చాక్లెట్ల లారీ చోరీ
posted on Nov 25, 2014 3:50PM
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి చెన్నైకి చాక్లెట్ల లోడ్‌తో వెళ్తున్న మినీ లారీని నెల్లూరు జిల్లా తడ మండలం పెరియపట్టు దగ్గర సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. చాక్లెట్ల లారీతోపాటు లారీ యజమాని, డ్రైవర్, క్లీనర్ని కూడా ఆ వ్యక్తులు తీసుకుపోయారు. రోడ్డు మీద వెళ్తున్న లారీని స్పార్కియో వాహనంలో వచ్చిన కొంతమంది వ్యక్తులు తాము వాణిజ్య పన్నుల అధికారులమంటూ ఆపారు. ఆ తర్వాత డ్రైవర్, క్లీనర్, లారీ యజమానిని బంధించి లారీని దొంగిలించారు. ఆ తర్వాత డ్రైవర్,క్లీనర్ని ఓ అటవీ ప్రాంతంలో వదిలేసి లారీని, దాని యజమానిని తీసుకుని దుండగులు వెళ్ళిపోయారు. డ్రైవర్, క్లీనర్ తడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.