స్థానికేతరుల లెక్క తేలుస్తాం.. కేసీఆర్

 

తెలంగాణ శాసనసభలో కేసీఆర్ స్థానికుల ఉద్యోగాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు, స్థానికేతరుల లెక్క తేలాలని, 317డి ప్రకారం స్థానికులను గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. స్ధానికేతరులకు ఇప్పుడు ఉపకార వేతనాలు ఇస్తే ఉద్యోగాల్లోనూ పోటీపడతారని అన్నారు. తెలంగాణ యువతను దృష్టిలో పెట్టుకొని ఉపకార వేతనాలు ఇస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో స్థానికులు కానివారు చాలామంది ఉన్నారని, తప్పకుండా వారిని క్రమబద్దీకరణ చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని, యువత ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.