జయలలితకు సుప్రీం షాక్..
posted on Jul 27, 2015 12:41PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక కోర్టు తనను నిర్ధోషిగా పరిగణిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలలితను నిర్ధోషిగా ప్రకటించడంపై ప్రతిపక్షనేతలు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జయలలితతోపాటు మరో ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మళ్లీ విచారణ జరపాలని కర్నాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌తో మాత్రం ఏకీభవించింది కానీ హైకోర్టు తీర్పు పైన స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కాగా నిర్ధోషిగా విడుదలైన తరువాత జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి అనంతరం ఆర్కే నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.