మోక్షం పొందాలంటే కుంభమేళాలో చనిపోవాలట

ఆత్మార్పణం చేసుకోవడం చట్టరీత్యా నేరం. సనాతన ధర్మం కూడా మహాపాపం అని బోధిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, సంపన్నులు  అక్కడే చనిపోవాలని  బీహార్ స్వతంత్ర ఎంపీ  పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కుంభమేళాలో చనిపోతే  వారికి మోక్ష  ప్రాప్తి లభిస్తుందని ఆయన బోధిస్తున్నాడు. ఇటీవల అక్కడ తొక్కిసలాట  జరిగి 30 మందికిపైగా చనిపోయారు. 60 కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ సదరు ఎంపీ మాత్రం యోగి ఆదిత్యనాథ్ పక్షాన నిలబడి కుంభమేళాలో చనిపోతే  మోక్ష ప్రాప్తి లభిస్తుందని కొత్త నిర్వచనం చెప్పి వార్తల్లోకెక్కాడు లోక్‌సభలో పప్పు యాదవ్ మాట్లాడుతూ చనిపోయిన వారి మృతదేహాలను హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిగాయని యుపి సర్కార్ తరపున వకాల్తా పుచ్చుకుంటే ప్రతి పక్షాలు మాత్రం వేరే విధంగా చెబుతున్నాయి. కుంభమేళ జరుగుతున్న త్రివేణి సంగమంలో మృతదేహాలను పారవేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.   కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఒక బాబా  తనతో చెప్పారని  పప్పు యాదవ్ తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులు, ధనికులు, బాబాలు కుంభమేళాలో  చనిపోవడమే మార్గమని చెప్పుకొచ్చారు చట్టాలను రూపొందించే చట్ట సభలోనే పార్లమెంటు  సభ్యుడి హోదాలో భక్తులను చనిపోవాలని వింత కోరిక కోరడం  ఇపుడు దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమైంది. 
మోక్షానికి మూడుమార్గాలు ఉన్నవని ఆధ్యాత్మిక గురువులు  చెబుతున్నారు. ఒకటి  భక్తి మార్గం,  రెండు జ్ఞాన మార్గం,  మూడు యోగమార్గం.
ఇందులో  మొదటిది భక్తిమార్గం. ఇది సులభతరం.  పూజలు, వ్రతాలు, భజనలు, కైంకర్యాలను ప్రోత్సహించటం వల్ల మోక్షం పొందొచ్చు.  
రెండోది జ్ఞానమార్గం.  జ్ఞానులుగా జన్మించి అంటే ఎన్నోజన్మలుగా సత్కర్మలు చేసి   మోక్షంవైపు వేగంగా అడుగులు వేయొచ్చు.  
మూడవది యోగమార్గం.  ఈ మార్గంలోఅతి కఠినమైన యోగ సాధన చేయాలి. దీనికి గురువుల అనుగ్రహం కంపల్సరీ. 
ఈ మూడుమార్గాలు కాకుండా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి నిండు లోకసభలో కామెంట్ చేయడంతో ప్రజాస్వామ్యం పట్ల  సదరు ఎంపీగారికి ఉన్న అవగాహన ఏంటో తెలియజేస్తుంది 
 

 ⁠