శాంతి శ్రీహరికి కామెర్లు... చికిత్స...

 

దివంగత నటుడు శ్రీహరి భార్య, నటి శాంతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని, ఆమె కాలేయానికి సంబంధించిన వ్యాధితో సింగపూర్‌లో చికిత్స పొందుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు శ్రీహరి, శాంతి అభిమానులలో ఆందోళన కలిగించాయి. అయితే ఈ వార్తల మీద శాంతి శ్రీహరి స్పందించారు. తన ఆరోగ్యం బాగాలేనిమాట వాస్తవమేగానీ, తాను విషమ పరిస్థితుల్లో లేనని ఆమె వివరణ ఇచ్చారు. తాను ప్రస్తుతం కామెర్ల వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం తాను చెన్నైలోని తన చెల్లెలు లలితకుమారి (నటుడు ప్రకాష్‌రాజ్ మాజీ భార్య) నివాసంలో వుంటూ కామెర్లకి చికిత్స పొందుతున్నానని ఆమె వివరించారు. చెన్నైలో చికిత్స తర్వాత తాను కొంత కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే వున్నానని శాంతి శ్రీహరి తెలిపారు.