Home » Health Science  » మహిళల గర్భాశయ ఆరోగ్యం బాగుండాలి అంటే తినకూడని ఆహారాలు ఏమిటి.!

మహిళల గర్భాశయ ఆరోగ్యం,  హార్మోన్ల సమతుల్యత బాగుండటానికి పోషకాహారం ఎంత ముఖ్యమో, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తప్పుడు ఆహార అలవాట్లు శరీరంలో  ఇన్ఫ్లమేషన్, ఈస్ట్రోజెన్ అసమతుల్యత , గర్భాశయ సమస్యలకు దారితీస్తాయి. గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగ్గించాల్సిన లేదా పూర్తిగా దూరంగా ఉండాల్సిన ముఖ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ సమతుల్యంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మహిళల గర్భాశయ ఆరోగ్యం కోసం తినకూడని ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే..
 

రిఫైండ్ షుగర్, ఫ్లోర్..

అధికంగా శుద్ధి చేసిన చక్కెరలు మరియు పిండి పదార్థాలు మైదా, వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు , తీపి పదార్థాలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే.. పిసిఓడి/పిసిఓఎస్  వంటి సమస్యలు తీవ్రమవుతాయి. గర్భాశయంలో మంటను పెంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ప్యాకింగ్, ప్రాసెస్ ఫుడ్స్..

ప్యాక్ చేసిన , ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రాసెస్ చేసిన చిరుతిళ్ళు, రెడీ టు ఈట్ ఈటింగ్ ప్యాకెట్లు , జంక్ ఫుడ్‌లలో కృత్రిమ రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు , ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా, హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. ఈ రసాయనాలు గర్భాశయ కణజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

రెడ్ మీట్..

అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం మేక, గొర్రె , పంది మాంసం వంటి రెడ్ మీట్‌ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల శరీరంలో ఆరాకిడోనిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది గర్భాశయంలో మంటను ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా రెడ్ మీట్ తినే మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్లు  వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

కెఫీన్, కూల్ డ్రింక్స్.

కెఫిన్ , శీతల పానీయాలు కాఫీ, టీ , ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ అధికంగా ఉంటుంది. అలాగే సోడాలు, శీతల పానీయాలలో కృత్రిమ చక్కెరలు ఎక్కువ. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇది పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి , అసమతుల్యతకు కారణమవుతుంది.

ధూమపానం, మద్యపానం..

ఆల్కహాల్ , ధూమపానం, మద్యపానం కాలేయం యొక్క పనితీరును దెబ్బతీస్తుంది. కాలేయం శరీరంలోని అదనపు హార్మోన్లను బయటకు పంపే పని చేస్తుంది. ఆల్కహాల్ వల్ల ఈ ప్రక్రియ మందగించి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది గర్భాశయ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ఎక్కువ నూనె, వేయించిన ఆహారాలు..

అధిక నూనె , వేయించిన ఆహారాలు ,  మళ్ళీ మళ్ళీ కాచిన నూనెల్లో వేయించిన బజ్జీలు, సమోసాలు, ఫాస్ట్ ఫుడ్ వంటివి శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగడానికి కారణమవుతాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి, గర్భాశయ కణజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

కృత్రిమ తీపి పదార్థాలు..

ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ కు నేటి కాలంలో చాలా డిమాండ్ పెరిగింది. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం రాదని చెబుతారు.  డైట్ సోడాలు లేదా చక్కెర లేని ఉత్పత్తులలో ఉపయోగించే కృత్రిమ తీపి పదార్థాలు పేగులలోని మంచి బాక్టీరియాను దెబ్బతీస్తాయి. పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే హార్మోన్ల నియంత్రణ కూడా దెబ్బతింటుంది.

గర్భాశయ ఆరోగ్యం కోసం ఏం తినాలి?

గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరం. అయితే గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు కేవలం ఆహారంతో గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడాలని అనుకోవడం సరికాదు. వైద్యులను సంప్రదించడం మంచిది.

                                *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.