Publish Date:Aug 18, 2018

ALSO ON TELUGUONE N E W S
    మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`.  గ‌త కొంత కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం నుండి మొద‌టి పాట ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీప్ర‌సాద్ తెలియ‌జేశారు. దీంతో మ‌హేష్ అభిమానులు పాట కోసం చాలా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌పుకుంటోంది. ఈ చిత్రంలో విడుద‌లయ్యే మొద‌టి పాట సినిమాకే కీల‌క‌మైన పాట అని తెలుస్తోంది. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రచించార‌ట‌. ఇందులో మొత్తం ఐదు పాట‌లున్నాయట‌.  రెండో పాట‌ను ఉగాది కానుక‌గా విడుద‌ల చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.
  హెడ్డింగ్ చూసి ఏంటా? అని  హెడ్ హేక్ తెచ్చుకోకండి.  ఆ మ‌ధ్య బన్ని- త్రివిక్ర‌మ్ సినిమాలో న‌గ్మ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోందంటూ వార్త‌లు తెగొచ్చాయి. దాదాపు ఖారారైన‌ట్లే అన్నారు కూడా. అయితే న‌గ్మ ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంలో ఓ ఛానెల్ తో మాట్లాడుతూ `నేను బ‌న్నీ సినిమాలో న‌టిస్తున్నానా? న‌న్నింత వ‌ర‌కు ఎవ‌రూ సంద్రించ‌లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో న‌గ్మ నటించ‌డం లేదంటూ  అంద‌రికీ ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ట‌బు పేరు తెర‌పైకి వ‌చ్చింది . బ‌న్నీ మ‌ద‌ర్ గా ట‌బు ని తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి న‌గ్మా లాగే ట‌బు పేరు తెర‌పైకి వ‌చ్చిందా?  లేక ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫైన‌ల్ చేసారా? అనే దానిపై త్వ‌ర‌లో ఒక క్లారిటీ రానుంద‌ట‌. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేష‌న్స్ బేన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి `నాన్న నేను` అనే టైటిల్ పరిశీలిస్తున్నార‌ట‌. ఇక ఈ సినిమా లో బ‌న్ని చాలా స్లిమ్ గా కనిపించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే బ‌రువు త‌గ్గ‌డానికి క‌స‌ర‌త్తులు ప్రారంభించాడ‌ట‌. త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
  టాలీవుడ్ లో ప్ర‌జంట్ మల్టీస్టార‌ర్ చిత్రాలు క్యూ క‌డుతున్నాయి. ఇక ఆ కోవ‌లోనే మ‌రో ఇంట్ర‌సింగ్ కాంబినేష‌న్ లో ఒక మ‌ల్టీస్టార‌ర్ సినిమా ప్రారంభం కానుంద‌ని స‌మాచారం అందుతోంది.  రెండేళ్ల క్రితం త‌మిళంలో ఘ‌న విజ‌యం విజ‌యం సాధించిన `విక్ర‌మ్ వేద‌` చిత్రాన్ని తెలుగులో బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రీమేక్ చేయాల‌ని  టాలీవుడ్ ప్ర‌ముఖ  ప్రొడ్యూస‌ర్ ఒకరు ప్లాన్ చేస్తున్నార‌ట‌. త‌మిళంలో మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి హీరోలుగా న‌టించారు. ఇక త‌మిళ చిత్రం  ఒరిజిన‌ల్ కి ఎవ‌రైతే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారో ఆ ద‌ర్శ‌కుడే ఈ సినిమాను డైర‌క్ట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా పై ఒక క్లారిటీ అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే మాత్రం అది నిజంగా క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎప్ప‌టి నుంచో బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ లు క‌లిసి న‌టించాల‌నుకుంటున్నారు కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌ర‌లేదు. ఈ సినిమాతో కుదిరే అవ‌కాశాలు హండ్రెడ్ ప‌ర్సెంట్ ఉన్నాయ‌ట‌.
  శ‌తాధిక చిత్రాల హీరోగా, శ‌త దినోత్స‌వాలు జ‌రుపుకున్న చిత్రాల హీరోగా టాలీవుడ్ లో `గుడ్ ప‌ర్స‌న్` గా పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. సినిమా ఫీల్డ్ లో ఎటువంటి స‌పోర్ట్ లేకుండా స్వ‌యంకృషితో ఎదిగిన హీరో.  క‌ష్టం విలువ తెలిసిన వ్వ‌క్తి కాబ‌ట్టి ఎవ‌ర్నీ క‌ష్ట‌పెట్ట‌డు.  ఎప్పుడూ మ‌న‌స్ఫూర్తిగా  న‌వ్వుతూ పాజిటివ్ థింకింగ్ తో ఉంటాడీ హీరో. అదే త‌న గ్లామ‌ర్ తో పాటు స‌క్సెస్ సీక్రేట్ అని చెబుతుంటాడు. వివాదాల‌కు దూరంగా ఉంటూ `వినోదం` పంచే ఈ హీరో అంద‌రికీ ఆమోద‌యెగ్య‌మైన ఎన్నో సినిమాల్లో న‌టించాడు, న‌టిస్తున్నాడు. తొలి నాళ్ల‌లో విల‌న్ గా చేసి ఆ త‌ర్వాత హీరోగా మారి కుటుంబ క‌థా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా, ఆ పాత్ర‌లో త‌న మార్క్ చూపిస్తూ ... న‌టుడుగా మంచి మార్కులు కొట్టేస్తుంటాడు. `తాజ్ మ‌హ‌ల్ , ఎగిరే పావుర‌మా, వినోదం, ప్రేయ‌సి రావే, ఆహ్వానం,  ఆమె, తాళి, పెళ్లి  సంద‌డి చిత్రాలతో సంద‌డి చేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాంత్  కెరీర్ కు మైలు రాయిలా నిలిచే చిత్రాలు చాలానే ఉన్నాయి.  ఇవ‌న్నీ ఒక ఎత్తైతే క్రియేటివ్ డైర‌క్ట‌ర్ కృష్ణ వంశీ డైర‌క్ష‌న్ లో వ‌చ్చిన ఖ‌డ్గం ఒక ఎత్తు. ఆ సినిమాలో  శ్రీకాంత్  సీరియ‌స్ అండ్ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌రగా న‌టించి, త‌న‌లో ఈ యాంగిల్ కూడా ఉందా? అనిపించుకున్నాడు. అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొందాడు. ఆ త‌ర్వాత పోసాని కృష్ణ మ‌రుళి ద‌ర్శ‌క‌త్వంలో ` ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌` చిత్రంలో న‌టించి న‌టుడుగా త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించాడు శ్రీకాంత్. ఇక వందో చిత్రం `మ‌హాత్మ‌` ప‌ట్టుబ‌ట్టి కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. క‌మ‌ర్షియ‌ల్ గా అది వ‌ర్క‌వుట్ కాక‌పోయినా కూడా న‌టుడుగా శ్రీకాంత్ ని వంద మెట్లు ఎక్కించింది.  ఆ త‌ర్వాత చేసిన సినిమాలు ఏవీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఒక వైపు హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌స్తున్నాడు.  ప్ర‌జంట్ త‌న‌యుడు రోష‌న్ ను ఒక మంచి హీరోగా టాలీవుడ్ లో నిల‌బెట్టాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్నాడు.  జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా సిన్సియ‌ర్ గా  త‌న ఎఫ‌ర్ట్ పెడుతూ , డెడికేష‌న్ తో ప‌ని చేసే వ్య‌క్తి.  ఎప్పుడూ  చెర‌గ‌ని చిరున‌వ్వుతో  , చెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసంతో ఉంటూ టాలీవుడ్ క్లీన్ హీరోగా పేరు తెచ్చుకుని  హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోన్న శ్రీకాంత్ పుట్టిన రోజు (మార్చి 23) సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది `తెలుగువ‌న్‌`.
  మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ప్రెసిడెంట్ గా న‌రేష్ ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేసారు. అయితే ఈ ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో `నేను అసోసియేష‌న్ కోసం బాగా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని మాటిస్తున్నాను` అని తెలిపారు న‌రేష్‌. దీంతో న‌రేష్ మాట్లాడిన తీరుపై న‌టుడు , `మా` ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్ వెంట‌నే క‌ల‌గజేసుకుని అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. న‌రేష్ మాట్లాడిన మాట‌ల్లో ఎక్క‌డా `మేము` అనే ప‌దం వాడకుండా `నేను` అనే ప‌దం వాడార‌ని రాజ‌శేఖ‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ``నేను మాట్లాడ‌టానికి చాలా ఉంది`. మీకు ఓపిక ఉంటే విన‌వ‌చ్చు. న‌రేష్‌, నేను నేను అన్న మాట వాడ‌కూడ‌దు. `మేము` అని మాట్లాడాలి. అస‌లు ఈ కార్య‌క్ర‌మానికి రావాలనుకోలేదు. న‌రేష్ వ‌చ్చి పిలిచారు కాబ‌ట్టి వ‌చ్చాను. అంద‌రం క‌లిసే ఈ అసోసియేష‌న్ ఎన్నిక‌ల కోసం ప‌ని చేశాం. కాబ‌ట్టి మున్ముందు న‌రేష్ మాట్లాడేట‌ప్పుడు `నేను` అని కాకుండా `మేము` అని మాట్లాడితే బాగుంటుంది `` అని రాజ‌శేఖ‌ర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కార్య‌క్ర‌మంలో హేమ మాట్లాడుతుంటే అధ్య‌క్షుడు న‌రేష్ మైక్ లాగేసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా ఆమె షాక‌య్యారు. వెంట‌నే క‌ల‌గ‌జేసుకున్న జీవిత ఆమెకు మైక్ అందించారు. న‌రేష్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఆమె అసంతృప్తి వ్య‌క్తం చేశారు. `మా` లో ఆయ‌నొక్క‌డే నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నీ, జ‌న‌ర‌ల్ బాడీతో చ‌ర్చిండంలేద‌ని న‌రేష్ పై ఆమె విమ‌ర్శ‌లు చేసింది. ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు `మా` ఎలా ఉండ‌బోతుందో ఏమో అని అంద‌రూ అనుకుంటున్నారు.
  అది ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో రెండు అందమైన ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వాటి యజమానులు ఇద్దరూ స్నేహితులే. ఆ ఇద్దరు స్నేహితులూ కలిసి ఓ రోజు బజారుకి వెళ్లారు. వస్తూ వస్తూ ఓ రెండు మొక్కలు తెచ్చుకొన్నారు. తీరా ఇంటికి వచ్చాక మొదటి ఇంటి యాజమాని- ‘మనం సరదాగా ఒక పందెం వేసుకుందామా! ఇద్దరం ఒకేరకం మొక్కను తెచ్చుకొన్నాం కదా! వీటిలో ఏది బాగా పెరుగుతుందో చూద్దామా!’ అన్నాడు.   ‘ఓ అదెంత భాగ్యం!’ అంటూ సవాలుకి సిద్ధమయ్యాడు రెండో యజమాని. మొదటి ఇంటి యజమాని పందేన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తను తెచ్చిన మొక్కని జాగ్రత్తగా నాటాడు. దాని కోసం ఎక్కడెక్కడి నుంచో ఎరువులు తీసుకువచ్చాడు. మూడుపూటలా మర్చిపోకుండా దానికి నీళ్లు పోసేవాడు. మొక్కలు బాగా పెరగడానికి ఇంటర్నెట్‌లో కనిపించే చిట్కాలన్నీ పాటించేవాడు. రెండో ఇంటి యజమాని మాత్రం తన మొక్క విషయంలో చాలా నిర్లిప్తంగా ఉన్నాడు. రోజూ ఉదయం కాస్త నీళ్లు పోయడం మాత్రమే చేసేవాడు.   