హోంమంత్రి హెలికాప్టర్ దారితప్పింది
posted on Nov 26, 2014 1:36PM
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జార్ఖండ్ రాష్ట్రంలో దారి తప్పింది. హెలికాప్టర్ దిగడానికి నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా దూరంగా వున్న మరో ప్రదేశంలో అత్యవసరంగా దిగింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. జార్ఖండ్ ఎన్నికల ప్రచారం కోసం రాజ్‌నాథ్ సింగ్ జార్ఖండ్‌కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా వున్న ఈ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి హోదా వున్న వ్యక్తికి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాల్సి వుంది. అయితే భద్రతా ఏర్పాట్లలోని లోపాల కారణంగానే ఈ సంఘటన జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్ ఎన్నికలను మావోయిస్టులు బహిష్కరించారు. నిన్న తొలివిడత పోలింగ్ సందర్భంగా భద్రతా దళాలు ఒక భారీ మందుపాతరను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా వున్న భద్రతా ఏర్పాట్లు హోంమంత్రి హెలికాప్టర్ దారితప్పేంత అధ్వాన్నంగా వున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.