డీకే రవి లవ్ ఫెయిల్యూర్‌తో చనిపోయాడా?

 

కర్ణాటకలో ఈ నెల 16న ఐఏఎస్ అధికారి డీకే రవి తన అపార్ట్ట్ మెంట్లో ఆత్మహత్య చేసుకన్న విషయం తెలిసిందే. డీకే రవి ఆత్మహత్యపై ఆ రాష్ట్ర ప్రజలు పలుఆందోళను చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీకీ అప్పగించగా అది మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయితే ఈయన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో కథనం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన ప్రేమలో విఫలం అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రోజు తన ఐఏఎస్ బ్యాచ్ మేట్ అధికారిణికి 44 సార్లు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు. సీఐడీ నివేదిక వచ్చిన అనంతరమే పోలీసులు తాజాగా ఈ కథనాలు బయటపెట్టడంతో కేసు పలుమలుపులకు దారితీస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికపై చర్చించాలని కోరగా, అందుకు కోర్టు నిరాకరించింది. విచారణ మధ్యలో ఉండగా వివరాలు బయటపెట్టొద్దని, కేసు విచారణ వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈయన కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.