బస్సు హైజాక్.. 28 మంది హత్య

 

కెన్యాలో దారుణ సంఘటన జరిగింది. తీవ్రవాదులు ఒక బస్సును హైజాక్ చేసి 28 మంది ప్రయాణికులను హతమార్చారు. శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సోమాలియాకి చెందిన అల్ షబాబ్ తీవ్రవాదులు వందమంది నైరోబీకి చెందిన బస్సును హైజాక్ చేశారు. బస్సును అదుపులోకి తీసుకుని ఆ తర్వాత హతమార్చారు. బస్సును కొంత దూరం తీసుకువెళ్లిన తర్వాత ప్రయాణికుల ప్రాంతాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీలో సోమాలియాకిచెందిన వారేవరు? సోమాలియాకి చెందని వారెవరు ? అంటూ నిలదీశారు. ఆ ప్రయాణికుల్ని రెండు గ్రూపులుగా విడగొట్టి రెండు గ్రూపుల వారిమీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వెళ్ళిపోయారు. ఈ ఘటనలో 28 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.