తెలుగులో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఏఎం రత్నం ఓ వెలుగు వెలిగారు. ఆయన దర్శకునిగా కూడా మంచి విజయం సాధించారు . అలాంటి రత్నం కొన్ని చిత్రాలు ద్వారా బాగా నష్టపోయారు. ఈయన బాగా ఊపులో ఉన్న సమయంలో తన కుమారుడు రవికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ 7/ జి బృందావన్ కాలనీ అనే చిత్రం తీశారు. సోనీయా అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అప్పట్లో యూత్ ని ఎంతగానో ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. సుమన్ శెట్టి వంటి వారు పండించిన హాస్యం ఈ చిత్రం ఇప్పటికీ అందరిని అలరిస్తూనే ఉంది.
ఈ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ మధ్య కెమిస్ట్రీని, రొమాన్స్ సీన్స్ ను దర్శకుడు సెల్వరాఘవన్ అద్భుతంగా పండించారు. వీటికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇందులోని పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ చిత్రాలు మెచ్చే వారికి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది.
ఇప్పుడు ఈ సినిమా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. 7/ జి బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. ఆమధ్య ఈ విషయాన్ని స్వయంగా ఎ.యం.రత్నమే తెలిపారు. ఇప్పుడు ఆ ప్రచారం మరల తెరపైకి వచ్చింది. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రవి కృష్ణ సోనియా అగర్వాల్ ఉండకపోవచ్చని సమాచారం. కానీ తన కుమారుడిని కాదని రత్నం వేరెవరినో ఎందుకు పెట్టుకుంటాడు? కానీ ప్రస్తుతం రవికృష్ణనే ఎవ్వరికీ తెలిదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫేడవుట్ అయిపోయారు.
రవి కృష్ణ అయితే ఈ సినిమా తర్వాత చేసిన శుక్రన్, కేడి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు వంటి కొన్ని చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. చాలా కాలంగా అయినా నటనకు దూరంగా ఉంటున్నారు. కాగా ప్రస్తుతం రత్నం పవన్ కళ్యాణ్ తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రం తీస్తున్నారు. పవన్ తో రత్నం చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇంతకు ముందు ఆయన పవన్ తో ఖుషీ, బంగారం చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రత్నం 7/ జి బృందావన్ కాలనీ సీక్వెల్ పై దృష్టి పెడతారని తెలుస్తోంది.