడక్షరాల ఈ మాట మన జీవితంలో చాలా విలువైనది. మన జీవితంలో ఏ బంధమైనా నిలబడాలంటే దానికి పునాది నమ్మకమే. మన ఇంట్లోవారయినా, స్నేహితులైనా, బంధువులైనా ఎవరితోనయినా మన ప్రయాణం సాఫీగా సాగాలంటే వారికీ, మనకీ మధ్య నమ్మకమనే గట్టి దారం కలపబడి ఉండాలి.  నమ్మకమనేది  సంపాదించుకోవాలి తప్ప బలవంతం మీద పొందలేము.  మనం జీవితంలో  ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలిసుండటం చాలా ముఖ్యం. అలా సైకాలజీ ప్రకారం మనం నమ్మకూడని 8 రకాల వ్యక్తులున్నారట.  వీరిని అసలు నమ్మకూడదని మానసిక విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ వీళ్ళేవరంటే.. స్వార్థపరులు: ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ‘నేను, నేను మాత్రమే’ అనే మనస్తత్వం  కలిగి ఉంటారు. వీళ్ళను నార్సిస్టులు అని అంటారు.  ఇతరుల భావాలు, అవసరాలు గురించి వీళ్లకు పట్టదు. వాళ్ళ అహాన్ని సంతృప్తిపరుచుకోవటం కోసం అవతలి వాళ్ళ మీద నింద వేయటానికి కూడా వెనుకాడరు.   అబద్ధాలు చెప్పేవారు: అబద్ధాలు చెప్పడం  కొందరికి అలవాటుగా ఉంటుంది. ప్రతివిషయనికి అబద్దం చెప్పి సింపుల్ గా విషయాన్ని దాటవేయడం, తప్పించుకోవడం చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు  బంధానికి అవసరమైన నిజాయితీ, సమగ్రతలు ఉండవు.  తమ వ్యక్తిగత లాభాల కోసం ఇతరులని తరచూ తప్పుదోవ పట్టించటానికి అబద్ధాలు చెప్తుంటారు.  వీళ్లకు దూరం ఉంటే మేలు..   అధికార ధోరణి: తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులు చేసే పనులని, నిర్ణయాలని నియంత్రించి వారికి అనుకూలంగా మార్చుకునే  నైపుణ్యం కలిగి ఉంటారు. వీరిని మానిప్యులేటర్లు అని చెప్పవచ్చు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులని ఎలాగైనా తప్పించుకోవాలి. బాధితుల్లా ప్రవర్తించేవారు: ఎల్లప్పుడూ తమని తాము బాధితులుగా చూపించుకోవాలనుకునే వ్యక్తులు వారివల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా  వారు చేసిన పనులకి, వారన్న మాటలకి జవాబుదారీతనం తీసుకోరు. ఎప్పుడు సింపతీ పొందడానికి కథలు అల్లేస్తారు..  వీరి స్వార్ధం వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు. అసూయపడేవారు: ప్రతిదానికీ ఇతరుల్ని చూసి అసూయపడే వ్యక్తులు నమ్మదగినవారు కాదు. వారు ఇతరుల విజయాలకి,  సంతోషానికి మనస్ఫూర్తిగా మద్ధతునివ్వరు, అభినందనలు చెప్పరు. వారిలో ఉన్న అసూయ వల్ల ఇతరులకి హాని కలిగించవచ్చు. నిబద్ధత లేని వ్యక్తులు: జీవితంలో ఎలాంటి కట్టుబాట్లు, పద్ధతులు లేకుండా ఉండే వ్యక్తులకి   బంధాల పరంగానైనా, పని విషయంలోనైనా  నిబద్ధత ఉండదు. వీరికి స్థిరత్వం, జవాబుదారీతనం ఉండదు. ఇలాంటి వాళ్ళను నమ్మితే నట్టేట మునిగినట్టే.. సానుభూతి లేని వ్యక్తులు: సానుభూతి చూపించడం  ఇతరుల కష్టాన్ని, బాధను తగ్గించడంలో సహాయపడుతుంది.  మనం మనుషులమనే సమైక్య భావాన్ని కలిగిస్తుంది. కష్టాలను, బాధలను, ఇబ్బందికర పరిస్థితులలో ఉన్న మనుషులను చూసి కూడా సానుభూతి  చూపలేని వ్యక్తులు చాలా స్వార్ధపరులని అర్థం.  వీరు తమ,పర భేధాలు చూపిస్తారు. ఆకర్షణ చూపించే వ్యక్తులు: అధికంగా ఆకర్షించాలని ప్రయత్నించే వ్యక్తులు తరచూ వాస్తవం బయటపడకుండా,  అసలు ఉద్దేశాన్ని లోపల కప్పి ఉంచుతారు. అలాంటి వ్యక్తులు తాము  కోరుకున్నది అవ్వటం కోసం ఇతరులతో మృదువుగా మాట్లాడటం, వారిని మెప్పించే పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కూడా నమ్మకూడదు.                          *రూపశ్రీ.
  మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తుల్లో  సాధారణంగా  తల్లిదండ్రులు ఉంటారు.  తర్వాత జీవిత భాగస్వామి కూడా అంతే ప్రభావం చూపిస్తారు., వాస్తవానికి ఇంకా ఎక్కువనే చెప్పాలి. మూడొంతుల మీ జీవితం ఎలా ఉండబోతుందనేది   జీవిత భాగస్వామి మీదనే ఆధారపడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం మీకుండదు,  కానీ మీ జీవిత భాగస్వామి ఎవరనే  నిర్ణయం తీసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది.  ఈ నిర్ణయం జీవితంలో ఎవరికయినా  చాలా ముఖ్యమైనదే అవుతుంది. అందులో ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించి మరీ    జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  కొంతమంది తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి, తర్వాత  జీవితాంతం బాధపడుతుంటారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో పొరపాటున కూడా  చేయకూడని కొన్ని తప్పులేంటంటే కుటుంబ సభ్యుల ఒత్తిడి.. సాధారణంగా  పెద్దవాళ్ళు జీవితాంతం తోడుండే మన భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో సహాయపడతారు. కానీ ఒక్కోసారి ఆ పెద్దవాళ్ళ ఒత్తిడివలనే ఒక అమ్మాయైనా లేక అబ్బాయైనా తమకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తర్వాత జీవితాంతం ఇబ్బందిపడుతూ ఉంటారు. తొందరపడి నిర్ణయం తీసుకోవటం.. ఏ మనిషి గురించైనా అర్ధం కావాలంటే  సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కలిసి మాట్లాడినంత మాత్రాన ఎవరి గురించి ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. కాబట్టి సమయం తీసుకుని ఆ వ్యక్తి మనకి సరిపోతారా? లేదా? అని నిర్ణయించుకోవాలి తప్ప తొందరపడకూడదు. వేర్వేరు సంస్కృతులు కావటం.. వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయిల సంస్కృతుల మధ్య పూర్తి బేధం ఉంటే, వారి వివాహం అయ్యాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంస్కృతి కేవలం వ్యక్తులతో కాకుండా  సమాజంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమాజంవలనే  ఇరువురూ కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని ప్రభావం వివాహ బంధం మీద కూడా పడుతుంది.  ముఖ్యంగా ప్రేమ వివాహాలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక ఆకర్షణ లేకపోవటం.. ఈ సృష్టి గమనానికి ఆడ, మగ మధ్య ఆకర్షణ ఎంత ముఖ్యమో, వివాహ బంధం మరింత బలపడి ముందుకి వెళ్ళటానికి కూడా  భౌతిక ఆకర్షణ ఉండటం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి భౌతిక ఆకర్షణ లేకపోతే ఆ ఆకర్షణ వేరేవైపుకి మళ్లి, జీవితాలు నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఆర్థిక అవసరాల కోసం, పనులు చేసిపెట్టే మనిషి కావాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకునే వారి జీవితంలో ఇలాంటివి కనిపిస్తాయి. నమ్మకం లేకపోవటం.. సమాజంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం నిలబడాలన్నా నమ్మకం ఉండాలి. అదే భార్యాభర్తల మధ్యైతే  ఈ నమ్మకం ఇంకాస్త ఎక్కువే ఉండాలి. జీవిత భాగస్వామి మీద  నమ్మకం లేకపోతే ఆ వివాహబంధంలో ఎవరూ,  ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.   ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండకపోతే ఆ వివాహ  బంధం ఎక్కువ కాలం నిలబడదు.                                            *రూపశ్రీ 
