150 ఏళ్లు బతుకుతా
posted on Apr 27, 2015 5:15PM

పెళ్లి చేసుకోకుండా 150 ఏళ్లు బతుకుతానని యాంటీ ఏజింగ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ అలెక్స జావోరొంకోవ్ అంటున్నారు. ప్రస్తుతం అలెక్స్ బ్రిటన్‌లోని బయోజెరంటాలోజీ రీసెర్చ్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి, పిల్లలు అనే బాధ్యతలు లేకుండా క్రమం తప్పకుండా వ్యాయామం, వృద్దాపాన్యాన్ని అరికట్టే మందులు తీసుకుంటూ 150 ఏళ్లు జీవిస్తానని తెలిపారు. జీవితం మొత్తాన్ని ఏజింగ్ ను అరికట్టే ప్రయోగాలకే అంకితం చేస్తానని అన్నారు. ఇప్పటికే ఏజింగ్ ను అరికట్టే ప్రయోగాలన్నీ విజయం సాధించాయని అవి మందుల రూపంలో రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో జన్యువుల చికిత్సకు సంబంధించిన వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని, వాటిని కూడా తాను తీసుకుంటానని చెప్పారు. బ్రిటన్ లో అనేక ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఆయుషు ప్రమాణం పెరిగిందని చెప్పారు.