తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి ఈవో శ్యామలరావు, ఆదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.

 మేళతాళాల మధ్య అర్చకులు ఆయనకు వేదమంత్రోచ్ఛారణతో సంప్రదాయబద్ధంగా ఇఫ్తికాపాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శన అనంతరం సీజేఐ సంజీవ్ ఖన్నాకు అర్చకులు స్వామి వారి శేష వస్త్రం కప్పి రంగనాయకుల మంటపంలో వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు సీజేఐకి తీర్ధప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.