వింత శిశువు.. 4 కాళ్ళు.. 4 చేతులు..

 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జన్మించాడు. ఈ శిశువు తల్లికి కవలలు జన్మిస్తారని వైద్యులు భావించారు. అయితే అభివృద్ధి చెందని కవల శిశువు మరో శిశువు పొట్టలో ఇరుక్కుపోయి పిండం అభివృద్ధి చెందింది. దాంతో ఇప్పుడు పుట్టిన శిశువుకే నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు వున్నాయి. ఈ శిశువు ఆరోగ్యంగానే వుంది. సాధారణంగా ఇలా పుట్టిన పిల్లలు చనిపోతూ వుంటారు. అయితే ఈ శిశువు ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా వుంటే, ఈ వింత శిశువును చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం వస్తున్నారు. చాలామంది బ్రహ్మదేవుడు పుట్టాడంటూ హడావిడి చేస్తున్నారు. ఇంతకొంతమంది అయితే ప్రళయం వచ్చేముందు ఇలాంటి శిశువు పుడతాడని, త్వరలో ఈ ప్రపంచం అంతమైపోతుందని అంటూ శోకాలు పెడుతున్నారు. దేవుడని పూజలు చేస్తున్నవారిని, ప్రపంచం అంతం అయిపోతుందంటూ శోకాలు పెడుతున్న వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.