రోజులు గడిచేకొద్దీ మొదటి ఇంట్లో మొక్క ఏపుగా పెరగసాగింది. దాని ఆకులు నవనవలాడుతున్నాయి. పండ్లు, పూలతో ఆ చెట్టు చూడముచ్చటగా ఉంది. రెండో చెట్టు కూడా బాగానే ఉంది. కానీ మొదటి చెట్టుతో పోలిస్తే అది కాస్త కాంతివిహీనంగా కనిపిస్తోంది. ‘చూశావా! ఒక్క ఆర్నెళ్లలోనే నా చెట్టు ఎలా తయారైందో. ఇక నువ్వు ఓడిపోక తప్పదు,’ అంటూ రెండో ఇంటి యజమానిని రెచ్చగొట్టాడు మొదటి ఇంటి యజమాని. దానికి రెండో యజమాని ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయాడు.   ఈ సంభాషణ జరిగిన రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఏముంది? ముందురోజు వరకూ నవనవలాడుతూ కనిపించిన మొదటి ఇంటి చెట్టు కాస్తా వేళ్లతో సహా పక్కకి పడిపోయింది. రెండో చెట్టు మాత్రం ఏం జరగనట్లు నిబ్బరంగా కనిపించింది.   ‘అదేంటి! ఇంత జాగ్రత్తగా పెంచిన చెట్టు ఇలా ఒరిగిపోయింది,’ అంటూ ఏడుపుమొహం పెట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని. దానికి రెండో యజమాని చిరునవ్వుతో- ‘నువ్వు చెట్టుని అందంగా, ఎత్తుగా పెంచాలని చూశావు. దానికి పళ్లు, పూలు కాయాలని మాత్రమే చూశావు. అందుకే దాని అవసరానికి మించిన నీళ్లు అందించావు. ఎప్పటికప్పుడు కావల్సిన నీరు అందడంతో దాని వేళ్లు భూమి లోపలకి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. కానీ నేను నాటిని మొక్క ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని సహజంగా ఎదగాలని కోరుకున్నాను. అందుకే దానికి తగినంత సాయం మాత్రమే చేశాను. ఫలితం! నేను నాటిన మొక్క వేళ్లు భూమి లోతుకి వెళ్లాయి. ఎండకి ఎండి, వానకి తడిసి దాని కాండం బలపడింది. గాలివానని సైతం తట్టుకొని నిలబడింది,’ అంటూ చెప్పుకొచ్చాడు.   ఈ కథ కేవలం మొక్కలకి సంబంధించింది మాత్రమే కాదు! పిల్లలు కూడా ఇంతే! వారికి ఏ కష్టమూ, లోకజ్ఞానమూ తెలియకుండా అవసరానికి మించిన సౌకర్యాలు అందిస్తుంటే... జీవితంలో అలజడి రేగినప్పుడు తట్టుకోలేరు. అలా కాకుండా వారు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తూ, ఒక కంట వారి అవసరాలను కనిపెడుతూ ఉంటే... ఎలాంటి తుఫానునైనా తట్టుకొని నిలబడతారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  ఎదుటివారు వాడే పెర్‌ఫ్యూమ్‌ని బట్టి వారి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ ఇది నిజం. కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేకమంది మీద పరిశోధనలు జరిపి నిర్ధారించిన నిజం. జాజి, మల్లె, విరజాజి, సంపంగి, చంపక, పున్నాగ, గులాబీ, చేమంతి... ఇలా పువ్వుల పరిమళాలను కోరుకునేవారి లక్ష్యాలు సమున్నతంగా వుంటాయట. ఎప్పుడూ చక్కగా తయారవడాన్ని కూడా ఇష్టపడతారట కూడా. నిండైన ఆత్మవిశ్వాసం వీరి స్వంతంట. వీరికి ఎదురుపడ్డ ఏ అవకాశాన్నీ అంత తేలికగా చేయిదాటి పోనివ్వరు కూడా. పళ్ళ పరిమళాన్ని ఇష్టపడేవారు... ఇక నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు తినడానికి చాలా బాగుంటాయి కదా! ఇవి తినడానికి ఎంత బాగుంటాయో వాటి పరిమళాలు కూడా అంతే అద్భుతంగా వుంటాయి. మరి ఈ పరిమళాలని ఇష్టపడేవారు సాధారణంగా ఏ పనినైనా శ్రద్ధగా, ఇష్టంగా చేస్తారుట. ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ ఉంటారు. అయితే కాస్త దురుసుగా మాట్లాడటం, తనకి నచ్చకపోతే నిక్కచ్చిగా చెప్పటం కూడా చేస్తారుట.   