రజనీకాంత్‌ మీద ఖుష్బూ కామెంట్లు..

 

నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటి కుష్‌బూ ఇక రాజకీయాల్లో ఫుల్లుగా బిజీ అయిపోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు రాజకీయంగా కామెంట్లు చేయడం ప్రారంభించింది. ఆ చేసే కామెంట్లు కూడా వాళ్ళమీద వీళ్ళమీద, పిల్లిబిత్తిరి గుంటల మీద ఎందుకనుకుందోగానీ, ఏకంగా తమిళ సినిమా దిగ్గజం రజనీకాంత్ మీదే చేసేసింది. ‘‘రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు. ప్రజలకు సేవ చేయాలని వుంటే రాజకీయాల్లోకి ధైర్యం చేసి వచ్చేయాలి. అందేగానీ, కాసేపు రాజకీయాల్లోకి వస్తానని, కాసేపు రానని కుప్పిగంతులు వేయడం వేస్ట్’’ అని రజనీకాంత్‌ని ఉద్దేశించి కుష్‌బూ కామెంట్ చేసింది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమాధిలోంచి బయటకి తీసుకురావాలంటే ఏం చేయాలో కూడా కుష్బూ సూచించింది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బాగు చేయాలట. మంచిదే..