తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 6) స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీరామ నవమి, ఆదివారం, సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక శనివారం (ఏప్రిల్ 5) స్వామివారిని 78,496 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 910 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.   శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3కోట్ల 6లక్సల రూపాయలు వచ్చింది.