ఆకుల పరిమళాన్ని ప్రేమించేవారు.. యూకలిప్టస్, తేజ్ పత్తా, సబ్జా ఆకుల వంటివాటి సువాసనలంటే మక్కువ చూపేవారు చాలా చురుగ్గా వుంటారని అంటున్నారు నిపుణులు. వీరు సదా అప్రమత్తంగా కూడా వుంటారట. అలాగే చాలా విషయాలు తెలుసుకోవాలని కూడా వీరు ఆరాటపడుతూ వుంటారట. సృజనాత్మకత పాళ్ళూ వీరిలో ఎక్కువే. కానీ ఒక్కోసారి చప్పున మూడీగా మారిపోతుంటారుట.   వీరి వ్యక్తిత్వమే వేరు... వట్టివేరు, అల్లం, పసుపు వంటి వేర్ల సువాసనలను అధికంగా ఇష్టపడేవారు సౌమ్యంగా, నిరాడంబరంగా వుంటారుట. వీరి మనసులో మాట కనిపెట్టడం కష్టమే. వీరు చెప్పేదాకా వీరి ఇష్టాలేంటో కూడా అంచనా వేయలేంట. సో... ఈ సువాసనలని ఇష్టపడేవారు మీ ఫ్రెండ్స్‌లోనో, కావలసిన వారిలోనో వుంటే కొంచెం సునిశితంగా వారిని గమనించి వారి ఇష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.   వీరి వ్యక్తిత్వమూ సుగంధమే... మంచి గంధం, రోజ్ వుడ్, రైన్ చెట్ల బెరళ్ళ వాసనలు చాలా విలక్షణంగా వుంటాయి కదా. వీటిని ఇష్టపడే వారు కూడా విలక్షణ వ్యక్తులే. ఎందరిలో వున్నా ఇట్టే పసిగట్టవచ్చు వారిని. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ వుంటారు. ఇలా ఆయా పరిమళాల ఎంపికను బట్టి సదరు వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు అంటున్నారు ఈ అంశంపై అధ్యయనం చేసిన వ్యక్తులు. మీ సన్నిహితులను కలసినప్పుడు సరదాగా ప్రయత్నించి చూడండి.
  హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి...   లాఠ్మార్ హోళీ ఉత్తర్ప్రదేశ్లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్మార్ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు.   షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగకు హోళీ ఓ ముగింపునిస్తుంది. ఇందులో భాగంగా ఊరూరా తమ చరిత్రను గుర్తుచేసుకునేలా సంప్రదాయ నృత్యాలు సాగుతాయి. డప్పు వాయించేవాళ్లు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటారు. గ్రామదేవతలకు బలులు సాగుతాయి. గుళ్లలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హోళీనాటికి షిమోగా పండుగ పతాకస్థాయిని చేరుకుంటుంది. స్థానికులతో కలిసి ఈ పండుగను చేసుకునేందుకు వేలమంది విదేశీయులు వస్తారు. ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా పెరేడ్లు నిర్వహిస్తుంటుంది.   కుమౌనీ హోళీ ఎక్కడన్నా పండుగ ఒకరోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతుంది... ఇంకా మాట్లాడితే పదిరోజులు జరుగుతుంది. కానీ కుమౌనీ హోళీని దాదాపు 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున మొదలవుతుంది వీరి హోళీ పండుగ. అందులో బోలెడు రకాలు, ఆచారాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ‘బైఠకీ హోళీ’లో సంగీతకారులు ఒకచోటకు చేరి కొన్ని ప్రత్యేక రాగాలను ఆలపిస్తారు. వీటిని వినేందుకు జనం గ్రామగ్రామంలోనూ ఒకచోటకి చేరతారు. ఇలా సంగీతాన్ని కూర్చుని వినే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీనికి బైఠకీ హోళీ అని పేరు వచ్చింది. ఇక ఈ హోళీ సమయంలో సంప్రదాయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు కాబట్టి ‘ఖాదీ హోళీ’ అని పిలుచుకుంటారు. ఈ సమయంలోనే మహిళలు ప్రత్యేకించి ఒక చోట చేరి గీతాలను ఆలపిస్తారు. ఆ సందర్భాన్ని ‘మహిళా హోళీ’ అంటారు.   