తితిదే బోర్డు ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి?
posted on Dec 2, 2014 1:28PM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అధ్యక్షుడిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన 15 మంది సభ్యులన్న కొత్త పాలక మండలి పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్‌కి పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాకి గవర్నర్ ఆమోద ముద్ర లాంఛనమే కానుంది. ఈ లాంఛనం ముగిసిన తర్వాత శనివారం కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా, ఈఏడాది నుంచి టీటీడీ పాలకమండలి పదవీ కాలాన్ని ఒక్క సంవత్సరానికి కుదించినట్టు సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం... పాలకమండలి సభ్యుల జాబితాలో దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు నారాయణస్వామి నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆకుల సత్యనారాయణ, జిల్లాకు చెందిన బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డితోపాటు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు సభ్యులుగా వున్నట్టు తెలుస్తోంది.