ఢిల్లీలో కాంగ్రెస్ తరపున రెండు గ్యారెంటీలను విడుదల చేసిన రేవంత్ రెడ్డి 

ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో రెండు గ్యారంటీలను విడుదల చేసింది.  ప్రతీ నెల 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి ఉచిత  కరెంట్  గ్యారెంటీని ప్రకటించింది. 500 వందలకే ఉచిత గ్యాస్ సిలిండర్  గ్యారెంటీను ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు దేవేంద్రయాదవ్ ఈ రెండు గ్యారెంటీలను ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. తెలంగాణలో  ఒకేసారి 21 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు చెప్పుకొచ్చారు.  దేశంలో స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రుణ మాఫీ జరగలేదన్నారు.కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యమని రేవంత్ పిలుపునిచ్చారు. 

 ⁠