మహానాడులో బోనాలు, బతుకమ్మలు..

 

తిరుపతిలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ పార్టీ మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు ఆ ప్రాంత సాంప్రదాయాలకు ప్రతిబింబాలైన బోనాలు, బతుకమ్మలతో ప్రదర్శనగా మహానాడుకు చేరుకోవడం ఆకట్టుకుంది.