మనల్ని ఇంకొక మనిషి నుండి వేరు చేసేవి, ప్రత్యేకంగా ఉంచేవి  ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలకు తగినట్టే వారు పనులు చేస్తారు,దానికి తగ్గట్టుగా జీవిస్తారు. కానీ ఎప్పుడూ మనం ఉన్న స్థితినీ ఉండవలసిన స్థితినీ పోల్చి చూసుకుంటున్నాం. ఉండవలసిన స్థితి అనేది మన మనసు రూప కల్పన చేసినదే. సరిపోల్చి చూసుకోవడం అనేది ఎదురైనప్పుడు వైరుధ్యం వస్తుంది. ఏదో పరాయివస్తువుతో కాదు, నిన్నటి మనతో ఉన్నది, ఈరోజు మనతో ఉన్నదీ రెండింటినీ తరచి చూసుకున్నా అవి మనిషిలో ఎప్పుడూ సంఘర్షణను వెంటబెట్టుకొస్తాయి. పోల్చి చూచుకోవడం అనేది లేనప్పుడు ఉన్నది ఒక్కటే వుంటుంది. అది మనలో మనమే అయినా లేక ఇతరులతో అయినా పోలిక అనేది లేనప్పుడు మనలో ఉన్నది ఒక్కటే మనతో ఉంటుంది.  ఉన్నదానితో జీవించడమే ప్రశాంతంగా వుండడం, అప్పుడు మీరు మీ అంతరంగ స్థితికి మరే పరధ్యాసా లేకుండా పరిపూర్ణ సావధానత యివ్వగలరు. అది నిరాశ అయినా, వికారమయినా, క్రౌర్యం అయినా, భయం అయినా, ఆదుర్దా అయినా, ఒంటరితనం అయినా… ఇట్లా ఏదైనా సరే... దానితోనే పూర్తిగా సహజీవనం చేస్తారు. అప్పుడు వైరుధ్యం లేదు. కనుక సంఘర్షణ కూడా లేదు. కాని, ఎంతసేపు మనం ఇతరులతో మనను పోల్చి చూసుకుంటున్నాం. మనకంటే శ్రీమంతులు, మేధావంతులు, మరింత అనురాగపరులు, ప్రసిద్దులు, ఇలా ఎన్నో రకాలుగా మిన్న అయిన వారితో, 'మిన్న' అవడం మనల్ని నడుపుతుంది. మన జీవితాలలో అది గొప్ప ప్రాధాన్యం అయిపోతుంది. ఏదో ఒకదానితోనో, మనష్యులతోనూ పోల్చి చూసుకోవడం అనేది మనకు సంఘర్షణను తెచ్చి పెడుతున్న  ప్రథమ కారణం. అసలు పోల్చి చూసుకోవడం అనేది ఎందుకు జరుగుతోంది? మరొకళ్ళతో మిమ్మల్ని ఎందుకు పోల్చుకుంటారు? ఈ పని చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నారు కదా... ప్రతి పాఠశాలలోను యిద్దరు పిల్లలకు పోలిక. రెండో వానిలాగ వుండటానికి మొదటివాడు తనను తాను నాశనం చేసుకుంటాడు. అసలు సరిపోల్చి చూసుకోవడం అనేది లేనప్పుడు, ఆదర్శం అంటూ లేనప్పుడు, అవతలి పక్షం అనేది లేనప్పుడు, ద్వంద్వప్రవృత్తి లేనప్పుడు, మీకంటే విభిన్నమయిన వారుగా మీరు కనిపించాలని ప్రయత్నం చేయనప్పుడు మీ మనసు ఏమవుతుంది? మీ మనసు వ్యతిరేకమైన దానిని నిర్మించడం, ఎదురుగా పెట్టడం మానివేస్తుంది. అప్పుడది చాల తెలివిగా, పదునుగా, లలితంగా, అమిత శక్తివంతగా తయారవుతుంది.  ఎందుకంటే ప్రయత్న ప్రయాసల వలన మన గాఢాసక్తి చెదరిపోయి పలచబడుతుంది. జీవసత్త్వమే శక్తివంతమైన లక్షణం. ఈ సత్యం లేకుండా ఏ పని చేయలేరు.  ఇతరులతో పోల్చి చూసుకోవడం అన్నపని లేనప్పుడు, మీరు మీరుగా వుండిపోతారు. పోలిక వల్ల, మీరు పరిణమించాలనుకుంటున్నారు. ఎదగాలనుకుంటున్నారు. మరింత తెలివి కలవారు, సుందరులు అవాలనుకుంటున్నారు. కాని నిజంగా అలా కాగలరా? వాస్తవం ఏమిటంటే  మీరు ఉన్న స్థితి పోల్చి చూచుకోవడం వల్ల మీరు వాస్తవాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు. అది శక్తిని దుర్వినియోగం చేసుకోవడం.  ఎటువంటి పోలికలు లేకుండా, మీ నిజస్థితిని మీరు చూచుకున్నందువల్ల మీకు ఎంతో శక్తి సంపద ఒనగూరుతుంది. పోలికలు లేకుండా మీవంక మీరు చూసుకున్నప్పుడు మనసు తృప్తితో స్తబ్ధమయిపోయిందని కాదు అర్ధం మీరు పోలికలకు అతీతులు అయిపోతారు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవసరమయిన శక్తి,  జీవసత్త్వం ఎలా వృధా అయిపోతుందో మనకు తెలిసివస్తుంది. పోలికలు పెట్టుకోవడం జీవితంలో ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని కుచించుకునేలా చేయడమే అవుతుంది. అందుకే పోలిక మంచిది కానే కాదు.                                       ◆నిశ్శబ్ద.
