పోలీసుల  విచారణకు హాజరైన అల్లు అర్జున్ 

 సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో ఉండటంతో చిక్కడపల్లి పోలీసులు  అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.   సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏ-11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.అల్లు అర్జున్ కు  కోర్టు మధ్యంతర  బెయిల్ మంజూరయ్యింది.ఈ నెల4న పుష్ప2 ప్రీమియర్ షో లో తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయింది.