బాణాసంచా దుకాణంలో పేలుడు.. ఏడుగురి మృతి

 

రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో గురువారం తెల్లవారుఝామున బాణాసంచా అమ్మే దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. బాలోత్రా ప్రాంతంలోని ఒక దుకాణంలో పేలుడు సంభవించిందని, మంటలను అదుపు చేసిన తర్వాత దుకాణంలో ఏడు మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.