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు. ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.  మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.                                                  *నిశ్శబ్ద.
  ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతంలో ఉసిరిని అమలకి అని అంటారు. రోజూ ఉసిరికాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని,  బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలోనూ సహాయపడతాయని అంటారు. అయితే ఉసిరికాయలను తినడం వల్ల కంటి శుక్లానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కంటి శుక్లం.. చాలామంది చూపు  కోల్పోవడానికి కంటి శుక్లం కారణం అవుతుంది..  ముఖ్యంగా కంటి చూపు అస్పష్టంగా మారుతుంది.  కాలక్రమేణా పూర్తీగా చూపు పోవడానికి దారితీస్తుంది.  వయసు పెరిగేకొద్ది కంటి శుక్లం సమస్యలు వస్తాయి.  చాలా వరకు వృద్దులలో కంటి శుక్లం సమస్యలు కనిపించేవి. కానీ నేటి కాలంలో చాలా తక్కువ వయసులోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. కంటి శుక్లం రాకూడదన్నా,  కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఉసిరికాయలు తినాలని అంటున్నారు. ఎలాగో ఇది కార్తీక మాసం.. ఈ మాసం మొదలు దాదాపు రెండు, మూడు నెలల వరకు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి.  ఉసిరికాయలు దొరికినన్ని రోజులు వీటిని తినడం.. మిగిలిన రోజులలో తినడానికి వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే ఏడాది మొత్తం క్వాలిటీతో కూడిన ఉసిరికాయ పొడి సిద్దమవుతుంది. ఉసిరికాయలు కంటి శుక్లానికి  ఎలా చెక్ పెడతాయి తెలుసుకుంటే.. కంటి శుక్లం వయసుతో సంబంధం లేకుండా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల కంటి శుక్లం వచ్చి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.  ఇది మాత్రమే కాకుండా కంటికి గాయం, మధుమేహం  వంటి సమస్యల వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది. సాధారణంగా కంటి శుక్లాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అయితే శస్ర్తచికిత్సతో సంబంధం లేకుండా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల  కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చు. దీనికి ఉసిరికాయ బాగా సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు కంటి శుక్లాన్ని నయం చేయడంలో, రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇతర కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఉసిరి సహాయపడుతుంది. ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే విటమిన్-సి దృష్టి సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది.  వృద్దాప్య ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందని అంటున్నారు. ఇది కంటి శుక్లం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలను తినవచ్చు.  దీన్ని పగలకొట్టి కొద్దిగా ఉప్పు వేసి నోట్లో వేసుకుని సుమారు గంట సేపటి వరకు దాని సారాన్ని మెల్లిగా జుర్రుకుంటూ ఉసిరిని తినవచ్చు.  లేదంటే ఉసిరికాయను ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి అందులో తగినంత నీరు జోడించి జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ సీజన్ దాటితే అవి దొరకవు. అందుకే ఉసిరికాయల సీజన్ లోనే ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వేడి నీటిలో కలిపి ఒక 10 నిమిషాల తరువాత గోరువెచ్చగా తాగాలి.                                      *రూపశ్రీ.
అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.  కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు.  ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు. ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే..  వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత  అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది. గుండెవ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రావడానికి ధూమపానం వాడకాలు ముఖ్యమని చెప్పాలి. సిగరేట్, చుట్ట, బీడీ లాంటివి త్రాగటంవల్ల ఆ పొగను కొంత బైటికి వదలటం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పొగాకు పొగత్రాగే వారికెంత హానికరమో, బైటగాలిలో వదలిన పొగను వారికి తెలియకుండా పీల్చే వారికి కూడా అంతే హానికరంగా పరిణమిస్తుంది. పొగాకు నమలటం, జరదా కిళ్ళీలు వేయటం వల్ల కూడా హృద్రోగాలు, కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని దాని కారణంగా కాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటివి సంభవిస్తుంటాయి. పొగాకు నమిలేవారికి నోరు, పళ్ళు, గొంతు, స్వరపేటికలకు సంబంధించిన తీవ్రవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువ. మన శరీరానికి జబ్బు తెచ్చిపెట్టే కొన్ని అలవాట్లు గమనిస్తే… ప్రతిరోజు స్నానం చెయ్యకుండా ఉండటం మొదటి అలవాటు. శరీర శుభ్రత లేకపోతే జబ్బులు రావడానికి మొదటి మార్గం మనమే ఇచ్చినట్టు. క్రమబద్దము లేని భోజనము చేయడం. రోజుకొక వేళలో భోజనం చేయడం వల్ల శరీరం ఏ సమయానికి శక్తిని తయారు చేసుకోవాలో నిర్ణయించుకోలేదు.   అధికంగా ఉపవాసములు చేయడం పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి ఉపవాసం అనేది కూడా ఆరోగ్య ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందే అయినా దాన్ని అతిగా పాటిస్తే శరీరానికి నష్టం చేకూరుతుంది.  బయట తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అలాగే శీతల పానీయాలు, చల్లని పదార్థాలు తినడం కూడా నష్టమే.   ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఫుడ్ చెడిపోకుండా వాయువులు నింపుతారు కాబట్టి వాటిని తిన్నా అనారోగ్యం వెంట వస్తున్నట్టే.. చాలామంది శారీరక సమస్యల విషయంలో సంకోచం చెందుతారు. కానీ అతిగా శృంగారంలో పాల్గొనడం ఎంత చేటు చేస్తుందో.. అసలు శృంగారం జోలికి పోకుండా సన్యాసిలా బ్రతకడం ఈకాలంలో అంతే చేటు చేస్తుంది.   ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే జబ్బులు వస్తాయి.  సౌకర్యవంతమైన దుస్తులు కాకుండా ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉన్నవి ధరించడం. శరీరంలో అవయవాల ఒత్తిడికి కారణమై తద్వారా వాటి క్రమబద్ధత తప్పేలా చేస్తుంది. ఆకుకూరలు–పౌష్టికాహారములు వాడకుండా ఉండటం కూడా అనారోగ్యానికి మూలకారణమే. మన శరీరానికి అనారోగ్యం దాపురించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి చూడండి.                                     ◆నిశ్శబ్ద.