బెజవాడలో యు.ఎస్. కాన్సులేట్.. నో లేట్...

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమెరికా దేశానికి చెందిన రెండు పరిణామాలు మంగళవారం నాడు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో అమెరికన్ కాన్స్‌లేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే భారత రిపబ్లిక్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి జనవరి 26వ తేదీన భారతదేశానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బరాక్ ఒబామాని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కి రావలసిందిగా ఆహ్వానిస్తూ అమెరికా రాయబార కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ లేఖ రాశారు.