ఫాల్గుణ పౌర్ణమి నాటి హోళీ ఘట్టానికి రంగులు చల్లుకునేందుకు ఈ నలభై రోజుల నుంచీ కూడా చెట్టూపుట్టా తిరుగుతారు. అక్కడ వేర్వేరు రంగు పూలను సేకరించి, పొడిచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. హోళీ ముందు రోజు... హోళిక అనే రాక్షసి మంటల నుంచి ప్రహ్లాదుడు తప్పించుకోవడాన్ని గుర్తుచేసుకుంటూనే మంటలు వేసుకుంటారు. హోళీకి ముందే ఇంత హడావుడి ఉంటుందంటే, ఇక హోళీనాడు ఎంత సంబరం సాగుతుందో చెప్పేదేముంది!   హోళా మొహల్లా   పంజాబులో హోళీ మరునాడు జరుపుకొనే ఈ పండుగలో సిక్కులు తమ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తారు. సిక్కులలోని యుద్ధనైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సాక్షాత్తూ వారి గురువైన గోవింద్ సింగ్ ఏర్పరిచిన సంప్రదాయం ఇది. హోళీ మర్నాడే ఈ ఆచారాన్ని మొదలుపెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ... పంజాబువాసులు అటు హోళీనీ, ఇటు హోళా మొహల్లాను కూడా ఘనంగా జరుపుకుంటారు.   ఇంతేనా! గుజరాత్లో హోళీ సందర్భంగా ఉట్టి కొడతారు, ఒడిషాలో రాధాకృష్ణులను ఊరేగించి వారికి రంగులను అర్పిస్తారు, పశ్చిమబెంగాల్లో దీనిని డోలీ పూర్ణిమ పేరుతో ఓ సంగీతోత్సవంగా నిర్వహిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ హోళీకి ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. రంగుల ప్రపంచం అన్నా, ఆ ప్రపంచంలో లయబద్ధంగా జీవించడం అన్నా భారతీయులకు ఎంత ఇష్టమో హోళీ తెలియచేస్తుంటుంది. - నిర్జర.
  కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తారని కొన్ని రోజుల కిందట వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రాహుల్‌ కేరళలోని వాయనాడ్ నియోజవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే కేరళ పార్టీ కార్యకర్తలు రాహుల్‌ను కోరారని, కేరళ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోందని చెప్పారు. కార్యకర్తల విజ్ఞప్తిని రాహుల్ సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. యూపీలో అమేథి నుంచి రాహుల్ పోటీపై ఆయన వివరణ ఇస్తూ, అమేథీ తన 'కర్మభూమి' అని రాహుల్ చెబుతుంటారని, అమేథీ ఆయనతోటే ఉంటుందని చెప్పారు.   తమిళనాడు, కర్ణాటక పార్టీ విభాగాలు సైతం రాహుల్‌ను తమతమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే రాహుల్‌కు విజ్ఞప్తి చేశాయి. తాజాగా, కేరళ కాంగ్రెస్ యూనిట్ సైతం రాహుల్‌ను వాయనాడ్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరింది. గత ఏడాది కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షానవాస్ కన్నుమూయడంతో వాయనాడ్ సీటు ఖాళీ అయింది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధిఖ్ పోటీలో ఉన్నప్పటికీ, రాహుల్ పోటీ చేస్తానంటే స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. మరి దీనిపై రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  కృష్ణా జిల్లా నూజివీడులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై కోపంతో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని, ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనన్నారు. వరంగల్‌లో వైఎస్ జగన్‌ను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్లు రాళ్లతో కొట్టి తరిమారని పవన్‌ గుర్తుచేశారు. ఏపీ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు ఏమీ చేయని జగన్‌.. సీఎం అయితే ఇంకేం చేస్తారని నిలదీశారు. నూజివీడును ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. నూజివీడులో అంతర్జాతీయ మామిడి పండుగ చేద్దామని, స్పెయిన్‌లో టమాటో పండుగలా నూజివీడు అండే మామిడి పళ్లు గుర్తుకు రావాలని అన్నారు. 'మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సీఎం అవుతున్నా.. ప్రమాణస్వీకారం చేస్తా' అని జనసైనికుల్లో ఉత్సాహం నింపారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలకు డొక్కా సీతమ్మ, కందుకూరి, కాటన్‌ దొర, అంబేద్కర్ వంటి మహానీయుల పేర్లు పెడతామని చెప్పారు. చంద్రన్న, జగనన్న పేర్లతో పథకాలు ఎందుకు? అని ప్రశ్నించిన పవన్.. తన పేరుపై భవిష్యత్తులో ఒక్క పథకం కూడా ఉండబోదని చెప్పారు. '25 కిలోల బియ్యం, రూ. 2500 ఇవ్వడానికి రాజకీయాల్లోకి రాలేదు. మీ 25 సంవత్సరాల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఇవ్వడానికి రాజకీయాల్లో వచ్చాను’ అని అన్నారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం రండి అంటూ పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్, కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. తనను చూసి రాజధానికి రైతులు భూములు ఇచ్చారని, అదే జగన్‌ను చూస్తే అసలు భూమి ఇచ్చేవారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేతిలో జగన్‌ జుట్టు ఉందని, అందుకే ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని విమర్శించారు. లోటస్‌పాండ్‌లో ఉంటూ ఇద్దరూ కుట్రలు పన్నుతున్నారన్నారు. చివరికి అఫిడవిట్‌కు స్టాంప్‌ పేపర్లను కూడా జగన్‌ హైదరాబాద్‌లో కొన్నారని ఎద్దేవాచేశారు. మోదీ, కేసీఆర్‌ కుమ్మక్కై మనపైకి వస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధం ఉందన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాము హత్యలు చేయబోమని.. హత్యలు చేసిన వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. 32 కేసులు పెట్టుకొని జగన్‌ ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారని విమర్శించారు. 31 కేసులున్న నాయకుడు మనకి కావాలా? అని ప్రశ్నించారు. ‘దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఆంధ్రావాళ్లు ద్రోహులని ప్రచారం చేశారు. ఆస్తులను లాక్కుని ఇక్కడికి పంపించారు. ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు. అయినా సహించాం. తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడున్నాయి? ఇక్కడ మేం కట్టిన ఇళ్లు చూడండి. రైతులకు తెలంగాణ లక్ష రూపాయలు చేస్తే మనం లక్షన్నర మాఫీ చేశాం. నాలుగో, ఐదో విడత రుణమాఫీ సొమ్మును ఎన్నికల్లోపు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. పేదల పెళ్లిళ్ల బాధ్యత కూడా తీసుకున్నాం. రూ.5కే భోజనం అందిస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పారు.
