ఆ వ్యాఖ్యలు రాజ్‌నాథ్ సింగ్ చేయలేదు.. ఔట్‌లుక్ సారీ
posted on Dec 1, 2015 11:50AM
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఔట్‌లుక్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో రగడ జరిగింది. 800 ఏళ్ల తర్వాత హిందూ వ్యక్తి ప్రధాని అయ్యారని రాజ్‌నాథ్ సింగ్ ఔట్‌లుక్‌లో వ్యాఖ్యానించారని.. సీపీఎం మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్తావించగా.. రాజ్‌నాథ్ సింగ్ అనవసరంగా తనపై ఆరోపణలు చేయవద్దని.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదని.. తనకు సలీం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్‌నాథ్ సింగ్, మహ్మద్ సలీం ల మధ్య వివాదం తలెత్తింది. అయితే జరగాల్సిన రచ్చ అంత జరిగిన తరువాత ఔట్‌లుక్ ఇప్పుడు స్పందించి ఆ వ్యాఖ్యలు రాజ్‌నాథ్ చేసినట్లుగా పొరపాటుగా ప్రచురించితమయ్యాయని.. నిజానికి అవి దివంగత విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ చేశారని తెలిపింది. పొరపాటున అశోక్ సింఘాల్ పేరుకు బదులు రాజ్‌నాథ్ సింగ్ పేరు పడిందని..తాము చేసిన పొరపాటుకు క్షమించాలని.. అనవసరంగా మావల్ల పార్లమెంట్ లో రగడ జరిగిందని.. దానికి సారీ చెబుతున్నామని ట్వీట్టర్లో పేర్కొంది.