జెఎన్యూ.. జాతి వ్యతిరేక నినాదులు చేశారు.. ఆ నినాదాలు ఇవే..

 

జెఎన్యూ యూనివర్శిటీ.. ఆఫ్జల్ గురు ఉరిశిక్షకు నిరసనగా చేసిన దీక్ష కారణంగా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అంతే కాదు ఈ దీక్షను ముందుండి నడిపించిన విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ కు కూడా చెప్పలేనంత పేరు వచ్చేసింది. ఫిబ్రవరి 9 వ తేదీన జరిగిన సదస్సులో జాతి వ్యతిరేకత నినాదాలు చేశారంటూ కన్నయ్య కుమార్ తో పాటు మరో నలుగురు విద్యార్ధులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేసిన మాట వాస్తవమేనని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్‌) నిర్ధారించింది. అఫ్జల్ ఉరిని ‘జ్యూడీషియల్ కిల్లింగ్’గా అభివర్ణించిన ఓ వర్గం విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారని..తనకు అందిన వీడియోలను పరిశీలించి  గాంధీనగర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)  నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

కాగా సమావేశం సందర్భంగా విద్యార్థులు చేసిన కొన్ని నినాదాలిలా ఉన్నాయి..
* తుమ్‌ కిత్‌నే అఫ్జల్‌ మారోగే, ఘర్‌ ఘర్‌సే అఫ్జల్‌ నిక్లేగే (మీరెంతమంది అఫ్జళ్లను చంపుతారో, ప్రతి ఇంటినుంచి అంతమంది అఫ్జళ్లు పుట్టుకొస్తారు)
* పాకిస్తాన్‌ జిందాబాద్‌, కాశ్మీర్‌ మాంగే ఆజాదీ, లడ్కర్‌ లేంగే ఆజాదీ (కాశ్మీర్‌ స్వతంత్య్రాన్ని కోరుతోంది, పోరాడి స్వాతంత్య్రం సాధించుకుంటాం)
* భారత్‌ కీ బర్బాదీ తక్‌ జంగ్‌ రహేగి (భారత్‌ నాశనమయ్యే వరకూ యుద్ధం జరుగుతుంటుంది)