దూకుడు పెంచిన ఎసిబి... ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న  ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. 
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ తో బాటు చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి , ఐఏఎస్ అరవింద్ కుమార్ లను ఎసిబి విచారణ చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి ఎస్ నెక్స్ట్ కంపెనీ ఒప్పందం చేసుకుని సడెన్ గా వైదొలగింది.