కోలీవుడ్ స్టార్లలో ప్రస్తుతం ప్రతి చిత్రానికి 100 కోట్లకు తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ ఎవరు అంటే ఇళయ దళపతి విజయ్ పేరు నే చెప్పాలి. ఈయన గత కొంతకాలంగా నటిస్తున్న చిత్రాలు హిట్ ఫ్లాప్ సంగతులను పక్కనపెట్టి అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో నిర్మాతలు దర్శకులు విజయ్‌తో సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. ఇటీవల దిల్ రాజు ఈయనతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారీసు తీశారు. ఈ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మాత్రం పెద్ద విజయం సాధించలేదు. ఇక విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు అన్న విషయం తెలిసిందే.
తాజాగా ఆయన మాట్లాడుతూ నాకు నా కుమారుడు విజయ్ కి మధ్య ఏడాదిన్నరగా సరిగా మాటల్లేవు. ఇదేమీ పెద్దగా చర్చించుకోవాల్సిన విషయం కాదు. తండ్రి కొడుకుల అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. మరలా కలుసుకోవడం కూడా సహజమే. విజయ్ కు నేనంటే ఎంతో ఇష్టం. నాతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు. సినిమాల తర్వాత నేను విజయ్ కే ప్రాధాన్యత ఇస్తాను. ఆ తర్వాతే నా భార్య. అయితే కొన్ని చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు వచ్చాయి. ఏడాదిగా మేము మాట్లాడుకోవడం లేదు. అది మా దృష్టిలో పెద్ద విషయం కాదు. మేమిద్దరం గొడవలు పడతాం తర్వాత కలిసిపోతాం. తండ్రి కొడుకుల సంబంధంలో ఇలాంటివి సర్వసాధారణం.
ఇటీవల వారిసు చిత్రం చూసాం అని చెప్పుకొచ్చారు. ఇక విజయ్‌కు ఆయన తండ్రికి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏమిటి? అని కోలీవుడ్ లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీ విషయంలో ఏర్పడిన విభేదాలేనని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ విషయంలో విజయ్ హర్ట్ అయ్యి కోర్టుకు వెళ్లడం కూడా తమిళనాట చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.