ప్రస్తుతం తెలుగు నటీనటులందరూ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంటూ ఉన్నారు. దాంతో ముంబైలో కూడా తమకు ప్లాటు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. బాలీవుడ్లో తమ సినిమాల ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు అందులో దిగడం కోసం, ఇతర పనుల రీత్యా, వ్యాపారాల రీత్యా ముంబైకి వెళ్ళినప్పుడు సొంత ఇంటిలో ఉండాలనే కోరికను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే ముంబైలో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు సొంతగా ప్లాట్స్ను కొనుక్కున్నారని వార్తలు వచ్చాయి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సమంతా ఆరోగ్యం బాగానే ఉంది. ఆరోగ్యపరంగా ఇప్పుడు డోకా లేదని ఆమె భావిస్తోంది. మరలా సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని భావిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తరువాత వెబ్ సిరీస్ లపై సమంత పూర్తిగా దృష్టి సారిస్తోంది.
వెబ్ సిరీస్ లతో పాన్ ఇండియా స్టార్ డమ్ చాలా సులభంగా సాధ్యమవుతుందని సమంతా నిరూపించింది. ఇక ఈమె ఇటు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ మెన్ డైరెక్టర్లు అయిన రాజ్ డికె లతో సిటాడెల్ అనే సిరీస్ కోసం ముంబైలో ఉంది. ఈ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో కొనసాగుతోంది. దీంతో పాటు భారీ బాలీవుడ్ చిత్రాలకు కూడా ఆమె ఓకే చెబుతోంది. తాజాగా ఆమె సూర్యాస్తమయం అవుతున్న ఓ ఆహ్లాదకరమైన ఫోటోని షేర్ చేసింది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తే అది ముంబై అని తెలుస్తుంది.
పోనీ అదేమైనా పెద్ద హోటల్ అనుకుంటే అది పొరపాటు. అది భారీ భవంతుల సముదాయం. సో బాలీవుడ్ రాజధానిలో తన నివాస ప్రాంతం నుండి సమంతా ఫోటోను షేర్ చేసి ఉంటుందని అంతా భావిస్తున్నారు. సి వ్యూయింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూం ప్లాటును ఆమె కొనుక్కుందని అంతా భావిస్తున్నారు. దాంతో సమంత ముంబైలో సొంత ఇల్లు కొనుక్కున్నారనే వార్త బాగా ప్రచారం సాగుతోంది. అందరూ ఆమె ముంబై ఇంటి గురించే మాట్లాడుతున్నారు. మొత్తానికి సమంత ముంబైలో కూడా తన పాగాను వేసి తన నివాసం ఏర్పరచుకుందని అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆమె దృష్టి అంతా ఇక బాలీవుడ్, వెబ్ సిరీస్ ల మీదే అనే క్లారిటీ వస్తుంది.