బంగారు చేప దొరికింది

 

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారులకు బంగారు చేప దొరికింది. బంగారం అంటే నిజం బంగారం కాదు.. బంగారు రంగులో మిలమిలా మెరిసిపోయే చేప దొరికింది. ఈ చేప బరువు 28 కిలోలు. ఈ చేపలను కచిడీ చేప అని పిలుస్తారు. చాలా అరుదుగా దొరికే ఈ చేప చాలా ఖరీదైనది. తాజాగా దొరికిన చేప ఖరీదు లక్ష రూపాయలు పలికింది. రుచితోపాటు ఎన్నో వైద్య ప్రయోజనాలున్న ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి వేలం పాటలో లక్ష రూపాయలకు పాడుకున్నాడు. ఈ చేపలకు గరుకుగా ఉండే చిన్ని రెక్కలతో పాటు పొట్ట భాగం గట్టిగా వుంటుంది. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారట. ఈ చేప పొట్ట భాగం విలువే 85 వేల రూపాయల వరకూ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.