కడుపునొప్పి ఉన్నాదా కడుపు నొప్పి... చెప్పండి నోరు విప్పి..... శూలము గుచ్చినట్టు సడన్ గా నొప్పి కలగటం వలన... శరీరాన్ని చీల్చినట్టు బాధ కలగటం వలన.. ఈ వ్యాధికి శూలవ్యాధి అనిపేరు వచ్చింది.  పొట్ట  పై భాగంలో నాభి ప్రాంతంలో, హ్రుదయము, పార్శ్వము వీపు వెన్నెముక కింది భాగము, కంఠము, పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కడైనా నొప్పి రావచ్చు. ఆహారం తినేటప్పుడు లేదా జీర్ణమయ్యే టప్పుడు కూడా నొప్పి రావచ్చు.  ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు:  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తికూర, మునగకూర, ఉప్పు వెల్లుల్లి సంవత్సరము దాటిన పాతబియ్యం ఆముదము, గోమూత్రము, వేడినీరు, నిమ్మపండ్లరసము సేవించాలి. రాత్రుల యందు నిద్రమేల్కొనుట, చేదురసం గల పదార్ధములు శీతల పదార్ధములు, వ్యాయామము, సంభోగము మద్యపానము, పప్పుదినుసులు, కారము గల పదార్ధములు తీసుకోకూడదు. దు:ఖము,కోపము, ఆవలింత, నవ్వు ఆకలి అపాన వాయువు, తుమ్ము లాంటివి నిరోధించాలి. మందుజాగ్రత్తలు:   ఆవు సంచితంలో కరక్కాయను ఉడికించి ఎండించి చూర్ణించి దాంట్లో బెల్లం, లోహభస్మం కలిపి సేవిస్తే కడుపులో మంటతో కూడిన నొప్పి వెంటనే తగ్గుతుంది. మజ్జిగలో భాస్కరలవణము, అజామోదార్కము, శంఖవటి అను ఔషధాలు బాగా పనిచేస్తాయి. హింగుత్రిగుణ తైలం ఒకటి రెండు చంచాలు వేడి నీరు గానీ లేదా పాలతో సేవిస్తే కడుపుబ్బరం, నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది. ఇంటికి చూసుకొనేది వీధి శూల... ఒంటికి చూసుకొనేది వ్యాధి శూల...
     మనం తినే ఆహారం జీర్ణమయ్యే సమయంలో కుక్షి, జఠరం, నాభి, పొత్తికడుపు, స్తనమధ్య  ప్రదేశం, నడుము, పక్కటెముకలందు నొప్పి వస్తుంది. దీనినే పరిణామ శూల కడుపులో పుండు అని అంటారు.  ఇది భుజించిన వెంటనే వాంతి చేసుకున్నాప్పుడు ఆహారమంతా జీర్ణమైనప్పుడు వస్తుంది. వరి అన్నం ఎక్కువ తిన్నప్పుడు వస్తుంది. ముందు జాగ్రత్తలు:    ఇలా వచ్చినప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఏమిటంటే.... మినుములు లాంటి పప్పు ధాన్యాలు, మద్యములు, స్త్రీ సంభోగాలు, శీతల పదార్ధాలు ఎండతిరుగుడు, నిద్రలో మేల్కొని కాలక్షేపం చేయటం, కోపము, దుఃఖము, ఆమ్ల పదార్ధసేవనం, అజీర్ణపదార్ధములు నువ్వులు లాంటివన్నీ నిషిద్దములు.  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తి కూర, మునగకూర, ఉప్పు, వెల్లుల్లి, సంవత్సరం దాటిన పాత బియ్యం, ఆముదం, గోమూత్రం, వేడి నీరు, నిమ్మపండురసం, క్షార చూర్ణము వంటివి పధ్యములు. మందుజాగ్రత్తలు:  శొంఠి, నువ్వులు, బెల్లము తీసుకొని కలిపి ముద్దగా నూరి పాలలో కలిపి సేవిస్తే ఏడురోజులలో పరిణామాలశూల శమిస్తుంది. పిప్పళ్ళ చూర్ణానికి మండూర భస్మ, తేనె కలిపి సేవిస్తే కడుపులో పుండు వెంటనే తగ్గుతుంది. పిప్పళ్ళచూర్ణం, కరకవలపు చూర్ణం, లోహభస్మమును సమభాగాలు గా కలిపి తేనె నేతులలో సేవిస్తే తీవ్ర పరిణామశూల వెంటనే శమిస్తుంది. భోజనమైన తరువాత ధాత్రీలోహము, సూతశేఖర రసము సేవిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.... ఇదే కనక అమలుచేస్తే... కడుపులో పుండు...ఇక్కడితో ఎండు...  
  హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే   రంగు – ఆకుపచ్చ ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు.   రంగు – ఎరుపు ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం.   రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు.   రంగు – సిల్వర్ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్. విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం.   రంగు – నలుపు ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్. విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం.   చాంతాడంత జాబితా! గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది.   కొత్త పోకడలూ ప్రమాదమే! ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   ప్రతి రంగుకీ ఓ  ప్రత్యామ్నాయం హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న! - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.