విజయవాడలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై గట్టి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే రెండు నెలల్లో తన క్యాంపు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయానికి తుళ్లూరు పరిసర ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల విజయవాడలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీలైతే ఏదైనా ప్రభుత్వ భవనాన్ని తీసుకోవాలని, ఒకవేళ దొరకకపోతే ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకొని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించాలని తెలుస్తోంది.అక్కడ తాను నివాసం ఉండటమే కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడానికి వీలుగా వసతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తన ఇంటి నిర్మాణానికి అమరావతి ప్రాంతంలో స్థలం కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం.