మాల్యా ఆఫర్ కు సానుకూలంగా స్పందించిన బ్యాంకులు..

 

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇచ్చిన కొత్త ప్రతిపాదనకు ఇప్పుడు బ్యాంకులు సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. తాను బ్యాంకులకు రుణాలు మొత్తం చెల్లించడానికి సిద్దంగానే ఉన్నానని.. అయితే ఓ హామీ ఇస్తేనే భారత్ తిరిగి వస్తానని.. భారత్ వచ్చిన నన్ను అరెస్ట్ చేయకూడదని.. తగిన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తేనే వస్తానని తెలిపాడు. దీంతో మాల్యా ఇచ్చిన ఆఫర్ కు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం స్పందించింది. తమకు రుణాల వసూలు మాత్రమే ముఖ్యమని.. మాల్యా ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి హామీ లభిస్తే, ఆయన ఇండియాకు వచ్చినా ఇబ్బంది పెట్టబోమన్న సంకేతాలు ఇచ్చాయి. మాల్యా ఇండియాకు వచ్చి బకాయిలు చెల్లిస్తే చాలని వివరించారు.

 

కాగా 17 బ్యాంకులు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. లండన్ లో తలదాచుకున్న మాల్యాను ఇండియాకు రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మాల్యాను ఎలాగైనా ఇండియాకు తీసుకొస్తామని వెల్లడించారు. మరి ఇప్పుడు మాల్యానే కేంద్రానికి ఆపర్ ఇచ్చాడు.. ఈ నేపథ్యంలో మాల్యా పెట్టిన షరతులకు కేంద్రం ఒప్పుకుంటుందో లేదో.. తాను అడిగిన హామీ ఇస్తుందో లేదో..  చూద్దాం..