పారిస్ లో భారత్ ప్రధాని, పాక్ ప్రధాని భేటీ..


 

భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పాక్ ప్రధాని పారిక్ లో భేటీ అయ్యారు. ఫ్రాన్స్ రాజధానిలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరైన మోదీ, షరీఫ్‌లు కలిశారు. ఇద్దరూ ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వారు కాశ్మీర్ సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా భేటీకి ధౌత్యపరమైన ప్రాధాన్యత లేదని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.